Site icon NTV Telugu

Top Headlines@1PM: టాప్‌ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

ఢిల్లీకి సీఎం రేవంత్‌.. ఆ జాబితాపై హైకమాండ్‌తో భేటీ
పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నేతలతో వరుసగా భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీపై రేవంత్ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. ఇక, బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీలోకి వస్తున్న కొత్త వారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్‌ రాని సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టిక్కెట్‌ విషయంలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఎంపీ టికెట్ దక్కని వారిని కార్పొరేషన్ బుజ్జగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానంతో ఈ అంశాలపై చర్చించేందుకు సీఎం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో లోక్‌సభ అభ్యర్థులపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 11 మంది మంత్రులకు శాఖలను కేటాయించింది. మరో ఆరు ఖాళీల భర్తీకి మంత్రివర్గ విస్తరణ పూర్తి కానుంది.

ఆ.. జీవోను తక్షణమే వెనక్కి తీసుకోండి.. ఖర్గే కు ఎంఎల్‌సీ కవిత లేఖ
AICC అధ్యక్షుడు ఖర్గే కు లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో నమోదు చేసుకున్నారు. అంటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలి. ఈ స్పూర్తిని పక్కనబెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ విషయంలో తమరు జోక్యం చేసుకొని ఈ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

మేడారం భక్తులకు బిగ్ షాక్.. బస్సుల్లో కోళ్లు , గొర్రెలకు ప్రవేశం లేదన్నసజ్జనార్
మేడారం మహాజాతర అంటే చాలా మంది భక్తులు కోళ్లు, గొర్రెలు, మేకలను అమ్మవార్లకు మొక్కుగా సమర్పిస్తారు. మేడారం బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు లైవ్ స్టాక్ ఎంట్రీ లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకురాకుండా భక్తులు సహకరించాలని సజ్జనార్ కోరారు. మేడారం జాతర నేపథ్యంలో వరంగల్‌లోని జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కళాశాలలో మండల శిక్షణ కళాశాల, ఆర్టీసీ రాష్ట్ర స్థాయి అధికారులు, సిబ్బందితో మేడారం జాతర సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సజ్జనార్ హాజరై మేడారం జాతరకు ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మేడారం జాతర నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి ఆయా బస్సులు నడపనున్నట్లు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని, ఈసారి మొత్తం 30 లక్షల మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆయన అంచనా వేశారు.

టీడీపీ- వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. ఈసారి రాకపోతే
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ మరో కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. వైసీపీ- టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారం నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు పార్టీల రెబల్ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విచారణకు రావాల్సిందిగా ఇవాళ అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌లు నోటీసులు ఇచ్చారు. ఇదే ఫైనల్ విచారణ నోటీసులని తెలిపింది.. హాజరుకాకుంటే అనర్హతపై తుది నిర్ణయం తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తమకు వివరణ ఇవ్వాలని స్పీకర్ తెలిపారు. అలాగే, మూడు గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాలని పేర్కొనింది. ఇక, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆనం రామనారాయణరెడ్డికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. సాయంత్రం 4గంటలకు విచారణ ఉంటుంది.. రాకపోతే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పీకర్‌ తమ్మినేని సీతారం స్పష్టం చేశారు. కానీ, ఆనంతో సహా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తాము ఈ రోజు విచారణకు హాజరు కావడం లేదని స్పీకర్ కు సమాధానం ఇస్తూ లేఖ రాశారు.

పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ లో మార్పులు..
జనసేన అధినే పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ లో స్పల్ప మార్పులు జరిగాయి. ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు జనసేనాని విశాఖలోనే ఉండనున్నారు. అలాగే, నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. ఇక, ఆశావహులు కు వన్ టు వన్ ఇంటర్వ్యూలో అధ్యక్షుడు క్లారిటీ ఇస్తున్నారు. కాగా, పొత్తుల కారణంగా ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవచ్చు అని వారికి తెలియజేస్తున్నారు. ఎక్కువ మందికి అవకాశం వస్తుంది.. ఎవ్వరూ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు. అయితే, ఎన్నికల తర్వాత అందరికీ సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే పార్టీలోని ముఖ్య నేతలను ఆయన భేటీ అవుతున్నారు.

