NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత!
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, కథనాయకుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో శనివారం ఉదయం 9.45 గంటలకు హృద్రోగంతో కన్నుమూశారు. ఆయన వయసు 78 ఏళ్లు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. గత కొన్నాళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న చంద్రమోహన్‌.. కొన్నాళ్లుగా కిడ్నీ డయాలసిస్‌ జరుగుతోంది. 1945 మే 23న క్రిష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో చంద్రమోహన్‌ జన్మించారు. చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. 1966లో రంగుల రాట్నం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. హీరోగా 175 సినిమాలు చేసిన ఆయన మొత్తంగా 932 సినిమాలు చేశారు. 2005లో అతనొక్కడే సినిమాకు గాను నంది అవార్డు ఆయనకు దక్కింది. కథనాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా వైవిధ్య పాత్రలు చంద్రమోహన్‌ చేశారు. రెండు ఫిలింఫేర్‌, 6 నంది అవార్డులను ఆయన అందుకున్నారు.

45 రోజుల తర్వాత అందుబాటులోకి రోడ్ కం రైల్వే బ్రిడ్జి
రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నేటి నుండి రాకపోకలు పునరుద్దరించారు. రెంఢు కోట్ల 10 లక్షల రూపాయాల వ్యయంతో చేపట్టిన మరమ్మతు పనులు చేపట్టి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. 4 పాయింట్ 4 కిలో మీటర్లు పొడవైన ఈ బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతి పొడవైనది. 45 రోజులుగా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడిన వాహనదారులు ఇప్పుడు సాపీగా ప్రయాణం చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏపీలో చారిత్రక నేపథ్యం ఉన్న అతి కొద్ది భారీ వంతెనల్లో రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన కూడా ఒకటి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బహుళ ప్రయోజన వంతెన మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా.. కింద రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. చక్కగా ఒంపు తిరిగి ఉండే ఈ వంతెన గోదావరి జిల్లాలకు మణిహారంలా ఉంది.

చరిత్ర సృష్టించటం జగన్ వల్లే సాధ్యం.. జగన్ అంటే ఒక బ్రాండ్
చరిత్ర సృష్టించటం జగన్ వల్లే సాధ్యం.. జగన్ అంటే ఒక బ్రాండ్ అంటూ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మైనారిటీస్‌ వెల్పేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే ఉత్సవాల్లో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా రూపకల్పన చేయటంలో మౌలానా అబుల్ కలాం పాత్ర కీలకమైనది.. యూజీసీ, అనేక సాంకేతిక సంస్థలను మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థాపించనవే.. దార్శనికుడు మౌలానా అబుల్ కలాం.. ఆయన వేసిన బీజాలే ఇవాళ విద్యా రంగంలో మనం చూస్తున్న ఫలితాలు అని కొనియాడారు. ఇక, మౌలానా అబుల్ కలాం ఆదర్శాలు, స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళుతున్నారు సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు అంజాద్‌ బాష.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మా పిల్లలు ఉన్నత విద్య చదువుకోగలిగారు.. తండ్రికి మించిన తనయుడిగా మైనారిటీ వర్గాలకు ఆర్ధిక, రాజకీయ సాధికారత కల్పించారు జగన్ అన్నారు. ముస్లింలకు చిత్తశుద్ధితో రాజకీయ సాధికారత కల్పించిన వ్యక్తి జగన్ అని.. ఆంధ్రప్రదేశ్ మొదటి మైనారిటీ డిప్యూటీ సీఎంగా నాకు అవకాశం ఇవ్వటం మాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం అన్నారు..

మైనారిటీలకు తొలిసారి రిజర్వేషన్లు కల్పించిన నేత వైఎస్‌.. నాన్న ఒక అడుగు వేస్తే.. మీ బిడ్డ రెండు అడుగులు వేశాడు
2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీ డేను ప్రకటించారు.. దేశంలోనే తొలి సారి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. నాన్న ఒక అడుగు వేస్తే.. మీ బిడ్డ రెండు అడుగులు వేశాడు అని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మైనారిటీస్‌ వెల్పేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్.. దేశంలోనే అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను స్థాపించారు అబుల్ కలాం ఆజాద్ అని గుర్తుచేశారు.

