NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్‌ విస్తరణ, బిల్లులు, పెండింగ్‌ ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్‌తో సీఎం రేవంత్ చర్చ జరిపారు. జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు కేబినెట్‌ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బిల్లుల కోసమే గవర్నర్‌తో సీఎం సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

మాది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం..

మాది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది.. అనంతపురంలో జిల్లాలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అన్నారు.. ప్రజల మనసుల్లో నిలిచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని ప్రకటించారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాం.. ఎన్నికల సమయం నుంచే అమలు చేస్తామన్న మాట ప్రకారం.. ఆ మూడు నెలల బకాయి.. ఈ నెల పెన్షన్‌ కలుపుకొని మొత్తం ఒకేసారి రూ.7 వేలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.. ఇక, పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీని జరుగుతుంది.. ఈ కార్యక్రమాన్ని ఉదయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారని గుర్తుచేశారు. కాగా, ఈ రోజు మంత్రి నారా లోకేష్‌ ప్రతినిథ్యం వహిస్తోన్న మంగళగిరిలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి.. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే.

ఛైర్మన్-ఖర్గే మధ్య ఆసక్తికర సన్నివేశం.. సభ్యులు నవ్వులే నవ్వులు

గత వారం పార్లమెంట్ ఉభయ సభలు హాట్ హాట్‌గా సాగాయి. ఇక రాజ్యసభలో అయితే ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్-కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది. తీవ్ర ఆగ్రహావేశాలు చోటుచేసుకున్నాయి. కానీ తాజా పరిణామాలు అందుకు భిన్నంగా మారిపోయింది. సోమవారం సభలో ధన్‌ఖడ్, ఖర్గే మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దీంతో సభలో సభ్యులు నవ్వులు చిందించారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించేందుకు మల్లికార్జున ఖర్గే లేచి నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువసేపు నిలబడి ఉండలేకపోతున్నానని.. ఛైర్మన్ అనుమతిస్తే కూర్చొని మాట్లాడతానని కోరారు. ధన్‌ఖడ్‌ బదులిస్తూ.. సభలో ప్రసంగించేటప్పుడు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోమని తెలిపారు. ఇబ్బందిగా ఉంటే కూర్చొని మాట్లాడవచ్చని బదులిచ్చారు. దీనికి ఖర్గే ప్రతి స్పందనగా.. కూర్చొని చేసే ప్రసంగం.. నిలబడి మాట్లాడి చేసేంత ఉద్రేకంగా ఉండదని ఖర్గే నవ్వుతూ చెప్పారు. దీంతో విపక్ష నేత మాటలతో ఛైర్మన్‌ కూడా ఏకీభవించడంతో ఇద్దరూ నవ్వులు చిందించారు. ఈ విషయంలో తాను సాయం చేస్తానని ధన్‌ఖడ్ అన్నారు. ఛైర్మన్‌ కూడా కొన్ని సందర్భాల్లో తమకు సాయం చేశారని.. దాన్ని తాము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామని ఖర్గే అనడంతో సభ మొత్తం నవ్వులు విరబూశాయి. ధన్‌ఖడ్-ఖర్గేల మధ్య కొనసాగిన సంభాషణలతో సోనియాగాంధీ కూడా నవ్వులు చిందించారు.

హైదరాబాద్‌ మెట్రో రైలుకు గోల్డెన్ పీకాక్ అవార్డు

అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను పాటించడంలో గల నిబద్ధతకు గాను ట్రాన్స్‌పోర్టేషన్ (రైల్వేస్) కేటగిరీలో ఆక్యుపేషనల్ హెల్త్ & సేఫ్టీకి సంబంధించి గోల్డెన్ పీకాక్ పురస్కారాన్ని (GPOHSA) ఎల్&టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) దక్కించుకుందని తెలియజేసేందుకు సంతోషిస్తోంది.

