Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ అయింది. స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. దసరా సెలవుల తర్వాతే విచారిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో బెయిల్‌ పిటిషిన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ చేయాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోరారు. వాదనల అనంతరం చంద్రబాబు లాయర్ల అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. ఈ క్రమంలో బెయిల్‌ పిటిషన్‌పై విచారణను దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ చేపట్టనుంది. అదే సమయంలో.. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్‌తో వైద్య పరీక్షలకు హైకోర్టు అనుమతిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరగగా.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన తరఫు లాయర్ సిదదార్థ లూథ్రా కోర్టును కోరారు. ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్‌పై ఉన్నారని.. గడిచిన 40 రోజుల్లో దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని అడిషనల్ అడ్వకేట్‌ జనరల్‌ కోరారు. వాదనలు విన్న ఏపీ హైకోర్టు విచారణను వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

*తెలంగాణ ఎన్నికల నిర్వహణపై ఈసీకి సుప్రీంకోర్టు న్యాయవాదుల ఫిర్యాదు
తెలంగాణ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతున్న వేళ, కొన్ని విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిక్కచ్చిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అని ఆయన తెలిపారు. ముఖ్యంగా 2018లో పోటీ చేసిన అభ్యర్థుల ఆధాయాలు, ఈ ఐదేళ్లలో విపరీతంగా పెరిగి పోయాయని పేర్కొన్నారు. గత అఫిడవిట్, తాజాగా సమర్పించే అఫిడవిట్లను పోల్చి చూడాలి అని చెప్పామని ఆయన వెల్లడించారు. ఈ ఐదేళ్లలో ఆదాయం ఏ విధంగా పెరిగింది.. అక్రమ పద్దతిలోనే, సరైన మార్గంలోనా అనే విషయాన్ని ముందే పరిశీలించాలి అని సుప్రీంకోర్టు లాయర్ జగన్ అన్నారు. చాలా మంది అభ్యర్థులు ఎన్నికల నియమావళి సరిగ్గా ఫాలో కావడం లేదు.. పైగా డబ్బులు, మద్యం పంచడం తెలంగాణలో నార్మల్ అయింది.. ఎన్నికలను ప్రహాసంగా మారుస్తున్నారు అని ఆయన ఆరోపించారు. దయచేసి డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టి ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే.. ప్రస్తుత సమయంలో ఎన్నికల అధికారుల నిఘా చాలా కీలకం.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు.. ఓట్ల కోసం ప్రకటనలు చేసే పత్రికలు, టీవీల్లోనే క్రిమినల్ కేసులపై కూడా ప్రకటనలు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ డిమాండ్ చేశారు.

*వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున వైఎస్సార్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు ప్రకటించబడ్డాయి. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసిన స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. ఎంపికైన వారి జాబితాను కమిటీ వెల్లడించింది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న వ్యక్తులు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా అవార్డులు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఒకటిన ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరగనుంది. వరుసగా మూడో సంవత్సరం, రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డుల్ని కమిటీ ప్రకటించింది. కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్, జీ.వి.డి.కృష్ణమోహన్‌తో పాటు ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి, వివిధ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది 27 అవార్డుల్ని సిఫారసు చేసి, ముఖ్యమంత్రి ఆమోదం మేరకు కమిటీ ఈ ప్రకటన చేసింది. ఈ రోజు ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైయస్సార్‌ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు; 4 ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ఉన్నాయి.

*మళ్లీ రిమాండ్‌ పొడిగించిన కోర్టు.. అప్పటి వరకు జైలులోనే చంద్రబాబు
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది ఏసీబీ న్యాయస్థానం.. ఈ కేసులో గతంలో విధించిన రిమాండ్‌ ఇవాళ్టితో ముగుస్తోన్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా విజయవాడలోని ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అయితే, చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్‌ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు.. జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు.. అయితే.. ఏమైనా అనుమానాలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. అదే విధంగా చంద్రబాబు రాసే లేఖను తనకు పంపించాలని రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారులను ఆదేశించింది ఏసీబీ కోర్టు.. ఇక, హైకోర్టులో స్కిల్‌ కేసు బెయిల్‌ పెండింగ్‌లో ఉందని ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. అదే విధంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టులు ఇవ్వడం లేదని ఏసీబీ కోర్టులో మెమో ఫైల్‌ చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జడ్జి ఆరా తీశారు. ఆయన మెడికల్‌ రిపోర్టులను ఎప్పటికప్పుడు అందించాలని జైలు అధికారులను ఆదేశించింది ఏసీబీ కోర్టు. మొత్తంగా.. స్కిల్‌ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్‌ 1వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.

