NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కాలేజీ అమ్మాయిల స్కూటీ లు ఎటు పాయే.. సీఎం రేవంత్ ట్వీట్ పై డీకే అరుణ ఫైర్..

సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తాం అన్నారని గుర్తు చేశారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఒక్క ఇల్లు మొదల పెట్టలేదన్నారు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా..? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ సగం మందికి కాలేదన్నారు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం కర్నాటకలో డీకే శివకుమార్ ఫ్రీ బస్ ఎత్తేస్తాం అంటున్నారని తెలిపారు. గ్రామాలకు బస్సులు బంద్ చేసి ఫ్రీ బస్ అంటున్నారని అన్నారు. అన్ని అమలు చేస్తున్నాం అనడానికి సీఎం రేవంత్ కు సిగ్గు ఉండాలన్నారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారన్నారు. రూ.500 రూపాయలకే సిలిండర్ లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 375 , మరి మీరిచ్చేది ఎంత‌..? అన్నారు.

కేటీఆర్ ది పాదయాత్రనా? లేక పదవుల యాత్రానా?.. అరవింద్ కీలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాక్యలు చేశారు. కేటీఆర్ ది పాదయాత్రనా? లేక పదవుల యాత్రానా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రేవంత్ దేవుళ్ళ మీద ఓట్టేసి రైతులను నట్టేటా ముంచాడన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కు ఓటకి తప్పదని తెలిపారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని మండిపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదన్నారు. కులగణన పకడ్బందీగా చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్నారు. కేటీఆర్ పాదయాత్ర హాస్యాస్పదం.. కేటీఆర్ పాదయాత్ర చేస్తే చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలకండన్నారు. కేటీఆర్ ది పాదయాత్రనా? లేక పదవుల యాత్రానా? స్పష్టం చేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంఐఎం పార్టీ దేశానికి పట్టిన క్యాన్సర్ అన్నారు. వక్ఫ్ బోర్డ్ చట్టం దుర్మార్గపు చట్టమన్నారు. పార్లమెంటు చట్టాలను ఉల్లంగిస్తే ఎంఐఎం పై కఠిన చర్యలకు సిద్ధమని తెలిపారు. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తానని హిందు దేవుళ్ళ మీద ఒట్టేసిన రేవంత్, ముస్లిం దేవుళ్ళ మీద ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు.

క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై స్టంట్ ఘటన.. సజ్జనార్ ట్వీట్ తో పది మందిపై కేసు..

ఐటీ క్యాడర్లో బైక్ రైడర్స్ మరొకసారి రెచ్చిపోయిరు. హైటెక్ సిటీ టీ హబ్ మై హోమ్ భుజ ప్రాంతాలలో దీపావళి రోజు యువత బాణాసంచర్లను బైక్ పై పెట్టుకుని స్టంట్లు వేసింది. దీపావళి రోజు కొందరు పోకిరీలు వెర్రి చేష్టలు వేస్తూ.. క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై స్టంట్లు చేసింది. అంతే కాకుండా వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. దీంతో యువత తీరుపై ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా Xలో వీడియోలు పోస్ట్ చేశారు. దీపావళి అనేది వినోదం మరియు ,ఉత్సాహం,ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రోజరి తెలిపారు. ఇలా.. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

సూపర్ సిక్స్ ఎక్కడా అమలు లేదు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుటి నుంచి ఒక మాఫియా పాలనా చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆటవిక రాజ్యం సృష్టిస్తున్నారని‌‌… వీరి అరాచకాలపై ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఇంటింటికి డబ్బులు, పథకాలు వచ్చేవీ‌‌‌‌ అవన్నీ మాయం అయ్యాయన్నారు. ఈ నాలుగు నెలల్లో వందమందికి పైగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు.శాంతిభద్రతలు రాష్ట్రంలో ఎక్కడున్నాయని ప్రశ్నించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఏదో జరుగుతుందని హెలికాప్టర్ పంపారు.. 5 నెలలు అయ్యింది ఏం పట్టుకున్నారని ప్రశ్నించారు. తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాన్ని చేశారంటూ మండిపడ్డారు. ఏదో ఒక అసత్య ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. చంద్రబాబు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. త్వరలో ఎన్నికలు వచ్చేటట్లు ఉన్నాయి.. ప్రతి కార్యకర్త సిద్దంగా ఉండాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డంగా దోచుకుని జేబులు నింపు కుంటున్నారన్నారు. జగన్‌ సహా పార్టీ నేతలు వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆక్రమ కట్టడాలు చేయలేదు, కరకట్ట అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారన్నారు.

