చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన సజ్జల.. కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు సీఐడీ అధికారులు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు అరెస్ట్‌లో ఎలాంటి దురుద్దేశాలు లేవు.. బలమైన ఆధారాలతోనే సిట్ వేశాం.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందన్నారు.. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయన్న ఆయన.. స్వాతంత్ర్య భారత దేశంలో అత్యంత హేయమైనది ఆర్ధిక నేరం.. స్కీమ్ పేరుతో స్కామ్ చేశారని విమర్శించారు. ఆర్ధిక నేరాల్లో నోటీసు ఇవ్వాల్సి అవసరం లేదన్నారు సజ్జల.. ఎఫ్ఐఆర్ లో పేరు లేదని చంద్రబాబు ఎవరిని దబాయిస్తున్నాడు? అని మండిపడ్డారు.. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిన విషయమేనన్న ఆయన.. వ్యక్తిగతం కక్ష సాధింపుకు వెళ్లని స్వభావం సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిది అన్నారు.. దర్యాప్తులో తేలాలి రాజకీయ ప్రమేయం ఉండకూడదనే రెండేళ్లు ఆగారని.. దబాయించి బయట పడాలని చూస్తే ఇంకా సాధ్యం కాదని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి..
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన బాలయ్య… అన్నం తినటం మానేసి..!
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ మీరో నందమూరి బాలకృష్ణ.. జగన్ పాలకుడు కాదు కక్ష్యదారుడు.. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గం.. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యం. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష్యసాధిస్తున్నారు అని మండిపడ్డారు.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? అని ఓ ప్రకటనలో నిలదీశారు బాలకృష్ణ.. స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్న ఆయన.. ఇది కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర. 19.12.2021 లో ఎఫ్ ఐఆర్ నమోదైంది, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్ సీటు చేయలేదు? డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్ లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింబచేసినపుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి లేఖ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన సాగుతుండగా.. ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. ఇతర నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇక, ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు విడివిడిగా లేఖలు రాశారు ఎంపీ కేశినేని నాని.. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని రక్షించాంటూ విడివిడిగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు కేశినేని నాని.. చంద్రబాబుపై రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదు.. ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు. రాజకీయ కక్షతో ఈ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ప్రజల్లో ఏపీ పోలీసులపై నమ్మకం పోయింది. అక్రమంగా జరిగిన చంద్రబాబు అరెస్ట్ వ్యవహరంలో కేంద్రం జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తన లేఖల ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. మరోవైపు.. చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి మచ్చ లేని నాయకుడు అని ఎంపీ కేశినేని నాని కొనియాడిన విషయం విదితమే.. ఐటీ నోటీసులు పెద్ద విషయం కాదని.. దానికి వివరణ ఇస్తారని.. ఇవన్నీ తాత్కాలికమేనన్నారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేసిన విషయం విదితమే.
చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. ఈ కేసులో కీలకం అదే..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఏపీ సీఐడీ.. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్న నేపథ్యంలో.. ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ ఎన్. సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేశాం.. నకిలీ ఇన్‌వాయిస్‌లతో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు.. ఈ స్కాం లో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే అన్నారు. స్కిల్ స్కాంలో కీలక సూత్రధారి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని పేర్కొన్న ఆయన.. విచారణలో మరిన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబు కస్టడీ చాలా అవసరం అన్నారు. ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉందన్నది స్పష్టం.. ఈడీ, జీఎస్టీ సంస్థలు కూడా విచారణ చేస్తున్నాయి.. తగిన ఆధారాలను కోర్టు ముందు పెడతాం అని వెల్లడించారు. ఈ స్కాంలో లబ్దిదారుడు చంద్రబాబు అని పేర్కొన్నారు సంజయ్.. డిజైన్ టెక్ నుంచి అనేక షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయన్న ఆయన.. కుంభకోణం చేయాలనే ఉద్దేశంతోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.. 2014లో జులై నాటికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు కంటే ముందే డిజైన్ టెక్ తో ఒప్పందం కుదిరింది.. కేబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని.. గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. డిజైన్ టెక్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ భాస్కర్ భార్య అపర్ణ.. ఈమెను కార్పొరేషన్ కు డిప్యూటీ సీవోగా నియమించారని తెలిపారు. ఈ ప్రజెంటేషన్స్ లో ఆమె కూడా పాల్గొన్నారు. సీమెన్స్ నుంచి వస్తుందని చెప్పిన 90 శాతం నిధులు ఎందుకు రాలేదు అన్న కోణంలో నాటి ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. ఏపీలో 6 చోట్ల 586 కోట్ల రూపాయలతో నైపుణ్య సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.. సాఫ్ట్ వేర్ కొనుగోలు కోసం 58 కోట్లు వెచ్చించారు.. ఈ 58 కోట్లతో కొన్న సాఫ్ట్‌వేర్ నే 3000 కోట్ల వ్యయంగా చూపించారని.. ఇదే కీలకమైన కుట్ర కోణం అని వెల్లడించారు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ ఎన్. సంజయ్.
