NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

వారికి వారే చంపుకుంటున్నారు.. జగిత్యాల ఘటనపై కేటీఆర్‌ కీలక కామెంట్..

రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ కార్యకర్తలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్ పేరుతో కాంగ్రెస్ ఉన్నా విద్యుత్ పోగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పేద మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిచేందుకు ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ, అంబానీ లకు సిరిసిల్ల నేతన్న లకి ఒకే కేటగిరి ఎలా? అని ప్రశ్నించారు. దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం.. పైసా పెంచలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల భారంగా మారాయన్నారు. గత పదేళ్లుగా ఆత్మహత్యలు లేవు, కానీ 10 నెల్లలో 10 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బుర్ర, బుద్ది మార్చకోవాలని కేటీఆర్ సూచించారు.

విజయవాడ వరద బాధితులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలో నగదు జమ

ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు కృష్ణానది ఉగ్రరూపం.. బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడ సిటీ అతలాకుతలం అయ్యింది.. ఎన్నడూ చూడనంత నష్టాన్ని చూసింది.. అయితే, యుద్ధప్రతిపదికన చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఓవైపు బాధితులను ఆదుకుంటూనే.. ఇంకో వైపు బుడమేరు కాలువకు పడిన గండ్లను పూడ్చేందుకు చర్యలు తీసుకుంది.. ఇక, క్రమంగా బెజవాడ కోలుకున్న తర్వాత.. వరద నష్టాన్ని అంచనా వేసింది.. ఇప్పుడు విజయవాడ వరద బాధితిలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.. ఇప్పటికే వరద బాధితులకు పరిహానం ప్రకటించిన ప్రభుత్వం.. ఈ రోజు మరో 1,501 మంది బాధితుల కోసం రూ.2.5 కోట్లు పరిహారం విడుదల చేసింది.. 1,501 మంది బాధితులకు వారి అకౌంట్లకు నేడు నగదు బదిలీ చేసింది..

మద్యం మత్తులో నడిరోడ్డుపై బాలికకు లిప్‌కిస్ ఇచ్చిన మహిళా పోలీస్

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని వార్డు నంబర్ 46లో మహిళా పోలీసు అధికారిపై తీవ్ర ఆరోపణ సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి పింక్ మొబైల్ పెట్రోలింగ్ వ్యాన్‌లో విధులు నిర్వహిస్తుండగా మహిళా పోలీసు అధికారి ఇద్దరు మైనర్లను కొట్టారు. ఈ సంఘటన వీడియో వైరల్ అయ్యింది. ఆ సమయంలో స్థానిక నివాసితులలో ఆగ్రహానికి దారితీసింది. దాంతో అక్కడి వారు పోలీసు సిబ్బందికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలకు దారితీసింది. అసలు విషయంలోకి వెళితే., బుధవారం రాత్రి సిలిగురిలోని 46వ వార్డులోని పాఠశాల మైదానంలో ఓ అబ్బాయి, బాలిక కలిసి మాట్లాడుకుంటున్నారు. స్కూల్‌ గ్రౌండ్స్‌లో తాము కేవలం స్నేహితులుగా మాట్లాడుకుంటున్నామని.. దాడికి గురైన మైనర్లు తెలిపారు. వారి ప్రకారం, వారు ఎలాంటి అసభ్య ప్రవర్తనకు, అక్రమాలకు పాల్పడలేదని.. కానీ, ఒక్కసారిగా లేడీ పోలీస్ సిబ్బంది పింక్ మొబైల్ వ్యాన్ దిగి తమపై దాడి చేశారని తెలిపారు.

ఢిల్లీలో కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్ చేయడం మానేశాం..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యం కమ్మేయడంతో రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తుంది. ఎన్ని క‌ఠిన‌ చర్యలు తీసుకున్నప్పటికీ కాలుష్యం మాత్రం తగ్గిపోవడం లేదు. కాలానుగుణంగా పెరుగుతున్న కాలుష్యం అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదే విష‌య‌ంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో విలేకరులతో సీజేఐ మాట్లాడుతూ.. పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్‌కు వెళ్లడం కూడా మానేసినట్లు వెల్లడించారు. సాధారణంగా తాను ఉదయం 4 నుంచి 4.15 గంట‌ల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్తానని చెప్పారు.

కస్తూర్బా గురుకులంలో 11 మంది విద్యార్థినిలకు అస్వస్థత..

