NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్‌
తెలంగాణ సర్కార్ అభివృద్ధే ప్రధానంగా దూసుకుపోతుంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు విశ్వనగరం హైదరాబాదులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నేడు రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ దాదాపు 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు రూ.1,656 (200 మిలియన్‌ డాలర్లు) కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ కొంగర కలాన్ లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. భూమి పూజ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌లియూతో కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. కంపెనీ ప్రారంభమైతే ఇందులో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. ప్రపంచంలో సుమారు 70 శాతం యాపిల్‌ ఐఫోన్లను ఫాక్స్‌కాన్‌ కంపెనీయే తయారు చేస్తున్నది. యాపిల్‌ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్‌కాన్‌కు భారీ ఆర్డర్‌ రావడంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. యాపిల్‌ కంపెనీ ఎయిర్‌పాడ్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్ల తయారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్‌కు అప్పగించింది. ఇప్పటివరకూ మొబైల్‌ ఫోన్ల తయారీకే ప్రాధాన్యమిచ్చిన ఫాక్స్‌కాన్‌, ఇప్పుడు ఎయిర్‌పాడ్‌ల తయారీలోకి అడుగు పెడుతోంది. ఇటీవలే ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యంగ్‌లూ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ తో సమావేశమై పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారన్న సంగతి తెలిసిందే.

పవన్ తన శీలాన్ని చంద్రబాబు అమ్మేశాడు..! నువ్వు ప్యాకేజీ స్టార్ వే
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలుచేశారు.. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం.. జనసేన ఇంకా అందరూ కలుస్తారని చెబుతున్నారు.. అసలు జనసేన పార్టీ ఉందా? అని ప్రశ్నించారు.. ఇక, పవన్ తన శీలాన్ని చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు.. ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడో.. పవన్-చంద్రబాబుకే తెలుసని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును కలిసేందుకు వెళ్లేటప్పుడు నాదెండ్ల మనోహర్ ను తీసుకెళ్లడు.. అక్కడే అర్థమయిపోతుంది.. కేవలం డబ్బులు కోసమే జనసేన పార్టీని చంద్రబాబు పాదాల దగ్గర పెట్టాడని విమర్శించారు. ఇక, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు కాపు నాయకులను అడుగుతున్నా.. రంగాని చంపించింది చంద్రబాబు నాయుడు కదా..? ఇది జగమెరిగిన సత్యం అన్నారు నల్లపరెడ్డి.. ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాను అని పవన్ అంటున్నాడు.. నువ్వు నిజంగా ప్యాకేజీ స్టార్ వే అని కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నావు, సూట్ కేసులు చేతులు మారాయి అని ఆరోపించారు. నన్ను చెప్పుతో కొట్టు చూద్దాం.. నీకంత ధైర్యం ఉంటే కోవూరుకి రా నడిరోడ్డులో నిలబడతాను.. చెప్పు తీసుకొని రా నన్ను కొట్టేందుకు అని సవాల్‌ చేశారు.

కొత్తగా ఎన్నికైన 8 మంది వైసీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..
కొత్తగా ఎన్నికైన 8 మంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులు ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రమాణస్వీకారం చేయించారు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు… అసెంబ్లీ ప్రాంగణంలో ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు.. శాసన మండలి సభ్యులుగా రామ సుబ్బారెడ్డి, మేరుగ మురళీధర్, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్, కుడిపూడి సూర్యనారాయణ రావు, నర్తు రామారావు, సుబ్రహ్మణ్యం సిపాయి, డా. అల్లంపూర్ మధుసూదన్‌ ప్రమాణస్వీకారం చేశారు. కాగా, స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు.

