NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు.. ఎండల ఎఫెక్ట్‌ అలా ఉంది మరి..!
రాత్రి నుంచి హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. .కానీ, ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఉపసమనం కోసం వైన్‌ షాపులకు పరిగెడుతున్నారు మందుబాబులు. బీరు తాగి వేసవి తాపం నుంచి ఉపశమనం పొండుతున్నారు. ఫలితంగా మద్య అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలంగాణలో పక్షం రోజుల్లో 35 లక్షల కాటన్లు ఖాళీ అయ్యాయి. ఈ నెలలో తెలంగాణలో రికార్డుస్థాయిలో బీర్లు అమ్మకాలు జరిగాయి. 18 రోజుల్లో 4 కోట్ల 23 లక్షల బాటిళ్లు అమ్ముడుపోయాయి. వీటి విలువ అక్కరాల 5 వందల 82 కోట్ల 99 లక్షల రూపాయలు. ఈ నెల ఎండలు మండిపోతుండడం వల్ల ఉపశమనం కోసం బార్లు, వైన్‌ షాపులకు పరుగులుతీస్తున్నారు మందుబాబులు. ఎక్కువ మంది బార్ల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ నెల ఒకటో తారీఖు నుంచి 18 వరకు 35 లక్షల 25 వేల 247 కాటన్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్కో కాటన్లో పన్నెండు బీరు సీసాలుంటాయి. ఈ లెక్కన సగటున రోజుకు 23 లక్షల 50 వేల 164 సీసాలు ఖాళీ అయ్యాయి. బీర్ల అమ్మకాల్లో నల్గొండ జిల్లా ఆగ్రస్థానంలో ఉంది. నల్గొండ జిల్లాలో 18 రోజుల్లో 3 లక్షలకు పైగా కార్టన్ల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ 48 కోట్ల 14 లక్షల రూపాయలు. ఈ విషయంలో కరీంనగర్‌ జిల్లా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడం వల్ల మద్యం విక్రయాలు ఇలాగే కొనసాగే సూచనలున్నాయి. ఫలితంగా నెలకరు నాటికి మద్యం అమ్మకాల రూపంలో ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కాగా, సాధారణ రోజుల్లో మద్యం అమ్మకాలు ఎలా ఉన్నా.. వేసవిలో మాత్రం బీర్లకు భలే గిరాకీ ఉంటుంది.. ఎప్పుడూ లేనంతా బీర్లు తెగ తాగేస్తుంటారు మందు బాబులు.. కూల్‌ కూల్‌గా బీర్లు తాగుతూ.. ఎండల నుంచి ఉపశమనం పొందుతుంటారు.

గల్లీ లీడర్ లా బండి సంజయ్ మాటలు.. కార్పొరేటర్ స్థాయి లీడర్లు కూడా బీజేపీ లేరు
కార్పొరేటర్ స్థాయి లీడర్లు కూడా బీజేపీ లేరని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో 80 కి పైగా స్థానాలతో కాంగ్రెస్ అధికారంలో రాబోతుందని అన్నారు. కర్ణాటక ఫలితాలతో బండి సంజయ్ మైండ్ బ్లాక్ అయ్యిందని ఎద్దేవ చేశారు. కనీస అవగాహన లేకుండా గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో బీజేపీ భూస్థాపితం అయ్యిందని తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. కార్పొరేటర్ స్థాయి లీడర్లు కూడా బీజేపీ లేరు, తెలంగాణ ఆ పార్టీ ఎలా ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. జూన్ లో కాంగ్రెస్ లో సీనియర్ నేతల చేరికలు, ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ సీనియర్లు కాంగ్రెస్ లో వస్తారని అన్నారు. 11 మంది బీఆర్ఎస్‌ మంత్రులు ఓడిపోయే లిస్టులో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ లిస్టు కేసీఆర్ కు తెలుసని వ్యాగాస్త్రం వేశారు. 105 స్థానాల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తా అని కేసీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎం.ఎల్.ఏ. లను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో 80కి పైగా స్థానాలతో కాంగ్రెస్ అధికారంలో రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీ మాదిరి తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అవినీతిలో కూరుకుపోయిందని తీవ్రంగా ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ను ఇంటికి పంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ కవి, కేతు విశ్వనాథ్‌ రెడ్డి కన్నుమూత.. సీఎం సంతాపం..
