అద్భుత ఔషధంతో క్యాన్సర్‌ని జయించిన మహిళ..
క్యాన్సర్.. ఈ వ్యాధి వస్తే మరణమే అని తెలుసు. అయితే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి మాత్రం సరైన చికిత్స అందుబాటులో లేదనే చెప్పవచ్చు. క్యాన్సర్ చివరి దశల్లో ఈ వ్యాధి దేనికీ లొంగడం లేదు. అయితే క్యాన్సర్ వ్యాధుల్ని పూర్తిగా నయం చేయడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో క్యాన్సర్ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే యూకేకు చెందిన ఓ మహిళను క్యాన్సర్ బారి నుంచి రక్షించడానికి ఓ ఔషధం అద్భుతంగా పనిచేసింది. వేల్స్‌కి చెందిన క్యారీడౌనీ అనే మహిళ థర్డ్ స్టేజ్ ప్రేగు క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే ‘డోస్టార్లిమాబ్’ అనే మందును తీసుకున్న తర్వాత ఆరు నెలల్లోనే ఆమె కొలుకున్నట్లు బీబీసీ నివేదిక వెల్లడించింది. 42 ఏళ్ల సివిల్ సర్వేంట్ అయి క్యారీ డౌనీ ఒక ఏడాది క్రితం క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. డోస్టార్లిమాబ్ మందుతో చికిత్స చేయడంతో క్యాన్సర్ వ్యాధి సంబంధించిన ఆధారాలు శరీరం నుంచి తొలిగిపోయినల్లు పరీక్షలు సూచించాయని స్వాన్సీబే యూనివర్సిటీ హెల్త్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
సారా అలీ ఖాన్ వేసుకున్న ఈ డ్రెస్సు ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవుతారు..
సారా అలీఖాన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలివుడ్ ముద్దుగుమ్మ సినిమాలు, యాడ్ లతో బాగానే సంపాదిస్తుంది.. సైఫ్ అలీఖాన్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన నటన టాలెంట్ తో అందరిని ఆకట్టునకుంది.. దాంతో సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా ఉంది.. ఫ్యాషన్‌లోనూ ఆ స్టార్ స్టయిల్ సెపరేటే.. అమ్మ, నానమ్మ.. మేనత్తల ఇన్‌ఫ్లుయెన్స్ ఇంచ్ కూడా ఉండదు. ఆమెకు ఆ ప్రత్యేకతను అలంకరిస్తున్న బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. చిన్న వస్తువు క్కూడా బోలెడంత ఖర్చు పెడుతుంటారు సినీ తారలు..
కానీ సారా మాత్రం అలా కాదు అంటుంది.. నన్ను మినహాయించొచ్చు. ఎందుకంటే నేను అంతగా ఖర్చు పెట్టను.. ముఖ్యంగా డ్రెసెస్ మీద. పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కి, షోస్‌కి కూడా నేను రెంటల్ డ్రెసెస్‌నే ఫ్రిఫర్ చేస్తాను అంటుంది.. మన ఫ్యాషన్ గురించే కాదు, మన గురించీ చెప్తాయి’ అంటాడు పునీత్ బలానా. అందుకే అతని డిజైన్స్ అన్నిటిలోనూ తన స్వస్థలమైన రాజస్థాన్ సంస్కృతి ప్రతిబింబిస్తుంటుంది. ఆధునికతకు దేశీ సంప్రదాయాన్ని జోడించిన డిజైన్స్ అతని ప్రత్యేకత. కాబట్టే ఈ బ్రాండ్ సెలబ్రిటీస్ ఫేవరెట్‌గా మారింది. ధర కాస్త ఎక్కువ. ఆన్‌లైన్‌లోనూ ఈ బ్రాండ్ డ్రెస్సులు దొరుకుతాయి..
మంత్రి రోజాకు మద్దతుగా మీనా.. బండారుపై విమర్శలు
టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి రోజాకు మద్దతుగా అలనాటి తారులు నిలుస్తున్నారు. తాజాగా సీనియర్ నటి మీనా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే.. టీడీపీ నేత బండారుపై మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారని, బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయన్నారు మీనా. అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనమని ఆమె విమర్శించారు. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీ కి వచ్చినప్పటి నుండి నాకు తెలుసునని, ఆమె తో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె కోసం నాకు పూర్తిగా తెలుసునన్నారు.
