Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

రాష్ట్రంలో నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుంది

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ అంటేనే కాలువలు, చెరువులు నదులు ఆయన లేకపోతే నీటి ఎద్దడి వస్తుందని కేవలం 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్ల వచ్చిన కరువుగా దీనిని గుర్తించాలన్నారు. మన చేతుల్లో ఉన్న వ్యవస్థలను మనం 10 యేళ్లు కాపడుకున్నామన్నారు. నాగార్జున సాగర్ లో ఉన్న నీళ్లను తాగునీటిగా తీసుకోలేని పరిస్థితి అన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండి పోవడమే కాదు, తాగునీటికి కూడా సమస్యలు వచ్చాయన్నారు.

కార్యకర్తలు ఓకే అంటే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: ప్రభాకర్ చౌదరి

తనకు పార్టీ మారే ఆలోచన లేదని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నేతృత్వంలో పని చేయాలని ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలన్నారు. కార్యకర్తలు ఓకే అంటే మాత్రం తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రభాకర్ చౌదరి చెప్పారు. దగ్గుపాటి ప్రసాద్‌కు సహకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ… ‘అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునరాలోచించుకోవాలి. నాకు పార్టీ మారే ఆలోచన లేదు. చంద్రబాబు నేతృత్వంలో పని చేయాలనుంది. కార్యకర్తలు ఓకే అంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా. 2014కు ముందే సీఎం వైఎస్ జగన్ నాకు మంత్రి పదవి ఆఫర్ చేశారు. అయినా నేను పార్టీ మారలేదు. పార్టీ కోసం, చంద్రబాబు కోసం కష్టపడి పని చేశా. దగ్గుబాటి ప్రసాద్‌కు ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారో బాబు సమాధానం చెప్పాలి. దగ్గుపాటి ప్రసాద్‌కు సహకరించే ప్రసక్తే లేదు. ఏ రోజు ఆయన పార్టీ కోసం పని చేయలేదు’ అని మండిపడ్డారు.

నాలుగు నెలల్లో ఎన్ని కష్టాలు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలుసు..!

నాలుగు నెలల్లో ఎన్ని కష్టాలు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఎంపీ నామా నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లా సరిహద్దు వద్ద ఎంపీ నామ నాగేశ్వరరావు వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. అనంతరం నామా మాట్లాడుతూ.. తెలంగాణ రైతు బిడ్డగా రైతుల కష్టాలు దగ్గరగా చూసిన వ్యక్తిగా ఇవ్వాళ రాష్ట్రంలో ఉన్న సమస్యలను చూసి చాలా బాధపడ్డానని అన్నారు. జిల్లా ప్రజలకు, రైతు బిడ్డగా సాయం చేద్దామని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. రైతులు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు, మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేశారని అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాం అని బాధపడుతున్నారని తెలిపారు. మీరైన వచ్చారు చూడటానికి అని ఆయన వాపోయాడన్నారు.

చంద్రబాబు సభకు 4 వేల మంది కూడా రాలేదు.. నా పుట్టినరోజుకి మాత్రం..: ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి

టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి మండిపడ్డారు. గరం మసాలా లాగ చంద్రబాబు మాటలు ఉన్నాయని విమర్శించారు. బాబు సభకు 4 వేల మంది కూడా రాలేదని, తన పుట్టినరోజుకి మాత్రం 70 వేల మంది వచ్చారన్నారు. పేదవాళ్ల కాళ్లు పట్టుకోవడం తమ సాంప్రదాయం అని, పేదవారి కడుపు కొట్టడం మీ సాంప్రదాయం అని ఫైర్ అయ్యారు. తానే మళ్లీ ఎమ్మేల్యేగా గెలుస్తానని, మంత్రి పదవితో వవస్తానని మధుసూధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

‘బాబు సభకు 4 వేల మంది కూడా రాలేదు కానీ నా పుట్టినరోజుకి 70 వేల మంది వచ్చారు. పేదవాళ్ల కాళ్లు పట్టుకోవడం మా సాంప్రదాయం అయితే పేదవారి కడుపు కొట్టడం మీ సాంప్రదాయం. వీరప్పన్, పుష్ప అంటే కాళహస్తీ ప్రజలకు బొజ్జల సుధీర్ రెడ్డి గుర్తుకు వస్తాడు. బోజ్జలకు మంత్రి పదవి పోవడానికి, చనిపోవడానికి కారణం సుధీర్ రెడ్డి కాదా?. పుష్ప సినిమా బోజ్జలను చూసే తీశారు. సమాధులు కుడా తవ్వి ఇసుకను కుడా అమ్ముకున్న చరిత్ర బొజ్జల సుధీర్ రెడ్డిది’ అని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అన్నారు.