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ కస్తూర్బా గురుకులంలో విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు. శ్వాసకోస సమస్యలతో విద్యార్థులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గురుకుల సిబ్బంది విద్యార్థినులను జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో 11 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. గురుకులంలో ఏం జరిగిందనే కోణంలో గురుకుల సిబ్బంది ఆరా తీస్తున్నారు. విద్యార్థులను పరిశీలించిన వైద్యులు సరైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో వున్నారని తెలిపారు. తీవ్ర అస్వస్థలకు గురి కావడానికి కారణాలను తెలుసుకోనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు అస్వస్థకు గురైనట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి వద్దకు చేరుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు అస్వస్థలకు గల కారణం పూర్తి యాజమాన్యమే అంటూ ఆందోళన చేపట్టారు. ఉదయం జరిగితే ఇప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. గురుకుల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలు శ్వాస కూడా తీసుకోలేక పోతున్నారని కన్నీరుపెట్టుకున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రుల ఆందోళనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

శ్రీవారి నడకదారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు.. వాళ్లు రావొద్దు..!

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. ఇక, శ్రీవారిని నడకమార్గంలో వెళ్లి దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది.. ప్రముఖుల సహా వేలాది మంది భక్తులు ప్రతీరోజు నడకమార్గంలో వెళ్లి.. శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు.. అయితే, ఈ మధ్య జరుగుతోన్న ఘటనలు దృష్టిలో ఉంచుకుని శ్రీవారి నడకదారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచనలు చేసింది.. ఇటీవలికాలంలో తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేస్తోంది..

అల్లుడి కోసమే మూసీ డ్రామా.. సీఎంపై తీవ్ర విమర్శలు

అల్లుడి కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ బాధితులకోసం బీజేపీ నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. లండన్, సీయోల్ కాదు…. మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్ అన్నారు. సబర్మతి, నమామి గంగతో మూసీకి పోలికా? అని ప్రశ్నించారు. సబర్మతి, నమామి ఖర్చు కు, మూసి అంచనాకు పోలిక ఎక్కడ? అని మండిపడ్డారు. మీ అల్లుడి(వాద్రా) కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా మీకు అండగా ఉంటామన్నారు.

సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం ఫోకస్..

సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో.. రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు. రేపు టీడీపీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం కానుంది. రూ.100 సభ్యత్వంతో రూ. 5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా సభ్యత్వ కార్యక్రమాన్ని తెలుగు దేశం పార్టీ రూపొందించింది.

ఈ ఉడత ఊపులకు భయపడం.. ఏ కేసు పెట్టుకుంటవో పెట్టుకో..!

టీఆర్‌ఎస్‌ అనే పార్టీ పుట్టినప్పటినుంచి తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో ముఖాముఖి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిననాడే చావు తెగించి వచ్చామని, ఉద్యమ సమయంలో చంద్రబాబు, రాజశేఖర్‌ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులతో కొట్లాడినమని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న చిట్టినాయుడి అని, ఆ చిట్టినాయుడు ఏదో కేసు పెడుతా.. అది చేస్తా.. ఇది చేస్తా అంటే భయపడేది లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పొలిటికల్‌ బాంబులు పేలుతై అంటే.. ముందు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలూ.. అమృత్‌ స్కాంలో రేవంత్‌ రెడ్డి బావమరిది 1,137కోట్ల వర్క్‌ ఇచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు. అర్హత లేని కంపెనీకి అమృత్‌ స్కీంలో స్కాం చేస్తే ఎందుకు కాపాడుతుందో సమాధానం కావాలన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిపై జరిగిన రైడ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని, అదానీని పొంగులేటి రహస్యం కలుసుకోవడం.. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఉన్న అక్రమ సంబంధానికి నిదర్శనమన్నారు.

36 రోజుల జైలు.. ఎట్టకేలకు బయటకొచ్చిన జానీ మాస్టర్

ఫోక్సో సహా రేప్ కేసుల్లో అరెస్టై ప్రస్తుతం చెంచల్గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు మధ్యాహ్నం చంచల్గూడా జైలు నుంచి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు నిబంధనల మేరకు ఆయనను బయలు పై విడుదల చేశారు. తన దగ్గర పని చేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు రేప్ కేసు పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలో ఉన్న జానీ మాస్టర్ను అరెస్టు చేసి హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నెమ్మదిగా పొడిగిస్తూ 36 రోజుల పాటు ఆయన జైలులోనే ఉన్నారు. ఇక ఈ జైలు శిక్ష కారణంగా జానీ మాస్టర్ పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఈ విషయాన్ని నిన్న పుష్ప ప్రెస్మీట్లో నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.