NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పను.. బీసీనే సీఎం..

చొప్పదండి బీజేపీ ప్రచారంలో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉప ఎన్నికలు వస్తాయని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని పోటీపడుతూ కవిత కూడా ముఖ్యమంత్రి కావాలని పోటీపడుతూ తర్వాత హరీష్ రావు సంతోష్ కుమార్ వీళ్ళందరూ సీఎం పదవికి పోటీలో ఉంటారు.. కాంగ్రెస్ లో కూడా అంతే ఎవరు ముఖ్యమంత్రి ఇప్పటికి తెలియని పరిస్థితిలో ఉన్నారు అని బండి సంజయ్ వ్యాఖ్యనించారు.

చొప్పదండిలో బీజేపీ పార్టీ భొడిగే శోభను గెలిపించకపోతే మీరు ఓవైసీ తమ్ముళ్లయితారని బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిపించకపోతే కేసీఆర్ కు అల్లుల్లు అవుతారని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డను చెప్పుకుంటాడు కేసీఆర్.. ధరణి తప్పుల తడకని నువ్వే చెప్పుకున్నవ్ కదా.. కేసీఆర్ ఇదిగో నీ అఫిడవిట్.. నీ భూమి రికార్డుల్లోనే గుంట భూమిని ఎక్కువగా చూపింది.. మరి ఇప్పుడేమంటావ్.. నువ్వే పెద్ద సన్నాసివని ఒప్పుకుంటావా? అని ఆయన ప్రశ్నించారు.

బీచ్ రోడ్డులో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. వైజాగ్‌ లా అండ్ ఆర్డర్ డీసీపీ

విశాఖలో దీపావళి సందడి మొదలైంది.. జోరుగా దీపావళి సామాగ్రి అమ్మకాలు జరుగుతున్నాయి.. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో 150 క్రాకర్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.. ఆ స్టాల్స్ ను పరిశీలించిన లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీనివాస్ రావు.. కీలక సూచనలు చేశారు.. ఈ ఏడాది కూడా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పక్కా పగడ్బంధీగా స్టాల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు.. పోలీస్, జీవీఎంసీ, ఫైర్ సేఫ్టీ, ఏపీఈపీడీఎల్‌ డిపార్ట్మెంట్ లు సమన్వయంతో పర్యవేక్షణ చేస్తున్నాం.. ప్రతీ స్టాల్ వద్ద అగ్నిప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. గ్రౌండ్ వద్ద రెండు ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు.

మీటింగ్ పెడితే కరెంట్ కట్ చేస్తారా.. మీ నరాలు కట్ అవుతాయి.. రేవంత్ వార్నింగ్

మీటింగ్ పెడితే కరెంట్ కట్ చేశారు.. మీ నరాలు కట్ అవుతాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాన వస్తె ఇసుక కదిలిందని అధికారులు అంటున్నారని తెలిపారు. ఇసుక మీద కడుతారా..ఇసుక మీద బ్యారేజి కడితే అది కుంగి పోయిందన్నారు. మేడిగడ్డ అనా పైసకు పనికి రాదని మండిపడ్డారు. అన్నారం అక్కరకు రాదన్నారు. దుర్గం చిన్నయ్యకు కబ్జాలు ఆడ పిల్లల కనబడితే అంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్గం చిన్నయ్య దుర్మార్గం గురించి వాళ్ళే చెప్పుతున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఈ జన ప్రవాహాన్నీ చూస్తోంటే గోదావరి నది ఈ మైదానంలో ప్రవాహించినట్లుందని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే పేరు కాకా వెంకటస్వామి అన్నారు. దేశంలో గాంధీ కుటుంబంలా తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులని అన్నారు. ఇటు బెల్లంపల్లిలో అటు చెన్నూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపు నిచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ మెడిగడ్డకు తీసుకెళ్లిండని అన్నారు. మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం మిగిలిపోయింది. దుర్గం దుర్మార్గాల గురించి రాష్ట్రమే కాదు… దేశమంతా తెలుసన్నారు. అలాంటి దుర్మార్గుడిని గెలిపించాలని కేసీఆర్ చెబుతున్నారని మండిపడ్డారు. చెన్నూరు ఎమ్మెల్యేకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..? అని ప్రశ్నించారు. సింగరేణి ఉద్యోగాలు, భూములు అమ్ముకోలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఏర్పాటు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి..

తెలంగాణ ఏర్పాటు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామన్నారు. నగరం లో ట్రాఫిక్ సమస్య వచ్చే రోజుల్లో తగ్గిస్తామన్నారు. మీరు ఇచ్చిన సమస్యలన్నీ డిసెంబర్ 3 తర్వత పరిష్కరిస్తామన్నారు. డిసెంబర్ 3న మళ్ళీ మేమే అధికారం లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ల ప్రతినిధుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో తెలంగాణ ఏర్పాటు ముందు యెన్నో అనుమానాలు ఉండేవని అన్నారు. కానీ ఈ తొమిదిన్నర ఏళ్లలో అంచెలంచెలుగా చేసి చూపించామన్నారు. కరోనా రెండేళ్లు మినహా మిగితా ఆరున్నర యేళ్లు మేము పని చేసి, అభివృద్ది చూపించామని తెలిపారు. మెట్రో ను మరింత విస్తరిస్తామని, ట్రాఫిక్ తగ్గాలంటే మెట్రో సేవలు పెరగాలన్నారు.

