పొత్తులు.. పవన్‌పై సీఎం జగన్ పంచ్‌లు..
ఆంధ్రప్రదేశ్ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటి నుంచే అన్ని పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి.. ఇక, స్కిల్ స్కా్ం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు.. దీంతో.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చినట్టు అయ్యింది.. అయితే, విజయవాడ వేదికగా జరిగిన వైసీపీ ప్రతినిధుల సమావేశంలో.. ఎన్నికల పొత్తులు, పవన్ కల్యాణ్‌పై పంచ్‌లు విసిరారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా వచ్చేది సున్నానే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒకడు 15 ఏళ్లు అయ్యింది పార్టీ పెట్టి.. అయినా ఇప్పటికీ నియోజకవర్గంలో నాయకులు లేరు.. గ్రామాల్లో జెండా మోసే కార్యకర్త లేడు.. జీవితం అంతా చంద్రబాబును భుజాలపై మోయటానికే సరిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్‌తో మ్యాచ్.. సోషల్ మీడియా వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత్ సరికొత్త జెర్సీతో బరిలోకి దిగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా బీసీసీఐ స్పందించింది. సోషల్ మీడియా కథనాలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారత జట్టు బ్లూ జెర్సీతో మ్యాచ్‌లను ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రాక్టీస్ సందర్భంగా డచ్ ఆరెంజ్ రంగులోని జెర్సీని ఆటగాళ్లు ధరిస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఇదే జెర్సీతో భారత్ బరిలోకి దిగుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు కాస్త బీసీసీఐ వరకు చేరాయి. తాజాగా వాటిపై బీసీసీఐ అధికారికంగా స్పందించింది. అవన్నీ రూమర్లేనని బీసీసీఐ కొట్టిపారేసింది.
వందశాతం కాంగ్రెస్ బీ-ఫాంలు కేసీఆరే పంచుతున్నారు..
తొమ్మిదేళ్ళ కల్వకుంట్ల పాలన చూసి తెలంగాణ ప్రజలు విసుగు చెందారు అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణకు కేంద్రం చేయాల్సింది అంత చేసింది.. అవినీతి ఆరోపణలు లేకుండా తొమ్మిదేళ్ళ పాలన మోడీ అందించారు.. ఇండ్లు, స్కాలర్ షిప్స్, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేసింది.. కేసిఆర్ ను ఓడించేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారు.. కేసిఆర్ చేసిన ప్రతి పథకంలో అవినీతి ఉంది.. 30 శాతం కమీషన్ల ప్రభుత్వం.. తెలంగాణలో ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.
పేదలపై ఆయన చూపేది కపట ప్రేమ..
పేదల ద్రోహి జగన్‌కి ఐదు కోట్ల జనానికి మధ్య యుద్ధం అంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తన అవలక్షణాలు ఎదుటి వారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజం.. నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి కంటికి వైసీపీ ప్రజా ప్రతినిధులు కనిపించ లేదు.. తాడేపల్లి ప్యాలెస్‌లోకి వారికి అనుమతి లేదు.. పంచాయతీల నిధులు రూ.8,600 కోట్లు దారి మళ్లింపును ప్రశ్నించిన వైసీపీ సర్పంచులపై లాఠీ ఛార్జీ చేయించారు అని ఆయన ఆరోపించారు. అక్రమ కేసులతో జైల్లో పెట్టారు.. ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడు వైసీపీలోని స్థానిక ప్రజా ప్రతినిధులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు.. పేదలపై జగన్ రెడ్డిది కొంగ జపం.. పేదలపై చూపేది కపట ప్రేమ అని అచ్చెన్నాయుడు అన్నారు.
పలు భూభాగాలను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. 1,100కు చేరిన మృతుల సంఖ్య
గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా చొరబడిన తరువాత దక్షిణాన ఉన్న భూభాగాలపై తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ మేరకు సీఎన్‌ఎన్ సోమవారం నివేదించింది. మూడు రోజుల పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ ఆదివారం పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. మిలిటెంట్ గ్రూప్ రహస్య స్థావరాలను నాశనం చేస్తామని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప్రారంభించింది. ఇజ్రాయెల్ ఇప్పటివరకు గాజాలో 800 కంటే ఎక్కువ లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో హనౌన్ నగరం చాలా వరకు ధ్వంసమైంది. చాలా మంది ప్రజలను ఖాళీ చేయించారు.గాజాలో 493 మంది మరణించినట్లు అధికారులు నివేదించారు. హమాస్ కూడా ఇజ్రాయెల్‌పై వేలాది రాకెట్‌లను ప్రయోగించింది.
