NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఆరోగ్య సంరక్షణకు ‘ఫార్మా’ పరిశ్రమ వెన్నుముక లాంటిది..

ఆరోగ్య సంరక్షణకు ‘ఫార్మా’ పరిశ్రమ వెన్నుముక లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 73వ ఫార్మా కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే ఇది మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ప్రతి ఏటా 50వేల కోట్ల విలువైన మందులు ఎగుమతి చేస్తున్నామన్నారు. మాది పారిశ్రామిక ఫ్రెండ్లీ గవర్నమెంట్ 24 గంటలు మా క్యాబినెట్ అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమకు ఎలాంటి సమస్య రానివ్వమన్నారు. ఓఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ మధ్యలో ఫార్మా క్లస్టర్లు నిర్మించి.. ఈ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. పరిశ్రమలకు విద్యుత్తు, నీటి సమస్య లేదని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నమని అన్నారు.

ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ.. రేవంత్ రెడ్డి కి కత్తిమీద సాములాంటిది..

రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల భేటీ రేవంత్ రెడ్డి కి కత్తిమీద సాములాంటిదని కీలక వ్యాఖ్యలు చేశారు. తేడావస్తే తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డి పై ముద్ర వేస్తారని గుర్తు చేశారు. దానికి రేవంత్ రెడ్డి భయపడాల్సిన పని లేదన్నారు. రెచ్చగొడితే సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. నీటి సమస్య, భద్రాచలం, విభజన సమస్యలు ఉన్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయిందన్నారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు తప్పా.. వారి మధ్య వైషమ్యాలు లేవన్నారు. ఒకప్పుడు సెంటిమెంట్ పని చేసింది.. దాన్ని యాంటీ ఆంధ్రగా వాడుకున్నారని తెలిపారు.

దేవుడా.. యూట్యూబర్‌కు కూడా ఇంతమంది అభిమానులా! స్టార్‌లు చూస్తే అంతే సంగతులు

సాధారణంగా సినిమా స్టార్‌లకు, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు భారీగా అభిమానులు ఉంటారు. సెలబ్రిటీలు బయట ఎక్కడ కనిపించినా.. వారిని చూసేందుకు లేదా కలిసేందుకు ఎగబడుతుంటారు. అయితే ఓ యూట్యూబర్‌కు సెలబ్రిటీలకు మించిన ఫాన్స్ ఉన్నారు. మాల్ నుంచి అతడు బయటకు రాగానే ఫాన్స్ ఎగబడ్డారు. ఫాన్స్ తోపులాట కారణంగా అల్లాడ తొక్కిసలాట జరిగింది. చాలా మంది గాయాలపాలయ్యారు కూడా. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు..ఎప్పుడంటే..?

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBE) నీట్-పీజీ (NEET PG 2024) పరీక్ష తేదీని ప్రకటించింది. ఎన్బీఈ పరీక్ష తేదీని జులై 5న విడుదల చేసింది. నీట్ పీజీ పరీక్ష ఆగస్టు 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా.. పరీక్ష రెండు షిఫ్టుల్లో జరగనుంది. నీట్ పీజీ పరీక్షలు 23వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. అయితే పరీక్షకు ఒక రోజు ముందు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్షా ప్రక్రియ, పటిష్టతను తనిఖీ చేసి, ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందకే రద్దు చేసినట్లు ఎన్బీఈ (NBE) ఛైర్మన్ డాక్టర్ అభిజాత్ సేథ్ తెలిపారు. ఎన్‌బీఈ గత ఏడేళ్లుగా నీట్‌-పీజీని నిర్వహిస్తోందని.. బోర్డు కచ్చితమైన ఎస్‌ఓపీ కారణంగా పేపర్ లీక్ అయినట్లు ఎలాంటి నివేదిక రాలేదన్నారు.

లిక్కర్ కేసులో మళ్లీ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..!

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జ్యుడీషియల్ రిమాండ్‌ను జూలై 18 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఇదిలా ఉంటే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లు వేసింది. కానీ ధర్మాసనం తిరస్కరించింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో వేసిన రెండు పిటిషన్లను కూడా కొట్టివేసింది. దీంతో కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది. లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. గత నాలుగు నెలలుగా జైల్లోనే కవిత ఉంటున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఆప్‌కు కవిత రూ.100 కోట్లు ముడుపులు అందించినట్లుగా ఈడీ ఆరోపించింది.

బీజేపీ ప్రభుత్వం మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుంది

జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మత్తవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. NEET పరీక్ష పేపర్ లీకేజ్ విచారణ ను సుప్రీం కోర్ట్ పరిధి నుండి CBI చేతిలో కి వెళ్ళిందని, విద్యార్థుల జీవితల తో చాలగటం ఆడుతుంది కేంద్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. నీట్ పేపర్ లీకేజీ పై సుప్రీం కోర్ట్ లొ విచారణ చేపట్టాలని, నీట్ పేపర్ లీకేజీ లొ కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ లొ పరదర్శకత లోపించిందని, నీట్ పరీక్ష నిర్వహణ పై రాష్టాలకె అధికారం కల్పించాలన్నారు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. CBI అంటే కేంద్ర ప్రభుత్వ అజిమాయిషీలో నడిచే సంస్థ అని ఆయన అన్నారు.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..త్వరలో వెయిటింగ్ కష్టాలకు స్వస్తి!

