Site icon NTV Telugu

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

డబ్బులు పంచుతూ దొరికిపోయిన ఎక్సైజ్ ఆఫీసర్‌.. వేటువేసిన ఈసీ..
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది.. ఇక, సైలెంట్‌గా రంగంలోకి దిగుతున్నారు నేతలు.. తమ అనుచరులను క్షేత్రస్థాయిలోకి దింపి.. ప్రలోభాలకు తెరలేపుతున్నారు.. ఓవైపు మద్యం.. మరోవైపు డబ్బులు.. ఇలా ఏది సాధ్యం అయితే అది అనే తరహాలో.. ఓట్ల కోసం.. వేట ప్రారంభిస్తున్నారు.. అయితే, ఈ ప్రలోభాల పర్వంలో కొందరు అధికారులు కూడా పాల్గొనడం చర్చగా మారింది.. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో డబ్బులు పంచుతూ దొరికిపోయిన వరంగల్ ఎక్సైజ్ అధికారి అంజిత్ రావును ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. నిన్న చెంగిచర్ల క్రాస్ రోడ్‌ దగ్గర కారులో పెద్ద ఎత్తున డబ్బు సంచులు లభ్యమయ్యాయి. బీఆర్‌ఎస్‌ నేతలు… కారులో డబ్బులు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. కాంగ్రెస్‌ నాయకులు కారును అడ్డగించారు. కారులో 5 వందలు, 2 వందల నోట్ల కట్టలు ఉన్న బ్యాగులు గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తి గురించి ఆరా తీయగా.. సీఐ అంజిత్‌ రావు పేరుతో ఉన్న ఐడీ కార్డు లభ్యమైంది. పోలీసు అయ్యి ఉండి అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున డబ్బులు పంచుతున్నారన్న కోపంతో కాంగ్రెస్‌ నేతలు అంజిత్‌రావును నిలదీశారు. వెంటనే సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎన్నికల అధికారులు.. డబ్బును, కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎక్సైజ్‌ అధికారి అంజిత్‌ రావును సస్పెండ్‌ చేస్తున్నట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

24వ రోజుకు చేరిన వైసీపీ సామాజిక సాధికార యాత్ర.. ఈ రోజు షెడ్యూల్..
ఇవాళ 24వ రోజు సామాజిక సాధికార యాత్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం, పార్వతీపురం జిల్లా కురుపాంలో జరగనుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో సాగనుంది సామాజిక సాధికార బస్సు యాత్ర.. గరుగుబిల్లి మండలం నదివానివలస జట్టు ఆశ్రమంలో వద్ద సమావేశం నిర్వహించనున్నారు.. నందివానివలస నుంచి మేరంగి మీదుగా ర్యాలీ నిర్వహిస్తారు.. కురుపాం జంక్షన్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సు యాత్రకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, వైసీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఉత్తరాంధ్రలో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.

ఎన్నికలపై డేగ కన్ను.. బందోబస్తుకే రూ. 150 కోట్ల ఖర్చు..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లలో కనివిని ఎరుగని రీతిలో చర్యలు చేపట్టింది. ఎంత వ్యయమైనా సరే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిపేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. చీమ చిటుక్కుమన్నా వాలిపోయే భద్రతా బలగాలు. ఘర్షణలకు తావులేకుండా పటిష్టమైన పహారా. కేవలం ఎన్నికల బందోబస్తు కోసమే ఎన్నికల కమిషన్‌ అక్షరాల 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందట.. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 119. ఇందులో సమస్యాత్మకమైనవి 106. పోలింగ్‌ కేంద్రాలు 35,655. ఈ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను వినియోగిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 50వేల మంది పోలీసులను కేటాయించింది. ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు ఏకంగా 150 కోట్లు అవుతుందని ఈసీ అంచనా వేస్తోంది. ఈ ఎన్నికల్లో కేవలం బందోబస్తు ఖర్చు రూ. 150 కోట్లు.. కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బలగాలతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే రాష్ట్ర పోలీసుల అలవెన్సులు, వాహనాలకు రూ.150 కోట్ల వరకు ఖర్చు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. గత ఎన్నికల్లో మొత్తం రూ.100 కోట్లు ఖర్చు కాగా.. ఇప్పుడు రూ.150 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయి… ఫలితాలు వెలువడే వరకు పోలీసులు విధులు నిర్వహించాల్సి ఉంది. అక్టోబర్ 9 నుంచి రాష్ట్రంలో తనిఖీల కోసం 373 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 374 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 95 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి పారామిలటరీ బలగాలు ఇలా ఖర్చు పెరుగుతూ పోయింది.

