NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.. ఇచ్చిన మాట ప్రకారం.. కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సీఎం ఆదేశాల మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి.. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ అర్హులైన 2,146 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వైద్య శాఖ స్పెషల్ సీఎస్‌ కృష్ణబాబు.. ఇక, పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2,025 మంది వైద్య సిబ్బంది ఉందడగా.. డీఎంఈ పరిధిలో 62, కుంటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాలలో నలుగురిని క్రమబద్దీకరించారు.. మొత్తంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంట్రాక్ట్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

అందరి సపోర్ట్ నాకే.. నారా లోకేష్ పై గెలుస్తా..!
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.. వారి వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు సాగుతున్నాయి.. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులు తెలాల్సి ఉన్నా.. చాలా దాదాపు సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులు ఎవరు? ఎవరికి ఎవరు పోటీ అనేది తేలిపోయింది.. ఇక, మంగళగిరిలో టీడీపీ నుంచి నారా లోకేష్‌ పోటీ చేస్తుండగా.. అతడికి చెక్‌ పెట్టడంతో పాటు సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడు కోవడంపై ఫోకస్‌ పెట్టింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అయితే, అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేను మార్చేసి.. ఓ మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపింది.. ఆమె.. మురుగుడు లావణ్య.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది నేను అనే ధీమా వ్యక్తం చేస్తున్న ఆమె.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. తన ప్రత్యర్థి ఎవరు అనేది ఆలోచించను.. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తాను.. విజయం సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మురుగుడు లావణ్య.. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి, అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.. అన్ని వర్గాల నుంచి మంచి సపోర్ట్‌ వస్తుంది.. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం నాదే అన్నారు. అంతేకాదు.. నేను లోకల్‌ అభ్యర్థిని.. నా ప్రధాన ప్రత్యర్థి నాన్‌ లోకల్‌ అని పేర్కొన్న ఆమె.. అందరికీ అందుబాటులో ఉంటాను.. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను అన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పూర్తిస్థాయిలో నాకు మద్దతుగా పనిచేస్తున్నారు.. ఇక, నా ఫ్యామిలీ కూడా నాకు అండగా ఉంది.. నారా లోకేష్‌పై విజయం నాదే అంటున్న మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య.. ఎ

చీరాలలో జనసేనకు షాక్.. సమన్వయకర్త పదవికి ఆమంచి స్వాములు రాజీనామా..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో చీరాలలో జనసేన పార్టీకి షాక్‌ తగిలింది.. చీరాల నియోకవర్గ జనసేన సమన్వయకర్తగా ఉన్న ఆమంచి స్వాములు.. ఆ పదవికి రాజీనామా చేశారు.. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో పాటు.. జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు.. అయితే, గిద్దలూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు ఆమంచి స్వాములు.. కానీ, జనసేన అధిష్టానం ఆయనకు చీరాల భాద్యతలు అప్పగించింది.. దీనిపై కినుక వహించిన ఆయన.. ఇప్పుడు చీరాల నియోకవర్గ జనసేన సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. ”నా పై నమ్మకం ఉంచి గతంలో నన్ను చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా నియమించినందుకు ధన్యవాదలు.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను చీరాల నియోజకవర్గ సమన్వయకర్తగా తప్పుకోదలుచుకున్నాను.. దయచేసి నా ఈ అభ్యర్థనను అంగీకరిస్తారని భావిస్తాను” అని పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు ఆమంచి శ్రీనివాసులు అలియాస్‌ ఆమంచి స్వాములు.. అయితే, పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానంటున్నారు. ఆమంచి స్వాములు జనసేన రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్న విషయం విదితమే.

అనకాపల్లిలో కొత్త కాంబినేషన్.. చేతులు కలిపిన చిరకాల ప్రత్యర్థులు
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. అదీ ఎన్నికల సమయంలో జరిగే పరిణామాలు కీలంగా మారుతుంటాయి.. ఇప్పుడు తాజాగా జరిగిన మార్పులు.. అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.. అనకాపల్లిలో కొత్త రాజకీయ కాంబినేషన్‌ ఏర్పడేలా చేశాయి.. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న సీనియర్‌ రాజకీయ నేతలైన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్ర రావు చేతులు కలిపారు.. ఈ రోజు మాజీమంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు.. జనసేన- టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.. 40 ఏళ్లుగా అనకాపల్లి రాజకీయాల్లో వర్గ పోరు నడిపిన దాడి, కొణతాల ఇప్పుడు చేతులు కలపడంపై రెండు వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తు్న్నాయి.. ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణ.. టికెట్‌ దక్కించుకున్నారు.. ఇక, సుదీర్ఘకాలంలో టీడీపీలో పనిచేసిన దాడి వీరభద్రరావు.. వైసీపీలోకి వెళ్లినా.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.. అయితే, రెండు పార్టీలో ఇప్పుడు పొత్తులో ఎన్నికలకు వెళ్తుండగా.. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నా ఇద్దరు మాజీ మంత్రులు, సీనియర్‌ పొలిటీషన్లు ఇప్పుడు చేతులు కలిపి ముందుకు సాగాల్సిన పరిస్థితి వచ్చింది. 40 ఏళ్లుగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని నేతలు.. ఇప్పుడు కలిసి పనిచేయాలని నిర్ణయిం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పూర్తిస్థాయిలో కొణతాల కోసం పనిచేస్తానని దాడి వీరభద్రరావు ప్రకటించారు.. ఇది అనకాపల్లి జిల్లా రాజకీయాలతో పాటు.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఆసక్తికర పరిణామంగా మారింది..