చంద్రబాబు అరెస్ట్‌పై ఇలా స్పందించిన పవన్ కల్యాణ్.. వాటికి సంపూర్ణ మద్దతు..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాయి విపక్షాలు.. చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అసలు ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్దరాత్రి అరెస్టు చేసే విధానానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తుందని మండిపడ్డారు. గత యేడాది అక్టోబర్ లో విశాఖలో కూడా జనసేన పట్ల ఏ విధంగా వ్యవహరించారో అందరూ చూశారని గుర్తుచేసిన ఆయన.. ఏ తప్పూ చేయని జనసేన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారు.. నేడు చంద్రబాబును అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన ఖండిస్తుందని ప్రకటించారు. పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు.. ఆయన పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదు అని హితవుపలికారు పవన్ కల్యాణ్.. చిత్తూరులో కూడా ఇదే విధంగా చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరించింది.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. వైసీపీ, ప్రభుత్వం, పోలీసులు ఊరుకోమని అంటున్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కదా..? అధికార పార్టీకి సంబంధం ఏమిటి..? అని నిలదీశారు. నేడు ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణంగా వైసీపీ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.
చంద్రబాబుకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయం..! లాలూ ప్రసాద్‌ను జైల్లో పెట్టలేదా..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మీద పెట్టిన సెక్షన్లకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయం అని వ్యాఖ్యానించారు.. లాలూ ప్రసాద్ యాదవ్ తప్పు చేస్తే జైల్లో పెట్టలేదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. ఆన్ స్క్రిల్డ్ పొలిటీషియన్ అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు చేసిన పాపాలు, దోపిడీకి అరెస్ట్ ఒక నిదర్శనంగా అభివర్ణించారు. రూ. 370 కోట్ల ప్రజాధనం వ్యక్తిగత స్వార్ధం కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు.. కాస్టోడియన్ గా ఉండాల్సిన ప్రజాప్రతినిధి కంచె చేను మేసినట్టు స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ లో బయటపడిందన్నారు. చంద్రబాబు తేలుకుట్టిన దొంగ.. అందుకే నా తప్పు లేదని ఎక్కడా చెప్పలేకపోతున్నారు అని విమర్శించారు మంత్రి అమర్నాథ్.. స్కిల్ స్కామ్ యూరో లాటరీ వంటి మోస పూరిత ఆలోచనల్లో నుంచి పుట్టిందన్న ఆయన.. చంద్రబాబు క్రిమినల్ స్కిల్ తప్ప రాష్ట్రానికి ఎటువంటి లబ్ది చేకూరలేదన్నారు. సీ మేన్స్ స్కామ్ లో ఎంత మంది పాత్రధారులు వున్నా.. ప్రధాన సూత్రధారి మాత్రం చంద్రబాబు నాయుడే అని ఆరోపించారు. ప్రజల ఆస్తిని దోపిడీ చేసిన వాళ్లను అరెస్ట్ చేస్తే ఆందోళన చేయడానికి టీడీపీ నేతలకు సిగ్గు లేదా..? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు మీద పెట్టిన సెక్షన్లకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయమన్న ఆయన.. లాలూ యాదవ్ తప్పు చేస్తే జైల్లో పెట్టలేదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంత రాజకీయ అనుభవం ఉన్న నేతైనా తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందే అని.. చంద్రబాబు పాలనలో స్కీంలు లేవు అన్నీ స్కామ్ లే అన్నారు.
భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చేసిన మోడీ
జీ20 సదస్సు భారతదేశంలోని ఢిల్లీలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా చారిత్రాత్మకంగా మార్చేందుకు ప్రత్యేక సన్నాహాలు చేశారు. ఢిల్లీని అలంకరించిన తీరు, వచ్చే ప్రపంచంలోని పెద్ద నాయకులందరూ భారతదేశ సంస్కృతిని గుర్తుంచుకోవాలని ప్రయత్నించారు. విదేశీ అతిథులు వచ్చే చోట భారతీయ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈవెంట్ అందాన్ని మరింత పెంచాయి. భారతదేశం గొప్ప సంస్కృతి, చారిత్రక వారసత్వం గురించి ప్రపంచానికి తెలియజేసే అవకాశం కూడా లభిస్తుంది. భారతదేశం తన సంస్కృతిని ప్రదర్శించడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. వేదికైన భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. ఆ సందర్భంలో ఒడిశాకు చెందిన కోణార్క్ చక్రాన్ని ప్రదర్శించారు. ఈ కోణార్క్ చక్రం 13వ శతాబ్దంలో రాజు నరసింహదేవ్-I పాలనలో రూపొందించడింది. ఈ చక్రం భారతదేశ ప్రాచీన జ్ఞానం, నాగరికత, వాస్తుశిల్పం ఔన్నత్యానికి చిహ్నం. కోణార్క్ చక్రం భ్రమణం కాలచక్రంలో నిరంతర పురోగతి, మార్పును సూచిస్తుంది. ఇది ప్రజాస్వామ్య చక్రానికి శక్తివంతమైన చిహ్నంగా కూడా పనిచేస్తుంది. ఇది ప్రజాస్వామ్య ఆదర్శాలకు, సమాజంలో పురోగతికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ చక్రం ఒడిశాలోని కోణార్క్‌లో నిర్మించిన సూర్య దేవాలయంలో ఏర్పాటు చేశారు. భారత కరెన్సీ నోట్లపై కూడా కోణార్క్ చక్రం ముద్రించబడింది. ఒకప్పుడు 20 రూపాయల నోటు, 10 రూపాయల నోటుపై ముద్రించేవారు. చక్రం 8 వెడల్పు చువ్వలు, 8 సన్నని చువ్వలు కలిగి ఉంటుంది. ఆలయంలో 24 (12 జతల) చక్రాలు ఉన్నాయి. ఇవి సూర్యుని రథ చక్రాలను సూచిస్తాయి. 8 కర్రలు రోజులోని 8 గంటల గురించి చెబుతాయి. దీనిని ఉపయోగించి సూర్యుని స్థానం ఆధారంగా సమయం లెక్కించబడుతుంది. చక్రం పరిమాణం 9 అడుగుల 9 అంగుళాలు. 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయని, 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని కూడా నమ్ముతారు.
అద్దెకు ఇళ్లు తీసుకున్న ఒక అమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. కట్ చేస్తే షాక్
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని సర్కేజీ ప్రాంతంలో ఓ అమ్మాయి ముగ్గురు అబ్బాయిలతో కలిసి ఇంటిని అద్దెకు తీసుకుంది. రెంటుకు తీసుకునేటప్పడు వారు ఏం చెప్పారో ఏమో కానీ బ్యాచిలర్స్ అయినా ఆ ఇంటి ఓనర్ వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చారు. అయితే అక్కడ వారు గంజాయి పండించడం స్టార్ చేశారు. అయితే నేల మీద పండే గంజాయిని ఆర్టిఫిషియల్ గా పండించడం కోసం వారు కరెంట్ ను ఉపయోగించి రూమ్ టెంపరేచర్ వద్దే గంజాయి సాగుకు కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. దీని కోసం నెలకు రూ. 35 వేల రూపాయలు చెల్లిస్తూ రెండు ప్లాట్లను కూడా అద్దెకు తీసుకున్నారు. ఒక్కో ప్లాట్ లో వంద మొక్కలను పెంచడం మొదలు పెట్టారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిని సోదా చేసి వారు గంజాయి సాగు చేసే విధానం చూసి ఆశ్చర్యపోయారు. వారిలో ప్రధాన నిందితుడు పారిపోగా ఒక అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమానిని కూడా దీనికి సంబంధించి విచారిస్తున్నారు పోలీసులు. దీన్ని బట్టి చూస్తే ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో అర్థం అవుతుంది.