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తామన్నారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు సహకరిస్తామన్నారు రేవంత్‌ రెడ్డి. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఓపెన్ కాస్ట్ గనులను బంద్ చేసి అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఓపెన్ కాస్ట్ గనులు వద్దన్నా సీఎం కేసీఆర్ ఫామ్ హౌంలో మందేసి పడుకున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు. సానుభూతితో స్థానిక ఎమ్మెల్యే చందర్‌ను గెలిపిస్తే ఎరువుల కర్మాగారంలో నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు స్వాహా చేశాడన్నారు. సింగరేణి ఎన్నికలు వస్తే సీఎం కేసీఆర్ భయపడి కోర్టు కు వెళ్ళి వాయిదాలు వేస్తున్నాడని, సీఎం కేసీఆర్ మొనగాడు అయితే ఎన్నికలు పెట్టమన్నారు సీఎం కేసీఆర్‌.

రాష్ట్రంలో పింక్ వేవ్ తప్ప మరో వేవ్ లేనే లేదు..

రాష్ట్రంలో పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో పింక్ వేవ్ తప్ప మరో వేవ్ లేనే లేదని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జోష్ గాంధీ భవన్‌లో తప్ప రాష్ట్రంలో లేనే లేదని ఆమె అన్నారు. బీసీలకు ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్.. బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదమంటూ ఎద్దేవా చేశారు. ఫెయిల్యూర్ స్టేట్ ఫెయిల్యూర్ సీఎంను తీసుకొచ్చి ఇక్కడ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆమె ఆరోపించారు. క్రెడిబులిటీ లేని పార్టీలు, నాయకులు మాత్రమే డిక్లరేషన్‌లు చేస్తాయన్నారు. తప్పుడు సర్వేలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రానా అధికారంలోకి రారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.

దళితులకు చెందాల్సిన 40 వేల కోట్లను కేసీఆర్‌ పక్కదారి పట్టించిండు

రాయికల్ మండలం ఇటిక్యాలలో గ్రామంలో కాంగ్రెస్ కార్యాలయంను ప్రారంభించి అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మస్కట్ పోయేటోళ్లనే పాస్ పోర్టుల పేరుతో మోసం చేసిన వ్యక్తి దళితబంధు ఇస్తాడని ఎలా నమ్ముతాం..? అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్, నేను కలిసి చదువుకున్నాం, నాకు ఆయన గురించి బాగా తెలుసు అని ఆయన వెల్లడించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, ఇల్లు కట్టించడం వంటి హామీలు తుంగలో తొక్కిండని ఆయన విమర్శించారు. అంతేకాదు, అంబేద్కర్ దయతో రాజ్యాంగపరంగా దళితులకు చెందాల్సిన 40 వేల కోట్ల ఎస్సీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ ను కూడా పక్కదారి పట్టించిండని జీవన్‌ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా దళితులు ఆలోచించాలన్నారు జీవన్‌ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారుతాయని, ఉద్యోగాలు లభిస్తాయని ఆశించిన యువతకు నిరాశే మిగిలిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రేషన్ కార్డు మీద 9 రకాల నిత్యావసర సరుకులు అందించామని, కేసీఆర్ బియ్యం తప్పా అన్ని రద్దు చేసిండన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, తమను ఆదరించి, ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

పథకాలు నిజాయితీగా ప్రజలకు అందాలనేదే మా పోరాటం

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ స్పష్టమైన ప్రశ్నలతో ముందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎదురు దాడి చేస్తుందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకాలు నిజాయితీగా నేరుగా అంతిమంగా ప్రజలకు అందాలనేదే తమ పోరాటమని తెలిపారు. పాలవెల్లువ పథకం పాపాల వెల్లువ అని.. పాలవెల్లువ పథకంలో స్కామ్ జరిగిందని చెబితే మంత్రి స్పందించడానికి ఈన్ని రోజులు పట్టిందా అంటూ ఆయన ప్రశ్నించారు. కోట్లు పెట్టి పథకాలు తెచ్చినప్పుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదని నాదెండ్ల ప్రశ్నించారు.

మళ్ళీ మూడో సారి మేమే అధికారం లోకి వస్తున్నాం

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల వేళ ఆయా పార్టీల నేతలు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ భవన్ మంత్రి తలసాని శ్రీనివాస్‌ గౌడ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలుస్తున్నామన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో అద్భుతంగా అభివృద్ది చెందిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన ధ్వజమెత్తారు. హోదా కలిగిన వ్యక్తి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు.

తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు.. కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్‌గా ఉన్న ప్రజాశాంతి పార్టీని యాక్టివ్‌గా లేదని అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు వస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయని కేఏ పాల్‌ పేర్కొన్నారు. సీఈవో వికాస్ రాజ్, డిప్యూటీ సీఈవో సత్యవాణి తమ ఉద్యోగాలు పోయినా పర్లేదు అని నిజాలు చెప్పారని ఆయన అన్నారు.

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం కాంగ్రెస్ సభలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అధికారం ఇచ్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ ల పథకాలకు రూపకల్పన చేసిందని, రాష్ర్టంలోని ప్రధాన పరిశ్రమలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధికోసం ఉద్యోగ, ఉపాధి అవకాశల కోసం ఏర్పాటు చేసినవేనని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీకి బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి విజయశాంతి..?

తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికీ బీజేపీ, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. నిన్నటితో నామినేషన్లకు గడువు కూడా ముగిసింది. అయితే.. టికెట్లు రాని కొందరు పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ సీనియర్‌ నాయకురాలు విజయశాంతి సైతం బీజేపీని వీడుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విజయశాంతి బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా కనపించడం లేదు. ట్విట్టర్‌ వేదికగా మాత్రమే ఆమె తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం కూడా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరుగుతున్న సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై వివరణ ఇస్తూ.. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వారి ఇప్పుడు బీజేపీ చేరితే వారితో ఆ సమావేశంలో కూర్చోలేకపోయానని వ్యాఖ్యానించారు.