NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక..

విజయవాడలో నిర్వహిస్తున్న కామ్రేడ్ ఏచూరి సీతారం సంతాప సభలో ఎంఏ బేబీ, బీవీ రాఘవులు, రామకృష్ణ, మాజీమంత్రి అంబటి రాంబాబు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఖర్చులు తగ్గడం కోసమట.. ప్రజాస్వామ్యం పోయినా పర్లేదా అని ప్రశ్నించారు. ఖర్చు కోసం ప్రాణాలు తీసేయాలన్న హిట్లర్ వాదనలాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వాదన ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, అత్యంత పెద్దదైన భారతదేశానికి ఒకేసారి ఎన్నిక ఎలా కుదురుతుందా అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్యం ఉండకూడదని.. అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక.. దేశం ఐక్యంగా ఉండదు.. ఒకే దేశం ఒకే ఎన్నిక వాదన.. సీతారాం ఏచూరి మార్క్సిస్ట్ పార్టీని దేశంలో అభివృద్ధి చేసారు.. ప్రదీప్ పురకాయస్తా అనే ఇంజనీర్ ను మోడీ ప్రభుత్వం జైల్లో పెట్టింది అని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం సీతారాం ఏచూరి పోరాడారు.. ప్రజాస్వామ్య రక్షణ అత్యవసరమైన సమయంలో సీతారాం ఏచూరి మరణం బాధాకరం అని ఆయన అన్నారు. ఇక, గత నాలుగు రోజులుగా తిరుమల లడ్డూ గొడవ జరుగుతోంది.. లడ్డు అంశంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.. లడ్డులో వాడే ఉప్పు, శనగపిండి, పంచదార కూడా కల్తీ కావొచ్చు అన్నారు.

తప్పులు జరగలేదంటే రాజకీయ సన్యాసం చేస్తా.. పొంగులేటి కి కేటీఆర్‌ సవాల్‌..

చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్ట్ సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి నాతో రావాలి.. టెండర్లలో తప్పులేమీ జరగలేదంటే.. రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి పొంగులేటి కి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉండాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పదవి ఊడబీకటానికి మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్లే రేవంత్ ఉద్యోగం కోల్పోతున్నాడన్నారు. బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందన్నారు. భార్య సోదరుడు బావమరిది కాకుండా ఏమవుతారు? అని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ కాదు.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన మాకు ఎలక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా? అని ప్రశ్నించారు. కొండగల్ లిఫ్ట్ కథ సహా.. సీఎం కుటుంబ అన్అవినీతిని తేలుస్తామన్నారు. బావమరిది వ్యవహారంలో ఇరికిపోయాడాని సీఎంకు కూడా తెలుసన్నారు.

చంద్రబాబు ఘోరమైన అపచారం చేశాడు‌.. టీటీడీ మాజీ చైర్మన్

తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల లడ్డు విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసిపినీ సమూలంగా నాశనం చేయడానికి చంద్రబాబు చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నాడు.. ఘటనపై సిబిఐ విచారణ కాని., సిట్టింగ్ జడ్జ్ తో కాని విచారణకు అదేశించే దమ్ముందా..? వెంకటేశ్వర స్వామీ ఆలయాన్ని నాశనం చేశారంటూ అబద్దాలు చెప్పి ఓట్లు వెయించుకున్నాడు చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వేసినా విజిలెన్స్ విచారణ ఎమీ దొరక పోవడంతో లడ్డుపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు చంద్రబాబు. ఆయన ఘోరమైన అపచారం చేశాడు‌.‌‌ బాబు చేసినా అపచారాలను స్వామీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు‌. నెయ్యి బదులుగా జంతువుల కోవ్వు కలిపారని దుర్మార్గమైన, నీచమైన ఆరోపణలు చేశారు. లడ్డుపై చేసినా ఆరోపణలు అబద్దం అయితే అలా చేసినా వారు రక్తం కక్కుకుని చస్తారు.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పోడిచి అధికారలోకి వచ్చావు‌. ఇప్పుడు కులదైవం అని చెప్పుకునే స్వామీవారిని సిగ్గు,లజ్జా అన్నది ఎమీ మాత్రం లేకుండా నీ రాజకీయ వాడుకున్నావ్…

డ్రగ్స్‌ కేసు విచారణ ఏమైంది.. బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..

కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఓవైసీలకు, ఎంఐఎంకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఒవైసీ కాలేజీలో ఓ ఫ్యాకల్టీ ఉగ్రవాది ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీల ఉగ్ర లింకులపై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కి ఇస్లాం ఫోబియో ఉందని ఓవైసీ అంటున్నారని మండిపడ్డారు. 15 నిమిషాలు టైం ఇస్తే నరికి చంపుతాం అన్నవారికి హిందూ ఫోబియో ఉందా..? అని ప్రశ్నించారు. గో మాంసం తినాలని మజా అని అన్నది ఓవైసీ అని మండిపడ్డారు.

మాల్యాల హంద్రీనీవా పంప్ హౌజ్‭ను పరిశీలించిన మంత్రి నిమ్మల..

చంద్రబాబు ఆదేశాల మేరకు హంద్రీనీవా సామర్థ్యం పెంచేలా, ప్రధాన కాలువ విస్తరించడానికే పర్యటన చేసినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఎన్టీఆర్ కలగన్నట్లు రాయల సీమను రతనాల సీమగా మారుస్తాం.. ఆసియాలోనే పెద్దది, పొడవైన ఎత్తిపోతల పథకం నిర్మించిన ఘనత టీడీపీదే. 3,850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా చంద్రబాబు మల్యాల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. జగన్ పాలనలో హంద్రీ నీవా పనులు వెనుకబడిపోయాయి. ప్రాజెక్ట్ సామర్థ్యం 40 వేల టీఎంసీలు. అయితే కనీసం 20 వేల టీఎంసీల నీటిని కూడా రాయల సీమకు అందించలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్ది, హంద్రీ నీవాను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకోస్తాం. గత ఐదేళ్లలో ఇరిగేషన్ లో చేసిన పాపాలు, తప్పులు సరిచేస్తున్నాం.

