Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

జోబైడెన్‌పై అభిశంసన తీర్మానానికి రిపబ్లికన్లు సిద్ధం

అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్‌బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్‌పై అభిశంసనానికి రెడీ అయ్యారు. సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్‌డీ-1023 ఫారమ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్‌, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్‌కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపించారు. వైట్ హౌస్‌లో అత్యంత అవినీతి కుటుంబం ఉందని జిమ్ బ్యాంక్స్ ఆరోపించారు.

గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఈ అభిశంసనకు మద్దతు పలికారు. బైడెన్‌ ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తరపున పాల్గొన్నారు. బైడెన్‌ ఒక నేరస్తుడు.. అతను మనల్ని మూడో ప్రపంచ యుద్ధంలోకి నడిపిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బైడెన్‌లు చేసిన నేరాలకు రుజువు ఉందంటూ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ విమర్శించారు. అభిశంసన తీర్మానానికి 218 రిపబ్లికన్ ఓట్లు అవసరం.. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

ఏపీ, తెలంగాణా రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. పలు ప్రాంతాల మధ్య పలు రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. నిర్వహణ పనుల దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో పలు రైళ్లను రద్దు చేశారు. 25న కర్నూలు సిటీ-సికింద్రాబాద్ (17024) రైలు 90 నిమిషాలు, గుంతకల్లు-బోధన్ (07671) రైలు 26, 27, 30 తేదీల్లో 120 నిమిషాలు రీషెడ్యూల్ చేశారు.

24 నుంచి 30వ తేదీ వరకు దండి-నిజామాబాద్ (11409) రైలు ముద్ఖేడ్-నిజామాబాద్, 25 నుంచి 31వ తేదీ వరకు నిజామాబాద్-పందర్‌పూర్ (01413) రైలు నిజామాబాద్-ముద్ఖేడ్ మధ్య రద్దు చేశారు. కాచిగూడ-నిజామాబాద్ (07596), నిజామాబాద్-కాచిగూడ (07593), నాందేడ్-నిజామాబాద్ (07854) రైళ్లు 24 నుంచి 30 వరకు, నిజామాబాద్-నాందేడ్ (07853) రైళ్లను 3215 నుంచి రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. కడగలపాలెం-శావల్యాపురం మధ్య ఇంటర్‌లింకింగ్‌ పనులు జరగకపోవడంతో ఈ నెల 31 నుంచి ఈ నెల 3వ తేదీ వరకు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. గుంటూరు-తిరుపతి (17261) రైలు మార్కాపురం-తిరుపతి మధ్య మాత్రమే నడుస్తుందని ప్రకటించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక.. ఎక్కడో తెలుసా?

జీవితంలో ఎన్ని బాధలు అనుభవించిన.. ప్రతి ఒక్కరూ చావులో ప్రశాంతత కోరుకుంటారు. అందుకే ప్రశాంత ప్రదేశంలో తనను ఖననం చేయాలని కోరుకుంటారు. కానీ పెరుగుతున్న జనాభా కారణంగా ప్రస్తుతం ఖననం చేసేందుకు భూమి కరువైంది. ఒకరిని పూడ్చిన చోటే మరొకరిని కొంత కాలం తర్వాత పూడ్చడం చాలా ప్రదేశాల్లో జరుగుతోంది. దీంతో చావులోనూ మనిషికి ప్రశాంతత లేకుండా పోతుంది. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న జనాలు, మరణించిన తర్వాత వారిని పూడ్చేందుకు ఎకరాల కొద్ది స్థలం కావాల్సి వస్తోంది. దీంతో శ్మశానవాటికల విస్తీర్ణం పెరుగుతోంది. ఆ క్రమంలోనే కొన్ని ప్రదేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశాన వాటికలుగా మారుతున్నాయి. అలాంటిదే ఓ శ్మశాన వాటిక ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మన దేశంలో కాశీ రెండో స్థానంలో నిలిచింది.

ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక ఇరాక్‌లోని నజాఫ్ నగరంలో ఉంది. ఈ శ్మశానవాటిక పేరు వాడి అల్ సలామ్ అంటే ‘శాంతి లోయ’. ఇది షియా వర్గానికి చెందిన ప్రజలకు పవిత్ర నగరం. దాని మతపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా మంది ఇక్కడ ఖననం చేయాలని కోరుకుంటారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్)తో ఘర్షణలు పెరిగిన తర్వాత ఈ నగరంలో ప్రతిరోజూ మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. గతంలో రోజుకు 120 నుంచి 150 మంది ఖననం చేయగా ఇప్పుడు 200 మందికి పెరిగింది.