*రాహుల్ గాంధీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదు
జగిత్యాల పట్టణంలోని 22 వార్డ్ అరవింద్ నగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే లిక్కర్ రాణి బతుకమ్మ మీద గౌరమ్మకు బదులు విస్కీ బాటిల్ పెట్టి బతుకమ్మ ఆడుతాదని కవిత ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడారు. ఎంపీగా కవితకు ముత్యంపేట, భోధన్ చక్కెర ఫ్యాక్తరీలు మూసివేయించిన ఘనత దక్కింది అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెదల కోసం జగిత్యాలలో సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వస్తాను అని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. జగిత్యాల మున్సిపాలటీల్లో అమలు చేస్తున్న మాదిరిగానే తెలంగాణాలో చిరు వ్యాపారులకు తై బజార్ పన్ను రద్దు చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడు.. దేశ వ్యాప్తంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్ని మతాలను ఏకం చేయడం కోసం భారత్ జోడో యాత్ర చేపట్టిన మహానేత రాహుల్ అంటూ ఆయన కోనియాడరు. రాహుల్ గాంధీని విమర్శించే హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదు.. కవిత ఎంపీగా ఉండి జగిత్యాలకు ఏం చేశావని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాలలో నేను చేసిన అభివృద్ధిని చూసి మంత్రి కేటీఆర్ నన్ను అనుసరించి సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఏం చేశారాని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు.. కదా ఇక్కడ జరిగిన అభివృద్ధి సిద్ధిపేట, సిరిసిల్లలో జరిగిందా అని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు.

*రామప్ప అభివృద్ధి చేసింది మేమే.. రాహుల్, ప్రియాంక.. మోడీకి థ్యాంక్స్ చెప్పాలి..
రామప్ప అభివృద్ధి చేసింది సీఎం మోడీ అని బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు..రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎం మోడీకి ధన్యవాదాలు తెలపాలని, రామప్ప దేవాలయాన్ని పీఎం అభివృద్ధి చేశారని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్, ప్రియాంక లు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్ కు జ్ఞాపక శక్తి తగ్గినట్లు ఉందని, రాహుల్ కు మతిమరుపు పెరిగిందని అన్నారు. వాస్తవాలు మర్చి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కు కొన్ని ప్రశ్నలు అడుగుతున్న.. రాహుల్ కు దమ్ము దైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. 2004లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టు కాలేదా? అధికారం పంచుకోలేదా? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉంటే కేసీఆర్ కేంద్ర మంత్రిగా లేరా? రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ లో టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులు కాలేదా? 2014 లో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మేల్యేలు.. ఏ పార్టీలోకి వెళ్లి చేరారు? ఎవరికి ఓటు వేస్తే ఎవరికి లాభం జరిగింది? కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మేల్యేలు టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు మడుగులు వత్త లేదా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ జాబితా సిద్దం కాగానే చెప్తామని అన్నారు. రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గతం అన్నారు. సస్పెన్స్ ఎత్తివేస్తే రాజాసింగ్ పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమవుతామని తెలిపారు. అభ్యర్థుల కసరత్తు ప్రారంభం చేశామన్నారు. ఎవరికి ఎవరు బిటిమ్.. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బిటీమ్ అన్నారు. 2013 లో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో మెర్జ్ చేసేందుకు చర్చలు జరగలేదా? అని ప్రశ్నించారు. ఎవరికి ఎవరు బిటిమో రాహుల్ చెప్పాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ పై ఓటుకు నోటు కేసు ఏమయింది? ఎందుకు తొక్కి పెట్టారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మధ్యవర్తిగా మజ్లిస్ ను పెట్టుకున్నారని మండిపడ్డారు. మూడు పార్టీలు కలిసి అట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీల DNA ఒక్కటే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి అవగాహనతో మూడు పార్టీలు పని చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాహుల్ చర్చలు సిద్దమా? అని సవాల్ విసిరారు. డిల్లీ ఐనా, హైదరాబాద్ అయినా రాహుల్ తో నేను చర్చకు సిద్దం అని అన్నారు.

