Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తాం..!

కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తామని ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్ళే ఈ కుట్ర ఇవ్వాల్టిది కాదని, అసెంబ్లీ సమావేశంలోనే ఈ కుట్రకు బీజం పడిందన్నారు. మూడు నెలల క్రితమే ఈ కుట్రకు తెర లేసిందన్నారు. రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి భుజం పైనా చేతులు వేసి అసెంబ్లీలోకి తీసుకెళ్ళి సీటు ఆఫర్ చేశాడని.. ఇది కడియం శ్రీహరి నే చెప్పాడని క్లారిటీ ఇచ్చారు. కుట్రతోనే బీఆర్ఎస్ లోనే నాయకుల వెళ్ళ గొట్టి బిడ్డకు టికెట్ ఇప్పించుకున్నాడన్నారు. కడియం శ్రీహరి ఎన్నికల కుట్రలు పన్నాడో మాకు అందరికీ తెలుసన్నారు.

కుట్ర చేసి పింఛన్లు ఆపారు.. ఇంటికి తీసుకెళ్లి ఇస్తే తప్పేంటి..?

ఎన్నికల సమయంలో ఏపీలో ఫించన్లు నిలుపుదలపై పొలిటికల్‌ హీట్‌ పెరుగుతుంది.. ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును తప్పుబడుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. దీనిపై తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ మార్గాని భరత్ రామ్.. సీఎం వైఎస్‌ జగన్ ఇవాళ పెన్షన్ పంపిస్తారని వృద్ధులు, వికలాంగులు ఎదురుచూస్తున్నారు.. కానీ, చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుట్రపన్ని ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేసి పింఛన్లు నిలిపివేశారని ఆరోపించారు. వృద్ధాప్యంలో ఉన్న వారి ఇంటికి వెళ్లి ఓటు తీసుకుని ప్రక్రియ ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిర్వహించనుంది. కానీ, పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇస్తే తప్పేంటి…? అని నిలదీశారు.

బీజేపీ మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం..

రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవాళ ( సోమవారం ) తొలిసారి భేటీ అయింది. సీనియర్ బీజేపీ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీలో పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి నలుగురు ముఖ్యమంత్రులతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇక, ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కన్వీనర్‌గా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కో-కన్వీనర్‌గా ఎంపికయ్యారు. మేనిఫెస్టో కమిటీలో సిక్కు, ముస్లిం, క్రిస్టియన్‌తో సహా మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇందులోని సభ్యులు ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చిస్తున్నారు.

ఐదేళ్లకు మించి పాలించిన చరిత్ర కాంగ్రెస్‌లో లేదు.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ..

కాంగ్రెస్ చరిత్రలో ఐదేళ్ల కు మించి పాలించిన చరిత్ర లేదని, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి వెళ్లిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం ఎక్కువ కనిపిస్తుందన్నారు. ద్రోహం చేసిన కడియం శ్రీహరి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అవసరం అయితే రాజకీయాల నుండి తప్పుకుంటను కానీ పార్టీ మారను అన్న మీరు ఎలా పార్టీ మారారో చెప్పాలన్నారు. విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి రాజీనామా చేసి మాట్లాడాలన్నారు.

హిందూపురం టికెట్‌ నాకే వస్తుంది.. నా లక్ష్యం, సంకల్పాన్ని వీడను..!

ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద ఎన్నికలకు సిద్ధం అవుతున్న విషయం విదితమే.. హిందూపురం లోక్‌సభ స్థానంతో పాటు అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఒకేసారి బరిలోకి దిగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.. భారతీయ జనతా పార్టీ టికెట్‌ ఆశించిన ఆయనకు.. టికెట్‌ రాకపోవడంతో.. ఇండిపెండెంట్‌గానే పోటీకి సిద్ధం అయ్యారు. ఇక, ఈ రోజు శ్రీ సత్యసాయిలో మాట్లాడిన పరిపూర్ణానంద.. హిందూపురం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని మరోసారి స్పష్టం చేశారు.. అయితే, తనకు బీజేపీ అధిష్టానం మీద గౌరవం ఉంది. నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలనేదే నా లక్ష్యం అని స్పష్టం చేశారు.. నా సంకల్పాన్ని వీడబోను అన్నారు.

