NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

14వ రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి సీఎం జగన్‌ షెడ్యూల్‌ ఇదే..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 14వ రోజుకు చేరింది.. మేమంతా సిద్ధం బస్సుయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. ఎండా, వర్షాన్ని లెక్కచేయకుండా బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ధూళిపాళ్ల నుంచి బయల్దేరి ఏటుకూరు వరకూ దిగ్విజయంగా యాత్ర నిర్వహించారు సీఎం జగన్. వివిధ వర్గాల ప్రజలు యాత్రలో భాగంగా సీఎంను కలిసి, తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. మళ్లీ వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని.. మరిన్ని సంక్షేమపథకాలు అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. అదే సమయంలో కూటమి పార్టీలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.గతంలో వారిచ్చిన హామీలు అమలుచేయలేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇవాళ.. బస్సుయాత్ర నంబూరు బైపాస్‌ నుంచి ప్రారంభిస్తారు సీఎం జగన్. కాజా, మంగళగిరి బైపాస్ మీదగా 11గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మేమంతా సిద్ధం యాత్ర విజయవాడకు రాబోతోందన్నారు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు. విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా యాత్ర ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలా మేమంతా సిద్ధం యాత్ర సాగుతోందన్నారు. తమ దగ్గరకు వస్తున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు పోటీ పడుతున్నారు. ఓవైపు వైసీపీ కార్యకర్తలు, మరోవైపు అభిమానులతో యాత్రలో కోలాహలం కనిపిస్తోంది.

లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌.. నేడు చేవెళ్ల నుంచి ప్రచారానికి కేసీఆర్‌ శ్రీకారం
లోక్‌సభ ఎన్నికలకు రెడీ అవుతోంది బీఆర్‌ఎస్‌.. అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌.. నేడు చేవెళ్ల నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. పార్లమెంట్‌ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో స్పీడ్‌ పెంచుతోంది కారు.. నేడు చేవెళ్లలోని ఫరా కళాశాల మైదానంలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు గులాబీ అధినేత కేసీఆర్‌ హాజరు కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు జరగనున్న బహిరంగసభలో కాంగ్రెస్ పాలన తీరును ఎండగట్టేలా కేసీఆర్‌ ప్రసంగం సాగనున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు చేవెళ్ల ఎంపీ సీటును కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌.. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తోంది. తద్వారా ప్రత్యర్థులకు దీటైన సమాధానం చెప్పాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న తొలిసభకు రెండు లక్షల మంది జనాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఐదు రోజుల పాటు వర్షాలు.. ఎల్లో, ఆరేంజ్‌ అలర్ట్‌ జారీ
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండు మూడు రోజుల కిందటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఇప్పుడు ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 10 నుంచి వాతావరణం చల్లబడటం ప్రారంభించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా ఉన్నాయి. తెలంగాణపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురవచ్చు. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

ప్రాణాలు తీసిన క్రికెట్‌ బెట్టింగ్‌.. కాకినాడలో యువకుడి ఆత్మహత్య
సందర్భం ఏదైనా సొమ్ము చేసుకోవడమే బెట్టింగ్‌ రాయుళ్ల పని.. అది ఎన్నికల సీజన్‌ అయినా.. క్రికెట్‌ సీజన్‌ అయినా.. ఇక, ఐపీఎల్‌ షురూ అయ్యిందంటే బెట్టింగ్‌ రాయుళ్లకు పండగే.. కొన్ని సార్లు పోలీసుల రైడ్స్‌ జరిగినా.. కేసులు పెడుతున్నా.. అరెస్ట్‌లు చేసినా.. చాలా ప్రాంతాల్లో గుట్టుగా.. ఈ వ్యవహారం సాగుతూనే ఉంది.. బెట్టింగ్‌ బారినపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కాకినాడ జిల్లాలో కలకలం రేపుతోంది.. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. క్రికెట్‌ బూకీల నుంచి బెదిరింపులు రావడంతో భయంతో అనిల్ కుమార్ అనే యువకుడు సూసైడ్‌ చేసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.. కరప మండలం వేళంగికి చెందిన అనిల్ కుమార్.. రామచంద్రపురంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు.. క్యాటరింగ్ పనులు చేసే అనిల్‌.. క్రికెట్‌లో బెట్టింగ్‌ పెట్టేవాడు.. కొన్నిసార్లు డబ్బులు వచ్చినా.. చాలా సార్లు డబ్బులు పోగొట్టుకున్నాడు.. క్రికెట్‌ బెట్టింగ్‌ల కోసం ఏకంగా రూ. 2 లక్షలకు పైగా అప్పులు కూడా చేశాడు.. ఓవైపు అప్పుల వాళ్ల వేధింపులు.. మరోవైపు క్రికెట్‌ బుకీల నుంచి బెదిరింపులు రావడంతో.. అనిల్‌ కుమార్‌ బలవంతంగా ప్రాణాలు వదిలాడు.