రాష్ట్రంలో కుట్ర జరుగుతోంది.. ధర్మాన సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో కుట్ర జరుగుతోంది.. సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్ళు అయినా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు వెనుకబడే ఉన్నాయన్నారు.. గత ప్రభుత్వాలు ఈ పరిస్థితిని సరిదిద్దలేక పోయాయన్న ఆయన.. వైఎస్‌ జగన్ ప్రభుత్వమే ధైర్యంగా అన్ని వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించారు.. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బటన్ నొక్కి పథకాలు అందిస్తున్నారు అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ వ్యంగంగా మాట్లాడుతున్నారు అని ఫైర్‌ అయ్యారు మంత్రి ధర్మాన.. నేను ప్రశ్నిస్తున్నాను.. ఇన్నేళ్ళు అయినా 21 శాతం మంది అక్షరం ముక్క రాని వాళ్లు ఉన్నారు.. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది? అని నిలదీశారు.. ఇది పాలనలోని లోపం కాదా? అని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇదే ప్రయత్నం 50 ఏళ్ల కిందటే చేసి ఉంటే.. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరో రకంగా ఉండేదని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ అటాచ్.. సజ్జల కీలక వ్యాఖ్యలు..
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన గెస్ట్ హౌస్ ని ఏపీ గవర్నమెంట్ అటాచ్ చేసిన విషయం విదితమే.. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం ప్రాపర్టీని అటాచ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, నారాయణ తమ పదవులను దుర్వినియోగపరిచి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణలో భాగంగా చర్యలు చేపట్టారు.. కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా పొందారని చంద్రబాబుపై అభియోగాలు మోపారు.. చట్టాలను ఉల్లంఘించినట్టు విచారణలో తేలిందంటున్నారు.. అయితే, సీఐడీ అటాచ్‌మెంట్ పై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను నిలబడి ఉన్న ఈ ప్రాంతం కూడా మాయా వేదికే.. అక్రమాలకు చిరునామా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు.. ఆ అక్రమ కట్టడంలో చంద్రబాబు ఏ హోదాలో ఉంటున్నారో అర్థం కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇంటి అలవెన్సు పొందుతున్నారు.. కానీ, ఎక్కడా అద్దెకు తీసుకున్నట్లు ఒప్పందాలు లేవన్నారు సజ్జల.. లింగమనేని రమేష్ ఆ ఇంటిని దేశభక్తితో ప్రభుత్వానికి ఇచ్చినట్లు కోర్టుకు చెప్పారన్న ఆయన.. మరి చంద్రబాబు అధికారం పోయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారు? అని నిలదీశారు.. పేదల, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని.. కపటత్వానికి చంద్రబాబు ప్రతినిధి అని ఆరోపించారు. ఒక వైపు ప్రజల కోసం నిలబడే వైసీపీ, మరోవైపు పెత్తందారీ స్వభావం ఉన్న చంద్రబాబు, జనసేన, వారి మీడియా ఉంది.. ఈ కుట్రల పట్ల మనం అందరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

క్యాసినో కేసులో ఇవాళ ఈడీ విచారణకు ‘చికోటి’
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ నేడు ఈడీ ఎదుట హాజరయ్యాడు. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని.. చికోటి ప్రవీణ్‌పై గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. తాజాగా.. థాయిలాండ్‌ ఘటన నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చింది. చికోటిపై విదేశాల్లో నిర్వహించిన క్యాసినో ఈవెంట్స్ లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలున్నాయి. దీంతో ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యాడు. చికోటి ప్రవీణ్‌ థాయిలాండ్‌లో క్యాసినో నిర్వహిస్తుండటంతో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సందర్భంగా పెద్ద ఎత్తున నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదు లావాదేవీలకు సంబంధించి చికోటి ప్రవీణ్‌ను ఈడీ ప్రశ్నించనుంది.

పుష్ప-2 గెటప్‌లో వైసీపీ ఎంపీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది.. బన్నీ చీరకట్టి, కాళికా మాత రూపంలో దర్శనమిచ్చాడు.. మాతంగి గెటప్‌లో ఉన్న అల్లు అర్జున్‌ను చూసి ఫ్యాన్స్‌ రకరకాల కథలు అల్లేశారు.. అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ గురుమూర్తి మాతంగి వేధారణలో కనిపించారు.. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా జరుగుతుండగా.. వివిధ వేషాల్లో పొంగళ్ళు సమర్పించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.. ఇక, తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా పుష్ప-2 వేషధారణలో గంగమ్మ భక్తి చైతన్య యాత్రలో పాల్గొన్నారు. పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ మాతంగి వేషంలో ఇమిడిపోతే.. ఎంపీ గురుమూర్తి కూడా మాతంగి‌ వేషధారణలో ఒదిగిపోయారు.. ఇక, ఎంపీతో ఫొటోలు దిగడానికి సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు భక్తులు.. కాగా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంతవీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, సారెతో భక్తి చైతన్య యాత్ర ప్రారంభమైంది. వందలాది మంది భక్తులు విచిత్ర వేషధారణలలో గంగమ్మ శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొన్నారు. తిరుపతి గంగమ్మ జాతర కన్నుల పండవుగా కొనసాగుతోంది. మొత్తం 8 రోజుల పాటు నిర్వహించే జాతరలో ఐదో రోజు మాతంగి రూపంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

