బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో.. బాలయ్య మీకు ఇదే సరైన సమయం..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితి కొనసాగుతూనే ఉంది.. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ సభ్యులు రెండో రోజూ కూడా ఆందోళనకు దిగారు.. అయితే, టీడీపీ సభ్యులకు కౌంటర్‌గా సభలో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు.. నందమూరి బాలకృష్ణకు సలహా ఇస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు.. గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్ గా ఉన్నాడు.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పాడు.. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ.. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు.. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి.. జన్మనిచ్చిన తండ్రి, క్లిస్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది.. ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చిందన్నారు అంబటి.. అంతే కాదు.. మీ బావ (చంద్రబాబు) జైల్లో… అల్లుడు (లోకేష్) ఢిల్లీలో ఉన్నారు.. ఇదే మీకు సరైన సమయం .. పోయిన పగ్గాలు తీసుకోండి.. నందమూరి వంశాన్ని నిరూపించుకోండి.. పార్టీని బ్రతికించుకోండి అంటూ బాలకృష్ణ ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.. పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి.. మీకు నేను సలహా మాత్రమే ఇస్తున్నా.. పాటిస్తే పాటించు.. పాటించకపోతే అథపాతాళానికి పోతావు అంటూ హెచ్చరించారు. మీకు మీ నాయకుడు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే కమాన్ చర్చలో పాల్గొనండి.. ప్రజలే నిర్ణయిస్తారు.. ఎవరు తప్పుచేశారో.. ట్రెజరీ బెంచ్ సిద్ధంగా ఉంది చర్చకు రండి అంటూ సవాల్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేశారు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే టీడీపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు మంత్రి అంబటి.. నేను లేచి నిలబడకపోతే స్పీకర్ మీద దాడి చేసేవారన్న ఆయన.. పేపర్ లో వార్తల కోసం టీడీపీ వ్యవహరించినట్లుగా అనిపిస్తోందని.. ఈ రోజు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే స్పీకర్ కచ్చితంగా చర్యలు తీసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.
బాలకృష్ణ రీల్ హీరో.. జగన్ రియల్ హీరో..
శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. టీడీపీ సభ్యుల ఆందోళనతో అసెంబ్లీ వాయిదా పడడంతో మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణ రీల్ హీరో.. జగన్ మోహన్ రెడ్డి రియల్ హీరో అని అభివర్ణించారు. అయితే, రీల్ హీరోలు సభలో తొడలు కొడితే రియల్ హీరోలు అయిపోరు అంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు 370 కోట్లు దోచుకుని అడ్డంగా దొరికిపోయాడు అని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేశాడు కాబట్టి చంద్రబాబు దోచుకోవడానికి అర్హుడు అనేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సభలో చర్చ జరగకుండా టీడీపీ నేతలు ఎందుకు పారిపోతున్నారు? అని నిలదీశారు. ఇక, అనుచితమైన ప్రవర్తనతో వ్యవహరించేవాడు అసలు నటుడే కాదు అంటూ బాలయ్యపై మండిపడ్డారు కాకాణి.. దేవాలయం వంటి అసెంబ్లీలో తాను చేసిన పనికి ఒక కళాకారుడిగా బాలకృష్ణ సిగ్గుపడాలన్న ఆయన.. టీడీపీ నేతలకు ఇదే నా సవాల్.. మీరు నీతిమంతులైతే.. దమ్ము, ధైర్యం ఉంటే రండి చర్చిద్దాం.. చంద్రబాబు దోపిడీ పై వివరింగా చర్చిద్దాం.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై పూర్తి స్థాయిలో చర్చిద్దాం అంటూ టీడీపీ సభ్యులకు చాలెంజ్ విసిరారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. కాగా, వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా.. టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగింది. దీంతో.. రెండోసారి కూడా అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
బాలయ్య రచ్చ రచ్చ.. నిన్న తొడగొట్టాడు.. నేడు విజిల్స్.. చర్చ మొత్తం అదే..!
నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో యాక్టివ్ అయిపోయారు.. గతంలో అవసరం అయినప్పుడు తప్పితే.. సభకు వచ్చారా? వెళ్లారా? అన్నట్టుగా ఉండే బాలయ్య.. తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత గేర్ మార్చేశారు.. సభలో నిరసన తెలుపుతున్నారు.. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లే ఆందోళన చేస్తున్నారు.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంటూ నినాదాలు చేస్తున్నారు… అధికార పక్షానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నారు. విపక్ష నేతలు రెచ్చగొడితే మీసాలు మెలేసి కౌంటర్ ఇస్తున్నారు.. తొడగొట్టి వార్నింగ్ ఇస్తున్నారు.. అంతే కాదు.. ఈరోజు అసెంబ్లీలో విజిల్స్‌తో హోరెత్తించారు.. ఇలా మొత్తంగా టీడీపీ సభ్యుల ఆందోళన సమయంలో.. నందమూరి బాలకృష్ణ గురించే ఎక్కువ చర్చ సాగుతోంది.. టీడీపీ సభ్యులకు కౌంటర్ ఇస్తూ మాట్లాడుతున్న ప్రతీ మంత్రి, అధికార పార్టీకి చెందిన నేతలు.. బాలకృష్ణ పేరు ఎత్తకుండా మాట్లాడడం లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్ గా ఉన్నాడు.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పాడు అంటూ సెటైర్లు వేసిన మంత్రి అంబటి రాంబాబు.. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ.. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు.. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి.. జన్మనిచ్చిన తండ్రి, క్లిష్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది.. ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చిందన్నారు.. అంతేకాదు.. మీ బావ జైల్లో… అల్లుడు ఢిల్లీలో ఉన్నారు.. ఇదే మీకు సరైన సమయం .. పోయిన పగ్గాలు తీసుకోండి.. నందమూరి వంశాన్ని నిరూపించుకోండి.. పార్టీని బ్రతికించుకోండి అంటూ బాలకృష్ణకు సలహా ఇచ్చారు..
చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. జైలులో పరిస్థితిపై న్యాయమూర్తి ఆరా..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ను మళ్లీ పొడిగించింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ నెల 9వ తేదీన అరెస్ట్ అయిన చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉండగా.. ఆయన రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. దీంతో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు జైలు అధికారులు.. ఆ తర్వాత రిమాండ్ రెండు రోజులు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు.. రిమాండ్ విచారణలో జైలులో ఏమైన ఇబ్బందులు ఉన్నాయా? అని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. జైలులో ఎలాంటి పరిస్థితి ఉంది అని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు చంద్రబాబును విచారించేందుకు సీఐడీ 5 రోజుల కస్టడీ కోరుతుండగా.. దీనిపై చంద్రబాబు అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు న్యాయమూర్తి.. ‘సీఐడీ వాళ్లు మిమ్మల్ని కస్టడీకి కోరుతున్నారు. మీ న్యాయవాదులు కస్టడీ వద్దంటున్నారు.. సీఐడీ కస్టడీపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగి తెలుసుకున్నారు.. అయితే.. చంద్రబాబు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగిస్తు్న్నట్టు పేర్కొన్నారు న్యాయమూర్తి. దీంతో.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబు గడపాల్సి ఉంటుంది. ఇక, చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఈ రోజుకు వాయిదా పడిన విషయం విదితమే కాగా.. మరికొద్ది సేపట్లో దానిపై కూడా తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.