ప్రజల దృష్టి మార్చడానికే కేసీఆర్ పంటనష్ట పరిశీలన యాత్ర..

ప్రజల దృష్టి మార్చడానికే కేసీఆర్ పంటనష్ట పరిశీలన యాత్ర అని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నైతికంగా పతనమయ్యారన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డిని ఆర్థిక లావాదేవీల్లోవాటాదారుడు నిన్ను ఎందుకు విడిచివెళ్ళాడన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతను విస్మరించావన్నారు. ప్రతిపక్ష పాత్రనైన సక్రమంగా నిర్వార్తించమని సలహా ఇచ్చారు. రాజకీయ పార్టీ లు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. ప్రజల దృష్టి మార్చడానికే కేసీఆర్ పంటనష్ట పరిశీలన యాత్ర అన్నారు.

రాజకీయ నాయకులను అవినీతి పరుల్ని చేసింది ప్రజలే: హీరో సుమన్

రాజకీయ నాయకులను అవినీతి పరుల్ని చేసింది ప్రజలే అని హీరో సుమన్ అన్నారు. అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకుని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారన్నారు. ఐదు సంవత్సరాలు బాగుండాలి అంటే.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సుమన్ సూచించారు. ఏపీ రాజకీయాలు తనకు అవసరం లేదని, అతను తెలంగాణలో ఉంటున్నాను అని సుమన్ చెప్పుకొచ్చారు. సోమవారం హీరో సుమన్ ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ… ‘రాజకీయాల్లోకి వచ్చినందు వలన ఉపయోగం లేదు. నేను సమాజ సేవలోనే ఉన్నాను. ఏపీ రాజకీయాలు నాకు అవసరం లేదు, నేను తెలంగాణలో ఉంటున్నాను. రాజకీయ నాయకులు దొంగలు అని ప్రజలు తిడుతున్నారు. అయితే రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ప్రజలే. అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకుని.. వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చాలా మార్పులు వస్తాయి. ఐదు సంవత్సరాలు బాగుండాలి అంటే.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. నేను సెక్యులరిజం ఫాలో అవుతా’ అని చెప్పారు.

జనసేనలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు.. ఆ నియోజకవర్గాల నుంచే పోటీ!

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయ్యింది. జనసేన పార్టీ మాత్రం పెండింగ్‌లో ఉన్న రెండు సీట్లకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేన పార్టీకి దక్కడంతో.. అక్కడ అభ్యర్థి ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేరుతో సర్వేలు చేయించింది.. కానీ ఓ అంచనాకు రాలేకపోతోంది. ఈ క్రమంలో సరికొత్త ప్రచారం జరుగుతోంది. అభ్యర్థిని ఫైనల్ చేశారని.. టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరి టికెట్ దక్కించుకుంటారనే చర్చ నడుస్తోంది.

వాలంటరీ, సచివాలయ వ్యవస్థలను కూల్చడమే చంద్రబాబు ఉద్దేశం

బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న వాలంటీర్లపై టీడీపీకి కన్ను కుట్టిందని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శించారు. వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థలను కుప్పకూల్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నాడన్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి అవ్వ తాతలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇస్తున్నారన్నారు.

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి సకాలంలో పెన్షన్లు అందకుండా చేశారన్నారు. వాలంటీర్లు సేవలు అందించకూడదనే నిబంధనను విధించారని విజయసాయి పేర్కొ్న్నారు. చంద్రబాబు ఎంత ద్రోహం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబుకు తగిన రీతిలో మీరు బుద్ధి చెప్పాలన్నారు. వాలంటరీ వ్యవస్థపై టీడీపీ నేతలు విషం కక్కుతూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అవ్వా.. తాతల్లో చాలా మంది నడిచి వెళ్ళలేరు.. వారందరినీ సచివాలయం వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని చెబుతున్నారు.. ఇది న్యాయమా అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు అభ్యర్థులు దొరకడం లేదు

