NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి
తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయ్‌. ఉదయం తొమ్మిది గంటలు దాటినా… మంచు తగ్గడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్‌లో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. తెలంగాణలో సాయంత్రం అయిందంటే చాలు చేతులు బిగుసుకుపోతున్నాయి. బయట అడుగుపెడదామంటే జనం బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆ సమయంలో ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. మెదక్‌లో అత్యల్పంగా 14 డిగ్రీలు, పటాన్‌చెరులో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 21 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇటు నిజమాబాద్, కరీంనగర్‌ ప్రాంతాల్లోనూ చలిగాలులు వీస్తున్నాయ్‌. ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏజెన్సీ ఏరియాల్లో చలిగాలులు ఎక్కువగా ఉన్నాయి. అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. లంబసింగిలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్‌. ఉదయం వేళల్లో దట్టంగా పొగ మంచు అలుముకుంటోంది. ఘాట్‌ రోడ్‌లో వెళ్లే వాహనదారులు.. మార్గం కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా ఏం వస్తుందో తెలియని పరిస్థితి. కొందరైతే రోడ్లపై చలి మంటలు కాగుతూ సేద తీరే ప్రయత్నం చేస్తున్నారు. స్వెట్టర్లు వేసుకుంటే తప్ప బయటకు రాలేని పరిస్థితి. వృద్ధులు, చిన్నారులు చలి, పొగ మంచులో బయటకు వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మూడు పూటలా వేడివేడి ఆహార పదార్థాలనే తినాలంటున్నారు. ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

వారికి శుభవార్త.. ఈ రోజే నిధులు విడుదల
కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తోంది. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ అందిస్తోంది. ఇందులో భాగంగా.. 2023-24 గాను రెండో విడత సాయాన్ని ఇవాళ విడుదల చేయబోతోంది. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు సీఎం జగన్‌. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా నిధులు విడుదల చేస్తారు. జులై నుంచి డిసెంబర్‌ వరకు ఆరు నెలలకు గాను ఒక్కొక్కరికి 30 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా 2 వేల 807 మంది జూనియర్‌ లాయర్లు లబ్దిపొందుతున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో సుమారు 8 కోట్ల రూపాయలను జమచేస్తోంది జగన్‌ సర్కార్‌. ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 49.51 కోట్లు. న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి, న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ. 25 కోట్ల ఆర్థిక సాయం ఏపీ ప్రభుత్వం అందించింది.

కార్తిక మాసం ఆఖరి సోమవారం.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది.. గోదావరి నది తీరం భక్తులతో కిటకిటలాడుతుంది. రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తుల కార్తిక స్నానాలతో పులకరిస్తుంది. రాజమండ్రి పుష్కర ఘాట్ లో వేలాదిగా భక్తులు విచ్చేరసి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు శివనామ స్మరణతో స్నానఘట్టాలు మారుమోగుతున్నాయి.. గోదావరి నదిలో స్నానాలు ఆచరించి మహిళలు కార్తిక దీపాలు వదులుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని శివాలయాలు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. పరమేశ్వరుడిని దర్శించుకుని. భక్తులు ప్రత్యేక పూజలు , అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పరమేశ్వరుడి దర్శనం కోసం శివాలయాల వద్ద భక్తులు బారులు తీరారు. కార్తీక మాసంలో గోదావరిలో కార్తీక దీపాలు వెలిగించడం వలన పాపం పరిహారం లభిస్తుందని భక్తుల విశ్వాసం.. అయితే, శివుడిని హృదయపూర్వకంగా స్మరించినట్లయితే, జీవితంలోని అన్ని కష్టాలు మరియు కష్టాలు తొలగిపోతాయని పురుణాలు చెబుతున్నాయి.. హిందూ మతంలో, శివుడు చాలా దయ మరియు దయగలవాడు. శివుడు ఒక్క కుండ నీటితో కూడా సంతోషిస్తాడని చెబుతారు. ఇక, ఈ రోజు శివుని ఆరాధనకు చాలా ప్రత్యేకమైన రోజు. కార్తికమాసం శివకేశవులకు ఎంతో పవిత్రమైన మాసం. ఈ రోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శివ ఆలయాలను సందర్శించి స్వామి వారిని దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. మరోవైపు.. హిందూ మతంలో సోమవారాన్ని చాలా పవిత్రంగా మరియు ప్రత్యేకంగా భావిస్తారు. కార్తిక మాసం చివరి సోమవారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున, శివుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం మరియు కొన్ని జ్యోతిష్య చర్యలు చేయడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుందని భక్తుల విశ్వాసం..