ఢిల్లీలో దారుణం.. కారు ఢీకొని ముగ్గురు మృతి
ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై.. అర్ధరాత్రి బైక్‌పై సోదరీమణులతో కలిసి సురేందర్ ఇంటికి తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టి వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ సమీపాన ఉన్న గ్రేటర్‌ నోయిడాలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోదరుడు, అతని సోదరీమణులిద్దరూ ప్రాణాలు విడిచారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఓ పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. కారు అదుపు తప్పి వీరి బైక్‌ను ఢీకొట్టింది. సురేందర్, అతని సోదరీమణులు శైలి, అను మృతిచెందగా.. మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. నోయిడాలోని కులేసరలో నివాసం ఉంటున్నారు. సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్నా ప్రాంతంలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు వారి మీద వెళ్లినట్లు దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. బైక్‌ను ఢీకొట్టిన కారును ఇంకా గుర్తించలేదన్నారు. అలాగే ఎవర్నీ అరెస్ట్ చేయలేదని.. సీసీటీవీని పరిశీలించాక ముందుకు వెళ్తామని పోలీసులు తెలిపారు.

మాజీ మంత్రికి షాక్.. రూ.50 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
రేషన్ కుంభకోణం కేసులో కోల్‌కతాలోని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కీలక చర్యలు చేపట్టింది. టీఎంసీ ప్రభుత్వంలోని మాజీ మంత్రి (ఆహారం, సరఫరా) జ్యోతిప్రియ మల్లిక్, ఆమె సమీప బంధువులకు చెందిన సుమారు 50.47 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని అంచనా. 48 జప్తు చేసిన ఆస్తులను నేరాల ద్వారా సంపాదించినట్లు ఈడీ తన దర్యాప్తులో కనుగొంది. ఇది జ్యోతిప్రియ, ఆమె సన్నిహితురాలు, రైస్ మిల్లు యజమాని బాకీబుర్ రెహమాన్, శంకర్ ఆధ్య పేరిట ఉంది. సాల్ట్ లేక్ ప్రాంతంలో జ్యోతిప్రియ బంగ్లా, సమీప బంధువుల పేరిట బినామీ ఆస్తులు, కోల్‌కతా, బెంగళూరులో బాకీబుర్ రెహమాన్ పేరిట 2 హోటళ్లు, వివిధ ఖాతాల్లో డబ్బు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. జ్యోతిప్రియ తన కుటుంబం, ఇతర బంధువుల పేరు మీద వారి అనుమతి లేకుండా చాలా ఆస్తులను కానుకలుగా సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది. పీఎంఎల్ఏ క్రింద జతచేయబడినవి. పశ్చిమ బెంగాల్ పోలీసులు నమోదు చేసిన అనేక ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో పెద్ద మోసం బయటపడింది. విచారణలో, పీడీఎస్ స్కామ్‌కు సంబంధించిన నేరాల కేసు వెలుగులోకి వచ్చింది. ఇందులో పీడీఎస్ రేషన్‌ను బహిరంగ మార్కెట్‌కు తరలించడం, పీడీఎస్ పంపిణీకి పాత గోధుమ పిండిని తాజా పిండిలో కలపడం, ఎంఎస్‌పీపై నకిలీ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం వంటివి గుర్తించారు. ఈడీ ప్రకారం, పీడీఎస్ కుంభకోణంలో నేరాలు రూ. 10,000 కోట్లకు పైగా ఉన్నాయి.

