Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

TDP నేత మన్నెం వెంకటరమణ కన్నుమూత

టీడీపీ నేత, ఎన్నారై మన్నెం వెంకటరమణ (53) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. కాగా వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే.. అమెరికాలోని న్యూ జెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా… గుండెపోటుకు గురయ్యారు మన్నెం వెంకటరమణ. దీంతో వెంటనే మన్నెం వెంకట రమణాను ఏథెన్స్ ఎయిర్ పోర్టు లోని ఆస్పత్రికి తరలించారు.

రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్

రేషన్ లబ్ధిదారులకు మార్చి 1 నుంచి రాగిపిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనుంది. రాగిపిండి ధర బహిరంగ మార్కెట్ లో కేజీకి రూ.40పైనే పలుకుతుండగా, ప్రభుత్వం రూ.11కే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో కార్డుకు ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలు ఇస్తున్న సంగతి తెలిసిందే. రాగి పిండిని ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అ­ల్లూ­రి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నంలో పంపిణీ చేస్తారు.

మిషన్‌ భగీరథపై సీఎం రేవంత్‌ ఉన్నతస్థాయి సమీక్ష

మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వేసవి ప్రారంభం కావడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై ఆయన సమీక్షించనున్నారని తెలుస్తోంది.గ్రామాల్లో నీటి సరఫరాపై ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుంచి సమాచారం సేకరిస్తోంది. గతంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఉండగా ఇటీవల ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించింది. ఈ మేరకు ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది.

మళ్లీ గెలిచాక 6 నెలల్లోనే రోడ్లు వేస్తాం

రోడ్లపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే తొలి ఆరు నెలల్లోనే రోడ్లన్నీ వేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లపై సీఎం జగన్ మేనిఫెస్టోలో కీలక ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలోని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికే తమకు 2 ఏళ్లు పట్టిందని అన్నారు. ఆ తర్వాత కరోనా వచ్చి, పనులు ఆగిపోయాయని నాని వివరించారు. అంతేకాకుండా.. మేమూ సిద్ధం అంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తు‍న్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కొడాలి నాని సెటైర్లు వేశారు. వైఎస్సార్‌సీపీపై అభ్యర్థుల్ని కూడా నిలబెట్టి అప్పుడు సిద్ధం అంటే బాగుంటుందంటూ చురకలంటించారాయన.

గుంటూరు మిర్చి యార్డులో లక్షల సంఖ్యలో పేరుకుపోతున్న మిర్చి టిక్కీలు

గుంటూరు మిర్చి యార్డ్ లో ఇసుక వేస్తే రాలనీ పరిస్థితి తలెత్తింది ..గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, కర్ణాటక, తెలంగాణ, లాంటి ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో వస్తున్న మిర్చి టిక్కీల వాహనాలతో మార్కెట్ యార్డ్ నిండిపోయింది ….దీంతో ఎగుమతి దారులు సరుకును తరలించలేక పోవడం, మరో వైపు వస్తున్న సరుకును ఆపలేని పరిస్థితిలో పాలకవర్గం ఉండటంతో, మిర్చి రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు… దీనికి తోడు పెద్ద ఎత్తున వస్తున్న మిర్చి దెబ్బకు వ్యాపారులు రేట్లు సగానికి సగం కోసి అడుగుతున్నారని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేజ్రీవాల్ కు ఏడోసారి ఈడీ నోటీసులు..

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) అధికారులు మరోసారి సమన్లు ఇచ్చారు. అయితే, ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేయగా, తాజాగా ఇచ్చిన నోటీసులతో కలిపి మొత్తం ఏడు సార్లు ఆయనకు సమన్లు జారీ చేశారు. ఇక, ఆయన ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు.. దీంతో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈడీ ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని నోటీసుల్లో వెల్లడించింది.

నేను ఎప్పుడు, ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెప్తా

నేను ఎప్పుడు,ఏ పార్టీ లో చేరేది త్వరలోనే చెప్తా అన్నారు ఎంపీ కృష్ణ దేవరాయ. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వైసీపీలోకి వెనక్కు వచ్చే ఆలోచన లేదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా లో వచ్చే వార్తలకు నేను స్పందించనని ఆయన వెల్లడించారు. నేను పార్టీకి విశ్వాస ఘాతానికి పాల్పడ్డానని కామెంట్లు చేసే వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారో లేక వేరే వాళ్ళ స్క్రిప్ట్ లు చదువుతున్నా రో తేల్చుకోవాలన్నారు. మంచి రోజు చూసుకుని అన్ని విషయాలు మీడియా కు చెప్తానని ఆయన తెలిపారు. తాను మళ్ళీ వైసీపీ లోకి వస్తున్న ట్లుగా జరుగుతున్న ప్రచారంలో, వాస్తవం లేదన్నారు ఎంపీ కృష్ణదేవరాయులు.. లావు శ్రీకృష్ణ దేవరాయలు కొన్ని రోజుల కిందట వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన నరసరావుపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రబద్దంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నాం

సోషియల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న రమణధీక్షితులు ఆరోపణలపై ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ధీక్షితులు, కృష్ణశేషాచల ధీక్షితులు స్పందించారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలధీక్షితులు మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్ర్తబద్దంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. రమణధీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని, రంగనాయకులు మండపంలో రమణధీక్షితులు హయంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారన్నారు. ఆలయంలో తవ్వకాలు అంటు రమణధీక్షితులు తరుచు ఆరోపణలు చేస్తూన్నారని, రమణధీక్షితులును సియం జగన్ నాలుగు సంవత్సరాలు క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించినా విధులుకు హజరుకావడం లేదన్నారు.

భారత్ లో కొన్ని ట్విట్టర్ అకౌంట్లు నిలిపివేయండి..

సోష‌ల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్)కు చెందిన కొన్ని అకౌంట్లను నిలిపివేయాల‌ని కోరుతూ భార‌త సర్కార్ ఆదేశాలు జారీ చేసిందని ఆ సంస్థ పేర్కొనింది. ప్రత్యేకమైన అకౌంట్ల నుంచి జరిగే పోస్టులను కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎలాన్ మాస్క వెల్లడించారు. కాగా, ఎల‌న్ మ‌స్క్ సంస్థ చేసిన ఆరోప‌ణ‌ల‌పై మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. కాగా, ఎక్స్‌కు చెందిన గ్లోబ‌ల్ గవర్నమెంట్ అఫైర్స్ అకౌంట్‌లో ఈ పోస్టు చేయగా.. భారత ప్రభుత్వ ఆదేశాల‌ను మాస్క్ కంపెనీ త‌ప్పు ప‌ట్టింది. ఈ చర్యలతో ఏకీభవించ‌డం లేద‌ని ఎక్స్ చెప్పుకొచ్చింది. భావ స్వేచ్ఛ పేరుతో పోస్టుల‌ను విత్‌హెల్డ్‌లో పెట్టడం మంచింది కాదని తెలిపింది. అయినా కానీ భార‌త ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా నడుచుకోక తప్పడం లేదని ట్వీట్ చేసింది.

 

Exit mobile version