చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వచ్చే నెలకు వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పు వచ్చేంతవరకు ఆగాలని సుప్రీంకోర్టు సూచించింది.. చంద్రబాబు జైలు లోనే ఉన్నారు.. దర్యాప్తు చేసుకోవచ్చు కదా అని సీఐడీకి సూచించింది ధర్మాసనం. “ఫైబర్ నెట్” కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయగా.. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేసింది సీఐడీ.. చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ “టేరా సాప్ట్” కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపించింది.. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని..
అవినీతి జరిగిందని చెబుతోంది..
బీఆర్ఎస్ పిటిషన్ కొట్టివేత.. రోడ్డు రోలర్‌కి కారుకు తేడా తెలియనంత అమాయకులు లేరు..!
సుప్రీంకోర్టులో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.. అయితే, కారు గుర్తును పోలిఉన్న రోడ్డు రోలర్, చపాతి మేకర్ లాంటి కామన్ ఎలక్షన్స్ సింబల్స్‌ని కేటాయించకుండా చూడాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.. కారును పోలిన ఎన్నికల గుర్తులను కేటాయించవద్దని విజ్ఞప్తి చేసింది.. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీనిపై వాదనలు వినిపించింది.. కానీ, బీఆర్ఎస్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. రోడ్డు రోలర్, చపాతి మేకర్‌కు.. కారు గుర్తుకు తేడా తెలియనంత అమాయకులు కాదు దేశ ఓటర్ల అంటూ వ్యాఖ్యానించింది ధర్మాసనం..
అక్రమాలపై రాహుల్ లెక్చర్లు హాస్యాస్పదం.. కేటీఆర్ మరో పోస్టు
అవినీతిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. టిక్కెట్లు అమ్ముకున్న రేవంత్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో రేవంత్ ఇరుక్కున్నాడు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ అవసరం లేదని మహాత్మా గాంధీ అన్నారని తెలిపారు. ఇలాంటి వాళ్లు పార్టీలో ఉంటారని మహాత్ముడు ఊహించి ఉంటాడని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. పీసీసీ పదవిని రూ.50 కోట్లకు అమ్ముకున్నారని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. ఒకరు పీసీసీ అధ్యక్ష పదవిని అమ్మగా, మరొకరు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఇలాంటి అవినీతి పార్టీలో జరుగుతున్న అక్రమాలపై రాహుల్ ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పేరులోనే స్కాంగ్రెస్ అంటూ మరో పోస్ట్ పెట్టారు.
టిఫిన్ బండి వద్ద దోసెలు వేసిన రాహుల్..
కరీంనగర్ V-పార్క్ నుంచి మూడో రోజు కాంగ్రేస్ విజయ భేరి యాత్ర ప్రారంభమైంది. జగిత్యాల కార్నర్ మీటింగ్ లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ బయలుదేరారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గం మధ్యలో నూకపల్లి NAC స్టాప్ వద్ద రాహుల్ గాంధీ ఆగారు. స్కూటీపై వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించారు. చిన్నారులకు చాక్లెట్స్ అందించారు. రాహుల్ ని చూసిన ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరారు. అయితే వారితో మాట్లాడిన రాహుల్ పక్కనే వున్న టిఫిన్ బండి వద్దకు వెళ్లారు. దోశ తినాలంటే ఎంత డబ్బు కట్టాలంటూ హాస్యాస్పదం చేశారు. నువ్వు కాదు నేను కూడా దోసె వేయొచ్చా.. అని అడిగారు. బండి వద్ద దానికేమి భాగ్యం వేయండి సార్ అంటూ పక్కకు జరిగాడు. నాకు దోస వేయడం రాకపోతే నేర్పిస్తావా అంటూ అనడం కాసేపు అక్కడి వాతావరణం అంతా నవ్వులపువ్వుల కురిపించారు రాహుల్. అయితే రాహుల్ దోస పిండి తీసుకుని దోసె వేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడు సభలు, సమావేశాలు అంటూ తిరుగుతూ తినడానికి కూడా టైమింగ్ లేక ప్రజలకోసం సమయాన్ని కేటాయించే రాహుల్ ఇలా ప్రజల్లో ఉండి వారిలో ఒకరై ప్రచారంలో ముందుకు సాగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాసేపు ఆ బండి వద్దనే ఉండి దోసెని అక్కడి నుంచి జగిత్యాలకు పయనం అయ్యారు.
గుడ్‌న్యూస్ చెప్పిన గూగుల్ పే.. ఇక, ఎక్కడికి పోవాల్సిన పనిలేదు..!
తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది గూగుల్ పే.. భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటిగా ఉన్న గూగుల్ పే.. ఇప్పుడు బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (NBFC) చేతులు కలిపింది.. దీని ద్వారా దేశంలోని తన వినియోగదారులు మరియు వ్యాపారుల కోసం క్రెడిట్-కేంద్రీకృత ఉత్పత్తుల శ్రేణిని తీసుకొచ్చింది.. న్యూఢిల్లీలో గూగుల్ వార్షిక గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ సందర్భంగా, దేశంలోని వ్యాపారులు మరియు వినియోగదారుల కోసం సాచెట్ లోన్‌లను అందిస్తామని కంపెనీ తెలిపింది, వీటిని Gpay యాప్‌లో పొందవచ్చు. టెక్ దిగ్గజం రుణ సేవలను అందించడానికి డీఎంఐ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు పేర్కొంది. ఇక, సాచెట్ లోన్‌లు రూ. 10,000 నుండి రూ. 1 లక్ష వరకు ఉంటాయి.. వాటిని 7 రోజుల నుండి 12 నెలల మధ్య కాలవ్యవధిలో తిరిగి చెల్లించే విధంగా ఉంటాయి.. గత సంవత్సరం, గూగుల్ వ్యాపారుల నుండి కొత్త రుణ అవకాశాలను అందించడానికి చిన్న వ్యాపారాలపై దృష్టి సారించిన రుణ ప్లాట్‌ఫారమ్ Indifiతో భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. గూగుల్ పే వ్యాపారుల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పరిష్కరించడంలో సహాయపడే ఈపేలెటర్ భాగస్వామ్యంతో వ్యాపారుల కోసం క్రెడిట్ లైన్‌ను కూడా ప్రారంభించింది. చిన్న మొత్తంలో రుణాలు అందించేలా గూగుల్.. డీఎంఐ ఫైనాన్స్ సంస్థతో చేతులు కలిపింది. దీంతో వ్యాపారులు గూగుల్ యూపీఐ నుంచి రూ.15,000 లోన్ తీసుకుంటే.. ప్రారంభ ఈఎంఐ రూ.111 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది ఆ సంస్థ. అంటే, చిన్న చిన్న మొత్తానికి మరోకరిని ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా.. జీపేనే నేరుగా లోన్లు ఇవ్వనుంది.
వాట్సాప్ ప్రియులకు గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్..
ప్రముఖ సోషల్ మీడియా ఇంస్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా..వ్యూ వన్స్..తరహాలో వాయిస్ నోట్స్‌పై మరో అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. వీ బీటా అందిస్తున్న సమాచారం ప్రకారం.. యూజర్ల భద్రత కోసం వాయిస్ నోట్స్ అనే ఫీచర్‌పై వాట్సప్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే వాయిస్ రికార్డ్‌లు ఫోన్‌లో స్టోర్ అవ్వకుండా చేస్తుంది.. అవి మళ్లీ సేవ్ చేసుకొనేవరకు అవి అలానే ఉంటాయి.. వాట్సప్ యూజర్ మరో యూజర్ కు వాయిస్ మెసేజ్ చేస్తాడు.. సాధారణంగా అలాంటి వాయిస్ ఫైల్స్ ఫోన్‌లలో స్టోరేజ్ అవడంతో పాటు అనేక భద్రతా సమస్యలు తలెత్తేవి. అయితే, ఈ సమస్యను అధిగమించేలా వాయిస్ నోట్స్ పేరుతో వాయిస్ మెసేజ్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌తో వాట్సప్‌లో పంపిన, లేదంటే రిసీవ్ చేసుకున్న ఆడియో ఫైల్స్‌ని ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలు ఆ తర్వాత అవి కనిపించవు.. మీకు వాట్సప్ ‘వ్యూ వన్స్’ ఫీచర్ గురించి తెలిసిందే. దీని కింద ఎవరైనా పంపిన ఫొటోలు, వీడియోలను ఒకసారి మనం ఓపెన్ చేస్తే వాటంతటవే అదృశ్యమైపోతాయి.. అలాగే ఇప్పుడు వాయిస్ మెసేజ్ లకు కూడా వర్తిస్తుంది. ఒకసారి ఫైల్ ను ఓపెన్ చేస్తే తర్వాత కనిపించవు.. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది..
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి… థానోస్ లాంటోడు రోలెక్స్
అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్.. అవెంజర్స్ ఎండ్ గేమ్… మార్వెల్ సినిమాటిక్ వచ్చిన ఈ రెండు వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ సినిమాలు డౌన్ ది లైన్ ‘వరల్డ్స్ బెస్ట్ సినిమా’ల లిస్టులో చేరిపోతాయి. సూపర్ హీరోస్ అందరినీ ఒక సినిమాలో చూపించి, వాళ్లందరికీ ఒకటే విలన్ ని పెట్టి చేసిన ఎండ్ గేమ్ సినిమా క్లైమాక్స్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ క్లైమాక్స్ లో థానోస్ కి అపోజిట్ గా సూపర్ హీరోలంతా ఫైట్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోవు. ఆ రేంజ్ విజువల్ కనిపిస్తూ ఉంటుంది తెరపైన. సూపర్ హీరోలంతా ఒక ఫోర్స్ గా ఫార్మ్ అయ్యి థానోస్ కి వైకతిరేఖంగా పోరాడి అతన్ని అంతమొందిస్తారు. అందుకే వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ నెగటివ్ క్యారెక్టర్ గా థానోస్ నిలిచిపోయింది. ఇండియన్ థానోస్ గా ఇప్పుడు సూర్య కనిపించబోతున్నాడు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ గా కనిపించిన సూర్య, ఒక స్ట్రాంగ్ విలన్ గా కనిపించాడు. కమల్ హాసన్, కార్తీ, ఫాహద్ ఫజిల్ vs సూర్య వార్ కి గ్రౌండ్ ప్రిపేర్ అవుతున్న సమయంలో… సూర్యకి అపోజిట్ గా లియో దాస్ ని కూడా నిలబెట్టాడు లోకేష్ కనగరాజ్… అంటే కమల్, విజయ్, కార్తీ, ఫాహద్ ఒక టీమ్… వీళ్లందరికీ ఒకడే విలన్ గా థానోస్ నిలబడనున్నాడు. రోలెక్స్ ని పట్టుకోవడానికి, చంపడానికి ఈ హీరోలు ఏం చేస్తారు? వీళ్లని ఆపడానికి సూర్య అకా రోలెక్స్ ఏం చేస్తాడు అనేది విక్రమ్ 2 సినిమాలో హైలైట్ అవ్వనుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఎండ్ గేమ్ లాంటి విక్రమ్ 2 సినిమాలో ఈ అందరూ కలిసి కనిపించనున్నారు. మరి ఈ రోలెక్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మాస్ మహారాజా రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్టుపురం పేరు మోసిన దొంగ నాగేశ్వర రావు బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ గజదొంగగా నటించాడు..వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 సినిమాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. మూవీ విడుదల కు ముందు వచ్చిన ట్రైలర్‌కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది.జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనన టైగర్ నాగేశ్వరరావు సినిమా లోని పాటలు కూడా పర్వాలేదనిపించాయి. ముఖ్యంగా జీవీ ప్రకాష్ బీజీఎమ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. సినిమాలో రవితేజకు సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా చేశారు. రేణు దేశాయ్ మరియు అనుపమ్ ఖేర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఎట్టకేలకు నేడు (అక్టోబర్ 20) పాన్ ఇండియా స్థాయి లో విడుదల చేశారు. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది.టైగర్ నాగేశ్వరరావు సినిమా లో రవితేజ తన యాక్టింగ్‌తో రఫ్పాడించేశాడని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ వివరాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. టైగర్ నాగేశ్వరరావు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందులో తెలుగుతో పాటు అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.అయితే, టైగర్ నాగేశ్వరరావు సినిమాను థియేట్రికల్ విడుదల తర్వాత ఓటీటీలో 8 వారాలకు స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.. అలా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.ఒప్పందం ప్రకారం థియేటర్ల లో దసరాకు విడుదలైన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఈ ఏడాది క్రిస్మస్ కానుక గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
మేము విడిపోయాము.. సంచలన ప్రకటన చేసిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా
బాలీవుడ్ టు టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా అందరికీ సుపరిచితమే, ఇటీవల తన అధికారిక ఖాతా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు.. కానీ శిల్పాశెట్టి గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాకుండా విడిపోయాం.. ఈ కష్ట సమయంలో మాకు సమయం ఇవ్వండి. .దయచేసి మిమ్మల్ని అభ్యర్థించడానికి మేము వ్రాస్తున్నాము. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతోంది. అయితే శిల్పాశెట్టి తన భర్తకు విడాకులు ఇచ్చిందా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ విడాకుల గురించి కాదని, ఇన్నాళ్లూ తాను వేసుకున్న ముసుగు గురించి అని మరికొందరు నెటిజన్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ముసుగు. విడాకుల కేసుపై శిల్పాశెట్టి కూడా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటన చేయలేదని అభిమానులు అంటున్నారు. అలాగే, గురువారం తన భర్త కొత్త సినిమా UT-69 గురించి పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. శిల్పా శెట్టి మరియు రాజ్ కుంద్రా 2009 లో వివాహం చేసుకున్నారు మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజ్ కుంద్రా బయోపిక్ రూపొందుతోంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బ్లూ ఫిల్మ్‌ల కేసులో జైలు జీవితం గురించి కూడా మాట్లాడాడు. లాంచింగ్ వేడుకలో ముసుగు తీసేసినట్లుంది.. మరి ఇది నిజంగా విడాకుల కేసు అయితే ఆ ముసుగు గురించి తెలియాల్సి ఉంది.