10బంతుల్లో 51.. యువరాజ్ రికార్డు బద్ధలు కొట్టిన ఐర్లాండ్ బ్యాట్స్ మెన్
తొలి టీ20 ప్రపంచకప్ 2007లో జరిగింది. అందులో భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఇంగ్లండ్‌పై ఓ ఓవర్‌లో 6 సిక్సర్లు బాది 12 బంతుల్లో అర్ధసెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు 2007 నుండి 2023 వరకు దాదాపు 16 సంవత్సరాలు కొనసాగింది. అయితే సెప్టెంబర్ 27న నేపాల్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. నేపాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దీపేంద్ర సింగ్ ఐరి 9 బంతుల్లో 8 సిక్సర్లు బాది 52 పరుగులు చేశాడు. నేపాలీ బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్ ముందు యువరాజ్ ఇన్నింగ్స్ కూడా తక్కువే అనిపించింది. ఆసియా క్రీడల అంతర్జాతీయ మ్యాచ్‌లో మంగోలియాపై ఈ ఫీట్ చేసి సంచలనం సృష్టించాడు దీపేంద్ర.. ఇప్పుడు అతడి అద్భుత ఇన్నింగ్స్ తర్వాత ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆడిన మరో తుఫాను ఇన్నింగ్స్ వెలుగులోకి వచ్చింది. అయితే ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే ఇన్నింగ్స్ కాదు. కానీ క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచే ఇన్నింగ్స్. ఐరిష్ బ్యాట్స్‌మెన్ సీమస్ లించ్ హంగేరీపై 10 బంతుల్లో 51 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి సోషల్ మీడియాలో ముఖ్యాంశాల్లో నిలిచాడు.
హనీమూన్‌కి తీసుకెళ్లి.. భార్య ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్..
భర్తగా భార్యను కలకాలం కాపాడాల్సిన వాడే రాక్షసుడిగా ప్రవర్తించాడు. పెళ్లి తర్వాత తనకు తోడుగా ఉంటాడనుకున్న వాడే దారుణంగా ప్రవర్తించాడు. భార్యతో ప్రైవేటుగా ఉన్న వీడియోలను తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పెళ్లి ముందు ఉద్యోగం ఉందని నమ్మించి యువతిని పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది.
వివరాల్లోకి వెళ్లే 28 ఏళ్ల యువతితో నిందితుడికి గతేడాది నవంబర్ నెలలో వివాహం జరిగింది. వీరిద్దరు హనీమూన్ కోసం థాయ్‌లాండ్ వెళ్లారు. ఆ సమయంలో భార్యతో ప్రైవేటుగా ఉన్న వీడియోలను, ఫోటోలను తీశాడు నిందితుడు. అక్కడ కొన్ని పోర్న్ చిత్రాలు చూపించి, మద్యం తాగించి, తన వివరాలన్నింటిని తన భర్త సెల్‌ఫోన్ లో అప్డోల్ చేసుకున్నాడని బాధిత మహిళ బసవనగుడి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది.
సిక్కింలో వరద బీభత్సం… నదుల్లో తేలియాడుతున్న మృతదేహాలు
సిక్కింలో మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నదిలో అకస్మాత్తుగా వరదలు రావడంతో మరణాల పరంపర కొనసాగుతోంది. మట్టి, శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్న పరిస్థితి నెలకొంది. సిక్కిం వరదల్లో ఇప్పటివరకు 56 మృతదేహాలను వెలికి తీయగా, గత మూడు రోజులుగా తప్పిపోయిన 62 మంది సజీవంగా కనుగొనబడ్డారు. తప్పిపోయిన వారి సంఖ్య ఇప్పుడు 81కి తగ్గిందని, వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SSDMA) శనివారం సాయంత్రం తెలిపింది.
సిక్కిం వరదల్లో ఇప్పటివరకు 56 మృతదేహాలను వెలికితీశారు. వీటిలో పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30కి పైగా మృతదేహాలను వెలికితీశారు. 22 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. వారిలో 7 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇజ్రాయిల్‌లో క్షేమంగా బాలీవుడ్ నటి.. ఇండియాకు పయణం..
ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు శనివారం భీకరదాడి చేశారు. ఏకంగా 5000 రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయిల్ వైపు ప్రయోగించారు. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయిలీలు చనిపోగా.. పలువురిని బందీలుగా హమాస్ నిర్బంధించి గాజాకు తీసుకెళ్లింది మరోవైపు ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. గాజా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 250కి పైగా ప్రజలు మరణించారు.
ఇదిలా ఉంటే హమాస్ చేసిన దాడుల తర్వాత బాలీవుడ్ నటి నహ్రత్ భరుచ్చా తప్పిపోయినట్లు వార్తలు వచ్చాయి. నిన్న దాడుల తర్వాత ఆమె ఆచూకీ కనిపించలేదనే పలు నివేదికలు వెల్లడించాయి. హైఫా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఆమె ఇజ్రాయిల్ వెళ్లారు. నిన్న మధ్యాహ్నం 12.30 తర్వాత ఆమెతో కాంటాక్ట్స్ కోల్పోయామని టీం సభ్యుల్లో ఒకరు తెలిపారు. దీంతో ఆందోళన నెలకొంది.
స్టేషన్ ఘనపూర్‌కు నేనే సుప్రీం.. తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు
స్టేషనల్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జనగామ జిల్లాలోని కేశవనగర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ పరిస్థితులు చూస్తే నేను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదన్నారు. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయని, డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారన్నారు. కోలాటమాడాలన్నా భయపడుతున్నారని, ఎందుకు అభద్రత భావంలో ఉన్నారో అర్దం కావట్లేదన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. జనవరి 17 వరకు నేనే ఎమ్మెల్యేనని, స్టేషన్ ఘనపూర్ కు నేనే సుప్రీం అని తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు.
ఆఫ్ఘాన్ భూకంపంలో 1000కి పైగా మృతుల సంఖ్య
పేదరికం, ఉగ్రవాదంతో కష్టంగా బతుకీడుస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో శనివారం భారీ భూకంపం సంభంవించింది. హెరాత్ ప్రావిన్సులో సంభవించిన భూకంపం ధాటికి 1000 మందికి పైగా చనిపోయినట్లు తాలిబాన్ అధికారులు ప్రకటించారు. 12 గ్రామాల్లో 600 ఇళ్లు ధ్వంసమైనట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
శనివారం నుంచి 8 సార్లు భూకంపం సంభవించింది. ప్రావిన్సులోని హెరాత్ పట్టణానికి వాయువ్యంగా 30 కిలోమీటర్ల దూరంలో ప్రాంతాలను భూకంప కుదిపేసింది. చాలా వరకు మట్టితో కట్టిన ఇళ్లు కావడం, కొండచరియల ప్రాంతాల్లో నివాసాలు ఉండటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 4200 మంది ప్రజలు భూకంపం ధాటికి ప్రభావితమయ్యారు.
గడువు ముగిసింది. రూ. 2000 నోట్లను ఎలా మార్చుకోవాలో తెలుసా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది, తరువాత దానిని అక్టోబర్ 7వరకు పొడిగించారు. ఇప్పుడు దానిని మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి గడువు ముగిసింది. అయితే దీని తర్వాత కూడా మీరు రూ 2000 నోటును మార్చుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 7 తర్వాత ఏ బ్యాంకు రూ. 2,000 కరెన్సీని అంగీకరించదు. అయితే, దీని తర్వాత కూడా ఈ నోట్లు చట్టబద్ధంగా ఉంటాయి. మీ వద్ద కూడా రెండు వేల రూపాయల నోట్లు ఉంటే గడువు ముగిసిన తర్వాత కూడా మీరు దానిని మార్చుకోవచ్చు. డిపాజిట్ చేయవచ్చు. సెప్టెంబరు 30న ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 8 నుండి బ్యాంకులు రూ.2000 నోటును అంగీకరించవు. వారి ఖాతాలలో కూడా డిపాజిట్ చేయవు. ఏ ఇతర నోటుతో మార్పిడి చేయబడదు.