వరుస సస్పెన్షన్లు.. టీడీపీ కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. రెండో రోజు అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే.. టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీంతో.. సభ మొదట 10 నిమిషాల పాటు వాయిదా పడింది.. ఆ తర్వాత మళ్లీ అదే రచ్చ సాగడంతో.. అసెంబ్లీకి బ్రేక్ ఇచ్చారు స్పీకర్.. బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగగా.. శాసన సభలో వీడియో తీస్తున్న టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకున్నారు స్పీకర్.. అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.. అయినా అసెంబ్లీలో గందరగోళం కొనసాగుతూనే వచ్చింది.. దీంతో.. మరో ముగ్గురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.. ఈ సారి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, రామకృష్ణ బాబును సభ నుంచి ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.. దీంతో.. మిగతా టీడీపీ సభ్యులు కూడా అసెంబ్లీని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. మరోవైపు.. మండలిలోనూ చంద్రబాబుపై కేసులు అక్రమం అనే అంశంపై చర్చకు పట్టుబట్టింది టీడీపీ.. శాసనమండలిలోనూ సస్పెన్షన్ల పర్వం కొనసాగింది.. కంచర్ల శ్రీకాంత్, బీటీ నాయుడు, పంచుమర్తి అనురాధను శాసనమండలి చైర్మన్ సస్పెండ్ చేశారు.. బలవంతంగా ఎమ్మెల్సీలను బయటకు పంపించారు తెచ్చిన మార్షల్స్. మండలి లాబీల్లో టీడీపీ ఎమ్మెల్సీల నినాదాలు చేయడంతో.. ఒక రోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో టీడీఎల్పీ కీలక నిర్ణయం తీసుకుంది.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చారు.. ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యేలు.
నగరం కేంద్రపాలిత ప్రాంతం కానుందా..? సోషల్ మీడియాలో జోరుగా చర్చ..!
మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి రంగంలోకి దిగి కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడారు. 2024 జూన్ నుంచి హైదరాబాద్ యూటీగా మారే అవకాశం ఉందని.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను మోదీ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను యూటీ (కేంద్రపాలిత ప్రాంతం – కేంద్రపాలిత ప్రాంతం)గా మార్చనున్నారు. నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైన సంగతి తెలిసిందే.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ యూటీ అవుతుందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. ఈసారి ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా… పులి తోకలా తమదైన రీతిలో కథలు అల్లుతున్నారు. 2024 నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లపాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ గడువు 2024 నాటికి పూర్తవుతుందని.. అందుకే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని కొందరు కొత్త లాజిక్కులు చెబుతున్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటు సమయంలో హైదరాబాద్‌ను యూటీ చేసి తెలంగాణ ఇస్తామని కేసీఆర్ ఒప్పుకున్నారు. అందుకే ఇప్పుడు ఆయన హైదరాబాద్‌ను యూటీ చేయకపోవడానికి కారణం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎగ్ ప్రైడ్ రైస్ తిని యువకుడు మృతి
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కల్తీ ఎక్కువ అయిపోయింది. పాలు దగ్గర నుంచి టీ పొడి, కారాల వరకు ఏదీ స్వచ్ఛంగా ఉండటం లేదు. పాలలో యూరియా కలిపి కల్తీ చేస్తున్న కేటుగాళ్లు, టీ పొడి లాంటి వాటిలో కూడా రంపం పొడి కలిపి విక్రయిస్తున్నారు. ఇక నూనెల కల్తీ గురించి అయితే చెప్పా్ల్సిన పని లేదు. జంతువుల ఎముకల పొడి నూనెలో కలిపి విక్రయిస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో అయితే లాభం కోసం వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీటి కారణంగా ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఇలాంటి వారిని పట్టుకున్నా ఏదో ఒక రకంగా కల్తీలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇక ఫుడ్ పాయిజన్ కారణంగా 27 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తిరుపతి రూరల్ లోని కాలురూలో జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలు విషయం ఏంటంటే తిరుపతి రూరల్ కాలూరుకు చెందిన నరేంద్ర అనే యువకుడు ఓ దుకాణంలో ఎగ్ ప్రైడ్ రైస్ తిన్నాడు. అనంతరం అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటినా రుయా ఆసుపత్రికి తరిలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగానే నరేంద్ర మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ విక్రయించిన దుకాణం పై నరేంద్ర కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసిన ఎంఆర్ పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. నరేంద్ర తిన్న దుకాణంకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. నరేంద్ర చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను ప్రభుత్వం రిలీజ్ చేసింది.. సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 153 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. పూర్తి వివరాలిలా.. ఇంజనీర్(సివిల్)-18, అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-05, అకౌంటెంట్-24, సూపరిండెంట్(జనరల్)-11, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-81, సూపరిండెంట్(జనరల్)-ఎస్‌ఆర్‌డీ(ఎన్‌ఈ)-2, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -ఎస్‌ఆర్‌డీ(ఎన్‌ఈ)-10, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-ఎస్‌ఆర్‌డీ(లద్దాఖ్ యూటీ)-2 పోస్టులు ఉన్నాయి.. జేటీఏ పోస్టులకు 28 ఏళ్లలోపు ఉండాలి. మిగతా ఉద్యోగాలకు 30 ఏళ్లు మించకూడదు. గరిష్ట వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీర్, అకౌంటెంట్, సూపరిండెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.40,000- రూ.1,40,000(ఈ-1) వేతనంగా లభిస్తుంది. అ లాగే జూనియర్ అసిస్టెంట్ ఎంపికైన వారు రూ. 29,000-రూ.93,000 వేతనంగా పొందవచ్చు..
