Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

గజ్వేల్‌లో పట్టుబడ్డ నగదు.. రూ.50 లక్షలు సీజ్‌..!

గజ్వేల్ పట్టణంలో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చు రత్నాకర్‌కు చెందిన కారు (టీఎస్‌36సీ 0198)లో రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు స్వాధీనం చేసుకోలేదు. ఈ సందర్భంగా గజ్వేల్ సీపీ అనురాధ మాట్లాడుతూ రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని సూచించారు. అధికంగా తీసుకెళ్లినట్లయితే సరైన పత్రాలను వెంట ఉంచుకోవాలి. లేని పక్షంలో ఆ మొత్తాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. డబ్బును ఐటీ శాఖకు అప్పగిస్తామని, సరైన ధ్రువపత్రాలు చూపించి బాధితులు విడిపించుకోవచ్చని తెలిపారు.

కవితకు షాక్.. మరో మూడురోజుల కస్టడీ పొడిగింపు..!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ ఇచ్చింది. కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో అధికారులు ఆమెను రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఈడీ.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈడీ వాదనతో ఏకీభవించింది. అయితే ఐదు రోజులకు బదులు మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. ఈ నెల 26 వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు. మరోవైపు ఇది తప్పుడు కేసు అని కవిత తరఫు న్యాయవాది వాదించారు. కవిత పిల్లలు మైనర్లు. న్యాయవాది తమకు కలిసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే బెయిల్‌ పిటిషన్‌ దాఖలైంది. కస్టడీ ముగిసే రోజునే బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కోరుతున్నారు.

ఏ సినీ నటుడికి లేని క్రేజ్‌ సీఎం జగన్‌కు ఉంది..

ఏ సినీ నటుడుకి లేని క్రేజ్ మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఉందన్నారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ నెల 27 తేదీ నుండి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు.. 2014 గెలిచి చంద్రబాబు ప్రజలు మోసం చేశారు.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా సహా చాలా హామీలు ఇచ్చారు.. చివరికి ఆయనకే శఠగోపం పెట్టారని దుయ్యబట్టారు.. టీడీపీ, జనసేన అభ్యర్థులను అత్యంత పేలవంగా రిలీజ్ చేశారు.. దాంతో మా వాళ్లు గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. ఇక, ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన వాళ్లకి టీడీపీ సీటు ఇవ్వలేదని విమర్శించారు..

ఇప్పటికే నాలుగు చోట్ల సిద్ధం సభలు.. మొత్తం 21 సభలు నిర్వహిస్తాం..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తుంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో సీఎం వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్ధం పేరుతో సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. చిత్తూరు లేదా పూతలపట్టులో ఒక సభ, నాయుడుపేట లేదా శ్రీకాళహస్తిలో సభలు నిర్వహిస్తాం అన్నారు. ఇందుకు సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించినట్టు చెప్పుకొచ్చారు..

కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రేణమాల గ్రామంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు, సుమారు 500 మంది ఓటర్లు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో మండల కన్వీనర్ ఓంకారం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారందరికీ కాకర్ల సురేష్ టీడీపీ కండువా కప్పి స్వాగతించారు. వైసీపీ ప్రభుత్వంలో విసుగెత్తి వేసారి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలకు ఆకర్షితులై ఉదయగిరి సేవకుడు కాకర్ల సురేష్ వెంట నడవాలని టీడీపీలోకి చేరినట్లు వారు చెప్పకొచ్చారు.

జర మా వైపు చూడండి సీఎం సారూ.. వీహెచ్ ఆవేదన

మాపై వున్నా కేసులు తీసేయండి ఎన్ని రోజులు తిరగాలి కోర్టుల చుట్టూ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. జరుతున్న పరిణామలా మీద ఆవేదన వ్యక్తం చేయాలనీ చాలా సార్లు సీఎంకు విన్నవించికోవాలని చూసానని అన్నారు. మేము ఎక్కడికి వెళ్లిన ఏం చేసిన మా పైన బీఆర్ఎస్ నాయకులు కేసులు పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్ పీడ పోయిందన్న సీఎం ఇప్పుడు ఏం మాట్లాడుతలేదని ఆవేదన వ్యక్తం చేసారు. మేము కలిసి చెప్దామంటే టైమ్ ఇస్తలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పెద్ద లీడర్.. నాలుగేండ్లలో ముఖ్య మంత్రి అయింది ఒక్కడివే అన్నారు. ఇరవై ఏండ్లు ఉన్నా ఒకరు ముఖ్య మంత్రి కాలేదు.. పార్టీ బలోపేతం చేసి అసంబ్లీ ఎన్నికల్లో గెలుపించావన్నారు.

పిఠాపురం పాలిటిక్స్‌లోకి ముద్రగడ..

