NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఉత్తరాంధ్రలో కనీసం నాలుగు సీట్లయిన గెలవగలనని చెప్పగలరా…?

రాష్ట్రంలో అన్ని వర్గాలు కోపంతో, ఉక్రోషంతో వున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని వంద అడుగుల లోతులో పాతి పెట్టేయడం ఖాయమని ఆయన అన్నారు. శ్రీలంకలో రాజపక్సే ప్రభుత్వాన్ని తరిమి కొట్టినట్టే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి మిగిలింది దింపుడు కళ్లెం ఆశలే.. అద్భుతాలు జరుతుగుతాయనే భ్రమలు వీడితే మంచిదన్నారు. మూడు రాజధానుల పేరు చెప్పి విశాఖలో 300కోట్లతో విలాసవంతమైన భవనం కట్టారు తప్ప చిన్నపాటి అభివృద్ధి కూడా జరగలేదన్నారు. వైనాట్ 175అంటున్న వైసీపీకి 1,7,5 వీటిలో ఏ నెంబర్ వస్తుందో ప్రజలు తేలుస్తారన్నారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం రావడం చారిత్రక అవసరమన్నారు. ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్స్ కింద పంచిన డబ్బుకు, చేసిన అప్పులకు ఉన్న వ్యత్యాసం ఎక్కడికి పోయింది, ఆ లెక్కల సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు.

ప్రమాదమా లేదా హత్యా.. బరేలీలో సజీవ దహనమైన కుటుంబం

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ అగ్ని ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు ముగ్గురు పిల్లలు చనిపోయారు. ఐదుగురు ఒకే గదిలో పడుకున్నారు. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గది బయటి నుంచి తాళం వేసి కనిపించింది. దీంతో హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం ఐదుగురు మరణించిన తర్వాత కుటుంబంలో పొగమంచు ఉంది. నిజానికి, అజయ్ గుప్తా అలియాస్ టింకిల్ బరేలీలోని ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోని మొహల్లా ఫరఖ్‌పూర్‌లోని బంధువుల ఇంట్లో అద్దెకు నివసిస్తున్నాడు. అతను మిఠాయి పని చేసేవాడు. కుటుంబంతో కలిసి గదిలో నిద్రిస్తున్నాడు. తెల్లవారుజామున ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గది తలుపు బయట నుంచి మూసి తాళం వేసి ఉంది. మొత్తం ఐదు మృతదేహాలు కాలిపోయిన స్థితిలో పడి ఉన్నాయి. గదిలో ఉంచిన వస్తువులన్నీ కాలిపోయాయి.

సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు ప్రారంభం.. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ ఫార్మాట్‌

సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు. అనంతరం సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌ను ప్రధాని ప్రారంభించారు. దీంతో దేశ పౌరులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో డిజిటల్ సుప్రీం కోర్టు నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పులు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ సుప్రీం కోర్టు నివేదికలు (డీజీ ఎస్‌సీఆర్), డిజిటల్ కోర్టులు 2.0, అనంతరం 1950 నుంచి ఉన్న సుప్రీం కోర్టు నివేదికలు, 519 వాల్యూమ్స్ నివేదికలు, 36,308 కేసుల తీర్పులు డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “భారత సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుంది.. ఏడు దశాబ్దాల్లో సుప్రీంకోర్టు ఎన్నో చరిత్రాత్మక తీర్పులనిచ్చింది.. ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాజిక న్యాయానికి సుప్రీంకోర్టు నిరంతరం కృషి చేసింది.. కోర్టుల డిజిటలైజేషన్‌ గొప్ప ముందడుగు.. దేశ పౌరుల హక్కులను కాపాడడంలో సుప్రీంకోర్టుది కీలక పాత్ర.” అని ప్రధాని పేర్కొన్నారు.

ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం.

ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తను ఎక్కడికి వెళ్ళను, రాజకీయ జన్మను ఇచ్చిన సిరిసిల్ల ప్రజలతోనే ఉంటానని తెలిపారు. 24 సంవత్సరాలు పని చేసిన కారుకు, చిన్న సర్వీసింగ్ అవసరం పడదా ? అని ప్రశ్నించారు. ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని తెలిపారు. పద్నాలుగు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామన్నారు. అధికార పార్టీ కంటే కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమే థక్కువ వచ్చాయని అన్నారు. వాళ్ళు 420 హామీలు ఇచ్చి 1.8 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నారు. రైతులు రైతు బందు కోసం ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారని అన్నారు. ఆరున్నర రక్షల మంది ఆటో డ్రైవర్లు రొడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఫ్రీ బస్సుల కోసం మహిళలు పడుతున్న అవస్థలు చూస్తూనే ఉన్నామని అన్నారు.

చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్

చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. తనపై చంద్రబాబు మితిమీరి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. “నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా ?. నీ లాగా మామకు వెన్నుపోటు పొడిచానా ?. చంద్రబాబు నువ్వు అధికారంలోకి రావు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవు. కుప్పంకు మేము నీరు ఇస్తున్నాం… 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏమి చేశావ్. రాజకీయంగా చూసుకోలేక చౌకబారు విమర్శలకు దిగారు. ఓటమి భయంతో చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారు.” అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ అంటున్నారని విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపగానే మద్యపాన నిషేదం ఎత్తివేశారని, రెండు రూపాయల కిలో బియ్యం తీసేశారని పేర్కొన్నారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలు తొలగించారని చెప్పారు.

నితీష్‌కు ప్రధాని ఫోన్.. అభినందనలు తెలిపిన మోడీ

ఏడాది తిరగకుండానే బీహార్ పాలిటిక్స్‌ రివర్స్ అయిపోయాయి. జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు బీజేపీలో తలుపులు మూసుకుపోయాయని సంవత్సరం క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కానీ లోక్‌సభ ఎన్నికల ముందు అంతా మారుమారైపోయాయి. బీజేపీ నుంచి బయటకొచ్చిన కొద్ది రోజులకే నితీష్‌కుమార్ మళ్లీ కమలంతోనే జత కట్టారు. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేశారు. మరోసారి బీజేపీ మద్దతుతో సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే జేడీయూకు మద్దతు తెలుపుతూ బీజేఎల్పీ లేఖను అందజేసింది. దీంతో జేడీయూ-బీజేపీ కూటమితో కూడిన ప్రభుత్వాన్ని ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను నితీష్ కోరగా సాయంత్రం 5 గంటలకు ఆహ్వానించారు.

‘‘ఇది మూన్నాళ్ల ముచ్చటే’’.. బీహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త పీకే సంచలనం..

బీహార్ రాజకీయ పరిణామాల గురించి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్య లు చేశారు. బీజేపీ-జేడీయూ కూటమి ఎక్కువ రోజులు ఉండదని ఆయన అన్నారు. నితీష్ కుమార్, బీజేపీతో కలిసిన కొన్ని గంటల తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. 2025 బీహార్ ఎన్నికల వరకు ఈ కూటమి నిలువదని అన్నారు. ఒక ఏడాది పాటే ఈ కూటమి అధికారంలో ఉంటుందని అన్నారు. ప్రస్తుతం నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ఉంది. ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఉండదు, ఈ విషయాన్ని నేను లిఖితపూర్వకంగా రాసిస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వా ఆరు నెలల్లోనే మార్పు జరుగుతుందని చెప్పారు.

నాసిన్ అకాడమీలో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసిన్ అకాడమీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంస్థలోని క్యాంటీన్ లో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు నాసిన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం పై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవలే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్సిస్ నార్కోటిక్స్ కేంద్రాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు.

కూలీ పనులు చేసే దుస్థితి సర్పంచులది.. ఇదే ప్రజాస్వామ్యమా?

కరీంనగర్‌లో సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు.. నూతన పంచాయతీ భవనాలు ప్రారంభించుకోకుండా సర్క్కులర్ ఇవ్వడమా? అని అన్నారు ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూలీ పనులు చేసే దుస్థితి సర్పంచులది…ఇదే ప్రజాస్వామ్యమా? అని ఆయన ప్రశ్నించారు. నేను సీఎంకు లేఖ రాసినా స్పందన లేదన్నారు బండి సంజయ్‌. బీఆర్ఎస్ మాదిరిగానే జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరికంగా వ్యవహరిస్తోందని, చేసిన పనులకు బిల్లులివ్వరు… కనీసం రికార్డుల్లోకి ఎక్కివ్వరని ఆయన మండిపడ్డారు. ఇట్లయితే సర్పంచులుగా పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని, కాంగ్రెస్ నుండి సర్పంచుగా పోటీ చేయరని, తక్షణమే పెండింగ్ బిల్లలున్నీ మంజూరు చేయండన్నారు బండి సంజయ్‌. నూతన భవనాలను ప్రారంభించుకునే అవకాశం ఇవ్వండని, విపక్షాల నిర్మాణాత్మక సూచనలు పరిగణలోకి తీసుకోండన్నారు. లేనిపక్షంలో మీరు తీసుకున్న గోతిలో మీరే పడతారని, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే నెల రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

ఫిబ్రవరి రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సమావేశాలు 4 రోజుల నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అంచనాలు తెప్పించుకుంది. కాగా.. ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో కీలక ప్రకటనలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

వరంగల్‌కు మంజూరైన సైనిక్ స్కూల్ ను రీ లోకేట్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమ పలుకుబడిని ఉపయోగించి దేశవ్యాప్తంగా ప్రారంభించే 100 సైనిక్ స్కూళ్లలో అదనంగా ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు కొత్తగా విద్యాసంస్థలు తేకున్నా పర్వాలేదు , రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వరంగల్లోనే సైనిక్ స్కూల్ ను నెలకొల్పాలని, గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందన్నారు కడియం శ్రీహరి.