కంపులో కాళేశ్వరం గోదావరి తీరం.. దుర్గంధంతో భక్తులు ఇబ్బందులు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి తీరం కంపు కొడుతుంది. వ్యర్థాలు,భక్తుల‌ దుస్తులు,కుండలతో దర్శనమిస్తూ దుర్గంధంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కావడంతో కాళేశ్వరానికి తెలంగాణ, ఏపి, మహరాష్ట్ర చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచే కాకుండే ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించెందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయాన్ని దర్శించేముందు త్రివేణి సంగమమైన గోదావరి నదిలో పుణ్యస్నానాలు అచరించడం ఆనవాయితి. దీంతో పున్యస్నానాలకు వెళ్ళే భక్తులకు గోదావరి తీరంలో దుర్గంధం స్వాగతం పలుకుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే, తగలపెడుతుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటే ఎందుకు చంద్రబాబు, హోంమంత్రి అనితా కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. వీటిపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదని అడిగారు. చంద్రబాబును ఈ జిల్లా వాడు అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నామన్నారు. సూపర్ సిక్స్ కాదు, సూపర్ చీటింగ్ చేస్తున్నారని విమర్శించారు. జగన్ అన్న మనకు అండగా నిలవాలి, తప్పుడు ప్రచారం వల్ల వైసీపీ ఓడిపోయిందన్నారు. చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదన్నారు. ఇది ఈవీఏం ప్రొడక్షన్ వారి సీబీఎన్‌ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.

రెడ్ బుక్పై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు..

మాజీ మంత్రి అంబటి రాంబాబు రెడ్ బుక్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్‌కు తమ కుక్క కూడా భయపడదని విమర్శించారు. తమ ఆఫీస్‌ను కూల్చినట్లు.. రుషి కొండను కూల్చేస్తారా అని అన్నారు. చంద్రబాబు రుషి కొండ భవనాలు చూసి ఆశ్చర్య పోతున్నారు.. చంద్రబాబు ఈ భవనాలు చూసి సిగ్గు పడాలని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కాలర్ ఎగరేసుకుని చెప్పండి.. జగన్ రుషికొండలో అద్భుత భవనాలు కట్టాడు అని చెప్పండని పేర్కొన్నారు. రుషి కొండలో ప్రభుత్వ భవనాలు కడితే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారని అని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలు గెలుపుకు కృషి చేస్తారు.. ప్రజాస్వామ్య దేశంలో గెలుపు ఓటములు సహజం అని అంబటి రాంబాబు తెలిపారు.

వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తాం

వరంగల్ భద్రకాళి బండ్, భద్రకాళి ఆలయం లో చేపట్టనున్న అభివృద్ధి పనులను జిల్లా ఉన్నత అధికారులతో రాష్ట్ర రెవెన్యూ, హోసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. దశాబ్దాల కాల మామునూర్ ఎయిర్ పోర్ట్ కు అవాంతరాలు తొలిగిపోయాయని, కేంద్రం అనుమతి ఇస్తే ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తోందన్నారు మంత్రి పొంగులేటి. భద్రకాళి అమ్మవారిని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. భద్రకాళి జలాశయంను తాగు నీటి జలయశంగా మారుస్తామని, భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిని పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చెరువు పై సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

ఏ హోదా ఉన్నా, ఏ పదవి ఉన్నా తృప్తిగా పనిచేస్తా

కంటోన్మెంట్ బంజారానగర్ లో జరిగిన సీనియర్ సిటిజన్స్, బీజేపీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అన్యాయంకి, దుర్మార్గంకి వ్యతిరేకంగా కొట్లాడడమే నా వ్యక్తిత్వమన్నారు. ఏ హోదా ఉన్నా, ఏ పదవి ఉన్నా తృప్తిగా పనిచేస్తా అని, తృప్తిలేనిది, గౌరవం లేనిది ఎంత పెద్ద పదవి అయినా వ్యర్థమని నేను భావిస్తా అని ఆయన వ్యాఖ్యానించారు. ఈయన మా బిడ్డ అని ఇంటింటికీ భావించి నాకు ఓటువేసి గెలిపించారని, చెరువులు, మూసీ ప్రక్షాళనకు నేను వ్యతిరేకం కాదన్నారు ఈటల రాజేందర్.

వైసీపీకి ఆధారం.. మూలం, బలం కార్యకర్తలే..

వైసీపీకి ఆధారం.. మూలం, బలం కార్యకర్తలు మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ జెండా మోస్తూ.. జై కొట్టినంత సేపు మాత్రమే నాయకులకు, కార్యకర్తలు జై కొడతారన్నారు. జెండా వదిలితే మాత్రం ఆ నాయకుడు కార్యకర్తకు అవసరం లేదని చెప్పారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ శ్రేణులను ఎన్నో ఇబ్బందులు పెట్టారు.. కేసులు పెట్టారు, రోడ్ల మీద కొట్టారు, దౌర్జన్యాలు చేశారని అన్నారు. ఓవర్ యాక్షన్ చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టం.. వాళ్లని పరిగెత్తించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు.