NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టండి.. అధికారులకు సర్కార్‌ ఆదేశం

ప్రభుత్వం ఫైనల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని సర్కార్ ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీ లోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు చేయాలని తెలిపింది. జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా విడుదల చేస్తూ.. ప్రభుత్వం కార్యాలయాల్లో సీఎం పెట్టాలని తెలిపింది. ఇప్పటికే కొందరు నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదనే వాదనపై ప్రభుత్వం స్పందించింది. దీంతో వచ్చే నెల 7వ తేదీ వరకు గడువు ఇస్తూ ఆదేశించింది. అన్ని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అన్ని ప్రభుత్వం కార్యాలయాల్లో ఉండాలని తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తి అయిన ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అన్ని ప్రభుత్వ కార్యాయాల్లో సీఎం ఫోటోను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ.. అక్టోబర్ 7వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మైక్‌ను పక్కకు తోసేసి.. మీడియాపై కర్ణాటక సీఎం సీరియస్..

కర్ణాటకలో ముడా స్కాం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణం సమగ్ర విచారణలో భాగంగా సిద్ధూను ఎంక్వైరీ చేసేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ పర్మిషన్ ఇవ్వడం చట్టబద్ధమేనని ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. ఈ పరిణామాతో ఆయన రాజీనామా చేయాలని బీజేపీ- జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించాలని ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించాగా.. సహనం కోల్పోయిన ఆయన, మైక్‌లను పక్కకు తోసేసి.. అవసరమైతే నేనే పిలిచి మాట్లాడుతాగా అంటూ సీరియస్‌ అయ్యారు.

పాత వారికే రేషన్ డీలర్లు కేటాయించాలి.. పెట్రోల్‌ బాటిల్‌ తో నిరసన..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాటర్ ట్యాంక్ ఎక్కి కొందరు రేషన్ డీలర్లు నిరసన తెలిపారు. సిరిసిల్ల పట్టణం సాయినగర్ లో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. పాత వారికే రేషన్ డీలర్లు కేటాయించాలని వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిల్ పట్టుకొని ఆందోళనకు చేపట్టారు. మా రేషన్ షాపులు మాకే కావాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించి మొన్న కేటాయించిన షాపులను రద్దు చేయాలన్నారు. ఆ షాపులను పాతవారికే కేటాయించాలని ఆందోళన చేపట్టారు. పది సంత్సరాల పైగా రేషన్ షాపులు నిర్వహిస్తున్న వారికి ఉన్న పళంగా రద్దు చేస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబాలు రోడ్డున పడేసారు అని కన్నీరుమున్నీరుగా విలపించారు. రాత్రికి రాత్రే రేషన్ షాపులు కేటాయించారని అవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి అక్కడి చేరుకుని పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులతో మాట్లాడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్..

మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూసీ ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మూసీ వద్ద ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మూసీ నిర్వాసితుల గుర్తింపు కోసం సర్వే కొనసాగుతోంది. పునరావాసం కోసం అధికారులు పేదల వివరాలను సేకరించడం ప్రారంభించారు. పునరావాసం తర్వాతే ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మూసీ నది ఆక్రమణల నుంచి బయటపడేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. మూసి నదిలో 2,166 ఇళ్లను అధికారులు గుర్తించారు. అయితే హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఎక్కువ ఆక్రమణలను అధికారులు గుర్తించారు. మూసీ రివర్ బెడ్ ప్రాంతాలను గుర్తించి మార్కింగ్ వేస్తున్న సిబ్బంది..చాదర్ ఘాట్, మూసా నగర్, శంకర్ నగర్ లలో హిమయత్ నగర్ తహశీల్దార్ సంధ్యా రాణి ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతుంది.. అయా నిర్మాణాల్లో నివసించేది యజమానా లేక కిరాయిదారా అని ఎంక్వయిరీ అధికారులు చేపట్టారు.

హర్షసాయిపై మరోకేసు

హర్ష సాయి కేసు మరో మలుపు తిరిగింది. హర్ష సాయి పై మరోసారి ఫిర్యాదు చేసింది అతని బాధితురాలు. నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన హర్ష సాయి బాధితురాలు, తన అడ్వకేట్ తో కలిసి హర్ష సాయి టార్చర్ చేస్తున్నాడని మరోసారి ఫిర్యాదు చేసింది. తనకు మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉండగా పోలీసులు నాలుగు టీంలతో గాలింపు మొదలు పెట్టారు. అదే విధంగా హర్ష సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలుగులో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక వేధింపుల ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. గతంలో తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న ఒక యువతి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376,,354, 328 కింద కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. అలాగే హర్ష సాయికి సంబంధించిన ఆధారాలు సైతం పోలీసులు సేకరిస్తున్నారు. అయితే హర్ష సాయి తరపు న్యాయవాదులు న్యాయపరంగా పోరాటం చేస్తామని అంటున్నారు. డబ్బుల కోసమే హర్ష సాయిపై అక్రమ కేసులు అని సదరు న్యాయవాది చెబుతున్నారు. మెగా సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు.