రేవంత్ అన్న అని పిలిచి మహిళ.. సీఎం ఏం చేశారంటే..
మేం పాలకులం కాదు.. సేవకులం.. అంటూ ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ మాటలను పాటిస్తుముందుకు సాగుతున్నారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా ఆయనే విని వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మంత్రులకే కాదు ప్రజలకు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటారంటూ గట్టి సంకేతాలు పంపారు. అయితే.. ముఖ్యమంత్రి అంటే ముందు పది మంది, వెనుక పది మంది పోలీసులు, చుట్టూ పదుల సంఖ్యలో నేతలు ఉంటారు. సీఎం ఎక్కడికైనా వస్తున్నారంటే కనీసం గంట ముందే ఎక్కడికక్కడ కట్ బంద్ చేస్తారు. కనీసం ఆయన్ను కలవాలంటే కూడా సాధ్యపడదు. ఆయన్ను దగ్గరగా చూసే అవకాశం కూడా దొరకదు. కానీ.. అప్పుడూ సీఎం అంటే అలా ఉండేదేమో కానీ.. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చాడు. నువ్వు నన్ను అన్నా అని పిలిస్తే క్షణాల్లో మీ ముందుకు వస్తాను అనే మాటను సీఎం అయినా ఆయన నిరూపించుకున్నారు. ఏదో సినిమాలో హీరో చెప్పినట్లే.. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును ఇప్పుడు అందరూ బ్యాడ్ సీఎంగా భావిస్తున్నారు. ఢిల్లీ రాజు అంటే తల్లీకొడుకులాగా.. రాష్ట్రానికి సీఎం అయినా సామాన్యులకు అన్ననే.. అన్నా.. అని పిస్తే చాలు మీ ముందుకు నేనే వస్తా అంటూ చెప్పిన మాటలు నిరూపించారు.

భక్తులకు శుభవార్త.. మధ్యాహ్నం 3 గంటల నుంచే అయ్యప్ప దర్శనాలు!
ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని టీబీడీ గంటసేపు పొడిగించింది. ప్రస్తుతం రోజులో రెండో భాగంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు. ఇక నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు మొదలై.. రాత్రి 11 గంటల వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ వర్చువల్‌ క్యూ ద్వారా 90 వేల బుకింగ్‌లు, స్పాట్‌లో 30 వేల బుకింగ్స్‌ ఉంటున్నాయని అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్‌ కుమార్‌ చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో.. దర్శనాలను త్వరగా చూడాలన్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందన్నారు. అయ్యప్ప దర్శన సమయాలను ప్రతిరోజూ 17 గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని టీబీడీ పేర్కొంది. దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు మంచి నీరు, బిస్కెట్లను అందిస్తున్నట్లు తెలిపింది.

కలకలం రేపుతోన్న వందల రోజుల దగ్గు వ్యాధి..
బ్రిటన్‌లో వందల రోజుల దగ్గు వ్యాధి కలకలం రేపుతోంది. దీన్ని అంటు వ్యాధిగా గుర్తించిన ఆరోగ్య నిపుణులు.. హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ వ్యాధి ముక్కు కారడం, గొంతు నొప్పితో మొదలై.. దగ్గు అధికమవుతుందని చెబుతున్నారు. దీని కారణంగా గొంతులో పుండ్లు, చెవిలో ఇన్ఫెక్షన్లకు గురయిన కేసులు బయటపడ్డాయి. ఓ దశలో మూత్రవిసర్జన ఆపుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాక్టీరియా కారణంగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మూడు, నాలుగు నిమిషాల పాటు తీవ్రమైన దగ్గు రావడం వల్ల వాంతులు, లేదా పక్కటెముకలు విరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితులు యూకేలో కనిపిస్తున్నాయి. జూలై – నవంబర్ మధ్య 716 పెర్టుసిస్ కేసులు నమోదయ్యాయని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ఈ కోరింత దగ్గు గతేడాదితో పోలిస్తే 250 శాతం పెరిగిందని వెల్లడించింది. ముఖ్యంగా పిల్లులు, వృద్ధుల్లో ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లల్లో ఈ దగ్గు నివారించడానికి, మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి టీకాలు అవసరమని NHS హెచ్చరించింది. గర్భిణీలు టీకాలు వేయించుకోవాలని… తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. యూకేలో అందరూ సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. దగ్గు వచ్చినప్పుడు నోటికి ఏదైనా క్లాత్‌ అడ్డుపెట్టుకోవాలంటున్నారు. ఇది అంటువ్యాధిలా వ్యాపిస్తుందని… తుంపర్ల ద్వారా ఎటాక్‌ అవుతుందంటుని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అయితే ఈ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందని.. నివారించడం సాధ్యమేనని అంటున్నారు.