కాంగ్రెస్ వేవ్ ఉంది.. తెలంగాణలో గెలుస్తుంది.. మరల ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది..!
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ ఉంది.. కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒకరోజు కాంగ్రెస్ పార్టీ మరల ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. పని చేసేవాడిని జాగ్రత్తగా చూసుకుంటే పార్టీ బలంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ చరిత్ర దేశ చరిత్ర.. పాలిటిక్స్ లో ఎవరూ శాశ్వతం కాదన్నారు. ఏపీ రాజధాని అంశం, ప్రత్యేక హోదా, అభివృద్ధి అంశాలపై కాంగ్రెస్ ఏపీకి కమిట్మెంట్ ఇచ్చింది.. జాతీయ పార్టీలు యాక్టివ్ గా లేకపోవడం ఏపీలో అభివృద్ధి లేకపోవడానికి కారణంగా తెలిపారు. ఇప్పుడు ఇండియా కూటమిగా మనతో చాలా పార్టీలు కలిసి పని చేస్తాయి.. 2024 ఎన్నికలలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు డీకే శివకుమార్‌.. కాంగ్రెస్ కారణంగా దేశం సంయుక్తంగా ఉంది.. నమ్మకాన్ని కోల్పోవద్దు.. సమస్యలపై పోరాడండి.. కలిసి, ఆలోచించి, పనిచేయాలి.. అదే గెలుపునకు కారణం అవుతుందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌.

ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా, స్వేచ్ఛగా బ్రతకాలన్నా.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి..!
రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా, రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని అభిప్రాయపడ్డారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. ముఖ్యమంత్రి పదవితో రాష్ట్రాన్ని ఎలా దొచుకోవచ్చు అని వైఎస్‌ జగన్ నిరూపించారు.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి 45 వేల కోట్లు దోచుకున్నాడు.. పదహారు నెలలు జైల్లో ఉండి రాష్ట్రాన్ని ఎలా దొచేయాలి అనే ప్లాన్ వేశాడు.. అధికారం అడ్డుపెట్టుకుని ల్యాండ్, సాండ్ మైన్, వైన్ ల పేరు తో మూడున్నర లక్షల కోట్లు దోచేశారు అని సంచలన ఆరోపణలు చేశారు. ఇక, ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు వద్దో చెబుతూ త్వరలో పుస్తకం విడుదల చేస్తాం అని ప్రకటించారు కన్నా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ , అమరావతిని నిర్వీర్యం చేశారు, పెండింగ్ ప్రాజెక్ట్స్ అటకెక్కించారు.. ఉద్యోగులను మోసం చేశారు.. రాష్ట్రాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టాడు, మళ్ళీ అధికారం ఇస్తే ఏ బ్రిటిష్ వాళ్లకు తకట్టు పెడతాడో అని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని నాసిరకం సారాయికి కేంద్రంగా చేశారు.. నకిలీ మద్యం తాగి 30 వేల మంది చనిపోయారని తెలిపారు. నవరత్నాల పేరుతో కొన్ని డబ్బులు ఇచ్చి పన్నులు రూపంలో ప్రజలను దోచేస్తున్నారంటూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులు లక్షా పద్నాలుగు వేల కోట్లు అక్రమ మార్గంలో వాడుకున్నారు.. అందుకే రాష్ట్ర ప్రజలు జగన్ ను వద్దనుకుంటున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.

బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా.. తుల ఉమ సీరియస్ వార్నింగ్..
తెలంగాణలో సీట్ల పంపకాలపై బీజేపీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. చివరి క్షణంలో బీఫారం రాకపోవడంతో వేములవాడకు చెందిన తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీని వీడాలని యోచనలో వున్నారు. బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా అని తుల ఉమ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తుల ఉమ తన అనుచరులతో సమావేశంలో మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ లను అణగదొక్కాలని చూస్తున్నారు, అగ్రవర్గాలకు కొమ్ము కాస్తున్నరని మండిపడ్డారు. బీజెపీలో మహిళను స్థానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను నమ్మించి మోసం చేశారని నిప్పులు చెరిగారు. బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా చిన్న తనం నుంచే దొరలతో కొట్లాడుతున్న అని తెలిపారు. బీఆర్ఎస్ లో కూడా ఓ దొర అహంకారంతో బయటకు వచ్చానని తెలిపారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలని అనుకున్న అని స్పష్టం చేశారు. బీజేపీ కుటుంబ పాలనకి వ్యతి రేకం అన్నారు కానీ.. దొరల కాళ్ళ దగ్గర బీ ఫామ్ పెట్టి వచ్చాడు ఎంపి బండి సంజయ్ అంటూ మండిపడ్డారు. దొరల వద్ద చేతులు కట్టుకొని ఉండలేను అని తెలిపారు. నా కళ్ళలో కన్నీళ్లు తెప్పించారని మండిపడ్డారు. బీజెపీలో సిద్దాంతాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో నే ప్రకటిస్తనని అన్నారు. బీజెపీలో బీసీ ముఖ్యమంత్రి అనేది బూటకమని మండిపడ్డారు. దొరలు కావాలనే నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఏ పార్టీ అనేది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వేములవాడ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్వభావం మాకు తెలుసు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మేము ఒంటరిగా పోరాటం కోరుకున్నది కాదు.. మా మిత్రుత్వం కాంగ్రెస్ కాదనుకుంది.. అందుకే 19 నియోజకవర్గలో పోటీ చేశామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్వభావం మాకు తెలుసు అని తమ్మినేని చెప్పుకొచ్చారు. రెండు పార్టీలు భూర్జువా స్వభావం కలిగి ఉన్నవే.. బీఆర్ఎస్ ది అహంకార ధోరణి.. కుటుంబ పాలనతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.. కేసీఆర్, కమ్యూనిస్టులను పక్కన పెట్టి తప్పుడు ప్రచారం చేశారు అని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల తర్వాతనే బీజేపీ డౌన్ ఫాల్ అయ్యింది అని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు సీట్ల సర్దుబాటులో తేడా రాలేదు అని చెప్పారు. ఇండియా కూటమిలో ఉన్న మీకు.. దూరంగా ఉన్న మాకు పొత్తు ఏంటి అని బీఆర్ఎస్ అడిగింది.. కాంగ్రెస్ తోడ్పాటు లేకుండా బీజేపీని దేశం నుండి తప్పించలేము అని ఆయన పేర్కొన్నారు. సీపీఐ.. సీపీఎం ఇద్దరం పోటీ చేద్దాం అనుకున్నాం.. కానీ కాంగ్రెస్ అధిష్టానం చర్చల అంశం మొదలు పెట్టింది.. బీజేపీ లాంటి రాక్షసిని అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ దయ్యం బెటర్ అనుకున్నామని తమ్మినేని వీరభద్రం తెలిపారు.