అది ‘నకిలీ శివసేన’ అన్న ప్రధాని.. ఇది మీ డిగ్రీలా నకిలీ కాదన్న ఉద్ధవ్ ఠాక్రే
లోక్‌సభ ఎన్నికల కోసం మహారాష్ట్రలో ఈ వారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సమయంలో అతను ఉద్ధవ్ ఠాక్రే బృందాన్ని ‘నకిలీ శివసేన’గా పేర్కొన్నాడు. ఉద్ధవ్ ఠాక్రే కూడా ప్రధాని మోడీని తిట్టిపోశారు. మీ డిగ్రీలా నా పార్టీ ఫేక్ కాదన్నారు. పాల్ఘర్ లోక్‌సభ స్థానం నుంచి శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) అభ్యర్థి భారతీ కమ్డీకి మద్దతుగా జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ… ఈ సమయంలో అతను ఇండియా కూటమి అద్భుతమైన విజయాన్ని కూడా పేర్కొన్నాడు. నేల పుత్రుల హక్కుల కోసం పోరాడేందుకు శివసేన అధినేత బాల్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేనను బూటకమని అంటున్నారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఇది మీ నకిలీ డిగ్రీ కాదు. ఈ వారం ప్రారంభంలో మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నకిలీదని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఇండియా కూటమి మిత్రపక్షమైన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సనాతనాన్ని నాశనం చేయడం గురించి మాట్లాడుతోందని, సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో ముడిపెడుతోందని ప్రధాని మోడీ అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, నకిలీ శివసేన ఒకే ప్రజలను ర్యాలీలకు పిలుస్తున్నాయి.

ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం షాక్.. ఫోన్ వినియోగదారులకు భారమే
చాలా కాలం తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు ఉపశమనం పొందడం ప్రారంభించారు. అయితే, త్వరలో ఈ విషయంలో మరో కొత్త సమస్యలు తలెత్తవచ్చు. లోక్‌సభ ఎన్నికల తర్వాత, సామాన్య ప్రజలు ద్రవ్యోల్బణం కొత్త షాక్‌ను ఎదుర్కోవచ్చు. ఈ షాక్‌ను టెలికాం కంపెనీలు ఇవ్వవచ్చు. జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచే యోచనలో ఉన్నాయని తాజా నివేదిక సూచిస్తుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ కంపెనీలు మొబైల్ టారిఫ్‌లను ఎప్పుడైనా పెంచుతున్నట్లు ప్రకటించవచ్చు. ఇదే జరిగితే జూన్‌లో ముగిసే ఎన్నికల తర్వాత ప్రజలు మొబైల్ ఫోన్లు వాడడం ఖరీదు కానుంది. జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ ప్లాన్‌లను ఖరీదైనవిగా మార్చవచ్చని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ అభిప్రాయపడింది. ఎన్నికల తర్వాత టెలికాం కంపెనీలు 15 నుంచి 17 శాతం టారిఫ్‌లను పెంచే అవకాశం ఉందన్న భయం నెలకొంది. అయితే దీనిపై మొబైల్ కంపెనీలు ఇంకా అధికారికంగా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు. మార్చి నెలలో కూడా ద్రవ్యోల్బణం ఉపశమనం క్రమంలోనే కొనసాగింది. ఒకరోజు క్రితం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5 శాతం దిగువకు వచ్చింది.

రాజస్థాన్ రాయల్స్ మళ్లీ విజయాల బాట పట్టేనా..?
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శనివారం నాడు మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. ఇక ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్, ఐదు మ్యాచ్‌ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ ఐదు మ్యాచ్‌ లలో కేవలం ఒకదానిలో మాత్రమే ఓడి పాయింట్స్ టేబుల్ లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇక ఈ రెండు జట్లు పంజాబ్, రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకు 26 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ వాటిలో 11 మ్యాచ్ లు, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్ లు గెలిచింది. ఇక ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఇప్పటివరకు పంజాబ్ అత్యధికంగా 223 పరుగులు చేయగా, పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ అత్యధిక స్కోరు 226. ఇక వీరిద్దరి మధ్య గత ఐదు మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ రెండు విజయాలు సాధించింది.

రెడ్ శారీలో గుండెల్ని పిండేస్తున్న లిల్లీ పాప..
అనుపమ పరమేశ్వరన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది.. ఈ మధ్య టిల్లు స్క్వేర్ సినిమాలో నటించింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్‌తో సూపర్ హిట్ కొట్టేసింది. సిద్ధూ జొన్నలగడ్డతో సరసన అనుపమ అందాలు సినిమాకే హైలెట్ అయ్యాయి.. కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేస్తుంది… ఇక సోషల్ మీడియాలో అనుపమ మళ్లీ అందాలతో రెచ్చగొడుతుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అనుపమ ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. రెడ్ శారీలో హాట్ అందాలతో లిల్లీ కుర్రకారు మతి పోగొడుతుంది.. మైండ్ బ్లాక్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ అమ్మడు నటించిన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఏకంగా ఈ సినిమా 100 కోట్లను అందుకుంది..అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇక మలయాళంలో పాటు, తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..