ఓటుకు నోటు కేసు.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఓటుకు నోటు కేసులో విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో విచారణ వాయిదా వేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.. దీంతో.. ఓటుకు నోటు కేసులో విచారణను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.. కాగా, ఈ రోజు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వేసిన పిటిషన్ల జస్టిస్ ఎంఎం సుందరేష్‌, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.. ఓటు కు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చాలంటూ.. ఆ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు ఆర్కే.. అయితే, ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా కోరారు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. దీంతో.. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కాగా, ఓటుకు నోటు కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఓవైపు.. విపక్ష నేత అయిన చంద్రబాబు, టీడీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. మరోవైపు.. పాత కేసులను కూడా వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేద్దాం: కిషన్​ రెడ్డి
తెలంగాణలో గురువారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్ జి కిషన్​ రెడ్డి కోరారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్​లోని చార్మినార్​ను వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఈరోజు కిషన్​ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం కిషన్​ రెడ్డి మాట్లాడుతూ… ‘దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 41 మంది కార్మికులు సొరంగం నుంచి 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు వచ్చారు. ఇది నిజంగా గొప్ప విషయం. వాళ్లు ధైర్యంగా బయటకు వచ్చినందుకు అమ్మవారికి ఈరోజు ప్రార్థనలు చేశాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్చలు జరిపి.. కార్మికులను బయటకు తీసుకురావడం గొప్ప విషయం’ అని అన్నారు.

రేపే పోలింగ్‌.. ప్రలోభాల జాతర పీక్స్‌కి..!
ఓటును నోటుతో కొనే పర్వం పతాకస్థాయిలో చేరుతోంది. నడి బజారులో ఓటనే వజ్రాయుధాన్ని చిల్లర పైసలకు కొనే సామదాన దండోపాయం భీకరంగా సాగుతోంది. నోట్ల కట్టలతో ఐదేళ్ల ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టే బేరం రంజుగా జరుగుతోంది. ఏ ఒక్క ఓటునూ వదులుకోవడానికి సిద్దంగాలేని అభ్యర్థులు ధనాన్ని వెదజల్లేందుకు వెనకాడ్డం లేదు. పోటాపోటీ రాజకీయంలో ప్రతీ ఓటు కీలకమైనదని భావిస్తున్న అభ్యర్థులు.. ఏ చిన్న అవకాశాన్నీ మిస్ చేసుకోవడానికి రెడీగా లేరు. వచ్చే ఐదేళ్ల కాలానికి కీలకమైన ఈ రెండు రోజుల్లో ప్రతీ క్షణాన్ని ఎంతో విలువైనదిగా లెక్కకడుతూ ఓటుకు నోటు చొప్పునా కొనేస్తున్నారు. అలా ప్రచారపర్వం ముగిసిందో లేదో నోట్ల సంచులు, ఓటర్ల జాబితాను వెంటబెట్టుకుని ఇల్లిళ్లు తిరగడం మొదలుపెట్టారు. కులసంఘాలు, మహిళా సంఘాలను ఆకట్టుకునేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు. డబ్బు, మద్యం, మాంసం, బంగారం ఇలా వారు ఏది కోరితే వాటిని ఇచ్చేందుకు డబ్బులు వెదజల్లుతున్నారు. గంపగుత్తగా ఓట్లు వేయించుకునేలా కుల సంఘాలపై కాసుల వల కురిపిస్తున్నారు. ఓటర్ల సంఖ్యను బట్టి సింగిల్ పేమెంట్ తో సెటిల్మెంట్ చేసుకునేందుకు సై అంటే సై అంటున్నారు. పంపకాల సమయంలో పోలీసులు, ఇతర ఎన్నికల పర్యవేక్షణ అధికారులకు చిక్కకుండా ఉండేందకు పకబ్బందీ ఏర్పాట్లు సెట్ చేసుకుంటున్నాయి.