ఏపీలోని ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక..మరో 3 రోజులు భారీ వర్షాలు..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు అధికారులు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు సూచిస్తున్నారు.. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు రెయిన్ అలర్ట్ జారీ చేస్తూ వెదర్ రిపోర్ట్ ను విడుదల చేసింది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..

ఈరోజు కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురవనుండగా.. ఏలూరు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు..

ట్విట్టర్ ఏది ఉచితంగా ఇవ్వదు.. అంటునే మస్క్ మళ్లీ ఫిట్టింగ్..!

ట్విట్టర్ తమ యూజర్లకు షాక్స్ మీద షాకులిస్తోంది. కొత్త రూల్స్ పేరుతో ట్విట్టర్ యూజర్ల నుంచి అందినకాడికి డబ్బులను దండుకోవడానికి చూస్తోంది. ఇటీవలే, బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ పొందాలంటే డబ్బులు చెల్లించాలన్న ట్విట్టర్.. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బ్లూ టిక్ లేని యూజర్లకు కొత్త ఫీచర్ ఇచ్చినట్టే ఇచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంది. బ్లూ టిక్ లేకుంటే మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు డైరెక్ట్ మెసేజింగ్ ద్వారా మెసేజ్ పంపితే ఛార్జీలు చెల్లించాల్సిందేనంటూ ఎలన్ మస్క్ కొత్త ఫిట్టింగ్ పెట్టాడు.

వినియోగదారులు పేమెంట్ సర్వీసైన ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందేలా చేసేందుకు, వెరిఫై చేయని అకౌంట్ల కోసం డైరెక్ట్ మెసేజ్‌లపై ఆంక్షలను విధించడానికి ట్విట్టర్ ఈ కొత్త మార్పులు తీసుకొచ్చింది. వెరిఫైడ్ చేయని ట్విట్టర్ యూజర్లకు మెసేజ్ సామర్థ్యాలను పరిమితం చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ అప్‌గ్రేడ్ చేయడంతో పాటు మరింత మెరుగుపరచేలా ప్రోత్సహిస్తోంది.

రూ.3లక్షల విలువైన టమాటాల చోరీ.. వందల కిలోమీటర్ల దూరంలో విక్రయం

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని నగరాల్లో ధరలు రెండు వందల రూపాయలను దాటాయి. పెరుగుతున్న ధరలతో పాటు టమాటా దొంగతనాల బెడద కూడా పెరుగుతోంది. పెరుగుతున్న టమాటా ధరల మధ్య కర్ణాటకలో ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలువడింది. బెంగళూరులో 2000 కిలోల వాహనం చోరీకి గురైంది. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకున్న పోలీసులు తమిళనాడుకు చెందిన భాస్కర్, సింధూజ అనే ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. అయితే మరో ముగ్గురు నిందితులను ఇంకా వెతుకుతూనే ఉన్నారు.

జూలై 8వ తేదీ శనివారం నాడు బెంగళూరులో నివాసముంటున్న ఓ రైతు బొలెరో వాహనంలో సుమారు రూ.3 లక్షల విలువైన టమాటాలను తీసుకెళ్తున్నాడు. ఆటోలో టమాటాలు లోడ్ చేయడం చూసి ముగ్గురు అపరిచితులు బొలెరో వెనుక తమ కారును పెట్టారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత, రైతులు బొలెరోను ఆర్‌సిఎం యార్డ్ స్టేషన్ ప్రాంతానికి తీసుకువచ్చి ఆపారు.

పెన్ గంగా ఉధృతికి తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్

తెలంగాణలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కుండపోత వర్షాలు పడటంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రాష్ట్రంలోని పలు చోట్ల రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో NH44పై నిన్నటి (శనివారం) నుంచి వెహికిల్ రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.

