NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

అయిదు రోజుల పాటు షూటింగ్… 1న బ్రేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ పెరగడంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసి అగ్రెసివ్ గా క్యాంపైన్స్ చేస్తున్నాడు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. పొలిటికల్ ప్లాన్స్ వేస్తూనే సినిమా పనులు కూడా చేస్తున్న పవన్ కళ్యాణ్… ఉస్తాద్ భగత్ సినిమా షూటింగ్ కి మళ్లీ డేట్స్ కేటాయించాడు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. ఇన్ని రోజులు షెడ్యూల్ బ్రేక్ లో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు నుంచి అయిదు రోజుల పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడట.

సీఎం చెప్పిన మాట ప్రకారం.. సీజన్‌కు ముందే గిట్టుబాటు ధర: మంత్రి కాకాణి

వ్యవసాయ మద్దతు ధరల పోస్టర్‌ను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సహా పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం.. సీజన్‌కు ముందే గిట్టుబాటు ధరను ప్రకటిస్తున్నామని మంత్రి కాకాణి తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా రూప కల్పన చేశామని చెప్పారు.

వ్యవసాయ మద్దతు ధరల పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘సీఎం చెప్పిన మాట ప్రకారం ఈ వ్యవసాయ సీజన్‌కు ముందే గిట్టుబాటు ధరను ప్రకటిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా రూప కల్పన చేశాం.

మణిపుర్‌లో ఘోరం.. జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య! పిక్స్ వైరల్

మణిపుర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గత జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాతుల మధ్య వైరం కారణంగా అల్లర్లతో మణిపుర్‌ అట్టుడికిపోయిన సమయంలో ఈ ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు.

మణిపుర్‌ అల్లర్ల అనంతరం జులై 6వ తేదీన ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో.. అమ్మాయి నీట్‌ కోచింగ్‌ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పరిస్థితులు బాగానే ఉన్నాయని భావించిన ఆమె.. తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లింది. అప్పటి నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్‌ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యిందని పోలీసులు అప్పుడు వెల్లడించారు. దాదాపుగా మూడు నెలల అనంతరం ఇద్దరు విద్యార్థుల దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది.

రేపే తెలంగాణ టెట్‌- 2023 ఫలితాలు విడుదల..

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ఫలితాలు రేపు (సెప్టెంబర్‌ 27) విడుదల చేయనున్నారు. ఇప్పటికే టెట్‌ పరీక్ష కు సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఫైనల్ ఆన్సర్‌ కీ తో పాటు ఫలితాలను కూడా బుధవారం విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు.నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టెట్‌కు హాజరైన అభ్యర్ధులు సెప్టెంబర్‌ 27వ తేదీన తుది ‘కీ’ తో పాటు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు.అయితే టెట్‌ పరీక్ష పేపర్‌-1కు దాదాపు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.అలాగే పేపర్‌ 2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే.. వారిలో 1,89,963 మంది అంటే 91.11 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే.

క్రికెట్‌లో మేం స్వర్ణం గెలిచాం.. ఇక మీ వంతు: జెమీమా

భారత మహిళా క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా గేమ్స్ 2023 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఫైనల్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్‌ (42) రాణించారు. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసింది. భారత యువ పేసర్ టిటాస్‌ సాధు 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది.

ఆసియా గేమ్స్ 2023లో జెమీమా రోడ్రిగ్స్‌ టాప్‌ స్కోరర్‌. మూడు మ్యాచుల్లో జెమీమా 109 పరుగులు చేసింది. ఫైనల్‌లో కీలక సమయంలో 42 పరుగులు చేసి జట్టు మంచి స్కోర్ సాధించేందుకు దోహదపడింది. గోల్డ్ మెడల్‌ అందుకున్న తర్వాత జెమీమా మాట్లాడుతూ భారత పురుషుల జట్టుకూ ఓ సందేశం పంపింది. ‘ఇక మనం భారత పురుషుల క్రికెట్‌ జట్టు గురించి మాట్లాడుదాం. వారికి ఒకటే విజ్ఞప్తి.. మేం స్వర్ణం గెలిచాం, ఇక మీ వంతు. మీరు కూడా ఆసియా గేమ్స్ 2023లో గోల్డ్‌ మెడల్‌ సాదించాలి అని జెమీమా ‘కోరింది.