అత్యుత్తమ భద్రత ప్రమాణాలు , పని ప్రదేశంలో ఆరోగ్యకరమైన పరిస్థితులను పాటించడానికి ప్రాధాన్యతనివ్వడంపై మా యావత్ బృందం చేస్తున్న నిరంతర కృషికి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలుస్తుంది. “మా ఉద్యోగుల భద్రత, సంక్షేమం విషయంలో మాకు గల ఎనలేని నిబద్ధతకు ఈ పురస్కారం నిదర్శనంగా నిలవగలదు. ఇది మాకు ఎంతో స్ఫూర్తినిస్తూ, భద్రతలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పే దిశగా నిరంతరం కృషి చేసేలా ప్రోత్సాహకరంగా ఉండగలదు” అని ఎల్ & టీ ఎంఆర్‌హెచ్ఎల్ ఎండీ , సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు.

“హిందువులుగా చెప్పుకుంటూ హింసకు పాల్పడుతున్నారు”..బీజేపీపై విరుచుకుపడ్డ రాహుల్

ఈరోజు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పెట్టుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు హిందువులుగా చెప్పుకుంటూ హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో పార్లమెంట్ లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రధాని, మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో రాహుల్ గాంధీ శివుడి చిత్రపటాన్ని చూపిస్తూ..మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ ఆయనకు రూల్ బుక్‌ను చూపించారు. “శివుడి ఎడమ చేతిలో త్రిశూలం ఉంది. త్రిశూలం హింసకు చిహ్నం కాదు. ఒకవేళ త్రిశూలం హింసకు చిహ్నం అయితే.. శివుడి కుడి చేతిలో ఉండేది.” అన్నారు. శివుడు తన స్ఫూర్తి అని అభివర్ణించిన రాహుల్ గాంధీ.. ప్రతికూల పరిస్థితుల్లో పోరాడేందుకు ఆయన నుంచి స్ఫూర్తి పొందానని అన్నారు.

నీట్ కౌన్సిలింగ్ కి వ్యతిరేకంగా ఈ నెల 6న బంద్‌కు పిలుపు

నీట్ కౌన్సిలింగ్‌కి వ్యతిరేకంగా ఈ నెల 6వ తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కి పిలుపునిస్తాము ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తెలిపారు. రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్షను రద్దు చేసిన మళ్లీ నిర్వహించాలని, NTA ను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి , యువజన ఐక్య కమిటీ అధ్వర్యంలో గవర్నర్ అప్పోయింట్మెంట్ కోరడం జరిగింది. గవర్నర్ అప్పోయింట్మెంట్ ఇవ్వకపోవడం తో ముట్టడి కి బయలుదేరారు నేతలు. పీపుల్స్ ప్లాజా నుండి రాజభవన్ వరకు ర్యాలీ గా విద్యార్థి సంఘాల నేతలు బయలుదేరారు. ఐమ్యాక్స్ సర్కిల్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్ కి పోలీస్ లు తరలించారు. ఈ రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ,(NSUI -SFI – AISF – PDSU -VJS-AIPSU- PYC- DYFI-AIYF-PYL-YJS) నేతలు పాల్గొన్నారు.

జగిత్యాలను జిల్లా చేసింది.. మెడికల్ కాలేజీ తీసుకువచ్చింది కేసీఆర్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హల్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్‌ తో పాటు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్మన్ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ , ఎమ్మెల్సీ రమణ, 18 మండలల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. జగిత్యాలలో ఈ హౌలే గాన్ని ఎమ్మెల్యేను చేసింది ఎవరు..? జగిత్యాలను జిల్లా చేసింది మెడికల్ కాలేజీ తీసుకువచ్చింది కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి జిల్లాను మెడికల్ కాలేజీని రద్దు చేస్తామన్న పార్టీలోకి సంజయ్ కుమార్ వెళ్ళాడని, సొంత ప్రయోజనాలు నాలుగు డబ్బులు సంపాదించుకునేందుకే పార్టీ మారాడు సంజయ్ అని ఆయన ధ్వజమెత్తారు. జగిత్యాల ఎమ్మెల్యే బండగట్టుకుని బాయిల దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు గడ్డి పోచలే కొట్టుకుపోతాయన్నారు కేటీఆర్‌. పార్టీ మారిన సంజయ్ కుమార్ దమ్ముంటే రాజీనామా చేసి పోటికి రావాలని, గతంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అందరూ రాజ్యాంగబద్ధంగానే చేరారని, సింగరేణి ప్రైవేటు పరం చేయబోమని రాహుల్ గాంధీ చెప్పారన్నారు.