అమ్మపై ఫిర్యాదు.. నచ్చిన చొక్కా ఇవ్వలేదని టవల్‌తోనే పీఎస్‌కు బుడతడు..
ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమ్మ చొక్కా ఇవ్వలేదని ఏలూరు టూ టౌన్‌ పోలీసులను ఆశ్రయించాడో బాలుడు.. చొక్కా లేకుండానే టవల్ కట్టుకుని నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు.. తాను స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు వెళ్లాలి.. దాని కోసం తెల్ల చొక్కా అగిడితే అమ్మ ఇవ్వనంటోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. విషయం తెలుసుకున్న సీఐ చంద్రశేఖరరావు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వచ్చి పోలీసులతో మాట్లాడిన.. ఆ బాలుడికి తీసుకొని ఇంటికి వెళ్లారు.. కానీ, చొక్కా కోసం పీఎస్‌కు వెళ్లిన ఈ బుడతడు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు.. వరే ఏంటిరా ఇది? అని కొందరు సెటైర్లు వేస్తుంటే.. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు.. పెద్దాయక పరిస్థితి ఏంటో అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
ఇటీవల విమానాల్లో ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్‌లపై లైంగిక వేధింపుల పర్వానికి తెర పడటం లేదు. దుబాయ్‌-అమృత్‌సర్‌ విమానంలో మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడినందుకు ఓ ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌లోని కోట్లి గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్, ఎయిర్ హోస్టెస్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగి శనివారం ఆమెను వేధించాడని పోలీసులు తెలిపారు. “ఈ ఘటనను ఎయిర్ హోస్టెస్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి” అని పోలీసులు తెలిపారు. సిబ్బంది ఈ విషయాన్ని అమృత్‌సర్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయగా, ఎయిర్‌లైన్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితుడిని ఇక్కడి శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కల్తీ మద్యం సేవించి 10 మంది మృతి.. పలువురికి అస్వస్థత
తమిళనాడులోని విల్లుపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో నకిలీ మద్యం సేవించి ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.విలుపురం జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందడంతో గ్రామస్థులు రోడ్డును దిగ్బంధించారు. విల్లుపురం జిల్లా మరక్కనం సమీపంలోని ఎక్కియార్‌కుప్పంకు చెందిన ఆరుగురు ఆదివారం మృతి చెందారు. చెంగల్‌పట్టు జిల్లాలోని మదురాంతగంలో శుక్రవారం ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఆదివారం ఒక జంట మృతి చెందిందని, అన్నీ అక్రమ మద్యం సేవించడం వల్లే సంభవించాయని అధికారులు తెలిపారు. “ప్రస్తుతం రెండు డజన్ల మందికి పైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. వారు బాగానే ఉన్నారు.” అని అధికారులు చెప్పారు. ఈ సంఘటన తర్వాత ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (నార్త్) ఎన్‌ కన్నన్ సరైన చర్యలకు హామీ ఇచ్చారు. మొత్తం 10 మంది బాధితులు ఇథనాల్-మిథనాల్ పదార్థాలతో కూడిన నకిలీ మద్యం సేవించి ఉండవచ్చని చెప్పారు.తమిళనాడులోని నార్త్ జోన్‌లో రెండు వేర్వేరు కల్తీ మద్యం మరణాలు నమోదయ్యాయని, ఈ రెండు ఘటనల మధ్య సంబంధమున్నట్లు ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, అయితే సాధ్యమయ్యే లింక్‌లను కనుగొనడానికి పోలీసులు కోణం నుండి దర్యాప్తు చేస్తున్నారని ఆయన అన్నారు. “రెండు నకిలీ మద్యం సంఘటనలు నమోదయ్యాయి. ఒకటి చెంగల్పట్టు జిల్లాలో, మరొకటి విల్లుపురం జిల్లాలో జరిగాయి. విల్లుపురం జిల్లా పరిధిలోని మరక్కనం సమీపంలో గల ఎక్కియార్‌కుప్పం గ్రామంలో నిన్న 6 మంది వాంతులు, కంటి సమస్యలు, వాంతులు, తల తిరగడం వంటి ఫిర్యాదులతో ఆసుపత్రి పాలయ్యారు. సమాచారం మేరకు, పోలీసుల బృందం గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైన ఆసుపత్రికి చేర్చింది. ఇందులో ఇద్దరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉండగా చికిత్సకు స్పందించకపోవడంతో నలుగురు మరణించారు. 33 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ”అని విలేకరుల సమావేశంలో ఐజీ తెలిపారు. కాగా ఐసీయూలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందడంతో విల్లుపురం జిల్లాలో మృతుల సంఖ్య ఆరుకు చేరగా, మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది.