చైనాను చావు దెబ్బ కొట్టిన భారత్.. ఆ దేశ టీవీలు, స్మార్ట్‌ఫోన్లను మనోళ్లు కొంటలేరు
ఒకప్పుడు చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లు అందరినీ ఆకట్టుకునేవి. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చైనా స్మార్ట్‌ఫోన్లు బడా కంపెనీలను కూడా భయపెట్టాయి. అనేక సంబర్భాల్లో చైనీస్ కంపెనీ Xiaomi కంటే ఆపిల్, శామ్సంగ్ కంపెనీలు వెనుకబడి పోయాయి. అయితే, చైనా ఉత్పత్తుల వృద్ధిని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అసలే ఇప్పుడు ఇండియన్ టెలివిజన్ రంగంతో డ్రాగన్‌కి పెద్ద దెబ్బ తగిలింది. భారతీయ టెలివిజన్ రంగంలో తొలిసారిగా చైనీస్ బ్రాండ్ టెలివిజన్ మార్కెట్ తగ్గింది. LG, Samsung వంటి పెద్ద బ్రాండ్లు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. దీని కారణంగా చైనీస్ టెలివిజన్ మార్కెట్ భారీ నష్టాన్ని చవిచూసింది. మరోవైపు, చైనా దాని ఉత్పత్తుల విశ్వసనీయత భారతదేశంలో కూడా తగ్గింది. చైనీస్ బ్రాండ్ మొబైల్ ఫోన్లు, టీవీల అమ్మకాలు భారతదేశంలో తగ్గుతున్నాయి. మార్కెట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ టెక్నాలజీ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. చైనాకు చెందిన ప్రముఖ టెలివిజన్ బ్రాండ్‌లు OnePlus, Real Me త్వరలో భారతీయ మార్కెట్‌ను వదిలివేయవచ్చు లేదా వాటి మార్కెట్‌ను తగ్గించవచ్చు.
యాపిల్ ‘ఐఫోన్ 15’ సిరీస్ సేల్స్ మొదలు.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!
సెప్టెంబర్ 12న జరిగిన వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ-బుకింగ్‌లు సెప్టెంబర్ 15న ఆరంభం కాగా.. ఈరోజు నుంచి భారత్‌లో అమ్మకాలు మొదలయ్యాయి. యాపిల్ అధికారిక స్టోర్స్, ఈ కామర్స్ వెబ్‌సైట్‌ల నుంచి 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా నేటి నుంచి ఈ ఫోన్ విక్రయించబడుతోంది. ఐఫోన్ 15 సిరీస్‌లో చౌకైన ఫోన్ ఐఫోన్ 15. ఈ స్మార్ట్‌ఫోన్ (128GB వేరియెంట్) ధర భారతదేశంలో రూ. 79,900గా ఉంది. 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 89,900 కాగా.. 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,09,900గా ఉంది. ఐఫోన్ 15 ప్లస్128GB వేరియంట్ ధర రూ. 89,900 కాగా.. 256GB వేరియంట్ ధర రూ. 99,900గా ఉంది. ఇక 512GB వేరియంట్ ధర రూ. 1,19,900లకు భారతదేశంలో అందుబాటులో ఉంది.