సీఎం కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నాడు.. మనకోసం లోపల కూర్చొని అన్ని చేస్తున్నాడు
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నాడని, మనకోసం లోపల కూర్చొని అన్ని చేస్తున్నాడన్నారు. త్వరలో బయటికి వచ్చి అన్ని ప్రకటనలు చేస్తారన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళలో చేసిన పనులు మీ కళ్ళ ముందున్నాయని, ఒక్క ఛాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అడగండని, కాంగ్రెస్ అధికారం వస్తే మళ్లీ కష్టాలు వస్తాయని, రైతుబంధుకు రామ్ రామ్.. దళిత బందుకు జై భీమ్ అంటారన్నారు.
కాంగ్రెస్ సీఎంలు తమ రాష్ట్రాల్లో కుల గణనపై చర్యలు తీసుకోవాలి..
కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుల గణనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని, ఇది చారిత్రాత్మక నిర్ణయం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం అన్నారు. విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఉదయం నాలుగు గంటలపాటు సమావేశమై కుల గణనపై చర్చించిందని అన్నారు. “సీడబ్ల్యూసీ సమిష్టిగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది… హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో కుల గణన నిర్వహించాలని మా ముఖ్యమంత్రులు నిర్ణయించారు” అని రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో అన్నారు. దేశంలోని పేద ప్రజల విముక్తి కోసం ఈ నిర్ణయం చాలా ప్రగతిశీల చర్య అని ఆయన అన్నారు. ఈ నిర్ణయం మతం లేదా కులాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, భారతదేశంలోని ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు తీసుకున్న నిర్ణయం అని గాంధీ అన్నారు.
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు కూడా సుప్రీం కోర్టులో బాబు కేసుపై విచారణ జరుగనుంది. అయితే, ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు లాయర్ సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు వినిపించారు.
ఇక, రేపు ఉదయం10.30 గంటలకు ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించనున్నాయి. చంద్రబాబు కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు. 17A అనేది అవినీతి నిరోధానికి ఉండాలే గానీ, కాపాడేందుకు కాదు.. ఇదే కదా చట్టం అసలు ఉద్దేశం అని ఆయన వ్యాఖ్యనించారు. 17Aలో చాలా అంశాలున్నాయి.. 17Aకు ముందు జరిగిన నేరాలకు ఇది వర్తిస్తుందా?.. 17A ప్రకారం అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలి? అని న్యాయమూర్తి బేలా కామెంట్స్ చేశారు.
టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎంతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం..
కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తోంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. చేతగాని దద్దమ్మ రాష్ట్రానికి సీఎంగా ఉండటం వలన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది..
మోడీ సీఎం జగన్ ను కాపాడుతున్నారు.. వందల కోట్లు ఏపీలో స్కాంలు జరుగుతున్నా కేంద్రం సైలెంట్ గా ఉంది.. ఏపీలో లిక్కర్, ఇసుకలో కుంభకోణాలు జరుగుతున్నాయని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి స్వయానా కేంద్రానికి ఫిర్యాదు చేసింది.. ఏపీలో వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐతో కేంద్రం విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు. మళ్లీ జగన్ ఏపీకి సీఎం కావాలని స్లోగన్ తీసుకున్నారు.. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని ప్రజలు జగన్ మళ్లీ సీఎం కావాలని అనుకుంటారు అని రామకృష్ణ అన్నారు.
టిటిడి పాలకమండలి సరికొత్త నిర్ణయాలు.. టిటిడి పారిశుధ్య కార్మికులకు శుభవార్త
కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామీ కొలువై ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల. ప్రతి రోజు కొన్ని లక్షల మంది భక్తులు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనార్ధం విచ్చేస్తుంటారు. అలాంటి తిరుమలను ఇంకా అభివృద్ధి చెయ్యాలని టిటిడి పాలకమండలి నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయం పైన టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాల గురించి తెలియ చేశారు. ఇకపైన అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నారాయణగిరి ఉద్యాణవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటు చేసేందుకు 18 కోట్లు కేటాయిచమని వెల్లడించారు. అలానే ఆకాశ గంగ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు 40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు, తిరుపతి లోని చేర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు 25 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డుని, వరహస్వామి అతిధి గృహం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు 10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మించనున్నట్లు అలానే గరుడా సర్కిల్ వద్ద రోడ్డు వెడల్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