మీ ఫోన్లో యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఇలా చెయ్యండి..
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేనివారు లేరు.. దాదాపు అందరు వాడుతున్నారు.. ఫోన్లోనే ముఖ్యమైన పనులు సులువుగా అవుతుండటంతో స్మార్ట్ మొబైల్స్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.. జనాల అవసరాలకు తగ్గట్లే ఆయా కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్స్ తో మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతున్నారు.. ఇక విషయానికొస్తే.. ఇంటర్నెట్ ఆన్ లో ఉంటే చాలు యాడ్స్ వస్తూనే ఉంటాయి.. కొన్నిసార్లు విసుగు కూడా తెప్పిస్తాయి.. ఏదైన ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడో లేదా .. ఏ మనీ చెల్లించేటప్పుడో ఇలా యాడ్ వస్తే, మనీ చెల్లించినా, చెల్లించనట్లు చూపిస్తే… దానంతటికీ కారణం ఆ యాడే అయితే.. దాని వల్ల మనం చాలా ఇబ్బంది పడతాం. Apple iPhone లో ప్రకటనలు ఎప్పుడూ కనిపించవు.. ఇలాంటి యాడ్స్ ను ఆఫ్ చేసుకొనే ఆప్షన్ కూడా ఉంది..

గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం,వెండి ధరలు.. తులం ఎంతంటే?
బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఎందుకంటే మార్కెట్ లో పసిడి ధరలకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు.. నిన్నటి ధరలతో పోలిస్తే, నేడు మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉన్నాయి.. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 350 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 150 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి 78, 000 గా నమోదు అయింది.. ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడుస్తుంది.. స్థిరంగా వెండి ధరలు ఉన్నాయి.. ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 76,000గా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000లకు చేరింది. హైదరాబాద్‌లో కూడా అదే ధరలు నడుస్తున్నాయి.. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

14 వారాలకు శోభా శెట్టి ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ తీకుసుకుందో తెలుసా?
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 14 వారాలాను పూర్తి చేసుకుంది.. ఈవారంకు తక్కువ ఓటింగ్ ఉన్న బిగ్ బాస్ దత్త పుత్రిక శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది.. ఈమెపై ఎంత నెగెటివిటీ ఉన్నా కూడా ఎన్ని ఓట్లు తక్కువ వేసినా కూడా 14 వారాల వరకు ఈమెను హౌస్లో నెట్టుకు వచ్చారు.. మొదటి వారం నుంచే నామినేషన్స్ లో ఉంటున్న అమ్మడిని బిగ్ బాస్ సేఫ్ చేస్తూ వస్తుందని జనాల్లో టాక్ ను కూడా అందుకుంది.. సోషల్ మీడియాలో ఈమెపై చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేయడమే కాదు బయటికి వస్తే ఏం చేస్తామో మాకే తెలియదు అనేలా చండాలమైన కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇంత నెగిటివిటీ వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్ ఆమెను సేవ్ చేస్తూ వచ్చిందని తెలుస్తుంది.. బిగ్ బాస్ మొత్తం ఫేక్ ఓటింగ్ అని ఓట్లు తక్కువ వచ్చిన వారిని హౌస్ లో ఉంచుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తున్నారు అని ఇప్పటికే చాలాసార్లు బిగ్ బాస్ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అంతే కాదు కొంతమంది అయితే బిగ్ బాస్ ని చూడడమే మానేశారు.. హౌస్ లో ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటూ.. వయస్సుకు మర్యాద లేకుండా అందరి మీద అరుస్తూ ఉంటుంది..

కాబోయే భర్తను పరిచయం చేసిన జబర్దస్త్ నటి.. రొమాంటిక్ డ్యాన్స్..
బుల్లితెర పై సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతో మంది కమెడీయన్లు ఈ షో ద్వారా మంచి పేరును తెచ్చుకుంటూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కొందరు సినిమా డైరెక్టర్లు కూడా అయ్యారు.. ఇక జబర్దస్త్ లో లేడీ కమెడియన్ మంచి పాపులారిటిని సంపాదించిన నటి పవిత్ర గురించి అందరికి తెలిసే ఉంటుంది.. పవిత్ర త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాను ప్రేమించిన వ్యక్తితోనే పవిత్ర ఏడడుగులు వేయబోతున్నారు.. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ.. రొమాంటిక్ డ్యాన్స్ చేసింది.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈమె కొద్ది రోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని, పెళ్లి విషయాన్ని పవిత్ర సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేశారు. సంతోష్ అనే వ్యక్తిని పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. పెళ్లి తేదీని ఇంకా తెలియజేయని ఈ జంట.. ప్రస్తుతం లవ్ లైఫ్ ని మరింత ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పవిత్ర ఒక వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో పవిత్ర తన కాబోయే భర్త సంతోష్ తో కలిసి.. లోఫర్ మూవీలోని రొమాంటిక్ సాంగ్ ‘జియా జలే’ సాంగ్ కలిసి డాన్స్ వేశారు. అయితే సంతోష్ కి మాత్రం డాన్స్ వేయడం చేతకావడం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూనే పవిత్ర ఇలా రాసుకొచ్చారు.. ‘కొన్ని సిట్యువేషన్స్ లో మనకి డాన్స్ వేయడం రానప్పుడు ఎం చెయ్యాలో తెలుసా.. డాన్స్ వచ్చినట్లు మ్యానేజ్ చెయ్యాలి అంటూ వీడియోకు జత చేసింది..