మూడో సారి మోదీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారు..
ఎన్నికల ముందే కాంగ్రెస్ కాడ ఎత్తేసిందని, మూడో సారి మోదీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ K.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కన్వెన్షన్ లో దేశ వ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేశారన్నారు. రానున్న వంద రోజుల్లో బీజేపీ కార్యాచరణను స్పష్టం చేశారన్నారు. బీజేపీ 370 స్థానాలు రానున్న ఎన్నికల్లో గెలవనుందన్నారు. ఎన్డీయే తో కలిపి 400 సీట్లకు పైగా గెలవటం ఖాయమన్నారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ కాడ ఎత్తేసిందన్నారు. మూడో సారి మోడీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలు మహాభారత యుద్ధమన్నారు. విపక్షాలు కౌరవ సైన్యంగా ఉంటే వాళ్ళను మోడీ నేతృత్వంలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. రాహుల్ భారత్ జోడో కాదు కాంగ్రెస్ జొడో చేపడితే కరెక్ట్ అన్నారు. ఇండియా కూటమి నుంచి పార్టీలు బయటకు వస్తున్నాయన్నారు. మోడీ అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు.

2024లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు ఇవే..! ఇండియా ర్యాంక్ ఎంతంటే..?
024లో ప్రపంచంలోని బలమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ నెల ప్రారంభంలో విడుదల చేసింది. భౌగోళిక రాజకీయాలలో దేశం యొక్క శక్తిని కొలవడానికి ఒక దేశం యొక్క పాస్‌పోర్ట్ యొక్క బలం ఒక ముఖ్యమైన పద్ధతి. శక్తివంతమైన పాస్‌పోర్ట్ కలిగి ఉండటం వల్ల పౌరులు వీసా అవసరం లేకుండా ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే, ఈ సంవత్సరం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ మరియు సింగపూర్‌లు జాబితాలో 1వ ర్యాంక్‌ను సాధించాయి. ఇక, ఈ సంవత్సరం భారతదేశం 85వ ర్యాంక్‌కు పడిపోయింది. 2023లో తన పౌరులకు వీసా రహిత యాక్సెస్‌ను 60 నుంచి 62కి పెంచినప్పటికీ.. గత సంవత్సరం కంటే ఒక ర్యాంక్ దిగజారింది. ప్రస్తుతం భారత్ ఒక ర్యాంక్ కోల్పోవడంతో బంగ్లాదేశ్‌తో సమానంగా ఉంది. మరోవైపు ఈ ఏడాది 101 నుంచి 102కి పడిపోయింది. మాల్దీవులు 58వ స్థానంలో ఉంది. అయితే, అనేక యూరోపియన్ దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను మంజూరు చేసిన తర్వాత చైనా ఈ సంవత్సరం 66 నుంచి 64కి పెరిగింది.

మేం అయోమయానికి గురయ్యాం.. ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు: బెన్‌ స్టోక్స్
రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ‘అంపైర్స్‌ కాల్’ వల్ల తాము నష్టపోయాం అని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్ తెలిపాడు. హాక్‌ఐ టెక్నాలజీ ఇంకా మెరుగైతే బాగుంటుందనిపించిందని, అంపైర్స్‌ కాల్ గురించి ఎవరినీ బ్లేమ్ చేయడం లేదన్నాడు. డీఆర్‌ఎస్‌పై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్టోక్స్ సూచించాడు. ఆదివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 434 పరుగుల భారీ తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం బెన్‌ స్టోక్స్ మాట్లాడుతూ అంపైర్స్‌ కాల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు.’జాక్‌ క్రాలే డీఆర్‌ఎస్‌ను ఓసారి గమనిస్తే బంతి వికెట్ల పైనుంచి వెళ్తున్నట్లు ఉంది. అంపైర్స్‌ కాల్ కాబట్టి అతడు పెవిలియన్‌కు చేరాడు. బంతి స్టంప్స్‌ను తాకినట్టే లేదు. మేం అయోమయానికి గురయ్యాం. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. హాక్‌ఐ టెక్నాలజీ ఇంకా మెరుగైతే బాగుంటుందని నాకనిపించింది. అయితే దీని గురించి ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. మేం మూడుసార్లు అంపైర్స్‌ కాల్ వల్ల నష్టపోయాం. అంపైర్స్‌ కాల్ సరైందా? కాదా? అనేది పక్కన పెడితే మేం మాత్రం వికెట్లు కోల్పోయాం’ అని బెన్‌ స్టోక్స్ అన్నాడు.

ఊరు పేరు భైరవకోన ‘ 3రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. అయితే ఈ హీరో ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయ్యింది.. తాజాగా ‘ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమా నిన్న విడుదలైంది.. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా ఈ మూవీని నిర్మించారు.. ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగానే లభించింది. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మరి సందీప్ ‘ఊరు పేరు భైరవకోన’ మూడు రోజుల్లో ఎంత కలెక్షన్లను రాబాట్టిందో చూద్దాం.. వీఐ ఆనంద్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమానే ‘ఊరు పేరు భైరవకోన’. ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ను అందించారు.. ఈ సినిమాలో ప్రముఖులు కీలక పాత్రలో నటించారు.. ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరిగింది.. ఇక కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి..

Exit mobile version