గిన్నిస్ బుక్ లోకి చిరంజీవి.. ఎందుకో తెలుసా?

ఈరోజు ఒక ఆసక్తికరమైన ప్రకటన రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ను మెగాస్టార్ చిరంజీవికి అందించే ఒక కార్యక్రమం హైదరాబాదులో జరగబోతోంది. హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. చిరంజీవికి గిన్నిస్ రికార్డుకు సంబంధించిన అవార్డు అందించనున్నారని తెలుస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులతో పాటు ఆమిర్ ఖాన్ హైదరాబాద్‍కు వచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పేరు అధికారికంగా గిన్నిస్ బుక్‍లో ఎక్కిన విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. చిరంజీవికి గిన్నిస్ రికార్డు అందించబోతున్నారు, అనే విషయం బయటకు వచ్చింది.

ఆలయం కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం.. యువకుడు ఆత్మహత్య

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఓ యువకుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడని పోలీసులు కనుగొంటున్నారు. కాగా.. ఆలయ దర్శనానికి వచ్చిన ఓ వీఐపీ గన్‌మెన్‌ నుంచి పిస్టల్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కొంతమంది వీఐపీలు తమ భద్రతా సిబ్బందితో కలిసి గోల్డెన్ టెంపుల్‌కు దేవుడిని దర్శనం చేసుకునేందుకు వచ్చారు. వీఐపీలు స్వర్ణ దేవాలయం లోపలికి వెళ్లగా, వారి భద్రతా సిబ్బంది బయట కారిడార్‌లో నిల్చున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చి గన్‌మెన్‌ పిస్టల్‌ లాక్కొని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల శబ్ధం వినడంతో అక్కడి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. యువకుడు టెంపుల్ ఎదురుగా ఉన్న స్థలంలో సూసైడ్ చేసుకున్నాడు.

కేటీఆర్ పచ్చి అబద్దాల మాట్లాడుతున్నారు

కేటీఆర్ పచ్చి అబద్దాల మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్‌ అయ్యారు. కేటీఆర్‌ లేని పోని ..నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా.. ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా అనేది కూడా తెలియకుండా పోయిందన్నారు. పచ్చకామెర్లు వాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్టు ఉంది కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు. మీలాగా మేము ఉండమని, మేము అధికారం లోకి వచ్చి 8 నెలలు.. 8 వేల కోట్లు ఎక్కడ వచ్చాయో చెప్పాలన్నారు. కాళేశ్వరం కూలిపోయింది.దాంట్లో జైలుకు వెళ్లడం ఖాయమని, అమెరికా వెళ్లి ప్రభాకర్ రావు నీ తెలంగాణ కి రావద్దు అని చెప్పి వచ్చిండు అని, కేటీఆర్… ఆధారాలు ఉంటే.. దమ్ముంటే నిరూపించు అని ఆయన అన్నారు. దోచుకు తిన్నది మీరు అని, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మీ హయంలో అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు కేటీఆర్.. మిషన్ భగీరథ..కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారన్నారు.

హైదరాబాద్‌కు మరోసారి భారీ వర్ష సూచన

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉప్పల్‌, నాగోల్‌, బండ్లగూడ, ఎల్‌బీ నగర్‌, సరూర్‌నగర్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సైదాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్, రామంతాపూర్‌, అంబర్‌పేట్‌, మీర్‌పేట్‌, గుర్రంగూడ, వనస్థలిపురంలోనూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సెప్టెంబర్ 23-25 ​​వరకు హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

భార్యకు గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేసి తన ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందటం తో ఆమె గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేసి తన ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతి… భార్య గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ చేసి ప్రేమను చాటుకున్నాడు భర్త..చనిపోయిన భార్య చేయి, తన చేయి, తన కూతురి చేయితో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేపించి భార్య పై ప్రేమను చాటుకున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న,పద్మశ్రీ ప్రేమించుకుని 2006 లో పెళ్లి చేసుకున్నారు.అశోక్ ప్రైవేట్ జాబ్ చేస్తూ సత్తుపల్లి పట్టణంలో స్థిరపడ్డారు.వీరికి ఒక కుమార్తె.అయితే ఆనందంగా సాగుతున్న అశోక్ కుటుంబంలో విషాదం నెలకొంది.కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన భార్య పద్మశ్రీ విజయవాడలో చికిత్స పొందుతూ గత నెల 28 వ తేదిన మృతి చెందింది.ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న తన జీవిత భాగస్వామి ఆకస్మికంగా మృతి చెందడం తో అశోక్ తట్టుకోలేకపోయాడు.భార్య గుర్తుగా తన చేయి,తన కూతురు చేయి,చనిపోయిన తన భార్య చేయిని కలిపి విజయవాడ నుండి ప్రత్యేకంగా వచ్చిన కాస్టింగ్ నిపుణులతో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేయించి గుర్తుగా పెట్టుకున్నాడు.భార్య మృతితో అశోక్ జీవచ్చావం లా మారిపోయాడు.పెళ్ళైన 16 ఏళ్లకే తన భార్యను కోల్పోయిన భర్త ఆవేదనను చూసి బంధువులు కంటతడి పెట్టారు..