పాల్వంచ పోలీసులు నయా రూల్స్‌.. ట్రాక్టర్‌ కు సీటు బెల్ట్‌ లేదని జరిమానా..!

మహబూబాబాద్‌ లో ఒక ట్రాక్టర్‌ డైవర్‌ హెల్మెట్‌ పెట్టుకోలేదని జరిమానా విధించన ఘటన 2021లో సంచలనం సృష్టించింది. అయితే అలాంటి ఘటనే ఇప్పుడు మరో సంచలనాన్ని సృష్టించింది. ట్రాక్టర్‌ నడుపుతున్న వ్యక్తి సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు జరిమానా విధించడం పాల్వంచ ప్రజలు బిత్తరపోయేలా చేసింది. ఈఘటన తెలంగాణలోని పాల్వంచలో చోటుచేసుకుంది. సెల్ ఫోన్ చేతపట్టి కనీసం ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన లేకుండా వారికి ఇష్టనుసారంగా జరిమానా విదిస్తున్నారంటూ వాహనదారులు ఆరోపిస్తున్నారు. మరికొందరు వాహన దారులు ఐతే వీరు ఫోటో గ్రాఫర్ల లేక పోలీసులా అని చర్చించుకుంటున్నారు. వీళ్ళందరూ చదువుకొని పోలీసు కొలువు తెచ్చుకున్నది.. ఫోటోలు తీయటానికేనా అంటున్నారు. ఒక విచిత్రం ఏమిటంటే ఒక ట్రాక్టర్ కి సీటుబెల్ట్ లేదని సుమారు పది ట్రాక్టర్ లకు జరిమానా విధించారు ఓ పోలీసు. దీంతో ట్రాక్టర్ యజమానులు ముక్కున వేలేసుకొని ట్రాక్టర్ కి కూడా సీటు బెల్ట్ ఉంటుందా? అని సందేహంలో ఉండిపోయాడు. పిచ్చోడి చేతిలో రాయి అన్న సామెతగా పాల్వంచ రూరల్ పోలీసుల తీరు ఉందని మండిపడుతున్నారు.

కీలమైన ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన కాంగ్రెస్.. ఆ పార్టీని నమ్మలేం..

ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఐ నివేదిక ద్వారా మన దేశానికి చెందిన ‘కచ్చతీవు’ ద్వీపాన్ని శ్రీలంకకు ఎలా అప్పగించిందనే వివరాలు వెల్లడైన తర్వాత, ప్రధాని నరేంద్రమోడీ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆర్టీఐ నివేదికను ‘ఆశ్చర్యకరమైనది’గా పిలిచిన ప్రధాని, భారతదేశ ఐక్యతను కాంగ్రెస్ బలహీనం చేస్తుందని ఆరోపించారు. 1970వ దశకంలో వ్యూహాత్మకమైన కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై ఆదివారం పీఎం మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దేశ సమగ్రత, ప్రయోజనాలను కాంగ్రెస్ బలహీనం చేసిందని ఆరోపించారు.

1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ఆర్టీఐ నివేదిక వెల్లడించింది. ఈ చర్చ ఆశ్చర్యకరమైనదని, దేశ ప్రజలకు కోపాన్ని తెప్పించిందని, కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ నమ్మలేదని ప్రధాని మోడీ అన్నారు. ‘‘కచ్చతీవుని కాంగ్రెస్ ఎంత నిర్ద్వంద్వంగా వదులుకుందో వెల్లడిస్తుంది. ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. మేము కాంగ్రెస్‌ని ఎప్పటికీ విశ్వసించలేము. 75 ఏళ్లుగా భారతదేశ ఐక్యత, సమగ్రత మరియు ప్రయోజనాలను బలహీనపరచడం కాంగ్రెస్ పని విధానం.’’ అని పీఎం మోడీ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.

వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబుకు కక్ష.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

బాబు పాలన అంతా విధ్వంసమేనని, ప్రజలను ఇబ్బంది పెడతారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మళ్ళీ ఆయన తీరు బయటపడిందన్నారు. వాలంటరీల వ్యవస్థ పై ముందు నుంచే చంద్రబాబు కక్ష పెంచుకున్నారని అన్నారు. ఎన్నికల పేరుతో వాలంటరీ వ్యవస్థను ఆపాలని చంద్రబాబు పరోక్షంగా ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు. చంద్రబాబు స్వయంగా చెప్పవచ్చు.. వాలంటరీ వ్యవస్థ మంచిది కాదు అని.. జన్మభూమి కమిటీలు తెస్తామని.. కానీ ఇలా చంద్రబాబు దొంగ దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబు, దత్తపుత్రుడు ఆలోచన ఏంటో అందరికీ తెలుసన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను చంద్రబాబు పెట్టించారన్నారు. వాలంటరీల వ్యవస్థతో జగన్‌కు మేలు చేస్తారని చంద్రబాబు ఆలోచన అని.. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు లేఖలు రాయడం మొదలు పెట్టారన్నారు.

కాంగ్రెస్ పాలనలో లీకులు ఇస్తూ .. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు

కాంగ్రెస్ 100రోజుల పాలనలో ఉద్దేర మాటలు తప్ప, ఉద్దరించింది ఏమి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన కామారెడ్డిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో లీకులు ఇస్తూ .. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని, పెద్ద ఎమ్మెల్యేలను కొంటారు తప్ప, ఉద్యమకారులను కార్యకర్తలను రేవంత్ రెడ్డి కొనలేరని ఆయన వ్యాఖ్యానించారు. పేగులు మేడల వేసుకోవడం కాదు, పేదలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకో అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే భవిషత్ ఉండదు. బీబీ పాటిల్ గళం విప్పలేదన్నారు. రాముడు అందరి వాడు.. దేవున్ని రాజకీయం చేయడం సరైంది కాదని ఆయన హితవుపలికారు.

400 సీట్లు కాదు, కనీసం 200 గెలిచి చూపించాలి.. బీజేపీకి మమతా సవాల్..

లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్లను సాధించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి టార్గెట్ పెట్టుకుంది. స్వతహాగా బీజేపీ 370 స్థానాలను సాధించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే, బీజేపీ లక్ష్యాన్ని ఎద్దేవా చేస్తూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బెంగాల్ కృష్ణానగర్ జరిగిన కార్యక్రమంలో ఆమె బీజేపీని సవాల్ చేశారు.

400 సీట్లు కాదు, కనీసం 200 స్థానలను గెలవాలని దీదీ బీజేపీని సవాల్ చేశారు. బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని తాను అనుమతించబోమని ఆమె చెప్పారు. సీఏఏ కోసం దరఖాస్తు చేసుకుంటే విదేశీయులుగా మారుతామని, దాని కోసం దరఖాస్తు చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 ప్లస్ సీట్లు సాధిస్తామని అన్నారు, కానీ 77 వద్దే ఆగిపోయారని ఆమె గుర్తు చేశారు.

ఎండిపోయిన పంటల పేరుతో కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారు

ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు వచ్చిన కేసీఆర్ పర్యటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం నాలుగు నెలలు కూడా కాకుండానే ఎండిపోయిన పంటల పేరుతోటి కేసీఆర్‌ రాజకీయం చేయడాన్ని ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోసం కేసీఆర్ రైతుల దగ్గర ముసలి కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 90 శాతం కలవాలని నిర్మాణం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మిగిలిన 10 శాతం కాలువల నిర్మాణం చేసి ఉంటే ఇప్పుడు రైతుకు ఈ ఇభందులు వచ్చేదా.. కేసీఆర్ అనాలోచిత చర్యలతోనే పాలకుర్తి రైతులకు నష్టం జరిగిందన్నారు.

మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400 సీట్లు సాధ్యమా..? బీజేపీపై రాహుల్ గాంధీ ఆరోపణలు..

మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీ చెబుతున్నా 400 సీట్లు సాధ్యమా..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 400 సీట్లు సాధించేందుకు ప్రధాని ‘అంపైర్లను’ ఎంచుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్‌కి వ్యతిరేకంగా ఈ రోజు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, మల్లికార్జున ఖర్గే, కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, హేమంత్ సొరెన్ భార్య కల్పనా సొరెన్ హాజరయ్యారు.

ఢిల్లీలో నిర్వహించిన ‘లోక్‌తంత్ర బచావో’ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, మీడియాపై ఒత్తిడి లేకుండా వారు(బీజేపీ) 180 సీట్ల కంటే ఎక్కువ గెలవలేరని అన్నారు. ‘‘ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. అంపైర్లను ఒత్తిడి చేసి, ఆటగాళ్లను కొనుగోలు చేసి, కెప్టెన్లను బెదిరించి మ్యాచుల గెలవడాన్ని క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. మన ముందు లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి, అంపైర్లను ప్రధాని మోడీ ఎన్నుకున్నారు. మ్యాచ్‌కి ముందే మా జట్టు ఆటగాళ్లను ఇద్దర్ని అరెస్ట్ చేశారు’ అని కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌ల గురించి రాహుల్ గాంధీ అన్నారు.

ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం..

జగన్ ఇంటికి వెళ్లే రోజు దగ్గరకు వచ్చిందని, ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక న్యాయం చేసేది టీడీపీనేనని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజల అభిప్రాయం అర్థమైందన్నారు. ఎన్నికల ఫలితాలు కనిపిస్తున్నాయని.. మే 13 లాంఛనమేనన్నారు. 1983లో పార్టీ పెట్టినప్పుడు, 1994లో ఇంత కసి చూశానన్నారు. ఫ్యాన్ ముక్కలై డస్ట్ బిన్‌లోకి పోవడం ఖాయమన్నారు. ఐదేళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి అయినా పెట్టాడా అంటూ ప్రశ్నించారు.

మోడీ పదేళ్ళ లో కులాల కొట్లాటలు తెచ్చిండు

మోడీ పదేళ్ళ లో కులాల కొట్లాటలు తెచ్చిండని, ఉద్యోగాలు అడిగితే రాముని అక్షింతలు పంపించిండన్నారు మంత్రి సీతక్క. ఆదానీ- అంబానీ రిలయన్స్, జియో ల కోసమే బీజేపీ పనిచేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలే.. దేవుళ్ళ పేర్లు చెప్తున్నారు.. మన ఊర్లు అందరికి దేవుళ్ళు ఉన్నారని, గాంధీని చంపిన గాడ్సే కు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ పార్టీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీ కరోనా సమయంలో ఎవరికి సహాయం చేయలేదని, నల్లధనం తీసుకువస్తా అన్నడు, ప్రతి ఎకౌంటు లో పదిహేను లక్షల రూపాయల వేస్తా అన్నాడన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే దండుగా.. బీజేపీకి ఓట్లు వేస్తే అభివృద్ధి రాలేదన్నారు మంత్రి సీతక్క.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాతృవియోగం

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో కింజారపు కళావతమ్మ మృతి చెందారు. కింజారపు కళావతమ్మకు ఏడుగురు సంతానం కాగా.. అందులో ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. ఎర్రన్నాయుడు, హరివరప్రసాద్, ప్రభాకర్, అచ్చెన్నాయుడు మగ సంతానం. కళావతమ్మ మృతిపట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అచ్చెన్నాయుడి మాతృమూర్తి కళావతమ్మ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నట్టు వెల్లడించారు. అమ్మగారి మరణం కింజారపు కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కళావతమ్మకు కన్నీటి నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని నారా లోకేశ్ పేర్కొన్నారు.

ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం క్లారిటీ

ఏపీలో పింఛన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతపై ఎట్టకేలకు క్లారిటీ లభించింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. పింఛను లబ్ధిదారులు ఆధార్‌ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సెర్ప్‌ సూచించింది.

Exit mobile version