తెలంగాణ మంత్రి హరీష్ రావు పై.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్ళు తప్పవు అంటూ ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు అల్లుడు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు అల్లుడు.. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు..
హరీశ్ రావు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు అని ఆరోపించారు. కేసీఆర్ తెలివైన వ్యక్తి కాబట్టి.. అల్లుడి గిల్లుడికి సమాధానం ఇస్తాడు అని ఆయన తెలిపాడు. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్ కళ్యాణ్ కు వావి వరుసలు లేవు.. బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు.. కృష్ణా జిల్లాలో కాపులు ఎక్కువగా ఉన్న ఊర్లలోనే ఎందుకు వారాహి యాత్ర చేస్తున్నాడు.. కమ్మ, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండే చోట్ల ఎందుకు మీటింగ్ లు పెట్టడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. మా అందరి కంటే ప్రజలు తెలివైన వాళ్ళు.. వాళ్ళకు అన్ని తెలుసు అని పేర్నినాని అన్నారు.
గాంధీ జయంతి రోజే దళితబంధు.. ప్రారంభించనున్న కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ఇప్పటికే ఉన్న పథకాలను లబ్ధిదారులకు మరింత చేరువ చేయడమే హ్యాట్రిక్ సక్సెస్ లక్ష్యం. వెనుకబడిన దళితులకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేందుకు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. మొదటి దశలో ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం, రెండో విడత పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 162 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్నారు. మొదటి విడత పంపిణీలో అవకతవకలు జరిగాయని విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, వారి అనుచరులు భారీగా కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు తీసుకొచ్చింది మన ప్రభుత్వమే..!
ప్రపంచంలో ఎవరికీ లేనన్ని ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.. సీసీఎల్ఏ సాయిప్రసాద్ ను ఆ స్ధానంలో సీఎం జగన్ పెట్టారు అని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే కంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ & జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని పిలవాలి అని చెప్పారు. భూమిపై సంపూర్ణ హక్కు అందించడం అవసరం.. 1977లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్సఫర్ యాక్ట్ వచ్చింది.. ఏదైనా సున్నితంగా తిరస్కరించడం తెలియాలి అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు.
ఎవరు సీఎం అయినా.. అందుబాటులో ఉంటాం
తాజాగా కాంగ్రెస్ పార్టీలో వేముల వీరేషం జాయిన్ అయిన తర్వాత ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నకిరేకల్ నేతల ముందు ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యపై హాట్ కామెంట్స్ చేశారు. మేము దగ్గరుండి గెలిపిస్తే.. మమ్మల్ని దారుణంగా మాట్లాడుతుండు.. మేము ఫస్ట్ జడ్పీటీసీగా గెలిపిస్తే.. పెద్ద పదవి ఎందుకు అన్నాడు.. తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించాం.. ఒకటి కాదు రెండు సార్లు గెలిపించిన.. ఇప్పుడు ఇష్టమున్నట్లు మాట్లాడుతుండు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్‌వాడీలకు దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా..
అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో ప్రకటించనున్న పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను మంత్రి హరీశ్ రావు ఆదివారం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలోని 70 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందనున్నారు. మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌లతో అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆదివారం సమావేశమయ్యారు.
హైదరాబాదులో అడుగు పెట్టిన ప్రధాని.. పాలమూరుకు పయనం
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు అధికారులు స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 01:05 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది. అయితే ప్రధాని మధ్యాహ్నం 01:30 గంటలకు వస్తారని సమాచారం అందింది. అయితే ప్రధాని మోదీ మధ్యాహ్నం 01:40 గంటలకు శంషాబాద్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 1:47 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు.
టర్కీ పార్లమెంట్ భవనం వెలుపల ఆత్మాహుతి దాడి..
