సాకే భారతికి సర్కార్ సాయం.. 2 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం..
కష్టాలు ఎదురైనా లక్ష్యం చేరుకుంటే ఎలా ఉంటుందో డాక్టర్ సాకే భారత్ జీవితం చెబుతుంది.. ఓవైపు కటిక పేదరికం.. మరో వైపు ఉన్నతాశయం.. ఎంతో కష్టపడి కూలి పనులు చేసుకుంటూ చదువుకుని పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆమె కష్టం వృథా కాలేదు.. పీహెచ్‌డీ చేసేంత వరకు ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు చూడాల్సి వచ్చింది.. కానీ, ఆ పీహెచ్‌డీ సాధించిన తర్వాత.. ఎంతో మంది ప్రశంసలు అందుకుంది.. తెలుగు రాష్ట్రాలు మొత్తం తనవైపు చూసేలా చేసుకుంది.. ఎవరా? సాకే భారత్.. ఆమె జీవితం ఏంటి? జీవనం ఏంటి? ఎలా పీహెచ్‌డీ సాధించింది అనే విషయాల్లో అన్ని మీడియాల్లో ప్రముఖంగా ప్రసారం అయ్యాయి.. అయితే, తక్కువ కాలంలోనే ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది.. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ సాధించిన సాకే భారతి టాలెంట్‌ను గుర్తించిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఆమెకు సాయం చేసి అండగా నిలిచింది. సాకే భారతికి 2 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది ఏపీ ప్రభుత్వం.. ఆ రెండు ఎకరాల భూమికి సంబంధించిన పట్టాను సాకే భారతికి అందించారు అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి. సోమవారం రోజు కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సాకే భారతికి పొలం పట్టా అందజేసిన కలెక్టర్ గౌతమి.. భారతి సాధించిన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించిన భారతి.. ఎందరికో ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు.. భారతికి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని ప్రకటించారు కలెక్టర్ గౌతమి.. శింగనమల మండలం సోదనపల్లి గ్రామంలో సర్వే నంబరు 9-12లో వ్యవసాయ యోగ్యమైన 2 ఎకరాల భూమి భారతికి అందించాం. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని నిర్మించి ఇస్తామని.. ఎస్‌కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జేఎల్ పోస్టు (కెమిస్ట్రీ) ఖాళీగా ఉంది.. సాకే భారతి అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామని హామీ ఇచ్చారు.
నేడు విశాఖకు సీఎం జగన్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. ఓవైపు వివిధ శాఖలపై సమీక్ష సమావేశాల నిర్వహిస్తోన్న ఆయన.. మరోవైపు సంక్షేమ పథకాలను కూడా ప్రారంభిస్తున్నారు.. వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ.. ఒక్కో పథకానికి సంబంధించిన డబ్బును బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మరోవైపు జిల్లాల్లో పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు.. కాగా, ఈ రోజు విశాఖలో పర్యటించనున్నారు సీఎం వైఎస్. విశాఖ పర్యటనలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఏపీ సీఎం.. ఇక, ఈ పర్యటన కోసం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉదయం 10.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.15 గంటలకు కైలాసపురం పోర్టు ఆసుపత్రి వద్దకు చేరుకుంటారు. అక్కడ ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో చేపట్టనున్న 50 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరి సిరిపురం కూడలిలోని ఏయూ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్, బయో మోనిటరింగ్ హబ్‌తో పాటు మరో నాలుగు భవనాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.50 గంటలకు ఏయూ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.20 గంటలకు కన్వెన్షన్ సెంటర్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.50 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరనున్న సీఎం జగన్.. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. అక్కడి నుంచే బరిలోకి..!
భూమా దంపతుల కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. నంద్యాల నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అవుతుందని ప్రకటించారు.. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఆళ్లగడ్డపైనే ఫోకస్ పెట్టమని పార్టీ అధిష్టానం చెప్పిందన్నారు.. అయితే, తన తండ్రి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాణాలు విడిచిన నంద్యాల నుండే తాను పొలిటికల్ కెరీర్ ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. కానీ, తనను నంద్యాలలో తిరగవద్దని పార్టీ చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు.. నంద్యాల నియోజకవర్గంలోని ప్రతి వార్డు, గ్రామంలో పర్యటిస్తాను అని ఈ సందర్భంగా ప్రకటించారు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.
రియల్ ‘జోకర్’ పాపం పండింది.. 23 ఏళ్ల జైలు శిక్ష
డీసీ కామిక్స్‌లోని ‘జోకర్’ క్యారెక్టర్ తరహాలో ఒక వ్యక్తి జోకర్ వేషం ధరించి.. ఒక ట్రెయిన్‌లో మారణకాండ సృష్టించాడు. మొత్తం 13 మంది వ్యక్తుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ కేసులో తొలుత నిందితుడు పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి అతని పాపం పండి, పోలీసులకు దొరికాడు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత.. న్యాయస్థానం నిందితుడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. 2021 అక్టోబర్ 31వ తేదీన క్యోటా హట్టోరి (26) అనే ఓ వ్యక్తి జోకర్ వేషం ధరించి, రద్దీగా ఉండే ట్రెయిన్‌లో ఎక్కాడు. ట్రెయిన్ కదిలే వరకు సైలెంట్‌గా ఉన్న అతడు, ట్రెయిన్ కదలగానే ఒక వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు. అతని ఛాతిపై పొడిచాడు. ఆ తర్వాత మరో 12 మంది ప్రయాణికులను చంపేందుకు ప్రయత్నించాడు. రాత్రి 8 గంటల సమయంలో కీయో లైన్ రైలులో లైటర్‌ను వెలిగించి, ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు ఒక్కసారిగా మాయమైపోయాడు. అతడు జోకర్ వేషంలో ఉండటంతో.. నిందితుడు ఎవరో తెలీక పోలీసులు తలలు పట్టుకున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? అనేది అప్పట్లో పెద్ద మిస్టరీగా మారింది.
కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా.. ఐపీఎల్ స్టార్లకు పిలుపు! ఐర్లాండ్‌తో టీ20లకు భారత జట్టు ఇదే
వెస్టిండీస్ పర్యటన అనంతరం ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. భారత జట్టుకు బీసీసీఐ సెలెక్టర్లు కొత్త కెప్టెన్‌ను నియమించారు. వెన్ను గాయంతో దాదాపు 11 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ ఎంపిక చేశారు. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్‌లకు విశ్రాంతి ఇవ్వడంతో.. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో సొంతగడ్డపై చివరిగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆడాడు. ఆ తర్వాత వెన్ను గాయంతో మైదానానికి దూరమయ్యాడు. శస్త్ర చికిత్స అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకున్న బుమ్రా.. ఇటీవలే సాధన మొదలు పెట్టాడు. ఫిట్‌నెస్ సాధించిన అతడు ఏకంగా టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. గాయాల నుంచి కోలుకోని స్టార్ బ్యాటర్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు జట్టులో చోటు దక్కలేదు. గాయంతో చాలా రోజులుగా జట్టుకు దూరమై ఎన్‌సీఏలో కోలుకున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ 2023లో సత్తాచాటిన శివమ్ దూబె కూడా చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2023లో పరుగుల వరద పారించిన రింకు సింగ్, జితేశ్ శర్మలు తొలిసారి భారత జట్టులోకి వచ్చారు. ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మలకు కూడా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడే జట్టులో చోటు దక్కింది.
ఐటీఆర్ ఫైలర్ల సంఖ్యను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న ఆర్థిక మంత్రి.. కారణం తెలిస్తే షాక్
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఈసారి జూలై 31 చివరి తేదీ. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు. కానీ దానిని ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. ప్రస్తుతం జూలై 31, 2023 వరకు.. మార్చి 31తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించి 6.50 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేయబడ్డాయి. చివరి రోజైన జూలై 31న 40 లక్షలకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ. నిన్న సాయంత్రం ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన సమాచారంలో.. సాయంత్రం 6 గంటల వరకు 1.78 కోట్ల ‘లాగిన్స్’ సక్సెస్ అయినట్లు సమాచారం. ఇప్పటి వరకు 6.50 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆ శాఖ ట్విట్టర్‌లో రాసింది. వీటిలో నేటి సాయంత్రం వరకు 36.91 లక్షల ఐటీఆర్‌లు దాఖలు కాగా.. గతేడాది జూలై 31 వరకు దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఐటీఆర్ ఫైల్ చేసిన వారి సంఖ్యను చూసి ఆర్థిక శాఖ సంతోషం వ్యక్తం చేసింది. ITR ఫైల్ చేయడంలో సహాయం చేయడానికి ఆదాయపు పన్ను శాఖ, హెల్ప్‌డెస్క్, వెబ్‌సైట్‌లో 24-గంటల సేవ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే ఏం చేయాలన్న ప్రశ్న తలెత్తింది.
బాబు బర్త్ డే రోజు సర్ప్రైజ్ లు ఏం ఉండవా?
ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ఘట్టమనేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉంటారు. 24 గంటల ముందు నుంచే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాని కబ్జా చేసి సందడి చేస్తూ ఉంటారు. మహేష్ బాబు బర్త్ డే రోజున ఎవరు ఎలాంటి విషెష్ చెప్పారు, ఏ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చింది? మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా అని ఈగర్ గా చూస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే జోష్ లో ఆగస్టు 9న సోషల్ మీడియాలో సందడి చేయడానికి రెడీ అయ్యారు కానీ సంబరాలు చేసుకోవడానికి ఫ్యాన్స్ కి మహేష్ నటిస్తున్న సినిమాల నుంచి పెద్దగా అప్డేట్స్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. ముందుగా త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా నుంచి సాంగ్ అనౌన్స్మెంట్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ థమన్ నుంచి సాంగ్ ఫైనల్ అవ్వాలి, దానికి టీమ్ అప్రూవల్ ఇవ్వాలి, ఆ తర్వాత సాంగ్ బయటకి రావాలి. ఈ ప్రాసెస్ జరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మహేష్ కి బర్త్ డే విషెష్ చెప్తూ చిన్న వీడియో ఏమైనా గుంటూరు కారం నుంచి బయటకి రావచ్చేమో కానీ అంతకన్నా పెద్ద సర్ప్రైజ్ లు ఉండకపోవచ్చు. ఇక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా బజ్ క్రియేట్ చేస్తున్న రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ గురించి కూడా ఆగస్టు 9న ఒక క్లారిటీ వస్తుందని భావించారు. ఆ రోజు సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు కానీ రాజమౌళి డిసెంబర్ వరకూ SSMB 29 గురించి మాట్లాడే అవకాశం కనిపించట్లేదు. ఇక ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఆగస్టు 9న బయటకి రానున్న ఒకే ఒక్కటి బిజినెస్ మాన్ సినిమా. ఈ మూవీ రీరిలీజ్ అయితే థియేటర్స్ లో సందడి చేయాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మహేష్ బాబు బర్త్ డేకి ఇంతకన్నా పెద్ద అప్డేట్స్ ఉండకపోవచ్చు, మరి సడన్ సర్ప్రైజ్ లు ఏమైనా ఉంటాయేమో చూడాలి.
తస్మాత్ జాగ్రత్త.. నేడు వాన్నలున్నాయ్.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్
మొన్నటి వరకు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలు ముంపునకు గురయ్యాయి. ఈ వరద పోటు నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. చాలా గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్ వంటి నగరాలు కూడా వరదల్లో మునిగిపోయాయి. అయితే రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ విజృంబిస్తున్నాడు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం వర్షం కురవడంతో కార్యాలయం నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడ్డారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిశాయి. అయితే ఈరోజు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, జనగాం, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్ద రాజన్నపల్లి, పెద్ద రాజన్నపల్లి, రాజన్నపల్లిలో వర్షం. జిల్లాలు. వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఇవాళ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.