క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌..
సఫాయి కార్మికుల కోసం క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. స్వచ్ఛత ఉద్యమి యోజన కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా లబ్దిదారులకు 100 మురుగుశుద్ధి వాహనాల అందజేశారు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సఫాయి కార్మికులు వినియోగించే క్లీనింగ్ యంత్రాలను జెండా ఊపి ప్రారంభించారు ఏపీ సీఎం.. ఇక, ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. మురుగు నీరు, చెత్త నిర్మూలన వాహనాను అందుబాటులోకి తెచ్చింది.. సఫాయి కర్మచారీల కోసం 100 మురుగు శుద్ధి వాహనాలను ప్రారంభించారు సీఎం వైఎస్‌ జగన్‌.. జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఆయన.. పారిశుద్ధ్య కార్మికులకు వాహనులకు సంబంధించిన కీలను అందజేశారు.. మరోఎవైపు, రేపు నంద్యాల, కడప జిల్లాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. సాయంత్రానికి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌.. ఎన్నికల స్క్వాడ్‌ అభ్యంతరం!
హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ చేపట్టిన ‘దీక్షా దివస్‌’పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్క్వాడ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు మంగళవారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఈసీ అభ్యంతరం తెలిపింది. పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించొద్దని ఈసీ అధికారులు అనగా.. దీక్షా దివస్‌ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. ఆపై తెలంగాణ భవన్‌కు మంత్రి కేటీఆర్‌ చేరుకున్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిర కార్యక్రమం ప్రారంభించి.. రక్తదానం చేశారు. అనంతరం దీక్షా దివస్‌పై మాట్లాడారు. ఆనాటి ఉద్యమ చైతన్యాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాలని కేటీఆర్ అన్నారు. 2009లో సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి బీజం పడిన రోజు 2009 నవంబర్‌ 29. తెలంగాణ రాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్‌ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో…’ అని నినదిస్తూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఢిల్లీ పీఠం దిగొచ్చేందుకు నాంది పలికారు. సరిగ్గా నేటితో తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ నిరాహార దీక్షకు దిగి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దీక్షా దివస్‌ కార్యక్రమం చేపట్టారు.

తన సత్తా ఏంటో చూపిన సౌదీ అరేబియా.. వరల్డ్ ఎక్స్‌పో హోస్టింగ్ హక్కులు సొంతం
వరల్డ్ ఎక్స్‌పో 2030 హోస్టింగ్ హక్కులను సౌదీ అరేబియా పొందింది. మంగళవారం ప్రకటించగానే రాజధాని రియాద్‌ వెలిగిపోయింది. ఎక్స్‌పో 2030కి ఆతిథ్యం ఇచ్చే రేసులో మూడు దేశాలు పాల్గొన్నాయి కానీ సౌదీకి మాత్రమే ఆతిథ్యం లభించింది. సౌదీతో పాటు దక్షిణ కొరియా, ఇటలీ కూడా హోస్టింగ్ రేసులో పాల్గొన్నాయి. వరల్డ్ ఎక్స్‌పో 2030కి హోస్ట్‌గా మారడం ద్వారా సౌదీ తన శక్తిని ప్రపంచానికి అందించింది. వరల్డ్ ఎక్స్‌పో 2030కి ఆతిథ్యం ఇవ్వడానికి సంబంధించి ఓటింగ్ జరిగింది. పారిస్‌లోని బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్‌పోజిషన్స్‌కు చెందిన 182 మంది సభ్యులు తమ ఓటు వేశారు. సౌదీకి అత్యధికంగా 119 ఓట్లు వచ్చాయి. దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలిచింది. దీనికి 29 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో ఇటలీకి కనీసం 17 ఓట్లు వచ్చాయి. అక్టోబర్ 2030 నుండి మార్చి 2031 వరకు సౌదీ ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తుంది. వరల్డ్ ఎక్స్‌పోకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత సౌదీ 2034లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది.

