NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

జనసేనకు మరో షాక్.. పార్టీకి కేతంరెడ్డి గుడ్‌బై
జనసేన పార్టీకి మరో షాక్‌ తగిలింది.. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తప్పడంలేదు.. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. నాల్గో విడత వారాహివిజయ యాత్రను కృష్ణా జిల్లాలో విజయవంతం చేశారు.. అయితే, వరుస రాజీనామాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి.. నిన్నటికి నిన్న జనసేన పార్టీకి రాజీనామా చేశారు పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి రాజీనామా చేశారు.. 2014 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. అయితే, మూడు నెలల క్రితం పిఠాపురం ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది జనసేన పార్టీ అధిష్టానం.. దీంతో.. మనస్థాపానికి గురైన మాకినీడి శేషుకుమారి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. మరోవైపు.. నెల్లూరు ఇప్పుడు జనసేన పార్టీకి సీనియర్‌ నేత రాజీనామా చేశారు..

వాయిస్‌ కాల్స్‌ వార్‌ పీక్స్‌కి.. చిత్తూరు జిల్లాలో పొలిటికల్‌ హీట్‌..
వాయిస్‌ కాల్స్‌ వార్‌ ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తుంది.. మంత్రి ఆర్కే రోజాపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషం విదితమే కాగా.. దీనిపై దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఇదే వ్యవహారంలో చిత్తూరు జిల్లాలో పొలిటికల్‌ వాయిస్ కాల్స్ వార్ పిక్స్ కి చేరింది. ఇన్నాళ్లు సోషియాల్ మిడియా వేదికగా మంత్రి ఆర్కే రోజా, నగరి టీడీపీ ఇంఛార్జ్‌ భాను ప్రకాష్ మధ్య నడుస్తోన్న వార్.. ఇప్పుడు కొత్త పుంతలు తొక్కింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసినా వ్యక్తులను ఖండిస్తూ జిల్లాలో కొందరికి వాయిస్ కాల్ వచ్చాయి.. అందులో బండారు చేసిన విమర్శలతో పాటు మంత్రి రోజా తన పడిన కష్టం, ఆవేదన చెప్పుకొచ్చారు.. అంతేకాదు తనకు మద్దతుగా నిలవాలని ఇలాంటి వాటికి తాను ఏమాత్రం భయపడను అని పేర్కొన్నారు. అయితే, ఆ వాయిస్ కాల్స్ కి కౌంటర్ గా నగరి టీడీపీ నేతలు మంత్రి ఆర్కే రోజా సంచలనం వాయిస్ కాల్ లీక్ అంటూ ఓ ఆడియో సోషల్‌ మీడియాలో వదిలారు. నగరితో పాటు జిల్లా మొత్తం అది వైరల్ అయ్యింది. ఆ ఆడియోను ఓపెన్ చేసిన వారికి గతంలో రోజా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబాన్ని, ఇతర నేతలను దూషించిన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. వాటిని కట్ చేసి ఆ ఆడియో రూపంలో ఉండటంతో నగరి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు షాక్ గురవుతున్నారు.. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యేలా ఉందనే చర్చ వారిలో సాగిందటా.. అలా నగరి వేదికగా తాజాగా సాగుతున్న వాయిస్ ఆడియో వార్ ఇప్పుడు జిల్లా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు.. రోజాకు మద్దతుగా కొందరు సినీ స్టార్స్‌ వీడియోలు విడుదల చేస్తుండగా.. సోషల్‌ మీడియాలో వారికి కూడా కౌంటర్లు పడుతున్నాయి.. వారి పెట్టిన పోస్టుల కింద.. గతంలో రోజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పెడుతున్నారు కొందరు నెటిజన్లు.. మరి ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..
ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది హైకోర్టు.. సీఐడీ న్యాయవాదులు సమయం కోరడంతో.. విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. అయితే, ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది.. దీంతో.. హైకోర్టును ఆశ్రయించారు న్యాయవాదులు.. ప్రధాన పిటిషన్‌పై తేలే వరకు మధ్యంతర బెయిల్‌ అయినా ఇవ్వాలని తాజా పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు మరో ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది కాబట్టి.. ఏపీ హైకోర్టు స్కిల్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వాలని కూడా ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే, చంద్రబాబుకు బెయిల్‌ ఇస్తే.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారని వాదిస్తూ వస్తున్నారు సీఐడీ తరపు న్యాయవాదులు.. విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడడంతో.. అప్పుడు ఎలాంటి వాదనలు సాగుతాయనేది ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వ ఆస్పత్రిలో విచిత్ర పరిస్థితి.. ఎవరి ఫ్యాన్‌ వారే తెచ్చుకోవాలి..
ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నీ ఉచితం.. వైద్యం, టెస్ట్‌లు, మందులు ఇలా అన్నీ ఫ్రీగానే ఇస్తారు.. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేనివారు.. ప్రభుత్వ ఆస్పత్రినే నమ్ముకుంటారు.. ఇక, ప్రసవాల కోసం ఎక్కువ మంది ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు.. కానీ, సరైన సౌకర్యాలు లేక గర్భిణిలు అల్లాడిపోతున్నారు. ఇదే ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే.. అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాంతీయ వైద్యశాలలో రోగులు విచిత్రమైన పరిస్థితి నెలకొంది.. ఆసుపత్రిలో వైద్యం ఉచితమే కానీ, ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవాలి అనేలా తయారైంది పరిస్థితి.. పీలేరు పాత భవనంలోని ప్రసూతి వార్డులో రెండు సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి. కానీ, అవి పాతవి కావడంతో వాటి నుంచి వచ్చే గాలి సరిపోవడం లేదు. దీంతో.. వార్డులోని మహిళలు ఉక్కపోతకు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.. రోగుల పరిస్థితిని క్యాష్‌ చేసుకోవడానికి ప్రైవేట్‌ వ్యక్తులు రంగ ప్రవేశం చేశారు.. ఆసుపత్రి ఆవరణలోని ప్రైవేటు మందుల దుకాణం నిర్వాహకులు ఫ్యాన్లను అద్దెకు ఇవ్వడం మొదలు పెట్టారు.. స్టాండింగ్ ఫ్యాన్లకు అద్దె వసూలు చేస్తూరు. ఒక్కో ఫ్యాన్‌ కోసం 500 రూపాయాలు డిపాజిట్ చేస్తే.. రోజుకు 50 రూపాయలు అద్దె వసూలు చేస్తున్నారు.. దీంతో.. రోగులు గగ్గోలు పెడుతున్నారు.. ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్తే స్తోమత లేకే.. ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే.. ఇక్కడ ఫ్యాన్ల గోల ఏంటి? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, అధికారులకు పలుమార్లు ఈ విషయాలను చెప్పినా స్పందించడం లేదని వాపోతున్నారు రోగులు.