మరోవైపు మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్ గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం డొలరా దగ్గర ఉన్న పెన్ గంగ నది ఉగ్ర రూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకుతూ పెన్ గంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ విజృంభించడంతో నేషనల్ హైవే 44పై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పెన్ గంగ నది వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. ముందుగానే మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య రూట్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. రేపు అక్టోబర్ నెల దర్శన టికెట్లు విడుదల

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపు ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్టుల విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. ఎల్లుండి 300 రుపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు టీటీడీ విడుదల చేయనుంది. అలాగే.. ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి రోజుకి 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లు విడుదల చేయనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

నేటి నుంచి ఏపీ బీజేపీ జోనల్‌ సమావేశాలు

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పురంధేశ్వరి అధ్యక్షురాలిగా నియమించిననాటి నుంచి వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి ఏపీ బీజేపీ జోనల్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పురంధేశ్వరి కూడా పాల్గొగనున్నారు. పార్టీలో కొత్త కమిటీల రూపకల్పన ముందు జోనల్ సమావేశాలను నిర్వహించాలని పురంధేశ్వరి నిర్ణయించారు. ఈ జోనల్ సమావేశాలు ముగిశాక కొత్త కమిటీలు ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జోనల్ సమావేశం ప్రొద్దుటూరులో నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీన గుంటూరులో కొస్తాంధ్ర జోన్ సమావేశం జరగనుండగా.. 26వ తేదీన రాజమండ్రిలో గోదావరి జోన్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక 27వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

రాజమండ్రి వద్ద మళ్లీ గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చింది. గంట గంటకు స్వల్పంగా నీటిమట్టం పెరుగుతుంది. ఈరోజు ఆదివారం సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని రాజమండ్రిలోని అన్ని స్నాన ఘట్టాలు గేట్లు మూసివేశారు అధికారులు. ఎవరూ నదిలోకి వెళ్లకుండా ఘాట్ల వద్ద బారికేడ్లతో పోలీసుల గస్తీ ఏర్పాటు చేశారు. ఎగువన విలీన మండలల్లోనూ, దిగువన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 22 లంక గ్రామాలను వరదనీరు చుట్టూ ముట్టింది. రహదారులు నీట మునిగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 43.2 అడుగులు ఉండగా.. పోలవరం వద్ద 11.6 మీటర్లకు నీటిమట్టంకు చేరుకుంది. అలాగే.. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.89 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఇవాళ్టి నుంచి ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం వరకు స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతుందని, కాటన్ బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే.. గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో.. ఎగువ ప్రాంతాల నుండి భారీ స్థాయిలో గోదావరిలోకి వరదనీరు చేరడంతో పోలవరం ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆ విషయంలో నేను ఎంతో హ్యాపీగా వున్నాను..

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా హిందీ లో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సాధించింది ఈ భామ. అయితే కాజల్ అగర్వాల్ కొన్నాళ్ళ పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.తనకి పెళ్లి జరిగి బిడ్డ కూడా జన్మించడంతో కాజల్ సినిమాల నుండి కొంత బ్రేక్ తీసుకున్నారు.తన కుమారుడు కాస్త పెద్ద కావడంతో తిరిగి ఈమె సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చారు.. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాతో పాటు బాలకృష్ణ తో నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా షూటింగ్ లతో చాలా బిజీ గా ఉంది.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ భామకు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తగ్గేదేలే.. పుష్ప సినిమా స్టైల్ లో జూపార్క్ లో గందపు చెట్లు స్మగ్లింగ్

హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో చోరీ జరిగింది. జూ పార్కులో పులులు, సింహాలు తప్ప ఏమున్నాయి. వాటిని ఎలా దొంగిలించాలా అని ఆలోచిస్తున్నారా? అవును మీ అనుమానం నిజమే.. వాళ్లు జంతువులను తీసుకెళ్లలేదండోయ్ విలువైన వృక్షాలను దొంగలించారు. జూలోని గందపు చెట్లను ఎత్తుకెళ్లారు. అది కూడా పుష్ప సినిమా స్టైల్‌లో నరికి అక్రమంగా రవాణా చేశారు. వాటిని చిన్నచిన్న దుంగలుగా మార్చి జూ పార్కు నుంచి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు షాక్‌కు గురయ్యారు. నెహ్రూ జూపార్క్ కొన్ని పదుల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది అరుదైన జంతువులతో పాటు విలువైన వృక్షజాలాన్ని కలిగి ఉంది. చందనం చెట్లను చూసిన కొందరు దుండగులు చప్పుడు కాకుండా చెట్లను నరికివేసి దొంగలించడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. పార్కు పెద్దగా ఉండడంతో సిబ్బంది పట్టించుకోవడం లేదని ఇదే అలుసుగా భావించిన దొంగలు సైలెంట్ గా చెట్లను నరికి ఎత్తుకెళ్లడంపై తీవ్ర సంచనంగా మారింది.

 

Exit mobile version