టర్కీ రాజధాని అంకారా నడిబొడ్డున ఆత్మాహుతి దాడి జరిగింది. పార్లమెంట్ భవనం వెలుపల, మంత్రిత్వ శాఖ భవనాలకు ముందు ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మహుతి బాంబు దాడికి పాల్పడ్డారని టర్కీ అంతర్గత మంత్రి ఆదివారం చెప్పారు. వేసవి విరామం తర్వాత పార్లమెంట్ తిరిగి తెరవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది. ఉగ్రవాదుల్లో ఒకరు పేలుడులో మరణించగా.. మరొకరిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులు స్వల్పంగా గాయపడ్డారు. పార్లమెంట్, మంత్రిత్వ కార్యాలయ భవనాల ముందు పేలుడు వినిపించిందని టర్కీష్ మీడియా వెల్లడించింది. ఓ వాహనంలో ఉగ్రవాదులు ఘటనా స్థలానికి చేరుకున్నారని టర్కీ అంతర్గత మంత్రి యర్లికాయ తెలిపారు.
అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
భారత దేశ అభివృద్ధిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారత్‌కు ఆధునిక పరికరాలతో కూడిన బలమైన సాయుధ బలగాలు అవసరమని రక్షణ మంత్రి ఆదివారం పేర్కొన్నారు. మూడు సేవల ద్వారా ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ (DAD) 276వ వార్షిక దినోత్సవ వేడుకల సందర్భంగా అనేక డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌ను “రక్షణ ఫైనాన్స్ సంరక్షకుడు”గా అభివర్ణిస్తూ, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని గుర్తించి, వెంటనే సమీక్షించగలిగేలా అంతర్గత నిఘా యంత్రాంగాన్ని బలోపేతం చేయవలసిన అవసరాన్ని గురించి వివరించారు. దీనివల్ల సమస్యను త్వరగా పరిష్కరించడమే కాకుండా శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని చెప్పారు.
అభివృద్ధికి తెలంగాణను కేరాఫ్ అడ్రస్‌గా మార్చింది కేసీఆర్
మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో నూతన మెడికల్ కాలేజ్‌కు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మళ్లీ పెద్ద మెజార్టీతో గెలవబోతున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. 180 కోట్ల రూపాయలతో ప్రభుత్వ మెడికల్ కాలేజీకు శంకుస్థాపన చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, 300 కోట్లతో 450 పడకల ఆసుపత్రి కూడా రాబోతుందన్నారు మంత్రి హరీష్ రావు. మహేశ్వరం నియోజకవర్గానికి కేసీఆర్ గారు ఇచ్చిన బహుమతి కందుకూరు ప్రజలకు వరమని, ఇక్కడ నుండి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు పోయే పరిస్థితి ఇకపై ఉండదన్నారు.
తెలంగాణకు పసుపు బోర్డు.. ములుగు జిల్లాకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ
మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్‌లైన్, వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నా కుటుంబ సభ్యులారా.. అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సభా వేదికగా ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పసుపు రైతుల కల సాకారమైంది. సభా వేదికగా పసుపు బోర్డుపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మోడి ప్రకటించారు. పాలమూరు సభ సాక్షిగా ప్రధాని ప్రకటించారు.
“ఇస్రో చంద్రయాన్ లాగానే”.. భారత్-అమెరికా బంధంపై జైశంకర్..
భారత్-అమెరికా కలిసి పనిచేయడం చాలా అవసరమని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇరు దేశాల బంధంపై పరిమితి విధించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు ఒకరికొకరు కావాల్సిన, అనుకూలమైన, సౌకర్యవంతమైన భాగస్వాములుగా ఆయన అభివర్ణించారు. ఇటీవల యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు జైశంకర్ అమెరికా వెళ్లారు. దీంతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, యూఎస్ జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమయ్యారు.
భారత-అమెరికా బంధం ఎక్కడి వరకు వెళ్తుందని తరుచుగా నన్ను అడిగే వారని, అయితే దానిపై పరిమితి విధించడం చాలా కష్టమని, ఎందుకంటే ఇరు దేశాల బంధం అంచనాలను మించి పోయిందని జైశంకర్ తెలిపారు. ఇస్రో చారిత్రాత్మక చంద్రయాన్ లూనార్ మిషన్ లాగేనే భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకుంటాయని జైశంకర్ పునరుద్ఘాటించారు.
ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయి
తెలంగాణలో నేడు ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభ నుంచి పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోడీ. అయితే.. మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ నష్టపోతుందన్నారు. 9ఏళ్లల్లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రూ. 9 లక్షల కోట్లు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత 9 ఏళ్లలో కేంద్రం తెలంగాణలో లక్షా 20కోట్ల రూపాయాలు జాతీయ రహదారుల కోసం ఖర్చు చేసిందని ఆయన అన్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారు
మరోసారి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బచ్చన్నపేట కార్యకర్తల సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. వర్గాలుగా విభజిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఆదేశాలు ధిక్కరించి మీటింగ్ లు పెడుతున్నారని, పల్లా సమైఖ్యవాది, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అని ఆయన ధ్వజమెత్తారు. నీపై ఎన్ని తెలంగాణ ఉద్యమ కేసులు ఉన్నాయని, నాపై తెలంగాణ ఉద్యమ రైల్వే కేసు లు ఇంకా ఉన్నాయని ఆయన అన్నారు. నగామలో వర్గాలు క్రియేట్ చేసిన ఘనులను ఖండిస్తున్నానని తెలిపారు. నేను ఓడిపోతానని ఏ సర్వే చెప్పలేదని.. ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైందని ప్రశ్నించారు ముత్తిరెడ్డి. కాంగ్రెస్ పాగా జనగామలో బీఆర్ఎస్‌ను బలపరిచానన్న ముత్తిరెడ్డి.. సీఎం కేసీఆరే తన పనిని మెచ్చుకున్నారని తెలిపారు.
ఉత్తరాంధ్రను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది
ఉత్తరాంధ్ర అభివృద్దిపై సమష్యల పరిష్కారం పై కృషిచేస్తున్నామన్నారు రాజ్యసభ సభ్యులు కామెంట్స్ జీవీఎల్ నరసింహారావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం – వారణాశికి రెగ్యులర్ ట్రైన్ వేయించగలుగుతున్నాం. దసరా నాటికి ట్రై మొదలౌతుందని, ఉత్తరాంధ్రను రాష్ర్ ప్రభుత్వాలు నిర్లక్యం చేస్తున్నాయన్నారు జీవీఎల్. అన్ని వనరులు ఉన్నా ఈప్రాంత ప్రజలను పాలకులు వదిలేసారని, ఇక్కడ రాజకీయ పలుకువడిన కలిగిన నేతలు ఉన్నారన్నారు జీవీఎల్. ముప్పై నలబై ఏండ్లుగా రాజకీయాలు చేస్తున్న కుటుంబాలు శ్రీకాకుళం లొ ఉన్నాయని, ధర్మన , అచ్చం నాయుడు కుటుంబాలు జిల్లాను పట్టించుకోలేదని జీవీఎల్ నరసింహారావు అన్నారు.
సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ నష్టపోతోంది..
మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన ‘పాలమూరు ప్రజాగర్జన’ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై మాటల తూటాలు సంధించారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఏ రకమైన ప్రభుత్వం ఉందో చూడాలన్నారు కిషన్ రెడ్డి. ఇంత మోసపూరితమైన సీఎంను ఎక్కడా చూడలేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చాలామంది రైతులు పసుపు పండిస్తారని, అనేక ఏళ్లుగా పసుపు బోర్డు కోసం రైతులు పోరాటం చేశారని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసమే పసుపు బోర్డు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రధాని మోడీ తీసుకున్నారని ఈ సందర్భంగా చెప్పారు. సమ్మక్క సారక్క పేరుతో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. తెలంగాణ చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు అని అన్నారు కిషన్ రెడ్డి. సమ్మక్క-సారక్క దేవతలను కోట్లాది మంది ప్రజలు పూజిస్తారని.. ఆ పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కానుందన్నారు. ట్రైబల్ యూనివర్సిటీకి ఆ పేరుపెట్టుకోవడం సంతోషకరమన్నారు.
తెలంగాణ ప్రజలు అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు..
పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రజలందరకీ నమస్కారములు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని మోడీ తెలంగాణ వాసుల మనస్సు దోచుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటోందని.. చెప్పింది చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. ఈ ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానన్న ప్రధాని మోడీ.. ఈ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