బియ్యం ఎగుమతులపై ఆంక్షలు పెంచనున్న ప్రభుత్వం.. ధరలు పెరిగే ఛాన్స్
బియ్యం అతిపెద్ద ఎగుమతిదారు భారతదేశం అన్న సంగతి తెలిసిందే. మన దేశం బియ్యం విషయంలో తీసుకున్న ప్రతి నిర్ణయం ఆసియాతో సహా ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలను ప్రభావితం చేస్తుంది. దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించేందుకు, బాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎగుమతి సుంకాన్ని పొడిగించే అంశాన్ని మోడీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాబోయే పండుగల సీజన్, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని జూలై నెలాఖరులో బాయిల్డ్ రైస్ ఎగుమతిపై 20 శాతం సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయం అక్టోబర్ 15, 2023 వరకు వర్తిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఫీజు విషయంలో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎగుమతి సుంకాన్ని 40 శాతానికి పెంచే ఆలోచనలో ప్రభుత్వం లేదని, అయితే దానిని 20 శాతానికి స్థిరంగా ఉంచవచ్చని కొందరు అధికారులు తెలిపారు.

మహిళపై సామూహిక అత్యాచారం.. పోలీసుల వింత విచారణ.. అధికారులపై మండిపడ్డ కోర్టు
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 55 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల వింత విచారణ వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో ‘లైంగిక దోపిడీ’ అనే పదం ఎక్కడా ప్రస్తావించబడలేదు. దర్యాప్తుపై ఢిల్లీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు నాసిరకంగా ఉందని కోర్టు అభివర్ణించింది. దీంతో పాటు ఏసీపీ ర్యాంక్ అధికారికి, అతని కింది అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రోహిణి కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి ధీరేంద్ర రాణాకు నేరం గురించి మొదటిరోజే తెలిసింది, అయితే ఢిల్లీ పోలీసులు చేసిన పని చాలా ఆశ్చర్యంగా ఉంది. సామూహిక అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాల్లో విచారణ ఈ స్థాయిలో ఉంటే.. ఇతర చిన్న నేరాల గురించి ఏం చెప్పలేమని జస్టిస్ రాణా అన్నారు.

అయ్యర్‌ భయ్యా.. ఒక్క సింగిల్ తీయవా?! విరాట్ కోహ్లీ వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్‌ 2203లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (80; 88 బంతుల్లో 8×4, 1×6), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (62; 69 బంతుల్లో 2×4, 4×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. జస్ప్రీత్ బుమ్రా (4/39) నాలుగు వికెట్స్ పడగొట్టాడు. అనంతరం భారత్ 35 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 273 రన్స్ చేసి గెలిచింది. రోహిత్‌ శర్మ (131; 84 బంతుల్లో 16×4, 5×6) సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ (55 నాటౌట్‌; 56 బంతుల్లో 6×4) హాఫ్ సెంచరీ చేశాడు. ఛేదనలో 34 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 261-2గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (44), శ్రేయాస్ అయ్యర్‌ (24)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 12 పరుగులు అవసరం కాగా.. కోహ్లీ హాఫ్ సెంచరీకి ఓ సిక్స్ అవసరం అయింది. అయితే అప్పటికే శ్రేయాస్ 101 మీటర్ల సిక్స్, ఓ బౌండరీ బాది మంచి ఊపుమీదున్నాడు. శ్రేయాస్ ఊపు చూస్తే.. అతడే మ్యాచ్ ఫినిష్ చేసేలా కనిపించాడు. అయితే అలా జరగలేదు. అజ్మతుల్లా వేసిన 35వ ఓవర్ మొదటి బంతికి ఫోర్ బాదిన కోహ్లీ.. మూడో బంతికి సింగిల్ తీశాడు. దాంతో కోహ్లీ హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచాడు.