దేశవ్యాప్తంగా ఆరోగ్య ప్రగతిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది

నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో మొదటి మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ తన పదేళ్ల నివేదిక కార్డును విడుదల చేసింది. “2014లో మేము 11వ ర్యాంక్‌లో ఉన్నాము. ఇప్పుడు మేము మూడవ స్థానంలో ఉన్నాము. త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటాం’’ అని హరీష్‌ రావు వైద్య సిబ్బందికి ఆ శాఖ విజయాన్ని అందించారు. పీజీ మెడికల్ సీట్లలో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఆరోగ్య సంరక్షణ సేవలకు రూ.12,364 కోట్ల బడ్జెట్‌ కేటాయించామని, పీజీ మెడికల్‌ సీట్లలో రాష్ట్రం రెండో స్థానానికి చేరుకుందని, గత తొమ్మిదేళ్లలో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీల జోడింపుతో మెడికల్‌ సీట్లు 2850 నుంచి 8515కు పెరిగాయని హరీష్‌ రావు తెలిపారు.

ఏంటి బ్రో అరాచకం.. మరీ ఇంత దారుణమా.. చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..

ఈ మధ్య మెట్రోలో డ్యాన్స్ లు ఎక్కువయ్యాయి.. మొన్నటివరకు ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు.. చాలా చోట్ల మనం మెట్రో డ్యాన్స్ లను చూస్తున్నాం.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం.. తాజాగా మరో మెట్రో డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. వారిలో ఎక్కువ మంది ఈ యువకుడి నమ్మకాన్ని అభినందిస్తూ వ్యాఖ్యానించారు. కాగా, ఈ సన్నివేశాన్ని లండన్‌లో చిత్రీకరించారు. మెట్రో రైలులో ఓ యువకుడు డ్యాన్స్ చేశాడు. ఈ యువకుడు బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ సూపర్‌హిట్ పాట ఛైయ్యా చయ్యాకి స్టెప్పులేశాడు. మెట్రోలోని వివిధ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్ క్లిప్‌లను కలిపి ఎడిట్‌ చేసిన వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తున్నాడు..

భారతదేశం ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా అవతరించింది

బషీరాబాగ్, కింగ్‌కోఠి లోని భారతీయ విద్యాభవన్, కులపతి మున్షీ సదన్” లో జరిగిన 9వ “రోజ్ గార్ మేళా” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు కిషన్ రెడ్డి. AIIMS, SBI, BDL FCI, Mannu, హైదరాబాద్ యూనివర్సిటీ లతో కలిపి మొత్తం 12 శాఖల్లోని వివిధ విభాగాల్లో 238 మంది అభ్యర్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్​మెంట్ లెటర్స్ అందించారు. నేడు జరిగిన 9వ రోజ్‌గార్ మేళాతో కలుపుకుని మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 6లక్షలకు పైగా యువత ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు అపాయింట్‌మెంట్ లెటర్స్ పొందారు.

గణేష్ నిమజ్జన వేళ రేపు ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

వినాయక నిమజ్జనం పురస్కరించుకొని నగరంలో శోభాయాత్ర నిర్వహించబడుతోంది. కావున వరంగల్, హన్మకొండతో పాటు కాజీపేట పరిధిలో నగరంలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాని ట్రై సిటీ పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ మంగళవారం వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా రేపటి రోజు అనగా 27-09-2023 మధ్యాహ్నం 02.00 నుండి మరుసటి రోజు తేది 28-09-2023 ఉదయం 10.00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

మహేష్ మంచితనం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ అడ్డాల..

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో మరో సారి మల్టీ స్టారర్ ట్రెండ్ మొదలైంది. దీనితో సూపర్ స్టార్ మహేష్ ఈ దర్శకుడికి మరోసారి ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఈ సారి మహేష్ తో సోలో హీరోగా బ్రహ్మోత్సవం అనే సినిమా ను రూపొందించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఆ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తో ఆయన సినిమా రూపొందించాడు అంటే ఓ రేంజ్ లో ఉంటుందని అంతా భావించారు. కానీ బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ గా నిలిచింది.అసలు కథ లేకుండా సినిమా ఎలా తీశారు అంటూ చాలా మంది దర్శకుడిని ప్రశ్నించారు.ఇదెక్కడి సినిమా అంటూ మహేష్ బాబు తో పాటు అందరిని నెటిజన్స్ విమర్శించారు.