కింగ్ ఆఫ్ బాలీవుడ్… రొమాన్స్‌కి స‌రికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడా?
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023లో ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లో హిట్స్ కొట్టిన షారుఖ్… ఈసారి ఫన్ తో హిట్ కొట్టడానికి డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. డంకీ సినిమా హిట్ అయితే ఏడాదిలో మూడు హిట్స్ కొట్టిన ఏకైక స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నిలుస్తాడు. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ ని అందరూ కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటారు. లవ్ స్టోరీస్, లవ్ సీన్స్ లో షారుఖ్ పెర్ఫార్మెన్స్ ఆ రేంజులో ఉంటుంది. అయితే లేటెస్ట్ గా తన కంబ్యాక్ తర్వాత షారుఖ్ ఖాన్ రొమాన్స్ విషయంలో రూటు మార్చినట్లు ఉన్నాడు. షారూక్ ఖాన్‌, రాజ్‌కుమార్ హిరాణి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న డంకీ నుంచి రీసెంట్‌గా ‘లుట్ పుట్ గయా..’ అనే సాంగ్‌ను ‘డంకీ డ్రాప్ 2’గా మేక‌ర్స్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. హార్డీ పాత్ర‌లో షారూక్‌, మ‌ను పాత్ర‌లో తాప్సీ మ‌ధ్య ఉండే ప్రేమ‌ను తెలియ‌జేసే ఈ పాట‌కు వ‌ర‌ల్డ్ వైడ్ అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు సంగీతాభిమానులు సైతం ఈ పాట‌కు ఫిదా అయ్యారు. ఇప్పుడు మ‌రోసారి జ‌వాన్ సినిమాలో కుస్తీ గ్రౌండ్ మ్యాజిక్‌ను షారూక్ డంకీలోనూ తాప్సీతో రిపీట్ చేస్తున్నారు.

గ్రీన్ శారీలో వయ్యారాలను వలకబోస్తున్న బుట్ట బొమ్మ..
టాలివుడ్ ముద్దుగుమ్మ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్లాప్ సినిమాలతో పనిలేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. నాజుకూ నడుము చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. మరోవైపు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా గ్రీన్ శారీలో వయ్యారాలను వలకబోసింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. డిఫరెంట్‌ స్టయిల్‌ డ్రెస్సులు ధరించింది. ట్రెండీ వేర్‌లో అదిరిపోయే పోజులిచ్చింది. ఇందులో సూపర్‌ హాట్‌గా ఉండటం విశేషం.. ఈ అమ్మడు టాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్ తో కలిసి నటించింది. ప్రభాస్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, బన్నీ, రామ్‌చరణ్‌ వంటి వారితోనూ కలిసి నటించింది. యంగ్‌ హీరోలతోనూ జోడీ కట్టింది. వరుస అవకాశాలే కాదు, వరుస విజయాలతోనూ లక్కీ హీరోయిన్‌గా మారింది… కానీ గతేడాది ఈ బ్యూటీకి కలిసి రాలేదు. ఊహించని దెబ్బలు తగిలాయి. నటించిన నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి..

Exit mobile version