ప్రముఖకవి, రచయిత, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథ్‌ రెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు.. ఆయన వయస్సు 88 ఏళ్లు.. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిట్‌లో చికిత్స పొందుతూ ఉదయం 5 గంటల సమయంలో కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు విడిచారు విశ్వనాథ్‌ రెడ్డి.. రచయితలు, సాహితీవేత్తలు, కవుల సందర్శనార్థం ఈరోజు ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు.. అమెరికాలో ఉన్న తన కుమారుడు ఈ రోజు ఒంగోలుకు చేరుకొని తండ్రి పార్థీవ దేహాన్ని కడపకు తీసుకెళ్తారని తెలుస్తోంది.. ఆయన అంత్యక్రియలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.. కాగా, విశ్వనాథ్‌ రెడ్డి 2 రోజుల క్రితం ఒంగోలులోని తన కుమార్తె ఇంటికి వెళ్లారు.. అక్కడ అస్వస్థతకు గురికాగా.. వెంటనే కుటుంబసభ్యులు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు విశ్వనాథ్‌ రెడ్డి.. మరోవైపు.. ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథ్‌ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథ్‌ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న ఆయన.. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథ్‌ రెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయన్నారు.. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిందనే విషయాన్ని గుర్తుచేసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. విశ్వనాథ్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

సీఎంకి చేతులు ఎత్తి దండం పెడుతున్నా.. ఇక, రిటైర్ అయిపోతున్నా
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.. సీఎం వైఎస్‌ జగన్‌ బందరు పోర్టు పనులను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన పేర్నినాని.. సభా వేదిక పై నుంచి తన రిటైర్మెంట్ ను ప్రకటించారు.. వయస్సులో చిన్నవాడు అయిపోయాడు.. లేదంటే సీఎం వైఎస్‌ జగన్‌కు పాదాభివందనం చేసి ఉండేవాడిని అని వ్యాఖ్యానించారు.. నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకుని వస్తున్న ముఖ్యమంత్రికి చేతులు ఎత్తి దండం పెడుతున్నానన్న పేర్నినాని.. ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటారు ముఖ్యమంత్రి .. ఏదో ఒక వర్గానికి సంక్షేమం అందిస్తూనే ఉంటారని ప్రశంసలు కురిపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం గోల్డ్ కవరింగ్ పరిశ్రమకు విద్యుత్ ఛార్జీలు తగ్గించారని తెలిపారు. అయితే, సీఎం వైఎస్‌ జగన్ తో కలిసి మరో మీటింగ్ ఉంటుందో..? లేదో? తెలియదు అని వ్యాఖ్యానించారు పేర్నినాని. ఇక, పోర్టు నిర్మాణానికి రాక్షసుడిలా చంద్రబాబు అడ్డుపడ్డాడు అంటూ మండిపడ్డారు పేర్ని నాని.. ఆ పీటముడులు తీయటానికి నాలుగేళ్లు పట్టిందని తెలిపారు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. నామినేషన్ వేసే వారం రోజుల ముందు పోర్టుకు శంఖుస్థాపన చేశాడని విమర్శించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 450 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.. ఈ ఒక్క నియోజకవర్గంలో 25,090 మందికి పట్టాలు ఇచ్చామని తెలిపరాఉ.. ఒక్క లే అవుట్ లోనే 15 వేల మందికి పట్టాలు ఇస్తామని తెలిపారు.