ముహూర్తం ఫిక్స్ అయ్యింది తమ్ముళ్లు… వేటకి సిద్ధమా?
బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్నాడు అనుకోగానే మళ్లీ రావణాసురతో రవితేజ డిజాస్టర్ అందుకున్నాడు. ఈ ఫ్లాప్ నుంచి బయటకి వచ్చి ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటకి రాలేదు. రవితేజ ఫాన్స్ చాలా రోజులుగా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యండి అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. అభిమానులు ఎంత అడిగినా మేకర్స్ మాత్రం సైలెంట్ గా తమ పని చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ సోషల్ మీడియాలో రవితేజ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. “ప్రియమైన తమ్ముళ్లు అందరికి ఓపిక గా వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు మీ మెసేజెస్, ట్వీట్స్ అన్ని చూస్తున్నాను. మీరిస్తున్న ఎంకరేజ్మెంట్, ప్రేమే నాతో ఇంకా హార్డ్ వర్క్ చేపిస్తోంది. టైగర్.. నా నాలుగేళ్ల ఆకలి…మీకు ఫస్ట్ లుక్ లో చూపిస్తాను. ఈ సారి వేట మామూలుగా ఉండదు.

ఒక్క థండర్ తో అన్ని లిమిట్స్ దాటేసారు మావా…
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఒక సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వగానే… ఇదో రేర్ కాంబినేషన్, ఎలాంటి సినిమా బయటకి వస్తుందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేశారు. #BoyapatiRapo అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి రామ్ పోతినేని బర్త్ డే సంధర్భంగా ఫస్ట్ థండర్ ని రిలీజ్ చేశారు. ఎలాంటి డౌట్స్ లేకుండా పక్కాగా బోయపాటి స్టైల్ లో ఊరమాస్ గానే ఈ సినిమా ఉంటుంది అని కన్ఫామ్ చేస్తూ ఈ గ్లిమ్ప్స్ బయటకి వచ్చింది. ఎప్పుడూ స్లిమ్ అండ్ క్యూట్ గా ఉండే రామ్, పూర్తిగా బోయపాటి హీరోలా మారిపోయి గడ్డం పెంచి మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇలాంటి ఒక లుక్ ని రామ్ పోతినేని చూస్తాం అని ఫాన్స్ ఏ రోజు అనుకోని ఉండరు. లుక్స్ విషయంలోనే కాదు రామ్ పోతినేని డైలాగ్స్ విషయంలో కూడా బోయపాటి స్టైల్ నే ఫాలో అయిపోయాడు. “నీ స్టేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ గేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ పవర్ దాటలేను అన్నావ్ డాటా, ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్” అని రామ్ పోతినేని డైలాగ్ చెప్తుంటే భద్ర సినిమాలో రవితేజ, తులసి సినిమాలో వెంకటేష్, సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ లు గుర్తొస్తున్నారు.