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది.. కూటిమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇక్కడి నుంచి బరిలోకి దిగుతుండగా.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ.. ఎంపీ వంగా గీతను పోటీకి పెడుతుంది.. ఓవైపు జనసేన.. మరోవైపు వైసీపీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతున్నాయి.. ఇక, ఈ మధ్య వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.. యూ కొత్తపల్లి మండలానికి చెందిన కాపు నేతలతో సమావేశం నిర్వహించారు.. కిర్లంపూడిలో తన నివాసంలో ఈ మీటింగ్‌ జరిగింది.. ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి.. సభలు, సమావేశాలు ఎలా నిర్వహించాలి.. వాటిపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. పవన్ కల్యాణ్‌ను ఎదుర్కోవాలంటే కలిసి పని చేయాలని సూచించారు. గ్రామస్థాయి మీటింగ్ లు పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే, 2009లో తాను పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు, ఇప్పటికి రాజకీయాలు చాలా మారాయని తెలిపారు. పిఠాపురం సెగ్మెంట్ బాధ్యతలు తనకి కూడా అప్పగించారని అంటున్నారు ముద్రగడ.

చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు..

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో నెల్లూరు వైసీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే అప్పుల లెక్కలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు.. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు అలాంటివి నమ్మాల్సిన అవసరం లేదు.. రాష్ట్రంలో దుష్ప్రచారం మొదలు పెట్టారని దుయ్యబట్టారు. టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన వారే బెట్టింగ్ కు నిధులు ఇస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ప్రజల గుండెల్లో వైసీపీ ఉంది.. ఐదు సంవత్సరాలలో జగన్ వారి మనసుల్లో నిలిచిపోయారని తెలిపారు.

ఫీజలు పెంచిన స్కూల్స్‌.. తల్లిదండ్రుల ఆందోళన..

ఓ పక్క వేసవి కాలం వేడి పుట్టిస్తోంది మారో పక్క స్కూల్స్ ఫీజుల పెంపుతో తల్లితండ్రులకు చమటలు పడుతున్నయి ప్రైవేట్ స్కూల్స్ ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచేందుకు సిద్ధమయ్యాయి.కూకట్ పల్లి లోని ఓ ప్రయివెట్ స్కూల్ ముందు తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేసారు.ఇక పిల్లలను కార్పొరేట్ లో చదివించాలన్న తల్లిదండ్రుల ఆశ నిరాశే మిగులుతుంది అని మీడియాతో అవేదన వెళ్ళబుచ్చుకొన్నరు.. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ఇప్పడికే తోచిన రీతిలో పెంచాయి. కొత్తగా ప్రవేశాలు తీసుకునే విద్యార్థులు స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందే టర్మ్ ఫీ చెల్లించాలని ప్రైవేట్ స్కూళ్లు ఆదేశాలు జారీ చేశాయి. లేదుఅంటే బుక్స్ ఇవ్వడం కుదరదని మొఖం చాటేస్తున్నయు.కూకట్ పల్లిలో ఓ ప్రయవేటు స్కూల్ పది శాతం పెంచుతామని 30 నుండి 40 శాతం పెంచారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేద వ్యక్తం చేశారు. ఇలా పెంచుకుంటూ పోతే తాము కూడా స్కూల్ వద్దే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ప్రభుత్వం చోరోవ తీసుకొని ఈ యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది.

మార్చి 23 నుంచి 26 మధ్య అరుణాచల్ ప్రదేశ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, జార్ఖండ్, కేరళలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాకుండా లక్షద్వీప్, కోస్తా కర్ణాటక. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్‌లో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. భారీ వర్షపాతంతో పాటు ఉరుములకు అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఎన్నికల వేళ షాక్.. పోటీ నుంచి వైదొలిగిన అభ్యర్థులు

ఎన్నికల వేళ ఎవరైనా టికెట్లు రాకపోతే నానా యాగీ చేస్తారు… కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేసి భారీ హంగామా సృష్టిస్తారు. కానీ గుజరాత్‌ బీజేపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టికెట్లు లభించాక.. పోటీ నుంచి వైదొలిగి పార్టీకి ఝలక్ ఇచ్చారు.

గుజరాత్‌కు చెందిన ఇద్దరు బీజేపీ నేతలకు అధిష్టానం టికెట్లు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు నేతలు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము పోటీకి దూరమవుతున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టులు పెట్టారు. వడోదర సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్‌కు బీజేపీ మరోసారి టికెట్ ఇచ్చింది. అలాగే సబర్‌కాంతా నుంచి భికాజీ ఠాకూర్‌కు టికెట్ ప్రకటించింది. ఇటీవలే వారి పేర్లను అధికారికంగా పార్టీ అధిష్టానం వెల్లడించింది. కానీ వారు మాత్రం అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుని హైకమాండ్‌కు షాకిచ్చారు.

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి.. భారీగా ఆయుధాలు స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించగా.. పొరుగున ఉన్న సుక్మా జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని పోలీసు అధికారి శనివారం తెలిపారు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వివిధ భద్రతా బలగాలకు చెందిన సిబ్బంది నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉండగా కాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. మావోయిస్టుల కంచుకోటగా భావించే బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల ట్రై జంక్షన్‌లో ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు వెల్లడించారు.

 

Exit mobile version