గంగాజలంపై 18శాతం జీఎస్టీ.. అవాక్కవుతున్న భక్తులు
పోస్టాఫీసు నుంచి వచ్చే గంగాజలంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించింది. అంటే 250 ఎంఎల్ బాటిల్ రూ.30కి కొంటే.. ఇప్పుడు రూ.35 చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం గంగాజల్ ఆప్కే ద్వార్ పథకం 2016లో ప్రారంభించబడింది. గంగాజలాన్ని ప్రజలకు సులువుగా అందుబాటులో ఉంచడంతోపాటు పోస్టాఫీసుల ఆదాయాన్ని పెంచడమే దీని లక్ష్యం. మొదట్లో రిషికేశ్, గంగోత్రి నుంచి వచ్చే 200, 500 మిల్లీలీటర్ల గంగాజలం ధర వరుసగా రూ.28, రూ.38 ఉండగా, ప్రస్తుతం తపాలా శాఖ గంగోత్రి నుంచి 250 మిల్లీలీటర్ల గంగాజలాన్ని అందిస్తోంది. దీని ధర రూ. 30, కానీ 18 శాతం జిఎస్‌టి విధించిన తరువాత, దాని ధర ఇప్పుడు రూ. 35 గా మారింది. ఇప్పుడు గంగా నీటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఒక్కో బాటిల్‌కు రూ. 125 ఖర్చు అవుతుంది. ఎందుకంటే…. భారత తపాలా శాఖ వెబ్‌సైట్‌లో గంగాజల్‌ను కొనుగోలు చేస్తే స్పీడ్‌ పోస్ట్‌ ఛార్జీతో పాటు గంగోత్రికి చెందిన 250 ఎంఎల్‌ గంగాజల్‌ బాటిల్‌ రూ.125కి, రెండు బాటిళ్లు రూ.210కి, నాలుగు బాటిళ్లు రూ.345కి లభిస్తాయి. గంగాజలాన్ని పోస్ట్‌మ్యాన్ ఇంటికి డెలివరీ ఇస్తారు. ఈ పథకం కింద పోస్టల్ శాఖ గతంలో గంగోత్రి, రిషికేశ్ నుండి నీటిని అందించేది. అయితే గత కొన్నేళ్లుగా గంగోత్రి నుండి మాత్రమే నీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ.. గంగా మూల ప్రదేశం కాబట్టి ఇది స్వచ్ఛమైన గంగా జలంగా పరిగణించబడుతుంది. రాజకీయ నాయకులు హిందూ మతంలో, మతపరమైన ఆచారాలలో గంగా జలానికి బంగారు హోదా ఉందని, మతపరమైన తీర్థయాత్రలకు వెళ్ళే భక్తులు తమతో గంగాజలాన్ని తీసుకువస్తారని నమ్ముతారు. ప్రజలు ఇంట్లో పూజలు నిర్వహిస్తారు. గంగాజల వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అటువంటి పరిస్థితిలో గంగా జలంపై GST విధించడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణిస్తున్నారు.

సీజన్‌కో సినిమా… ఇది అన్‌స్టాపబుల్ అంటే!
బాలయ్యలోని అన్‌స్టాపబుల్ యాంగిల్‌ను చూసి జనాలు ఇంతలా ఎంటర్టైన్ అవుతారని… అల్లు అరవింద్ ఎలా గెస్ చేశారో తెలియదు గానీ బాలయ్య హోస్టింగ్ తో దుమ్ములేచిపోయింది ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షో. ఒకరు ఇద్దరు అని కాదు… టాలీవుడ్ లెజెండ్స్‌ అందరితోనూ రచ్చ చేశారు బాలయ్య. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్… ఇప్పుడు మూడో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. గత రెండు సీజన్లలో తన రెండు సినిమాల టీమ్‌తో సందడి చేసిన బాలయ్య… ఇప్పుడు భగవంత్ కేసరి టీమ్‌తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఫస్ట్ సీజన్ వచ్చినప్పుడు అఖండ రిలీజ్ అయింది… సెకండ్ సీజన్‌లో వీరసింహారెడ్డి థియేటర్లోకి వచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో రెండుసార్లు వంద కోట్లు రాబట్టాడు బాలయ్య. ఇక ఇప్పుడు మరో హండ్రేడ్ క్రోర్స్ కొట్టేందుకు భగవంత్ కేసరిగా వస్తున్నాడు. అయితే.. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే అన్‌స్టాపబుల్ థర్డ్ సీజన్ రావడం విశేషం. అసలు అన్‌స్టాపబుల్ ఆహా వారి కోసం చేస్తున్నట్టుగా లేదు… బాలయ్య సినిమాల కోసమే ఈ షో చేస్తున్నట్టుగా.. సీజన్‌కో సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు బాలయ్య. తాజాగా మూడో సీజన్‌ ఫస్ట్ ఎపిసోడ్‌ను భగవంత్ కేసరి మూవీ టీంతో స్టార్ట్ చేయనున్నారు. అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్‌గా రానున్న ఈ సీజన్‌ ఫస్ట్ ఎపిసోడ్‌ను అక్టోబర్ 17న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటికే భగవంత్ కేసరి హీరోయిన్లు కాజల్, శ్రీలీల, విలన్ అర్జున్ రామ్ పాల్, డైరెక్టర్ అనిల్ రావిపూడితో షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. దీంతో సీజన్ 3 కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