బీజేపీ కిసాన్ మోర్చా సమావేశం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు. టికెట్లు ఇచ్చిన పోటీ చేయమని వెనక్కి తగ్గుతున్నారని, మోడీకి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నుండి 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, బాయిల్డ్ రైస్ కొనాలని మోడీని కోరితే ఓకే చెప్పారన్నారు కిషన్ రెడ్డి. ఈనెల ఒకటి నుండి తెలంగాణలో ధాన్యం కొనుగోలను కేంద్రము ప్రారంభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రైతులను గత ప్రభుత్వం మోసం చేసింది అదే బాటలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని, ధాన్యం కి బోనస్ ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు కిషన్‌ రెడ్డి. 70 లక్షల టన్నుల ధాన్యం కొంటామని కేంద్రానికి ఈ ప్రభుత్వం చెప్పింది.. ప్రతి క్వింటాల్ కి 500 బోనస్ ఇవ్వాలని, ఎకరానికి 15వేలు రైతు భరోసా ఇవ్వాలి కౌలు రైతులను ఆదుకోవాలన్నారు.

టీడీపీ కేడర్‌తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. పింఛన్లపై కీలక ప్రకటన

పెన్షన్ల అంశంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఇంటింటి ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు పార్టీ కేడరుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ కుట్రలు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. తన రాజకీయ లబ్ది కోసం బాబాయినే చంపేసిన జగన్.. ఓట్ల కోసం ఇలాంటి అనేక కుట్రలు చేస్తాడని ఆరోపించారు. మనం వచ్చాక రూ. 4 వేల పెన్షన్ ఇంటింటికీ ఇస్తామని.. రెండు మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తామని.. అన్ని విషయాలు లబ్దిదారులకు వివరించాలన్నారు. ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులు ఇచ్చిందో ప్రకటన చెయ్యాలన్నారు. మే 13 తరువాత ఇంటికి పోయే ముందు ఖజానాలో ఉన్న డబ్బంతా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని.. గత 15 రోజుల్లో రూ. 13 వేల కోట్లు బిల్లుల కోసం చెల్లింపులు జరిపారని.. పేదలకిచ్చే డబ్బులు విషయంలో జగన్ నాటకాలు ఆడుతున్నాడని చంద్రబాబు విమర్శించారు.

ప్రతిపక్షం అంటే ఖాళీగా కూర్చోవడం కాదు

ప్రతిపక్షం అంటే ఖాళీగా కూర్చోవడం కాదని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి చేశారో మీ విజ్ఞత కే వదిలేస్తామన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కాలు బయట పెట్టగానే ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత brs ఉండదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి ముందు చూసుకోండని ఆయన వ్యాఖ్యానించారు. 50 సీట్లు కూడా దాటవని సర్వేలు చెబుతున్నాయని, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ని మూసి వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉందో… ఇప్పుడు అలాంటి కి వచ్చిందని, రైతుల దగ్గరకు వెళ్లే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌. అందుకే ప్రతిపక్షంగా మేమే వెళ్లి రైతులకు ధైర్యం చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు.

కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు

నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ కు నిన్నటి ఆదరణ చూస్తుంటే నిజంగానే నల్లగొండ జిల్లాలో ఓడిపోయామా అనిపించిందన్నారు. చేసింది చెప్పుకొకపోవడం, ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామని, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు పార్లమెంట్ ఎన్నికలో జరగొద్దన్నారు. నోటిఫికేషన్ లు ఇచ్చినా… మనం నిరుద్యోగ యువత మనసు గెలుచుకొలేకపోయమని, అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం ఉద్యోగులు బీఆర్ఎస్ కు వ్యతరేకంగా ఓటు వేశారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన లేదని, రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ఉండాలి, ఇచ్చిన ప్రతిహమి అమలు చేయాలన్నారు కేటీఆర్‌. సీఎం రేవంత్ రెడ్డి కి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో ముప్పుందని, సీఎం పదవి కోసం బీజేపీ కీలక నేత నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితంగా ఉంటున్నాడన్నారు కేటీఆర్‌.

 

Exit mobile version