పండుగల సమయంలో రైళ్లలో టిక్కెట్లు దొరకడమే పెద్ద సమస్యగా మారింది. కొన్ని వారాలకు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నా..నిరీక్షణ తప్పదు. అయితే రానున్న రెండేళ్లలో టిక్కెట్ల వెయిటింగ్ కష్టాలకు స్వస్తి పలకాలని రైల్వేశాఖ ప్లాన్ చేసింది. ఇక ప్రయాణికులు కొన్ని రోజులు మందుగా టికెట్ బుక్ చేసుకున్నా.. సీట్ దొరికే అవకాశం రానుంది. ఎలా అనుకుంటున్నారా..? రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 మరియు 2025-26 సంవత్సరాల్లో 10,000 నాన్-ఏసీ కోచ్‌లను తయారు చేయాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దాని నెట్‌వర్క్‌లో సామాన్యుల పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి.. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4,485 నాన్-ఏసీ కోచ్‌లను, 2025-26లో మరో 5,444 కోచ్‌లను ప్రవేశపెడతామని మంత్రిత్వ శాఖ ఉత్పత్తిని పెంచే ప్రణాళికను వెల్లడిస్తూ ఓ సీనియర్ అధికారి తెలిపారు. అదనంగా.. రైల్వే తన రోలింగ్ స్టాక్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడానికి 5,300 కంటే ఎక్కువ సాధారణ కోచ్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

త్వరలో విద్యుత్‌ బిల్లులపై క్యూఆర్‌ కోడ్‌

ఆర్‌బిఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ జూలై 1న తమ వినియోగదారులను విద్యుత్తు అధికారిక వెబ్‌సైట్ , మొబైల్ యాప్ ద్వారా నెలవారీ విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరిన తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( టిజిఎస్‌పిడిసిఎల్ ) విద్యుత్ బిల్లులపై చెల్లింపులు చేయడానికి క్యూఆర్ కోడ్‌ను ముద్రించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

సమాచారం ప్రకారం, QR కోడ్‌తో కూడిన బిల్లులు వచ్చే నెల నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వారి బిల్లులను చెల్లించవచ్చు. కొత్త నిబంధనల వల్ల బిల్లుల వసూళ్లపై ఇప్పట్లో ప్రభావం పడలేదని డిస్కమ్ అధికారులు పేర్కొంటున్నారు . శుక్రవారం ఉదయం 10 గంటల వరకు దాదాపు 1.20 లక్షల మంది వినియోగదారులు బిల్లులు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.

ప్రజల తరపున పోరాడటం నేను చేసిన తప్పా

అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు, కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో తమ అధికారిక పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. వారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు బాధ్యులైన అధికారులపై ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయాలని ప్రయత్నించారు , కాని వారి ఫోన్ కాల్‌లకు వారు స్పందించిన తర్వాత వారు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. .స్పీకర్ ను కలవడానికి అసెంబ్లీకి వచ్చామని, స్పీకరు అపాయింట్ మెంట్ తీసుకునే వచ్చామని తెలిపారు. ఎందుకనో స్పీకరు మాకు టైం యిచ్చి అందుబాటులోకి రాలేదని, మా నియోజక వర్గాల్లో ప్రోటో కాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ నేతల పెత్తనం నడుస్తోందని, ప్రొటో కాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారుల పై ప్రివిలేజి మోషన్ ఇవ్వడానికి స్పీకర్ ను కలవాలనుకున్నామన్నారు. స్పీకర్ మళ్ళీ ఎపుడు టైమ్ ఇస్తే అపుడు కలిసి ప్రివిలేజి మోషన్ ఇస్తామన్నారు.

సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కరీంనగర్‌లో నిరసనలు

సింగరేణి బొగ్గు క్షేత్రాల వేలానికి నిరసనగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద వామపక్షాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి . సిపిఐ, సిపిఐ (ఎం), సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కార్యకర్తలు నిరసనలో పాల్గొని సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలను రామగుండం , ఎన్టీపీసీ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు .

కరీంనగర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బొగ్గు బ్లాకులను వేలం వేసి సింగరేణిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఎస్‌సిసిఎల్‌ను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ గోదావరిఖని పర్యటనలో స్పష్టం చేశారు. అయితే, ఆయన ఇచ్చిన మాటకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

సాయంత్రం నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్.. కారణమిదే!

హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నగరంలో ఒకే సమయంలో రెండు అతి పెద్ద ర్యాలీలు జరగనున్నాయి. ఇందుకోసం నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇటీవలే టీ 20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుచుకుంది. గురువారమే క్రికెటర్లు భారత్‌కు చేరుకున్నారు. టీమిండియాకు ముంబైలో ఘనస్వాగతం లభించింది. ఇక ప్రపంచ కప్‌ సాధించడంలో భాగమైన హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ సాయంత్రం 5:30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. అక్కడ నుంచి నగరంలోకి భారీ ర్యాలీ నిర్వహించేందుకు క్రికెట్ అభిమానులు ఏర్పాట్లు చేశారు.