తెలంగాణను తిట్టేవారు కావాలా? కిట్లు ఇచ్చేవారు కావాలా..?
పాలమూరు ప్రజలు సీఎం కేసీఆర్ కి, గ్రామ దేవతలకు అభిషేకాలు చేస్తే కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్ళు వస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్ట్ గా మారింది అని ఆయన దుయ్యబాట్టారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్ట్ లు కట్టకుండా కేసులు వేయడం.. అడ్డుకోవడం చేస్తున్నారు అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు తిట్లు తిట్టేవారు కావాలా? కిట్లు ఇచ్చేవారు కావాలా? మీరు తేల్చుకోండి అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో గ్లోబల్స్ కి నోబల్స్ కి మధ్య పోటీ ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 50 ఎండ్లలో అభివృద్ధి చేయలేదు కానీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెబుతున్నారు.. ప్రజల నాయకుడు మన సీఎం కేసీఆర్ నీ మీరంత మరోసారి దీవించండి అని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది దేశంలో మరెక్కడ కూడా జరగడం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి సీఎం మనకు ఉన్నందుకు తెలంగాణ ప్రజలు గర్వం పడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.
భారతీయులకు వివేక్ షాక్.. H-1B వీసా ప్రోగ్రామ్‌ని ముగించాలని వ్యాఖ్యలు..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ జరుగుతోంది. ఈ సారి అధ్యక్ష బరిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఒకరు వివేక్ రామస్వామి కాగా.. మరొకరు నిక్కీహేలి. ఇటీవల వివేక రామస్వామి పలుమార్లు ట్రంపును పొగడటం, తాను అధ్యక్షుడినైతే యూఎస్ క్యాపిటల్ పై దాడులకు పాల్పడిన ట్రంప్ మద్దతుదారులకు క్షమాభిక్ష పెడతానంటూ వార్తల్లో నిలిచారు. దీంతో పాటు ఫెడరల్ ఉద్యోగులను, ఎఫ్బీఐ ఉద్యోగులను తగ్గిస్తానంటూ హామీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన పురంధేశ్వరి.. ఏమన్నారంటే?
టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్ఠానిదేనని ఆమె మీడియాతో అన్నారు. మూడు పార్టీలు పోటీ చేయడంపై పవన్ తన అభిప్రాయం చెప్పారని.. తమ పార్టీ నిర్ణయాన్ని అధిష్ఠానం నిర్ణయిస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుపై తాను బీజేపీ అగ్ర నాయకత్వానికి వివరిస్తానని, తమ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను పురంధేశ్వరి గుర్తు చేశారు. తాము కూడా తమ పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతామని ఆమె చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం ఉందనడం అవాస్తవమని పురంధేశ్వరి వెల్లడించారు.
టెండర్ కోసం కుట్ర.. లంచం కేసులో ప్రైవేట్ కంపెనీ యజమాని సహా ఏడుగురి అరెస్ట్
ఓ ప్రైవేట్ కంపెనీ యజమాని సహా ఏడుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ వ్యక్తులు టెండర్ కోసం లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టెండర్ ఒడిశాలోని ఓ పాఠశాలకు సంబంధించి రూ.19.96 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ టెండర్ కేసులో రూ.19.96 లక్షల లంచం తీసుకున్న కేసులో ప్రైవేట్ కంపెనీ యజమాని, ప్రైవేట్ వ్యక్తులు, బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్ సీఎండీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు సీబీఐ ఆదివారం వెల్లడించింది. ఒడిశాలోని పాఠశాలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో నోయిడాకు చెందిన సోమేష్ చంద్ర, ముంబైకి చెందిన వీర్ ఠక్కర్, రాజీవ్ రంజన్, తరంగ్ అగర్వాల్, బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్ సీఎండీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, ఆశిష్ రజ్దాన్, బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. అధికారి, గుజరాత్‌కు చెందిన కంపెనీ యజమాని హేతల్ కుమార్ ప్రవీణ్‌చంద్ర రాజ్యగురు, సేవకులు, ఇతర ప్రైవేట్ వ్యక్తులతో పాటు కోల్‌కతా నివాసి శశాంక్ కుమార్ జైన్‌పై కేసు నమోదు చేయబడింది.
రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన ముగిసింది
హైదరాబాద్‌లో హిమాయత్ నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దుం భవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చడా వెంకటరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన ముగిసిందన్నారు. ఏడాది కాలం పాటు సాయుధ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారని ఆయన వెల్లడించారు. పోరాటాలు చేసింది కమ్యూనిస్టులు అయితే చరిత్రను వక్రీకరించి ప్రయత్నం జరిగిందన్నారు కూనంనేని. రైతాంగ పోరాట అమర వీరుల పోరాట స్పూర్తితో ముందుకు వెళ్తామని ఆయన వెల్లడించారు.
బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారు
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన దగ్గరి నుంచి వైసీపీ నేతలు టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మంత్రి ఆర్.కె. రోజా మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణీ మాట్లాడిన మాటలకు ఆమే కౌంటరిచ్చారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారని.. తీరా ఈ అస్త్రం కూడా తుస్సుమందని మంత్రి రోజా విమర్శించారు. దొరికిన దొంగను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా అని ప్రశ్నించారు. దేవాన్ష్ కు పొరపాటున కూడా సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించకండని ఎద్దేవా చేశారు. మా తాత ఇంత అవినీతి పరుడా అనుకుంటాడన్నారు.