టీవీ లోకి రాబోతున్న బ్రో మూవీ..54 అడుగుల కటౌట్ తో కౌంట్ డౌన్..
పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ కలిసి నటించిన చిత్రం బ్రో.. ది అవతార్‌. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో లో కేతికా శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు.అలాగే బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. భారీ అంచనాలతో జులై 28న థియేటరర్లలో విడుదలైన బ్రో సినిమా మంచి విజయం సాధించింది.. మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమాలో మొదటిసారి మామా అల్లుళ్లు కలిసి నటించడం అలాగే పవన్ వింటేజ్‌ లుక్స్‌ మరియు సాంగ్స్‌ కు ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్‌ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.. దీంతో బాక్సాఫీస్‌ వద్ద బ్రో మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌లో కూడా బ్రో సినిమా సందడి మొదలైంది. ఇక్కడ కూడా బ్రో మూవీకి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. పాకిస్తాన్‌ మరియు బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో కొన్ని రోజుల పాటు బ్రో టాప్‌ ట్రెండ్‌లో నిలవడం విశేషం. ఇలా థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసిన బ్రో ఇప్పుడు టీవీలోకి రాబోతుంది.. అక్టోబర్‌ 15న జీ తెలుగు ఛానెల్‌లో సాయంత్రం 6 గంటలకు బ్రో మూవీ ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను జీ తెలుగు ఛానెల్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు జీ తెలుగు ఓ స్వీట్‌ సర్‌ప్రైజ్ ను ఇచ్చింది. హైదరాబాద్‍లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద పవన్‍ కల్యాణ్ 54 అడుగుల భారీ కటౌట్‍ను ఏర్పాటుచేసింది.

రజినీకాంత్ కథ ముందు చెప్పింది విజయ్ కే – లోకేష్ కనగరాజ్
ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ ని రీచ్ అయ్యాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. నైట్ ఎఫెక్ట్ లో, యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ని బాలన్స్ చేసే సినిమాలు ఎక్కువగా చేసే లోకేష్ కనగరాజ్… తనకంటూ ఒక స్పెషల్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా విక్రమ్ సినిమా క్లైమాక్స్ తో లోకేష్ కనగరాజ్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా లియో. మాస్టర్ సినిమా తర్వాత లోకీ అండ్ విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని అందుకోవడంలో ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదని లియో ట్రైలర్ క్లియర్ కట్ గా చెప్పేసింది. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీ తర్వాత లోకేష్ కనగరాజ్ తలైవర్ రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నెక్స్ట్ మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ మూవీ ‘తలైవర్ 171’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇటీవలే లియో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో లోకేష్ కనగరాజ్ ‘తలైవర్ 171’ గురించి మాట్లాడుతూ… “రజినీకాంత్ సర్ కోసం కథని ఖైదీ కన్నా ముందే రాసుకున్నాను. కేవలం 20 నిముషాలు మాత్రమే రజినీ సర్ కి చెప్పను, దుమ్ము లేపేద్దాం అన్నారు. రజినీ సర్ కన్నా ముందు విజయ్ సార్ కి ఈ కథ చెప్పాను భయంకరంగా ఉంది, ఇలాంటి కథని ఇప్పటివరకూ వినలేదు అని చెప్పాడు” అని లోకేష్ చెప్పాడు. జైలర్ సినిమాతో ‘టైగర్ కా హుకుమ్’ అని 650 కోట్లు కలెక్ట్ చేసిన రజినీకాంత్ మరి లోకేష్ కనగరాజ్ తో ఎలాంటి ఇండస్ట్రీ రికార్డ్స్ ని నమోదు చేస్తాడు అనేది చూడాలి.