తుమ్మల చెల్లని రూపాయి లాంటోడు.. పువ్వాడ సంచలన వ్యాఖ్యలు
తుమ్మల చెల్లని రూపాయి లాంటోడు.. పువ్వాడ అజయ్ కొత్త వంద నాణెం లాంటోడు అని ఖమ్మం BRS అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వెనకటికి ఒక నానుడి ఉండేది.. మట్టి పనికి పోవాలన్నా మనోడు ఉండాలన్నారు. పరాయి వాడు ఉంటే మోసం చేస్తాడు జాగ్రత్త.. అని ఉండేదని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పరయివాడు అని నేను ఇక్కడి వాడిని ఖమ్మం లోకల్ అని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ కు పదవి ఇస్తే అది అహంకారం అవుతుంది.. నాకిస్తే ఖమ్మం ప్రజలకు అలంకారం అవుతుందన్నారు. ఖమ్మం, పాలేరులో చెల్లని రూపాయి మళ్ళీ ఖమ్మం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రద్దయిన నీ రాజకీయ జీవితాన్ని కేసీఅర్ పిలిచి మంత్రి పదవి ఇస్తే.. కేసీఅర్ నే మోసం చేసావని మండపడ్డారు. నిన్ను నమ్మి పదవి ఇస్తే నువ్వు చేసింది ఏమీ లేదు.. గుండు సున్నా.. నువ్వే గెలవలేదు.. ఇంక ప్రజలకు ఏం చేస్తాడని తెలిపారు. నీకు ఇచ్చిన మంత్రి పదవిని కూసుమంచి నుండి దమ్మపేట అవతల వరకు 300 ఎకరాలు పామాయిల్ తోటలు కొనుక్కుని మంచిగా స్థిర పడ్డావు.. ప్రజలకు చేసింది ఏముంది చెప్పలన్నారు. తుమ్మల చెల్లని రూపాయి లాంటోడు.. పువ్వాడ అజయ్ కొత్త వంద నాణెం లాంటోడు అని తెలిపారు. కాంగ్రెస్ కు పదవి ఇస్తే అది ఖమ్మంకు అపకారం అవుతుంది.. అదే పదవి ఇస్తే అది ఖమ్మం ప్రజలకు అలంకారం అవుతుందన్నారు. నేను వజ్రాయుధం లాంటి వాడను.. నన్ను ఇప్పుడు కాపాడుకుంటే జీవితాంతం మీరు గర్వపడేలా ఖమ్మంను అభివృద్ది చేసి మీకు అప్పగిస్తామన్నారని తెలిపారు. ఖమ్మం, పాలేరులో చెల్లని రూపాయి మళ్ళీ ఖమ్మం వచ్చింది.. వొద్దు అని వెళ్లగొట్టినా మళ్ళీ తగుదునమ్మా అంటు ఖమ్మం వచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈసారి శాస్వతంగా రాజకీయాల నుండి ఇంటికి పంపించాలని తెలిపారు. ఇంకా ధౌర్భాగ్యం ఏంటంటే నేను మంత్రి ఆయన తరువాత ఖమ్మంలో ఇంత అభివృద్ది చేస్తే అదంత నేనే చేశాను అని చెప్పుకుంటున్నాడు.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అని మండిపడ్డారు. ఇదంత తట్టుకోలేక బ్యాలెన్స్ తప్పు మాట్లాడుతున్నాడు.. కొన్ని రోజులు అయితే ఖమ్మం ఖిల్లా ను నేనే కట్టించిన అని చెప్తాడెమో అంటూ సెటైర్ వేశారు.

ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’పై ప్రత్యేక పుస్తకం.. రాష్ట్రపతికి అందజేత
ప్రధాని నరేంద్ర మోడీపై రాసిన “ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్‌నెస్: మన్ కీ బాత్@100” పుస్తకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయన ఈ పుస్తకాన్ని అందుకున్నారు. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంకలనం చేసి వెస్ట్‌ల్యాండ్ బుక్స్ ప్రచురించిన ఈ పుస్తకం ప్రధాని నరేంద్ర మోడీ రేడియో షో ఆధారంగా రూపొందించబడింది. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈవో అఖిలేష్ మిశ్రా, తన బృందం సభ్యులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు పుస్తకాన్ని అందించారు. ఈ పుస్తకం ప్రత్యేకత సంతరించుకుంది, ఎందుకంటే ఇందులో ప్రధాని మోడీ స్వయంగా రాసిన ప్రత్యేక ముందుమాట కూడా ఉంది. 100వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ఏప్రిల్ 30న ప్రసారమైంది. ఈ కార్యక్రమం అక్టోబర్‌లో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. మన్ కీ బాత్ తనకు కేవలం ఒక కార్యక్రమం మాత్రమేనని ప్రధాని మోడీ చెప్పారు. తన రేడియో కార్యక్రమంలో ప్రధానమంత్రి ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు చెందిన వ్యక్తుల కథలను చేర్చారు. వారు సమాజానికి ఏదో ఒక విధంగా మార్పు తెచ్చారు. ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ద్వారా రేడియోను పునరుద్ధరించే ప్రయత్నం కూడా జరుగుతోంది. పీఎం తన బ్లాగ్ పోస్ట్‌లలో ఒకదానిలో మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌పై వ్రాసిన పుస్తకంపై కూడా వ్యాఖ్యానించారు. “ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్‌నెస్: మన్ కీ బాత్ @ 100” దేశం సామర్థ్యాన్ని, స్ఫూర్తిని, ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి సామూహిక మంచితనానికి గల శక్తిని ఉదాహరణగా చూపుతుందని ఆయన అన్నారు.

షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన అజయ్ భూపతి…
అజయ్ భూపతి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆర్ఎక్స్ 100′ మరియు ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు…తాజాగా ఈ దర్శకుడు పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం అనే సినిమాను తెరకెక్కించాడు..ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ మరియు శ్రవణ్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లోవిడుదల కానుంది. ఇప్పటికే చిత్రం యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది.తాజాగా ఈ సినిమా నుంచి ‘అప్పుడప్పడ తాండ్ర’ అనే సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే చిత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో చిత్ర యూనిట్ కు షాక్ తగిలింది. ఈ పాటలోని రెండు లైన్ల లిరిక్స్ ను తొలగించాలని సెన్సార్ నిర్ణయించింది. దీంతో అజయ్ భూపాతి మాత్రం సెన్సార్ కట్ కు అస్సలు అంగీకరించలేదు. మొత్తం సాంగ్ నే సినిమాలో లేకుండా చేశారు. దీనిపై తాజాగా అజయ్ భూపతి స్పందించారు. సెన్సార్ ‘అప్పడప్పడ తాండ్ర’లోని రెండు లైన్లను సెన్సార్ చేశారు. ఆ లిరిక్స్ ఛేంజ్ చేయాలని నాకు చెప్పారు. అలా చేస్తే సాంగ్ లో ఉన్న ఫీల్ అంతా పోతుంది. దాంతో థియేట్రికల్ వెర్షన్ లో ఈ సాంగ్ ను తీసేస్తున్నాము.. ఓటీటీ వెర్షన్ లో మాత్రం సాంగ్ ఉంటుందని ఆయన చెప్పారు. ఆలోగా ఫుల్ సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తామని తెలిపారు… దీంతో పలువురు సెన్సార్ ఇచ్చిన షాక్ కు అజయ్ భూపతి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు గా అంటూ కామెంట్ చేస్తున్నారు..ఇక ఈ రోజు (నవంబర్ 11) హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్‌లో ‘మంగళవారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నారు.. అల్లు ఆర్మీ సమక్షంలో ఈ వేడుక జరగనుంది. గ్రాండ్ గా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఓటీటీ లో కి రాబోతున్న అవికా గోర్ ‘వధువు’ వెబ్ సిరీస్..
యంగ్ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‍తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అవికా గోర్. ఆ తర్వాత 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‍ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది..ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల లో నటించి మెప్పించింది… అయితే, నటనపరంగా ప్రశంసలు అందుకున్నా కూడా టాప్ హీరోయిన్‍ గా అవికా ఎదగలేకపోయారు . ప్రస్తుతం ఆమె వరుసగా ఓటీటీ సిరీస్‍లు చేస్తున్నారు.. ఇటీవల మ్యాన్షన్ 24 అనే హారర్ థ్రిల్లర్ సిరీస్‍లో అవికా గోర్ నటించింది..ఆ సిరీస్‍ లో అవికా కనిపించింది కొంచెం సేపే అయినా కానీ తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అవికా ప్రధాన పాత్రలో ‘వధువు’ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఈ సిరీస్‍కు సంబంధించిన ఫస్ట్ లుక్ నేడు విడుదల అయింది. వధువు వెబ్ సిరీస్ త్వరలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వధువు సిరీస్ ఫస్ట్ లుక్‍ను నేడు ఆ ప్లాట్‍ఫామ్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‍లో పెళ్లికూతురుగా అవికా గోర్ కనిపించింది పెళ్లి దుస్తులు, బాసికం కట్టుకున్న అవికా గోర్ ఆవేదనగా కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా వధువు ఫస్ట్ లుక్ ఉంది. మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనే క్యాప్షన్ తో ఈ సిరీస్‍ తెరకెక్కింది..ఈ సిరీస్‍లో బిగ్‍బాస్ ఫేమ్ అలీ రెజా మరియు నందు కూడా కీలకపాత్రలు చేస్తున్నారు. వధువు వెబ్ సిరీస్ కూడా థ్రిల్లర్ జానర్‌ లోనే ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ను డిస్నీ+ హాట్‍స్టార్ ప్రకటించనున్నారు..వధువు సిరీస్‍ను ఎస్‍వీఎఫ్ సోషల్ పతాకంపై అభిషేక్ దాగా నిర్మిస్తున్నారు.తాను త్వరలో ఓ సిరీస్ చేస్తున్నానని ‘వధువు’ గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో హింట్ ఇచ్చారు అవికా గోర్. ఇప్పుడు ఈ సిరీస్ ఫస్ట్ లుక్ వచ్చింది.