“థర్డ్ ఫ్రంట్” ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ని కోరా..
దేశంలో థర్డ్ ఫ్రంట్ కు స్థానం ఉందని ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాని పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కి సూచించినట్లు ఎంఐఏం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇండియా కూటమి దేశంలోని రాజకీయ శూన్యతను పూరించలేకపోయిందని, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కి నాయకత్వం వహిస్తే ఇది భర్తీ అవుతుందని ఆయన అన్నారు.
కూటమిలో చేరేందుకు తమకు ఆహ్వానం అందకపోవడాన్ని తాను పట్టించుకోనని చెప్పారు. ఇండియా కూటమిలో సీఎం కేసీఆర్ సహా బీఎస్పీ, ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రకు చెందిన కొన్ని పార్టీలు లేవని తెలిపారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఓవైసీ చెప్పడం ఇది తొలిసారి కాదు, కేసీఆర్ నాయకత్వం వహిస్తే దేశంలోని అనేక పార్టీు, నాయకులు సిద్ధంగా ఉన్నారని గత నెలలో ఓవైసీ వ్యాఖ్యానించారు.
భగవద్గీత చదువుతున్న సమంత.. పోస్ట్ వైరల్..
టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు ఏడాది బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. సినిమాలకు దూరంగా ఉన్న సామ్ తన మాయోసైటీస్ చికిత్స తీసుకొనుంది.. దీంతో ఇప్పుడు పూర్తిగా తన హెల్త్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుంది. అలాగే తీసుకున్న రెమ్యూనరేషన్స్ వెనక్కు ఇచ్చేసింది. అయితే కొద్ది రోజులు సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే ఇన్ స్టా స్టోరీలో మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది.. ఈ క్రమంలో తాజాగా భగవద్గీత చదువుతున్న ఫోటోస్ షేర్ చేసింది. అంతేకాదు.. ఏ భాగాన్ని చదువుతుందో చూపించింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. ఈ చిత్రంలో సామ్, విజయ్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే ఇందులోని సాంగ్స్ సైతం మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేశాయి.ఈ ప్రమోషన్లకు దూరంగా ఉన్న సామ్.. కేవలం సోషల్ మీడియా వేదికగా మాత్రమే మూవీ అప్డేట్స్ పంచుకుంది.. ఈ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. కానీ విజయ్ దేవరకొండకు మాత్రం భారీ విజయాన్ని అందించింది..
యూట్యూబర్ హర్షసాయి హీరోగా ‘మెగా’.. అదరగొట్టేశాడు అంతే..
యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్నవారికి డబ్బును వెదజల్లుతూ కనిపిస్తాడు. ఇంకోపక్క యూట్యూబ్ లో రిచ్ లైఫ్ గడుపుతూ కనిపిస్తాడు. అసలు నిజంగా హర్షసాయికి అంత డబ్బు వస్తుందా..? అతను చేసే మంచి పనులు నిజమేనా..? అని అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. ఇక అప్పటి విషయం పక్కన పెడితే.. తాజాగా హర్షసాయి హీరోగా అవతారమెత్తాడు. మెగా లో డాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది కూడా హర్షసాయినే. ఇక ఈ చిత్రాన్ని బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ” ఏంటి డాక్టర్? ఏమీ అర్థం కావడం లేదు అని ఓ వ్యక్తి అడగ్గా.. ప్రపంచానికి తెలియని, ప్రపంచంలోని అత్యంత ఘోరమైన శిక్షల్లో ఇదీ ఒకటి” అంటూ డాక్టర్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. ఒక గంట కింద హీరో హర్షసాయిని తాళ్లతో కట్టేసి పైకి లాగి చంపాడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
లియో మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమా ను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత లోకేష్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో లియో సినిమా పై అంచనాలు భారీ గా వున్నాయి.. లియో సినిమా బిజినెస్ దాదాపు రెండు వందల కోట్ల పై నే అని సమాచారం.ఈ సినిమాను దసరా కానుక గా అక్టోబర్ 19 న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.లియో సినిమా. రిలీజ్ కు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండటం తో చిత్రబృందం ఎంతో ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ ఒక్క పాట తమిళ్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది.
హైదరాబాదీ బౌలరా మజాకా.. సిరాజ్ దెబ్బ మాములుగా లేదు
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాట్స్ మెన్స్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. టాస్ ఓడిన భారత్.. బౌలింగ్ కు దిగింది. అయితే జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి ఓవర్లనే శ్రీలంక మొదటి వికెట్ తీశాడు. ఆ తర్వాత హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ సంచలన స్పెల్ తో శ్రీలంక టాపార్డర్ ను కుప్పకూల్చాడు. ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ శ్రీలంక జట్టుకు డిజాస్టర్‌గా మారాడు.
సిరాజ్ వేసిన రెండో ఓవర్లో మొదటి వికెట్ పడగొట్టగా.. మళ్లీ ఆ తర్వాత వేసిన మరో ఓవర్ లో ఏకంగా 4 వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వన్డే క్రికెట్‌లో సిరాజ్ తొలిసారి ఈ ఘనత సాధించాడు. పాతుమ్ నిస్సాంక, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ్ డి సిల్వా, దసున్ షనకలకు సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై సిరాజ్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు శ్రీలంక మాజీ గ్రేట్ బౌలర్ లసిత్ మలింగ మాత్రమే వన్డేల్లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.