హాట్ బ్యూటీ సెట్… పూరి టేస్ట్ అంటే మినిమమ్ ఉంటది
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేనితో కలిసి చేస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసాడు పూరి జగన్నాథ్. పది రెడ్ బుల్స్ తాగిన ఎనర్జీని ఒక్క సినిమాతో ఇవ్వడానికి ప్రిపేర్ అవుతన్న ఈ కాంబినేషన్ రీసెంట్ గా ఫారిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని వచ్చింది. ఆ తర్వాత ముంబై షెడ్యూల్ ని కూడా పూర్తి చేసాడు పూరి. ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ కూడా షూటింగ్ జరిగిందని సమాచారం. రామ్ పోతినేనితో పాటు ఒక యంగ్ బ్యూటీతో సాంగ్ షూటింగ్ లో పాల్గొనింది. ఇలియానా, నభా నటేష్, నిధి అగర్వాల్, ఆసిన్, అనుష్క, హన్సిక, అదా శర్మ… ఇలా పూరి సినిమాల్లో హీరోయిన్ ఎప్పుడూ చాలా స్పెషల్ గా యూత్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటారు. లేటెస్ట్ గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ కోసం కూడా పూరి అలాంటి హీరోయిన్ నే ఫిక్స్ చేసినట్లు ఉన్నాడు. హీరోయిన్ విషయంలో పూరి కనెక్ట్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రాలేదు కానీ ముంబైలో జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో రామ్ పోతినేనితో పాటు కావ్య థాపర్ కూడా సాంగ్ లో ఉందని టాక్. తెలుగు ఆడియన్స్ కి ‘ఏక్ మినీ కథ’ సినిమాతో పరిచయం అయిన ఈ నార్త్ బ్యూటీ… మొదటి సినిమాతోనే యూత్ ని మెప్పించింది. క్యూట్ గా కనిపిస్తూనే గ్లామర్ ట్రీట్ ఇవ్వగల కావ్య థాపర్ డబుల్ ఇస్మార్ శంకర్ సినిమాలో హీరోయిన్ అని మేకర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది చూడాలి. ఇప్పటికైతే ఈ ఏడాది చివరికల్లా డబుల్ ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడట పూరి.
బన్నీ కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్…
త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగతో భారీ ప్రాజెక్ట్స్ ఇప్పటికే అనౌన్స్ చేశాడు బన్నీ. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ ‘స్పిరిట్’ అయ్యాక… సందీప్ రెడ్డి సినిమా స్టార్ట్ అవనుంది. అయితే ఈ లోపు ఓ తమిళ్ డైరెక్టర్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్… అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడట. ఇప్పటికే బన్నీకి స్టోరీ కూడా నరేట్ చేసినట్టు సమాచారం. జైలర్ తర్వాత నెల్సన్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాలేదు. ఉంటే బన్నీతోనే ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక వెయ్యి కోట్ల వైపు దూసుకుపోతున్న జవాన్ డైరెక్టర్ అట్లీ కూడా బన్నీతో ఎప్పటి నుంచో టచ్‌లో ఉన్నాడు. కుదిరితే అట్లీతో కూడా బన్నీ సినిమా చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరిలో బన్నీ ఎవరితో సినిమా చేస్తాడనేది ఆసక్తిరంగా మారింది. ఇద్దరు కూడా సాలిడ్ హిట్ కొట్టిన డైరెక్టర్సే కాబట్టి.. ఈ తమిళ తంబీలతో బన్నీ సినిమా చేస్తాడా? లేక ఈ వార్తలు రూమర్స్‌కే పరిమితమవుతాయో చూడాలి.