మరోసారి సుప్రీంకోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.. మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. వెకేషన్‌ బెంచ్‌ జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ నరసింహ ధర్మాసనం ముందు అవినాష్‌ న్యాయవాది మెన్షన్‌ చేశారు. అయితే, పిటిషన్‌ తమ ముందుకు విచారణకు రావట్లేదని.. మరో వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. మెన్షనింగ్‌ రిజిస్ట్రార్‌ను కలవాలని సూచించిన ధర్మాసనం. అయితే, రెండు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అవినాష్ రెడ్డి… అందులో ఒకటి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై జూన్ 5న విచారణ జరిగే వరకు అరెస్ట్ లేకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.. ఇక, తెలంగాణ హైకోర్టులో తదుపరి వెకేషన్ బెంచ్ ముందు విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు.. తెలంగాణ హై కోర్ట్ లో తదుపరి వెకేషన్ బెంచ్ ముందు విచారణకు వచ్చే వరకు అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి.

చిరకాల స్వప్నం.. చరిత్రను మార్చబోతున్నాం..
బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తపసిపూడిలో సముద్రుడికి హారతిచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. బందరు పోర్టు పనులకు ప్రారంభోత్సవం చేశారు.. ఇక, తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులను జెండా ఊపి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్టు చిరకాల స్వప్నం, అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్‌క్లియర్‌ చేశామని తెలిపారు.. బందరుకు సముద్ర వర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉందని గుర్తుచేసిన ఆయన.. కానీ, పోర్టు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు.. మేం వచ్చాక బందరు వాసుల కలను నెరవేర్చాం. కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా పోర్టు మారబోతుందని ఆకాంక్షించారు ఏపీ ముఖ్యమంత్రి. ఇక, 35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంలో బందరు పోర్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు సీఎం జగన్‌.. పోర్టుకు కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా చేపడుతున్నామని వెల్లడించారు. అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైన్‌పోర్టుకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లకు కూడా ఇది చేరువలో ఉంటుందని.. ఇక, పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు సీఎం జగన్‌.. బందరుకు శతాబ్దాల చరిత్ర ఉంది.. అన్ని అనుమతులు వచ్చాయి.. రూ.5156 కోట్లతో, నాలుగు బెర్తులతో ఈ పోర్టు ప్రారంభం అవుతుందని.. ట్రాఫిక్ పెరిగేకొద్దీ బెర్తులను పెంచి 116 మిలియన్ టన్నుల వరకు సామర్థ్యం పెంచే అవకాశం ఉందన్నారు సీఎం జగన్‌.

రూ.2 వేల నోట్ల ఉపసంహరణ.. తొలిసారి స్పందించిన ఆర్బీఐ గవర్నర్‌
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. తొలి సారి ఈ వ్యవహారంపై స్పందించార ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను కరెన్సీ నిర్వహణలో భాగంగా తీసుకున్న కీలక నిర్ణయంగా పేర్కొన్నారు.. సెప్టెంబర్ 30 నాటికి రూ. 2,000 బ్యాంకు నోట్లు చాలా వరకు తిరిగి ఖజానాకు వస్తాయని మేం భావిస్తున్నాం అని తెలిపారు.. రూ. 2,000 నోట్ల మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు సూచించామని తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కసరత్తు పూర్తి చేయడానికి సెంట్రల్ బ్యాంక్ 4 నెలల సమయం ఇచ్చిందని గవర్నర్ చెప్పారు. మేం సెప్టెంబరు వరకు గడువు ఇచ్చాం.. కాబట్టి ఇబ్బంది ఉండబోదన్నారు.. ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలి. మేం దానిని తెరిచి ఉంచలేం. అన్నారు.. విదేశాలలో నివసిస్తున్న భారతీయులు, సీనియర్ సిటిజన్లు మరియు విదేశాలలో చదువుతున్న విద్యార్థులతో సహా పౌరులందరి సమస్యలు మరియు ఇబ్బందుల విషయంలో ఆర్బీఐ సున్నితంగా ఉంటుందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్‌.. క్లీన్‌ నోట్‌ పాలసీ అన్నది ఆర్బీఐ ఎప్పటినుంచే అమలుచేస్తోందని వివరించారు. వివిధ డినామినేషన్‌ నోట్లలో కొన్ని సిరీస్‌లను ఆర్బీఐ అప్పుడప్పుడూ ఉపసంహరిస్తుందని, కొత్త సిరీస్‌లను విడుదల చేస్తుందని చెప్పుకొచ్చారు.. అందులో భాగంగానే రూ.2 వేల నోట్లను కూడా ఉపసంహరించినట్లు తెలిపారు.