అసలు జగన్‌కు గుండె లేదు.. కొణతాల గెలుపుకోసం పనిచేస్తా..
అనకాపల్లి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.. చేతులు కలిపారు చిరకాల ప్రత్యర్థులైన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్ర రావు.. ఇటీవల జనసేనలో చేరి అనకాపల్లి సీటు దక్కించుకున్నారు కొణతాల రామకృష్ణ.. ఇక, ఈ రోజు ఆయన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి కలిసారు.. ఈ సందర్భంగా.. మాజీమంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ.. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ గెలుపుకు సహకరిస్తాను అన్నారు. మా ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలే గాని వ్యక్తిగత విభేదాలు లేవు.. ఈ కలయిక మా రెండు కుటుంబాల కలయికగా అభివర్ణించారు. వైసీపీలో అనకాపల్లిలో నాయకులు లేనట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌.. ఎమ్మెల్యే అభ్యర్థిని అమెరికా నుండి తీసుకువచ్చాడు అని ఎద్దేవా చేశారు.. నియోజకవర్గం లేని నాయకుడు మంత్రి గుడివాడ అమర్నాథ్ అని సెటైర్లు వేశారు. 15 నియోజవర్గాలు గెలిపించే బాధ్యత అప్ప చెప్పిన మంత్రి గుడివాడకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు ఎందుకు ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు. మరోవైపు.. అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుండె లేదని విమర్శించారు దాడి వీరభద్రరావు.. గతంలో నా కుమారుడు దాడి రత్నాకర్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు, ఇప్పుడు మంత్రి అమర్నాథ్ ను కూడా అలాగే అన్నాడు అంటూ ఎద్దేవా చేశారు దాడి వీరభద్రరావు.. ఇక, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం అన్నారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.. అనకాపల్లిలో తన గెలుపు కోసం సహకరించమని మాజీ మంత్రి దాడి వీరభద్ర రావుని కలిసా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు కలిసి పని చేస్తాం అని ప్రకటించారు కొణతాల రామకృష్ణ.

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు.. విజయసాయిరెడ్డి సెటైర్లు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న విపక్షాలు.. జట్టు కట్టాయి.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఇప్పటికే ఉండగా.. బీజేపీ విషయంపై ఈ రోజు క్లారిటీ రానుంది.. ఇప్పటికే దాదాపు పొత్తు ఖరారు అయిపోగా.. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌.. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడనున్నారు.. ఆ తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించి ఎంపీ విజయసాయిరెడ్డి.. సెటైర్లు వేశారు. 2014-19 మధ్య కాలంలో ఏపీ చూసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది? అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి… ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు దుయ్యబట్టిన ఆయన.. ఈ మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది అని జోస్యం చెప్పారు.. ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర ప్రభుత్వం కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయండి అంటూ.. సోషల్‌ మీడియా వేదిక పిలుపునిచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. కాగా, వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది.. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రచారంలో స్పీడ్‌ పెంచారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

