NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బతుకమ్మ కుంటపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

హైడ్రా పేరువింటే చాలు.. తెలంగాణలోని స్థానిక ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఎప్పుడు హైడ్రా అధికారులు వస్తారో.. వారు ఉంటున్న నివాసాలను కూల్చేస్తారో అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. స్థానికులకు క్లారిటీ ఇచ్చేందుకు ఇవాళ అంబర్ పేట్ లోని బతుకమ్మ కుంటకు వెళ్లారు. రంగనాథ్ ను చూసిన స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. దీంతో ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజల్లో కుల్చివేతలు ఉంటాయనే అపోహ ఉంది.. ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మకుంటకు వచ్చానని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. రెండు నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. బతుకమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఇండ్ల కూల్చివేతలు ఉండవన్నారు. బతుకమ్మకుంటను పునరుద్దరిస్తామన్నారు. ప్రస్తుతమున్న ఐదెకరాల విస్తీర్ణంలోనే పునరుద్దణ చేస్తామన్నారు. బతుకమ్మకుంటలోకి వరద నీరు వచ్చే మార్గాలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. హైడ్రా నోటీసులు ఇచ్చే అధికారం ఉందని, హైడ్రా నోటీసులు ఆక్రమణదారులకు వెళ్తూనే ఉంటాయన్నారు. నాగారంలో రోడ్డు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను ఈరోజు కూల్చేశామన్నారు. ఐదు కాలనీలకు వెళ్ళే రొడ్డును ఆక్రమించారని క్లారిటీ ఇచ్చారు. మాకు స్థానికులు కంప్లెయింట్ చేయడంతో సర్వే చేశామన్నారు. 15 ఏళ్లుగా కబ్జాలో ఉన్న నిర్మాణాలు తొలగించామని ఏవీ రంగానాథ్ పేర్కొన్నారు.

దాడులకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయడానికి వెనకాడం..

దాడులకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయడానికి వెనకాడమని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ టాపింగ్ కేసులో ఎవరినీ వదిలిపెట్టమన్నారు. చట్ట ప్రకారం అందరూ శిక్ష అనుభవిస్తారని తెలిపారు. మల్లన్న సాగర్ నిర్మాణం కోసం దళితులు, బీసీ లపై కేసులు పెట్టించింది గత ప్రభుత్వం అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. కలెక్టర్ పై జరిగిన దాడి విషయంలో కేసీఆర్ స్పందించాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. దీని వెనక కేటీఆర్, మాజీ ఎంఎల్ఏ లు ఇంకా ఎంత పెద్ద వారున్నా వదిలిపెట్టమన్నారు. జైల్ కు వెళ్తే సానుభూతి కోసం చిల్లర రాజకీయాలకు బీఆర్ఎస్, కేటీఆర్ పాల్పడుతున్నారని తెలిపారు. జైల్ కు వెళ్ళకుండా రక్షణ కోసమే కేటీఆర్ డిల్లీ కి వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. దాడులకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయడానికి వెనకాడం అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారం రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు మాట్లాడటం లేదన్నారు. బీజేపీ, కేంద్ర మంత్రుల తీరు చూస్తుంటే.. బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నట్లు ఉందన్నారు.

నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా..?

నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా..? అని బీజేపీ ఎంపీ డీకె అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ లగచర్ల పర్యటనలో ఉద్రిక్రత వాతావరణం నెలకొంది. లగచర్ల కు వెళుతున్న డీకే అరుణను మన్నెగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా..? అని మండిపడ్డారు. నేను ఎంపీనీ.. నేను ఏ తప్పు చేశానని అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి వల్లే జిల్లాలో లా & ఆర్డర్ సమస్య వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు వెళ్తున్నామని అన్నారు. తాను నా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందన్నారు. తన‌ సొంత నియోజకవర్గంలో లా & ఆర్డర్ కంట్రోల్ చేసుకోలేక పోయారన్నారు.

తెలుసుకొని మాట్లాడు.. హరీష్ రావుపై జీవన్‌ రెడ్డి ఫైర్‌

హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిందని క్లారిటీ ఇచ్చారు. ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ ల ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల పై మండిపడ్డారు. ధాన్యం సేకరణలో గత ఖరీఫ్ కంటే ముందంజలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందన్నారు.

ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశ‌పెట్టిన ప్రభుత్వం

ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు – 2024, ఆంధ్ర ప్రదేశ్ మున్సిప‌ల్ బిల్లు- 2024 బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను అసెంబ్లీలో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ప్రవేశ‌పెట్టారు. మరో వైపు.. శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చించారు. చర్చలో మంత్రులు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాల అమలకు నిధులు కేటాయించలేదని, కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని అడిగితే, లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాల ప్రకటనలు చేసేటప్పుడు, ఆ అప్పులు గుర్తుకు రాలేదా అని ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.

వికారాబాద్ డీటీసీ నుంచి పరిగికి పట్నం నరేందర్ రెడ్డి తరలింపు..

వికారాబాద్ జిల్లాలో టెన్షన్ వాతవరణం కొనసాగుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ లోని అడిషనల్ ఎస్పీ కార్యాలయం డీటీసీ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.. లగచర్లలో అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డిని ఈరోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కలెక్టర్ పై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్ర ఉందని భావించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

వరి కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా చూడాలి

తెలంగాణ వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రవాణా శాఖ కు సంబంధించిన లారీలు ఇతర వాహనాలు ఇబ్బంది లేకుండా స్థానిక జిల్లా రవాణా అధికారులు & కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా రవాణా శాఖ తీసుకుంటున్న చర్యల పై అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్లు స్థానిక రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

ఎంఎస్పీ రేటు కంటే అదనంగా గింజ లేకుండా ప్రభుత్వం కొంటుంది

ఓపిక పట్టండి సీరియల్‌గా ఒక్కొట్టి బయటకు వస్తుందని వికారాబాద్ ఘటన పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతన్నలు ధర్నాలు చేసియాల్సిన అవసరం లేదని, Msp రేటు కంటే అదనంగా గింజ లేకుండా ప్రభుత్వం కొంటుందని ఆయన వెల్లడించారు. పచ్చరంగు వేసుకొని మీ దగ్గరకు వస్తున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. మొదటి దఫా పార్టీలకు అతీతంగా కడు బీదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని ఆయన వెల్లడించారు. గాంధీ భవన్ లో ఎక్కువగా గత ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్లు ఇస్తానని మోసం చేసిన అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయని, అందరికి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. కేవలం 27 రోజుల్లో రూ. 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామన్నారు, ఇంకా రూ. 13 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలాంటి ఆటలు లేదా తొండిపనులు చేయం అని స్పష్టం చేశారు. ఈ డిసెంబర్‌లో అర్హత కలిగిన రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రైతుభరోసా కూడా త్వరలో అందించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ను ప్రవేశ పెట్టారు..

పథకాలకు కేటాయింపులు చేయకుండా చంద్రబాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. 8 నెలలు ఓటాన్ బడ్జెట్ అకౌంట్ తో ప్రభుత్వాన్ని నడిపారు.. మరో 4 నెలలు మాత్రమే సమయం ఉండగా ఇప్పుడు బడ్జెట్ పెట్టారు.. బడ్జెట్ ప్రవేశ పెడితే చంద్రబాబు చేసిన మోసాలు ప్రజలకు తెలుస్తాయని ఈ సాగతీత చేశారు.. ఈ విషయం తెలిసే బడ్జెట్ ప్రవేశ పెట్టడంలో సాగదీశారు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు చేసి బడ్జెట్ ఆలస్యానికి కారణమైందన్నారు. బడ్జెట్ పత్రాలే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని చెబుతున్నాయి.. ఆర్గనైజ్డ్ క్రైం చంద్రబాబు ఎలా చేస్తారో బడ్జెట్ చూస్తే అర్థం అవుతుంది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

బాధితులకు మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ

రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి అవసరం ఉందని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. బాగా వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి చేసి స్థానికులకు ఉద్యోగులు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావించారని, భూమి కోల్పోతున్నప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది. వారి భాద ప్రభుత్వం కు తెలుసు అని ఆయన అన్నారు. బాధితులకు మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు భట్టి విక్రమార్క.

 

Show comments