కార్పొరేట్ హాస్పిటల్స్‌ను సీఎం రేవంత్‌ ప్రోత్సహిస్తున్నాడు

తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని, కార్పొరేట్ హాస్పిటల్ లను ప్రోత్సహిస్తున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ హాస్పిటల్ లోకి మీడియా ను కూడా అనుమతి ఇవ్వడం లేదు… ఇదేనా మీ ప్రజా పాలన అని ఆయన ప్రశ్నించారు. గ్రూప్స్ నోటిఫికేషన్‌ల తేదీలను మీ మేనిఫెస్టో లో పెట్టీ అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే చావు డప్పు కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు మీరు చేర్చుకున్న ఎమ్మెల్యేల ఇల్ల ముందు ఏ డప్పులు కొట్టాలని మహేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ విధంగా కండువాలు కప్పుతున్నారని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్ బి ఫార్మ్ మీద పోటీ చేయించినప్పుడే ప్రజా స్వామ్యాని కూని చేశారన్నారు.

అయిదేళ్లలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతాం

కేంద్రం సహాయంతో అయిదేళ్లలో ఆర్టీసీ (RTC)లో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడతామని..త్వరలోనే 1400కొత్త బస్సులు రాబోతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎపీఎస్ ఆర్టీసీ (APSRTC)ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి ఆదివారం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ఆస్తులను సద్వినియోగం చేసి ఆర్టీసీని లాభదాయకంగా మారుస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో మాదిరిగా లాభ దాయకంగా లేదని ఆర్టీసీని పక్కన బెట్టే చేతకాని ప్రభుత్వం తమది కాదన్నారు. లాభదాయకంగా లేదని బస్సులు రద్దు చేసే పరిస్థితులు ఉండవోద్దన్నారు. కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసులు ప్రవేశ పెట్టేనాటికి పూర్తి స్థాయిలో బస్సులు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారు.. 

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ కు చుక్కెదురైంది. అయితే.. హైకోర్టు పిటిషన్ ను కొట్టివేయడం కేసీఆర్ కు చెంప పెట్టులాందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రశేఖర్ రావు వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారని, చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని కేసీఆర్ మరిచిపోయారన్నారు ఆది శ్రీనివాస్‌. రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దు చేయాలనే సాహసం చేశాడని, చంద్రశేఖర్ రావు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరై వాస్తవాలు చెప్పాలన్నారు. తప్పు జరిగిందని విచారణలో తేలితే కేసీఆర్  శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విసిరిన సవాల్ పైనే ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరి పారిపోతారా.? అని ఆయన ప్రశ్నించారు. నరసింహారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సిందేనని ఆది శ్రీనివాస్‌ అన్నారు. విచారణ నుంచి తప్పించుకునే కేసీఆర్ ప్రయత్నం బెడిసికొట్టిందని, భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పిడుగులు పడకుండా టెక్నాలజీ ఎందుకు ఏర్పాటు చేయలేదు..? అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల  అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి…బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిశాయి. గత వారం రికార్డుల్లో సృష్టించిన సూచీలు.. శుక్రవారం మాత్రం నిరాశ పరిచింది. నష్టాలతో ముగిసింది. ఇక సోమవారం ఫ్లాట్‌గా ట్రేడ్ అయిన సూచీలు.. అనంతరం క్రమక్రమం పుంజుకుంటూ భారీ లాభాల్లో దూసుకెళ్లింది. సెన్సెక్స్ 443 పాయింట్లు లాభపడి 79. 476 దగ్గర ముగియగా.. నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 24, 141 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 దగ్గర ముగిసింది.