కరీంనగర్ పార్లమెంట్‌కు12 వేల కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చా..
బీజేపీ అనేది పెద్ద కుటుంబం.. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు. తనకు కల్మషం ఉండదని, ఎవరి మీద కోపం ఉండదని.. ఎవరితో తనకు అభిప్రాయ భేదాలు లేవని ఆయన తెలిపారు. పార్టీలో ఉంటూ పార్టీ కోసం పని చేయక పోతే కన్నా తల్లికి ద్రోహం చేసినట్టేనన్నారు. తన వల్లనే పార్టీ ఉందని ఎప్పుడు చెప్పుకోలేదన్న ఆయన.. బండి సంజయ్ ఉన్న లేకున్నా పార్టీ ఉంటుందన్నారు. మా నాయకుల మీద కామెంట్ చేసే అంత సంస్కార హీనున్ని కాదన్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వాలన్నారు. తాను కూడా అవమానాలకు గురయ్యానని.. కార్యకర్తలకి అన్యాయం జరిగితే ప్రశ్నించే వ్యక్తిని అంటూ ఆయన తెలిపారు. చాలా మంది పోటీ చేసిన వారు పార్టీనీ వదిలి వెళ్ళిపోయారు .. దీంతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారన్నారు.బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిన వారిని, కార్యకర్తలను రాచి రంపాన పెట్టిన వారినీ పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తానని, అడ్డుకుంటానని బండి సంజయ్‌ తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్‌కు12 వేల కోట్ల ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చానని వెల్లడించారు. వినోద్ కుమార్‌ను ఆయన పార్టీ కార్యకర్తలే గుర్తు పట్టరన్నారు. గత ఎంపీ కరీంనగర్‌కు చేసిందేమీ లేదని, అయన చేసి ఉంటే లక్ష ఓట్లతో నన్ను ఎలా గెలిపించారన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారన్నారు.

అన్నారం సరస్వతి బ్యారేజీకి ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల బృందం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజీకి నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(NDSA0 నిపుణుల బృందం చేరుకుంది. నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ బృందం రెండో రోజు పర్యటిస్తోంది. నిన్న రాత్రి రామగుండంలో బస చేసి అన్నారం బ్యారేజీకి చేరుకుని అక్కడ సీపేజీలు, బుంగలు, లీకేజీల ప్రాంతంలో పరిశీలిస్తున్నారు. కేంద్రజలసంఘం మాజీ చైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు యు. సి. విద్యార్థి, ఆర్. పాటేల్, సీడబ్ల్యూసీ సభ్యుడు యస్.హెచ్.శివ కుమార్, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనాలు ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు‌. ఎన్‌డీఎస్‌ఏ కమిటీ సభ్యులు బ్యారేజ్‌పై నుంచి పరిశీలిస్తున్నారు‌. మీడియాను అనుమతించడం లేదు. గురువారం ఈ బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సంగతి తెలిసిందే.

రికార్డు సృష్టించిన బంగారం ధర.. అంతర్జాతీయ సంకేతాలే ఇందుకు కారణమా ?
బంగారం మెరుపు ఆగడం లేదు. గురువారం బంగారం మళ్లీ సరికొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. ఢిల్లీ NCR బులియన్ మార్కెట్‌లో బంగారం రూ. 500 పెరిగి రూ. 65,650 గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే గత ట్రేడింగ్ సెషన్‌లో బంగారం 10 గ్రాములు రూ. 65,150 స్థాయిలో ముగిసింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయని, ఆ తర్వాత ధర జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుందని చెప్పారు. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.65,650కి చేరుకుందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ, విదేశీ మార్కెట్ల నుంచి వస్తున్న సంకేతాల కారణంగా బంగారం ధరల్లో ఈ మార్పు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో, Comex బంగారం ఔన్స్‌కు 30డాలర్ల పెరుగుదలతో 2152డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కూడా ఔన్స్‌కు 2161.50 డాలర్ల స్థాయిని తాకింది. వెండి ధరలు కూడా పెరగడంతో పాటు కిలో రూ.400 పెరిగి రూ.74,900కి చేరింది.

అండర్19 ప్రపంచకప్ కలిసి ఆడారు.. 100 టెస్ట్ మ్యాచ్‌ కలిసే ఆడారు! మధ్యలో మరెన్నో
సీనియర్స్ ప్లేయర్స్ కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు ఇప్పటికీ న్యూజిలాండ్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విలియమ్సన్ పరుగుల వరద పాటిస్తుంటే.. సౌథీ వికెట్స్ పడగొడుతున్నాడు. అండర్19 ప్రపంచకప్ కలిసి ఆడిన ఈ ఇద్దరు.. అంతర్జాతీయ 100 టెస్ట్ మ్యాచ్‌ కూడా కలిసే ఆడారు. క్రైస్ట్‌చర్చ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ విలియమ్సన్, సౌథీలకు కెరీర్‌కి 100వ టెస్ట్ మ్యాచ్. 100 టెస్ట్ మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న 5, 6వ న్యూజిలాండ్ ఆటగాళ్లుగా వీరు నిలిచారు. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు 2008లో జరిగిన ఐసీసీ పురుషుల అండర్19 ప్రపంచకప్‌లో ఆడారు. అండర్19 ప్రపంచకప్‌కు కొన్ని వారాల ముందు టీ20 ఫార్మాట్‌లో సౌథీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సంవత్సరం లోపే టెస్ట్ అరంగేట్రం కూడా చేశాడు. అయితే విలియమ్సన్ తన టెస్ట్ అరంగేట్రం చేయడానికి రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఇద్దరు మూడు ఫార్మాట్‌లలో వేగంగా ఎదిగారు. న్యూజిలాండ్ జట్టుకు కీలక ఆటగాళ్లుగా మారిపోయారు. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీల ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2011, 2015, 2019 మరియు 2023 వన్డే ప్రపంచకప్‌లు ఇద్దరు కలిసి ఆడారు. అంతేకాదు టీ20 ప్రపంచకప్‌లు కూడా ఆడారు. టీ20 ప్రపంచకప్‌ 2024 ఆడడానికి కూడా సిద్ధమయ్యారు. విలియమ్సన్ టెస్టుల్లో 8675 పరుగులు చేశాడు. ప్రస్తుత ఆటగాళ్లలో విలియమ్సన్ కంటే ఎక్కువ టెస్టు సెంచరీలు (32) ఎవరూ చేయలేదు. మరోవైపు సౌథీ 378 టెస్ట్ వికెట్స్ పడగొట్టాడు.