ఎయిర్‌పోర్టుల్లోనే బెగ్గింగ్.. ఈ బిచ్చగాడు యమ రిచ్..
ఈజీ మణి కోసం చాలా మంది రకరకాల ప్లాన్స్‌ వేస్తూ వచ్చిన డబ్బుతో ఎంజాయ్‌ చేస్తుంటారు. వారికి కావాల్సిందే మణీ మాత్రమే. బ్రెయిన్‌ ఉపయోగించి ఐడియాలు వాడి ఎదుటి వారి నుంచి డబ్బులు తీసుకుని జల్సాలకు పాల్పడుతుంటారు. వారికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో తెలియదు కానీ.. ఇలాంటి ఐడియాలు కొంత కాలమే పనిచేస్తాయని మాత్రం మర్చిపోతుంటారు. ఓ వ్యక్తి కష్టపడకుండా ఈజీగా మణి సంపాదించేదుకు ప్లాన్‌ వేశాడు. ఆప్లాన్‌ వర్కంట్‌ అవడంతో దాన్నే ఫాలో అయ్యాడు. అతను వేసిన ప్లాన్‌ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అదే బెగ్గింగ్‌ ప్లాన్‌ (అడుక్కోవడం). అదికూడ గుడి, ఫంక్షన్‌ హాల్లు దగ్గర కాదండో ఏకంగా ఎయిర్‌ పోర్టులోనే అడుక్కోవడం స్టార్ట్‌ చేశాడు. ఒక్కరోజుకు రూ. 50 నుంచి 60 వేల వరకు సంపాదించి జల్సాలకు పాల్పడే వాడు. ఇదే శాస్వతం అనుకున్నాడు. కానీ ఆ జల్సాలే అతన్ని పోలీసులకు పట్టుబడేలా చేశాయి. చెన్నైకు చెందిన విఘ్నేష్ బీటెక్ పూర్తి చేసి కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అప్పట్లో అతనికి నాలుగంకెల జీతం కూడా వచ్చేది. ఓసారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్ పర్చు పోగొట్టుకున్నారు. విమాన టికెట్ తన ఫోన్లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితిని బెంగళూరు విమానాశ్రయం లాంజ్లో ఓ విదేశీయుడితో పంచుకున్నాడు. అతనిపై జాలిపడ్డ విదేశీయుడు రూ. 10 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం కోల్పోవడంతో రోడ్డునపడ్డ విఘ్నేష్.. బెంగళూరు ఎయిర్పోర్టు అనుభవంతో ఈజీ మనీపై దృష్టి పెట్టాడు విఘ్నేష్‌ నిర్ణీత సమయానికి తక్కువ ధరకు వచ్చేలా డొమెస్టిక్‌ విమాన టికెట్లు బుక్‌ చేసుకొని, ఖరీదైన క్యాజువల్స్‌ ధరించి, చేతిలో లగేజ్‌ బ్యాగ్‌ తో ఎవరికి అనుమానం రాకుండా ప్లైట్ షెడ్యూల్‌ టైం కు ముందే ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేవాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ ను ఎంచుకుని మాటలు కలిపేవాడు. ఆపై ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌ లో ఉంచి బాధల్లో వున్నట్లు మాట్లాడినట్లు నటించేవాడు.