*నిజమే నిజం గెలుస్తుంది.. అందుకే చంద్రబాబు జైల్లో..!
చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ వరుస కార్యక్రమాలకు సిద్ధం అవుతుంది.. ఈ నేపథ్యంలో.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర చేయనున్నారని ప్రకటించారు.. లోకేష్ యువగళం యాత్ర ఆపేస్తున్నారని ఆ పార్టీ ప్రకటించింది.. నిజమే.. అందరం నిజం గెలవాలనే కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి నిజం గెలుస్తుంది.. కాబట్టే, చంద్రబాబు జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. గత 45 రోజుల నుంచి నిజమే గెలుస్తోందన్న ఆయన.. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు నిజమే గెలుస్తోందన్నారు. నిజం గెలవాలని కోరుకుంటున్న వారు 17ఏ ని పెట్టుకుని ఎందుకు పాకులాడుతున్నారు? 17ఏ సాంకేతిక అంశాన్ని అడ్డం పెట్టుకుని నిజాన్ని ఎందుకు తొక్కి పెట్టాలని అనుకుంటున్నారు? అంటూ నిలదీశారు. ఇక, చంద్రబాబు అరెస్టు అయితే 105 మంది గుండెలు పగిలి చనిపోయారట.. ఇది పెద్ద జోక్ గా అభివర్ణించారు అంబటి.. చంద్రబాబు వల్ల చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయి.. ఎన్టీఆర్ ఆత్మ, నందమూరి హరికృష్ణ, రంగా పింగళి దశరధరామ, గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు వల్ల చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయన్నారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తాను అన్న బాలకృష్ణ ఇంత వరకు ఎందుకు వెళ్లలేదు..? ఇప్పుడు భువనేశ్వరి పరామర్శిస్తారు అని ఎందుకు అంటున్నారు? ములాఖాత్ లో ఏ కుట్ర జరిగింది? అని అనుమానాలు వ్యక్తం చేశారు. తమకే భవిష్యత్తులేని వాళ్లు ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తారట.. క్వాష్ ఎలాగూ రాదు.. బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదని న్యాయవాదులు చెప్పేసినట్లు ఉన్నారు.. అందుకే భువనేశ్వరి, లోకేష్ యాత్రల అంటున్నారు అని ఎద్దేవా చేశారు. ఇక, టీడీపీ నేతలు గవర్నర్ ను, కేంద్ర హోం మంత్రి ని కలవటం డ్రామాగా అభివర్ణించారు అంబటి.. ఇది చాలా సీరియస్ కేసు.. చట్టానికి వ్యతిరేకంగా వారు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు.. విచారణను చంద్రబాబు ఎదుర్కోవలసిందే అన్నారు. మరోవైపు.. పవన్ కల్యాణ్‌, బీజేపీ కలిసి ఉన్నాయా లేవా అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఇక్కడ టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటాడు? అని ప్రశ్నించారు. పవన్ రాజకీయాలకు పనికి రాడు.. ఒకరితో ఉంటూ వేరే వారి వ్యవహారం చేయటం పవన్ కు అలవాటే అని విమర్శించారు. జైలుకు వెళ్లి టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్‌ తర్వాత ఎందుకు స్పందించడం లేదు? అని నిలదీశారు. రాజకీయాల్లో కూడా నైతిక విలువలు లేని వ్యక్తి పవన్ కల్యాణ్‌ అని మండిపడ్డారు. పవన్ ను నమ్మవద్దని కాపు సోదరులను కోరుతున్నాను అన్నారు మంత్రి అంబటి రాంబాబు.

 

*ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదం.. భారత వైఖరిపై కాంగ్రెస్ అసంతృప్తి..
ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో విమర్శించారు. పాలస్తీనాపై భారత్ అవలంభిస్తున్న వైఖరి తీవ్రంగా నిరాశపరించిందని అన్నారు. అమాయకులు, నిస్సహాయులైన మహిళలు, పిల్లలు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్నప్పుడు బలమైన వైఖరి లేకుండా భారతదేశం ఎలా నిలబడగలదు..? ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై భారత ప్రభుత్వం వైఖరి తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. ఈ వివాదంపై మొదటి నుంచి భారత్ విధానం భిన్నంగా ఉందని ఆయన ఆరోపించారు. భారతదేశం పాలస్తీనా వాదానికి మద్దతు ఇస్తుందని, వారి హక్కుల కోసం పోరాడిందని కేసీ వేణుగోపాల్ ఫేస్‌బుక్ లో మలయాళంలో పోస్టు చేశారు. దురాక్రమణ, ప్రతిదాడుల విషయంలో భారత్ తీవ్రంగా ఖండించేది, అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుత భారత వైఖరి యుద్ధం ముగించడానికి సరిపోదని అన్నారు. ఇంతే కాకుండా గతంలో మాదిరిగా ఈ అంశంపై ప్రభుత్వం అభిప్రాయాలను గౌరవంగా, మర్యాదగా తెలియజేయాలని ఆయన కోరారు. ఇజ్రాయిల్, పాలస్తీనా అనే తేడా లేకుండా రెండు దేశాలు అంతర్జాతీయ మానవతా చట్టాలకు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. ఇజ్రాయిల్ లో మహిళలు, పిల్లలు, బలహీన పౌరులపై హమాస్ చేసిన చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేమని, అయితే అలాంటి పరిస్థితులకు దారి తీసిన చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించడం చాలా అవసమని ఆయన అన్నారు. గాజాను పూర్తిగా తుడిచపెట్టేందుకు ఇజ్రాయిల్ చేస్తున్న క్రూరమైన దాడులకు కొన్ని దేశాలు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని, వాటి వెనక భారత్ నిలబడవద్దని కాంగ్రెస్ ఎంపీ కోరారు. ఈ యుద్ధం ముగించి, శాంతి నెలకొల్పేందుకు భారత్ నాయకత్వం వహించాలని వేణుగోపాల్ అన్నారు. ప్రపంచం భారత్ నుంచి ఆశించే పరిణితి చెందిన గౌరవప్రదమైన వైఖరని వేణుగోపాల్ అన్నారు. అంతకుమందు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై కేంద్ర వైఖరిని ఉద్దేశిస్తూ ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆదివారం విమర్శలు గుప్పించారు.