జీ20 డిన్నర్‌లో భారతీయ రుచులు.. వంటకాల పూర్తి జాబితా ఇదే
జీ20 సదస్సు వేదికగా దేశాధినేతలు, ఇతర ప్రతినిధుల కోసం శనివారం ఏర్పాటు చేయనున్న విందు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక వంటకాల జాబితాను సిద్ధం చేశారు. ఈ విందు కోసం తయారు చేయబడిన మెనూలో భారతదేశంలోని విశిష్ట వంటకాలు ఉన్నాయి. ఒక లగ్జరీ హోటల్ గ్రూప్ సీనియర్ మేనేజర్లు, సిబ్బంది రెండు రోజుల పాటు జరుగుతున్న సదస్సు కోసం భారత్ మండపంలో విందు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన ప్రత్యేక వెండి సామాగ్రిలో అధికారిక విందును ఏర్పాటు చేయనున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ఈ (వర్షాకాలం) సీజన్‌లో తినే వంటకాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. మెనూలో మిల్లెట్ ఆధారిత వంటకాలు కూడా ఉంటాయి. మెనూలో చేర్చబడిన వంటకాల గురించి అధికారులు ఖచ్చితమైన వివరాలు ఇవ్వలేదు. ఇది భారతీయ వంటకాల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని వారు భావిస్తున్నారు. శిఖరాగ్ర సదస్సు మొదటి రోజు ముగిసిన తర్వాత రాష్ట్రపతి ముర్ము భారత్ మండపంలో ఘనంగా విందును ఏర్పాటు చేస్తారు. మెనూ వివరాలు పబ్లిక్‌గా లేవు. కానీ సదస్సుకు వచ్చిన దేశాధినేతలకు వడ్డించే భారతీయ వంటకాల రుచి.. వారికి చిరకాలం గుర్తుండిపోతుంది. గులాబ్ జామూన్, రస్మలై, జిలేబీ వంటి పలు రకాల స్వీట్లను అందించనున్నారు. వంటకాలను అందించే సిబ్బంది కూడా ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. మెనూలో భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన లేదు.
జీ-20 సమావేశాల్లో కీలక పరిణామం.. ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం
ఈరోజు ఉదయం ప్రారంభమైన జీ-20 వన్ ఎర్త్ సెషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీ-20 సమ్మిట్ లో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. సబ్‌కా సాథ్ భావనతోనే ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 సభ్యత్వం ఇవ్వాలని భారత్ ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని దానికి అందరూ అంగీకరిస్తారని భావిస్తూ ఈ ప్రకటన చేస్తున్నట్లు మోదీ తెలిపారు. జీ20 సభ్యుడి హోదాలో ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడు అజాలీ అసౌమనీని చైర్ లో కూర్చోవాలని ఆహ్వానించారు. ఆ సమయంలో అజాలీ అసౌమనీ మోడీని ఎంతో ఆప్యాయంగా హత్తుకున్నారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఇలా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మోడీ. ఈ సమావేశంలో మాట్లాడిన మోడీ మొరాకో భూకంపంలో మరణించిన వారికి సానుభూతి తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ మొరాకోకు సాయం అందించాల్సిన సమయం ఇదని మోదీ అన్నారు. భారత్ ఈ విషయలో పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జీ-20 వేదికపై మోదీ సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ మంత్రం అందరికి ఆదర్శం అన్నారు. దేశం లోపల, బయట అందరిని కలుపుకొని పోవడానికి భారత్ సిద్ధంగా ఉందని మోడీ వెల్లడించారు. ప్రపంచంలో యుద్దాలు, కరోనా వంటి మహమ్మారి కారణంగా అపనమ్మకం ఏర్పడిందని వాటిని పోగొట్టుకొని ముందుకు సాగాలన్నారు. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం అన్వేషించడానికి 21 శతాబ్దం ఎంతో ముఖ్యమైనదన్నారు. ఇక ఇప్పుడు శాశ్వత సభత్వం పొందించిన ఆఫ్రికన్ యూనియన్ తో పాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్ జీ-20 గ్రూప్ లో భాగంగా ఉన్నాయి. ఇక ఆఫ్రికన్ యూనియన్ విషయానికి వస్తే దీనిలో 55 మెంబర్ స్టేట్స్ ఉండి మొత్తం ఆఫ్రికా ఖండాన్నే ఇది రిప్రెజెంట్ చేస్తుంది.