‘దేవర’ కోసం ‘దసరా’ విలన్…
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాతో కొరటాల సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నానిడనే విషయం ‘దేవర’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందరికీ క్లియర్ కట్ గా అర్ధం అయ్యి ఉంటుంది. ఇప్పటికే రెండు, మూడు యాక్షన్ షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న దేవర సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఈ ఇద్దరిపై కొరటాల శివ ఇప్పటికే ఒక యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ కూడా చేసాడు. అయితే ఇప్పుడు దేవర కోసం మరో విలన్‌ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన దసరా సినిమాలో విలన్‌గా నటించిన మళయాళ నటుడు షైన్ ‘టామ్ చాకో’కి మంచి మార్కులే పడ్డాయి. అందుకే దేవర కోసం ‘టామ్‌ చాకో’ని ఓ విలన్‌గా తీసుకున్నట్టు సమాచారం. టామ్‌ చాకో ఇప్పటికే దేవర సెట్స్‌లో కూడా జాయిన్ అయిపోయాడట. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలే జాన్వీ పేరు చెబితే సోషల్ మీడియా హీట్ ఎక్కిపోతుంది. అమ్మడు చేసే గ్లామర్ షో అలా ఉంటది మరి. అలాంటి బ్యూటీని దేవరలో వాడుకోవాలే గానీ.. గ్లామర్ ట్రీట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందుకు తగ్గేట్టే జాన్వీ క్యారెక్టర్ ఉంటుందట. పుష్పలో రష్మిక, రంగస్థలంలో సమంతలా ‘దేవర’ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేస్తోందట జాన్వీ. ఒక ఫిషర్ మ్యాన్ కూతురుగా కనిపించనుందట. ఇప్పటికే అమ్మడి ఫస్ట్‌ లుక్‌లో లంగా ఓణిలో చూపించారు. సినిమా మొత్తం కూడా లంగా ఓణి, చీర కట్టులో ఉన్నా జాన్వీ గ్లామర్ డోస్ కాస్త అందరినీ అట్రాక్ట్ చేసేలానే ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్-శ్రీదేవి కాంబినేషన్ లోని ఒక హిట్ సాంగ్ యంగ్ టైగర్ తో పాడించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడట.

‘బిచ్చగాడు2’ ఫస్టాఫ్ లేపేశారు! అలా ఎలా మావా?
ప్రస్తుతం టాలీవుడ్‌ బాక్సాఫీస్ దగ్గర బిచ్చగాడు 2 హవా నడుస్తోంది. ఈ సినిమా ఊహించని వసూళ్లను రాబడుతోంది. తెలుగు మీడియం రేంజ్ సినిమాలకు మించి కలెక్షన్స్ సాధిస్తోంది. సినిమా టైటిల్ బిచ్చగాడునే కానీ.. డిస్ట్రిబ్యూటర్స్‌ని ఈ సినిమా శ్రీమంతులని చేస్తోంది. అన్నీ తానై మరోసారి బిచ్చగాడుగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనికి భారీ విజయాన్ని ఇచ్చేశారు తెలుగు జనాలు. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఊహించని సంఘటన జరిగింది. ఏకంగా ఈ సినిమా ఫస్టాఫ్‌ని లేపేసి షో ప్రదర్శించారనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే మరో విచిత్రం ఏంటంటే.. సెకండాఫ్ మొత్తం అయిపోయే వరకు గానీ ఆడియెన్స్‌కు అసలు మ్యాటర్ అర్థం కాలేదట. మామూలుగా ఏదైనా సినిమాకు లేట్‌గా వెళ్లినప్పుడు.. అరె స్టార్టింగ్‌ మిస్ అయ్యామని ఫీల్ అవుతుంటాం. కానీ షో స్టార్ట్ అవడమే సెకండాఫ్‌తో మొదలైతే.. ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బిచ్చగాడు2 విషయంలో ఇదే జరిగింది. హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో సెకండ్ హాఫ్ నుంచి స్క్రీనింగ్ వేసారట. అయినా కూడా మనోళ్లు పాప్‌కార్న్ తింటూ పస్టాఫ్ రేంజ్‌లో సెకండాఫ్ మొత్తం చూసేసారట. కానీ చివరకు ఎండ్ కార్డు చూసి అంతా షాక్ అయ్యారట. దీంతో తమకు పూర్తిగా సినిమా చూపించలేదని థియేటర్ యాజమాన్యంపై ఫైర్ అయ్యారనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతోంది. దీంతో ఈ ఇన్సిడెంట్‌ చాలా ఫన్నీ అండ్ షాకింగ్‌గా మారింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఇది సెకండాఫ్ అని తెలియకుండానే ఆడియెన్స్ సినిమాను ఎంజాయ్ చేశారంటే.. బిచ్చగాడు2 ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.