*మహిళల ప్రీమియర్ లీగ్ కోసం జట్లు ఆటగాళ్ల జాబితా విడుదల
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్‌లోని మొత్తం ఐదు జట్లు ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అందులో 60 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. 29 మంది ఆటగాళ్లు విడుదలయ్యారు. రిలీజ్ చేసిన వారిలో పెద్ద బ్యాట్స్ మెన్లు కూడా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ ఈ జాబితాను విడుదల చేశాయి.
యూపీ వారియర్స్ అలిస్సా హీలీ, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్‌లను అట్టిపెట్టుకుంది. బెంగుళూరు జట్టులో అలిస్ పెర్రీ, హీథర్ నైట్, రేణుకా సింగ్‌ కొనసాగుతున్నారు. ముంబై జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్, అమంజోత్ కౌర్‌లను రిటైన్ చేసుకుంది. గార్డనర్‌ గుజరాత్ జట్టులో కొనసాగుతుండగా.. అన్నాబెల్ సదర్లాండ్‌ను విడుదల చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్-(రిటైన్డ్ ప్లేయర్లు): అలిస్ క్యాప్సే, అరుంధతీ రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జొనాసెన్, లారా హారిస్, మరిజన్ కాప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తాన్యా భాటియా, టిటాస్ సాధు.
విడుదలైన ప్లేయర్లు: అపర్ణ మండల్, జసియా అక్తర్, తారా నోరిస్*.
గుజరాత్ జెయింట్స్ -(రిటైన్డ్ ప్లేయర్లు): ఆష్లే గార్డనర్*, బెత్ మూనీ*, డేలాన్ హేమ్లత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్ట్*, షబ్నమ్ షకీల్, స్నేహ్ రాణా, తనూజా కన్వర్.
రిలీజైన ప్లేయర్లు: అన్నాబెల్ సదర్లాండ్*, అశ్వనీ కుమారి, జార్జియా వేర్‌హామ్*, హర్లీ గాలా, కిమ్ గార్త్*, మాన్సీ జోషి, మోనికా పటేల్, పరునికా సిసోడియా, సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ*, సుష్మా వర్మ.
ముంబై ఇండియన్స్ -(రిటైన్డ్ ప్లేయర్లు): అమంజోత్ కౌర్, అమేలియా కెర్*, క్లో ట్రయాన్*, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్*, హుమైరా కాజీ, ఇసాబెల్లె వాంగ్*, జింటిమణి కలితా, నటాలీ స్కివర్*, పూజా వస్త్రాకర్, ప్రియాంక బాలా, సైకా ఇషాక్, యస్తికా భాటియా.
రిలీజైన ప్లేయర్లు: ధారా గుజ్జర్, హీథర్ గ్రాహం*, నీలం బిష్త్, సోనమ్ యాదవ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు -(రిటైన్డ్ ప్లేయర్లు): ఆశా శోభన, దిశా కస్సట్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, ఇంద్రాణి రాయ్, కనికా అహుజా, రేణుకా సింగ్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, స్మృతి మంధాన, సోఫీ డివైన్*
రిలీజైన ప్లేయర్లు: డేన్ వాన్ నీకెర్క్, ఎరిన్ బర్న్స్, కోమల్ జంజాద్, మేగాన్ షుట్, పూనమ్ ఖేమ్నార్, ప్రీతి బోస్, సహానా పవార్
యూపీ వారియర్స్-(రిటైన్డ్ ప్లేయర్లు): అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్శ్వి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్, ఎస్. యశశ్రీ, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్
రిలీజైన ప్లేయర్లు: దేవికా వైద్య, షబ్నిమ్ ఇస్మాయిల్*, శివలీ షిండే, సిమ్రాన్ షేక్

Exit mobile version