బ్యాంక్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఆ నిర్ణయం తీసుకోనున్న రాష్ట్రప్రభుత్వం
దేశంలో బ్యాంకింగ్ రంగం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు కూడా బ్యాంకింగ్ రంగంపై అవగాహన పెరగడంతో వారు కూడా ఎక్కువగా బ్యాంకులకు వెళుతున్నారు. ఇక ప్రభుత్వాలు అందించే అన్ని స్కీమ్ ల డబ్బులు కూడా బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. దీంతో సాధారణ జనం చాలా మంది బ్యాంకులకు క్యూ కడుతున్నారు. అయితే స్కీంలకు సంబంధించిన వివరాలు కానీ, ఇన్యూరెన్స్ లాంటి విషయాలు కానీ, మరే ఇతర విషయాల గురించి అయినా తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్లిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకులో పని చేసే చాలా మందికి అక్కడి స్థానిక బాష రాకపోడం దీనికి ప్రధాన కారణం. బ్యాంకులు కేవలం వారి రాష్ట్రానికి చెందిన వారిని కాకుండా అన్ని రాష్ట్రాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఐబీపీఎస్ లాంటి పరీక్షలు రాసి దేశంలో ఎక్కడైనా ఉద్యోగం పొందవచ్చు. కేవలం గవర్నమెంట్ బ్యాంకులే కాకుండా ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులైన హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ లాంటి బ్యాంకులు కూడా బ్యాంకింగ్ ప్రోగ్రామ్ ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో వారికి అక్కడి భాష నేర్చుకోవడానికి కొద్ది రోజులు పడుతుంది. ఈలోపు కస్టమర్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ మేనేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే కొంతమందికి ఇబ్బందిగా మారింది. బ్యాంక్ సేవలు అందించడానికి అడ్డంకిగా మారుతుంది. ఇంగ్లీష్ రాని, అర్థం కాని కస్టమర్ల పరిస్థితి ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా గవర్నమెంట్ కు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఉద్యోగులందరూ కచ్ఛితంగా స్థానిక భాషలో మాట్లాడాలని ఆదేశించనుంది. ఇది కనుక అమలులోకి వస్తే బ్యాంకులన్ని ఎక్కువగా కన్నడీగులకే అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.
కడుపులో గ్యాసు, మంట.. క్షణాల్లో తగ్గించే చిట్కా..!
చాలా మందికి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంటాయి. కడుపు ఉబ్బరం అనేది చాలా సాధారణం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మన శరీరానికి సరిపడని వస్తువులు తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమయంలో శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ ఎసిడిటీ సమస్య ఉన్నప్పుడు ఛాతీలో అసౌకర్యం కలుగుతుంది. కొన్ని ఆహారాలు తిన్న తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. పోషకాహార నిపుణుడు లవనీత్ బాత్రా ప్రకారం, ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు క్యాబేజీ తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం ఏర్పడుతుంది. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సమస్య నుండి బయటపడటానికి ఒక రెసిపీ కూడా ఉంది. కానీ, గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. శీతల పానీయాలు తీసుకుంటే కడుపులో గ్యాస్ తగ్గుతుందని చెబుతున్నారు. కానీ, ఈ పానీయాలలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. కడుపులోకి ప్రవేశించినప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ఎక్కువ ఫ్రక్టాన్లను కలిగి ఉంటాయి.