ముంబైలో వర్ష బీభత్సం.. ఓపెన్ డ్రైన్‌లో పడి మహిళ మృతి

ముంబైలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. అంధేరీలో మ్యాన్‌హోల్‌లో పడి ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళను 45 ఏళ్ల విమల్ గైక్వాడ్‌గా గుర్తించారు. ప్రమాద ఘటనపై ముంబై పోలీసులు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనపై విచారణకు కూడా బీఎంసీ ఆదేశించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళ భర్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారీ వర్షం సమయంలో అంధేరీ ఈస్ట్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భవనంలోని గేట్ నంబర్ 8 సమీపంలో పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్‌లో మహిళ పడిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆమెను గుర్తించి కూపర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మహిళ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 30వ వార్డులోని ఎచ్చర్ల వీధిలోని ప్రభుత్వ పాఠశాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో స్కూల్ వద్ద దుర్బర పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కారణంగా పాఠశాల ప్రాంగణంలో వర్షపునీరు నిలిచిపోయింది. పాఠశాల ప్రాంగణంలోనే ఎప్పుడు కూలుతాదో తెలియని శిథిలావస్థలో ఉన్న భవనం ఉంది. దానిని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. రణస్థలం మండలం పాతర్లపల్లి జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నిన్న(బుధవారం) నిర్మాణంలో ఉన్న పాఠశాల అదనపు భవనం సజ్జ కుప్పకూలడంతో ఒక విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. విద్యార్థి మృతి నేపథ్యంలో జిల్లాలోని పాఠశాల పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. విద్యా్ర్థి మృతి పట్ల మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని వెల్లడించారు.

పదిరాష్ట్రాలలో పెసా యాక్ట్ అమలులో ఉంది

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పెసా యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరుఫున మంత్రి సీతక్క పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ట్రైబల్ శాఖ అధికారులు, పెసా యాక్ట్ కోర్దినేటర్లు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పదిరాష్ట్రాలలో పెసా యాక్ట్ అమలులో ఉందని, పెసా యాక్ట్ అమలులో తెలంగాణలో ఉన్న సమస్యలను ఈ సమావేశం దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. పెసా యాక్ట్ ఉన్న గ్రామాల్లో గ్రామ సభల ద్వారా తీర్మానాలతో అనుమతులు తీసుకోవచ్చు, గ్రామసభల తీర్మాణమే అత్యున్నతమైనదనీ పెసా యాక్ట్ చెప్తుందని, రోడ్లు, మంచినీటి వ్యవస్థ, స్కూల్స్, విద్యుత్, హెల్త్ సెంటర్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలకు అటవీ చట్టాలు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు మంత్రి సీతక్క. అనుమతులు లభించేలా అటవీ అధికారులకు సూచన చేయాలని సూచించామన్నారు. కేంద్రం నుంచి నిధులు వచ్చిన వాటిని వినియోగించుకోవడంలో అటవీ అధికారుల తీరుతో గ్రౌండ్ చేయలేకపోతున్నాం, అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఏండ్ల కొద్దీ మురిగిపోతున్నాయని, గ్రామ సభ ద్వారా గ్రామాలకు ఏం అవసరమో వాటికి అనుమతులు వచ్చేలా చూడాలని కోరామని ఆమె తెలిపారు.

మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకం పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రాచకొండ సీపీ లు హాజరయ్యారు. వీరితో పాటు GHMC కమిషనర్ అమ్రాపాలి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాజసింగ్, MIM ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, నివాసాల్లో వయసు మీరిన వారు ఇబ్బంది పడుతున్నారన్నారు.

ముంబయి నటి కేసు.. తప్పు చేసిన ఎవర్ని వదిలే ప్రసక్తే లేదు..

ముంబయి నటి కాదంబరి జిత్వానీ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశామని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితి వెల్లడించారు. ఈ కేసులో తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసులో కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని మంత్రి చెప్పారు. విచారణ తర్వాత కొంతమంది పోలీసులపై చర్యలు ఉంటాయన్నారు పేర్కొన్నారు. ముంబయి నటి కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కాగా, హీరోయిన్ జిత్వానీ కేసు రాష్ట్రంలో కలకలం సృష్టించింది.. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం విదితమే.. ఇక. ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్ ను డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్‌లో అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకొచ్చిన విషయం విదితమే.. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. విద్యాసాగర్ కు అక్టోబర్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం విదితమే.