Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పెళ్లి నిశ్చితార్థం ముందు స్నేహితుడి హత్య చూసి జీవితాన్ని విడిచిన యువకుడు

సికింద్రాబాద్‌లోని వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక విషాద సంఘటన కలకలం రేపింది. మయ్ 4న నిశ్చితార్థం జరగాల్సిన యువకుడు, తన మిత్రుడు హత్యకు గురవడం చూసి తీవ్ర మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు ఒక్కరోజే చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. బౌద్ధనగర్‌కు చెందిన మోహన్ కృష్ణ అనే బైక్ మెకానిక్‌కు పెళ్లి నిశ్చితార్థం మే 4న జరగాల్సి ఉంది. అయితే, నిశ్చితార్థానికి ముందు అంటే ఏప్రిల్ 27 రాత్రి మోహన్ తన స్నేహితులు శ్యాంసన్ రాజు, మరికొందరితో కలిసి మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీ సమయంలో శ్యాంసన్ రాజు , అతని బావ లూథరస్ మధ్య తీవ్ర మాటల తూటాలు పేలాయి. తీవ్రంగా చినగిపోయిన గొడవలో, లూథరస్ తన బావ శ్యాంసన్ రాజును ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో శ్యాంసన్ స్పాట్‌లోనే మృతిచెందాడు.

సింహాచలం ఘటన దురదృష్టకరం

సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సింహాచలంలో గోడ కూలి క్యూ‌లైన్‌లో ఉన్న భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. భారీ వర్షాలు కారణంగా గోడ కూలిందని అధికారులు చెప్పినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్‌కల్యాణ్ సూచించారు.

బంగారం ధరలు పెరిగినా తగ్గేదేలే.. అక్షయ తృతీయ నాడు వేల కోట్ల వ్యాపారం!

అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం కలుగుతుందని.. సంపద పెరుగుతుందని భావిస్తుంటారు. అక్షయ తృతీయ నాడు గోల్డ్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. తులం బంగారం ధర ఏకంగా లక్షను తాకింది. దీంతో బంగారం కొనేందుకు గోల్డ్ లవర్స్ ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ, అక్షయ తృతీయ సందర్భంగా నేడు దేశీయ ఆభరణాల విపణిలో దాదాపు రూ. 16 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది.

సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం

సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఇక పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖ జిల్లా సింహాచలంలో భారీ వర్షం కురిసింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం కారణంగా గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

సింహాచలం ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసింది

సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాద ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స జరుగుతోందని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులకైనా తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు.

వేలం పేరుతో వృద్ధురాలిని మోసగించిన నాగేశ్వర శర్మ.. రూ.5.71 కోట్ల స్వాహా

హబ్సిగూడకు చెందిన ఓ వృద్ధురాలు అశ్రద్ధగా నమ్మిన పరిచయం ఆమె జీవిత savingsనే గుబ్బుచేసింది. 2022లో ఆమెకు నాగేశ్వర శర్మ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఆస్తుల విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తున్నానని చెప్పిన అతను, బ్యాంక్ వేలంలో బంగారం, ఫ్లాట్లు, కార్లు తక్కువ ధరకే లభిస్తాయని వృద్ధురాలిని నమ్మబలికాడు. వృద్ధురాలి నమ్మకాన్ని పూర్తిగా పొందిన నాగేశ్వర శర్మ, ఆమెకు నాలుగు ఫ్లాట్లు, నాలుగు ప్లాట్లు, రెండు కార్లు వేలం ద్వారా ఇప్పించగలనని వాగ్దానం చేశాడు. దీనిపై నకిలీ డాక్యుమెంట్లు కూడా చూపించాడు.

వేసవి సెలవులకు అనుకూలంగా 8 స్పెషల్ ట్రైన్లు..

వేసవి సెలవుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు టూర్లకు, పుణ్యక్షేత్రాల దర్శనాలకు పెద్ద సంఖ్యలో ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిన వేళ, దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి దిశగా వెళ్లే ప్రయాణికుల కోసం మొత్తం 8 స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ట్రైన్ నెం. 07257.. మే 8 నుంచి 29 వరకు, ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి రవాణా అవుతుంది. ట్రైన్ నెం. 07258.. మే 9 నుంచి 30 వరకు, ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చర్లపల్లి జంక్షన్‌కు తిరుగు ప్రయాణం చేస్తుంది. ఈ స్పెషల్ ట్రైన్లు సనత్‌నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సెడాం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్పెషల్ సర్వీసుల ద్వారా వేసవి రద్దీలో తిరుమల వెళ్లే భక్తులకు గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది.

విశాఖకు వర్ష సూచన.. సింహాచలంలో వేగంగా దర్శనాలు

విశాఖకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. దీంతో సింహాచలం ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవానికి భక్తులు క్యూకట్టారు. వర్ష సూచన నేపథ్యంలో భక్తులకు వేగంగా దర్శనాలు చేయిపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక వాలంటీర్లు కూడా వేగంగా దర్శనాలు చేయిపిస్తున్నారు.

భారత్ వీడిన 786 మంది పాక్ జాతీయులు..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాక్ పై దౌత్య దాడికి దిగి కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 24న పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 27లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ప్రకటించింది. వైద్య వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు గడువునిచ్చింది. దౌత్య, అధికారిక, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని ‘లీవ్ ఇండియా’ నోటీసు నుంచి మినహాయించారు. స్వల్పకాలిక వీసాల 12 వర్గాలలో దేనినైనా కలిగి ఉన్న పాకిస్తానీయుల గడువు ఆదివారంతో ముగిసింది.

అజారుద్దీన్ కి ఊరట.. హైకోర్టు కీలక ఆదేశం

అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్‌సీఏను హైకోర్టు ఆదేశించింది. నార్త్ స్టాండ్స్‌కు ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు.

 

Exit mobile version