రెండు రోజుల్లో 240 కోట్లు… కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్
పదేళ్లుగా హిట్ లేదు… అయిదేళ్లుగా సినిమానే లేదు ఇక షారుఖ్ ఖాన్ పని అయిపొయింది అని బాలీవుడ్ మొత్తం డిసైడ్ అయ్యింది… ఒక షారుఖ్ ఖాన్ తప్ప. టైమ్ అయిపోవడం ఏంటి, నేను హిందీ సినిమాకి కింగ్ అని ప్రూవ్ చేస్తూ షారుఖ్ ఖాన్ డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. ఫిలిం హిస్టరీలో ఇప్పటివరకూ చూడని కంబ్యాక్ ని ఇచ్చిన షారుఖ్ ఖాన్, ఒకే ఇయర్ లో రెండు హిట్స్ కొట్టాడు. ముందుగా జనవరిలో పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన షారుఖ్ ఖాన్, ఇప్పుడు జవాన్ సినిమాతో పఠాన్ రికార్డులని బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మొదటి రోజు 129 కోట్లు రాబట్టిన జవాన్… రెండో రోజు 110 కోట్లకి పైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఓవరాల్ ఫైనల్ ఫిగర్ ఇంకా రాలేదు కానీ ఎర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం జవాన్ సినిమా రెండు రోజుల్లో 240 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇది బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. ఈరోజే వీకెండ్ స్టార్ట్ అయ్యింది, సండే ఇంకా బాలన్స్ ఉంది కాబట్టి జవాన్ సినిమా డే 3 అండ్ 4 కలెక్షన్స్ డే 1 రీచ్ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే జవాన్ మూవీ ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే సరికి 500 కోట్ల బెంచ్ మార్క్ ని బ్రేక్ చేయడం గ్యారెంటీ. పఠాన్ సినిమాతో 25 రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టిన షారుక్ జవాన్ సినిమాతో ఆ వెయ్యి కోట్ల మార్క్ ని ఎన్ని రోజుల్లో రీచ్ అవుతాడు అనేది ఇప్పుడు బీటౌన్ లో జరుగుతున్న హాట్ డిస్కషన్.
శంకర్ సర్ సినిమాలు చేస్తున్నారా? సీరియల్స్ చేస్తున్నారా? మరీ పోస్ట్ సమ్మర్ కి వాయిదా ఏంటండీ?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కిస్తున్నాడు, ఈ మూవీతో పాటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నాడు. శంకర్ గ్రాండ్ సెట్స్ కోసం భారీ ఖర్చుని సరదాగా పెడుతుంటాడు శంకర్. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్దే శంకర్ ప్రస్తుత ట్రాక్ రికార్డ్ బాగాలేదు, హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. శంకర్ ఎంత అవుట్ ఫామ్ లో ఉన్నాడు అంటే ఇండియన్ 2 సినిమా సీరియల్ చెక్కినట్లు చిక్కుతూనే ఉన్నాడు. క్లారిటీ లేదో లేక అనివార్య కారణాల ఎఫెక్టో తెలియదు కానీ వాయిదా తర్వాత మొదలైన ఇండియన్ 2 షూటింగ్ ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని 2024 జనవరికి రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. సరేలే ఇండియన్ 2 సంక్రాంతికి వస్తే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సమ్మర్ కి షిఫ్ట్ అవుతుంది, ఎక్కువ సెలవలు దొరుకుతాయి కాబట్టి మన సినిమాకి మంచి జరుగుతుందనుకున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు ఇండియన్ 2 సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ కి కూడా దాటేసి ఆగస్టు 15కి షిఫ్ట్ అవుతుందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ మాటలో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియదు కానీ ఇప్పటికైతే ఇండియన్ 2 ఇండిపెండెన్స్ వీక్ ని టార్గెట్ చేస్తుందని సమాచారం. ఇండియన్ 2 రిలీజ్ అయ్యే వరకూ గేమ్ ఛేంజర్ బయటకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. దిల్ రాజు అంతటి ప్రొడ్యూసర్… మన చేతిలో ఏం లేదు అంతా డైరెక్టర్ చేతిలో ఉంది అనే కామెంట్స్ చేస్తున్నాడు. బాహుబలి, KGF, ఆర్ ఆర్ ఆర్ లా పీరియాడిక్ డ్రామాని అయితే శంకర్ తెరకెక్కించట్లేదు. ఇండియన్ 2 ఫక్తు కమర్షియల్ సినిమా… మరి దీనికి ఎందుకు రెండు మూడేళ్ల సమయం పడుతుందో శంకర్ కే తెలియాలి.