ఘాటైనా అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
ఈషా గుప్తా ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జన్నత్ 2`చిత్రం తో బాలీవుడ్‌లో కి అడుగుపెట్టింది ఇషా గుప్తా.ఆ తరువాత `రాజ్ 3డీ`,`చక్రవ్యూహా`వంటి వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది.`బేబీ`మరియు`టుటక్ టుటక్ టుటియా`సినిమాల లో ఐటెమ్ సాంగ్స్ లో నటించింది.. దీంతో పాటు వీడెవడు సినిమా తో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత `వినయ విధేయ రామ`చిత్రం లో `ఏక్ బార్ ఏక్ బార్` ఐటెమ్ సాంగ్ లో అదరగొట్టింది.ప్రస్తుతం హిందీ లో మూడు సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా ఉంది.హాట్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియా లో ఎంతగానో యాక్టీవ్ గా ఉంటూ శృతి మించిన అందాల విందు చేస్తూ నెటిజన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈషా గుప్తా తాజాగా తన టెంప్టింగ్ పోజులతో రెచ్చగొట్టింది. తన ఎద అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుందీ ఈ హాట్ బ్యూటీ.బోల్డ్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న ఇషా గుప్తా తన సరికొత్త లుక్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.దీంతో తన హాట్ ఫోటోలు సోషల్ మీడియా ని షేక్ చేస్తున్నాయి.ఇషా గుప్తా తాజాగా ఈ ఫోటోలు పంచుకుంటూ ఓ పోస్ట్ ను పెట్టింది. `అందమైన వేసవి గాలి` అంటూ రిసార్ట్ లకు ధన్యవాదాలు తెలిపింది. ఆమె ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. ప్రస్తుతం ఈ భామ ఫోర్చుగల్ లో ఉన్నట్టు తెలుస్తుంది.అక్కడ దిగిన ఈ హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఇషా గుప్తా ఇటీవల ఆసుపత్రి బెడ్‌పై కనిపించి అందరికి షాకిచ్చింది. తాను అనారోగ్యానికి గురయ్యాను అని ఆసుపత్రి లో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని వున్నా పిక్ ను షేర్ చేసింది..అలాగే తాను హైపర్బెరిక్ థెరపీ చేయించుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొంది.
శివుడి పాత్రలో అక్షయ్ ని తీసేయండి… సెన్సార్ బోర్డు సంచలనం
అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ వంటి స్టార్స్ నటించిన ‘OMG 2’ చిత్రం నిరంతరం చర్చలో ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతోంది కానీ దానితో పాటు రిలీజ్ కి చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ చిత్రం ఆగష్టు 11 న నిర్మాత-దర్శకుడు అనిల్ శర్మ చిత్రం గదర్ 2 తో పాటు విడుదల కావాల్సి ఉంది, కానీ ఇప్పుడు నివేదికల ప్రకారం ఈ చిత్రం విడుదల తేదీని ముందుకు నెట్టారు. అయితే మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రను మార్చాలని సెన్సార్ బోర్డ్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) యొక్క రివైజింగ్ కమిటీ అక్షయ్ కుమార్ నటించిన చిత్రం వివాదాస్పదమని పేర్కొంది, చిత్రానికి A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది, అయితే ఈ చిత్రానికి ఇంకా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సినిమాలోని కంటెంట్, సీన్స్ విషయంలో రాజీ పడేందుకు మేకర్స్ సిద్ధంగా లేరని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, సెన్సార్ బోర్డ్ కూడా తమ డెసిషన్ పై స్ట్రాంగ్ గా నిలబడి ఉంది. ఏ విధంగానూ కనికరం చూపించడానికి సిద్ధంగా లేదు. ‘OMG’ తర్వాత, ‘OMG 2’లో అక్షయ్ కుమార్ శివని లుక్ లో చూడటానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ సెన్సార్ బోర్డుకి మాత్రం అక్షయ్ లుక్ తోనే సమస్య వచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ శివుడి పాత్రను ప్లే చేయడాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆమోదించడం లేదు. అక్షయ్ పాత్రను మార్చాలని, శివుడిలా కాకుండా దేవుడి దూతగా చూపించాలని సెన్సార్ బోర్డ్ మేకర్స్ కోరుతోంది. A సర్టిఫికేట్ పొందడం అంటే కుటుంబం మరియు పిల్లలు సినిమా చూడలేరని మీకు తెలియజేద్దాం. అలాంటి పరిస్థితుల్లో సినిమా చాలా నష్టపోతుంది. ఈ సినిమాని ఎలా రిలీజ్ చేయాలనే దానిపై దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు.