చిత్ర పరిశ్రమ లో విషాదం.. అక్క మృతిచెందిన కొద్దిసేపటికే చెల్లి కూడా..
చిత్ర పరిశ్రమలో విషాదం విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటీమణులు డాలీ సోహి, అమన్ దీప్ సోహి.. కొద్దీ గంటల వ్యవధిలోనే మృతిచెందారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకేసారి మృతి చెందడంతో సోహి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. డాలీ సోహి.. జనక్, భాభీ వంటి టీవీ షోలతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఇక ఆరునెలల క్రితమే ఆమె క్యాన్సర్ బారిన పడింది. గర్భాశయ క్యాన్సర్ అని తెలియడంతో ఆమె చికిత్స తీసుకుంటుంది. క్యాన్సర్ ఊపిరితిత్తుల వరకు పాకిందని.. ఆరోగ్యం క్షీణించడంతో గతరాత్రే డాలీని ఆసుపత్రిలో చేర్చామని ఆమె సోదరుడు మన్‌ప్రీత్ తెలిపారు. ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె క్యాన్సర్ నుంచి కోలుకుంటుందని అందరూ ఆశించారు. ఆమె పరిస్థితి ఇలా ఉంటే .. ఆమె సోదరి, నటి అమన్ దీప్ సోహి కామెర్ల బారిన పడింది. గత కొన్నిరోజులుగా ఆమె కూడా డీవీ పాటిల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. అయితే కామెర్లు ముదరడంతో అమన్ దీప్ సోహి నేటి ఉదయం మృతి చెందింది. సోదరి మరణవార్త విన్న కొద్దిసేపటికే డాలీ కూడా కన్నుమూసిందని వారి సోదరుడు మన్‌ప్రీత్ సోహి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక ఇద్దరు కూతుళ్లను ఒకేరోజు పోగొట్టుకున్న వారి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివలన కావడం లేదు. ఇక ఈ విషయం తెలియడంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రముఖులు సోహి సిస్టర్స్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ధనుష్ DNS మూవీ ఫస్ట్ లుక్ అప్డేట్.. దేవిశ్రీ లుక్ వైరల్..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్  కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం DNS. హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాల తో లాంఛ్ కాగా..స్టిల్స్‌ ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉంటే నేడు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.. ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.తాజాగా డీఎస్పీ రాకింగ్ బీజీఎం తో DNS ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల కాబోతుందంటూ మేకర్స్‌ స్టూడియోలో ఉన్ లుక్‌ ను షేర్ చేయగా.. నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌ మరియు పుస్కూరి రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.రష్మిక ఇటీవలే హైదరాబాద్‌ లో జరుగుతున్న షూటింగ్‌కు నుంచి విరామం తీసుకొని జపాన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి వెళ్లగా.. ఈవెంట్‌ స్టిల్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. DNS తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌ గా విడుదల కానుంది.లవ్‌స్టోరీ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల నుంచి వస్తున్న సినిమా కావడం తో ప్రేక్షకులలో అంచనాలు భారీ గా వున్నాయి..ఇదిలా ఉంటే ధనుష్‌ మరోవైపు స్వీయ దర్శకత్వం లో 50వ సినిమా చేస్తున్నాడు.’D50’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కమ్‌ యాక్టర్ ఎస్‌జే సూర్య ఈ ప్రాజెక్టు లో ముఖ్య పాత్ర లో నటిస్తున్నట్లు సమాచారం.

నయనతారకు నిజంగానే మనసు ముక్కలైందా?
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.టాలీవుడ్,కోలివుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే.. తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్‌ హీరోయిన్‌ నయనతార భర్తను అన్ ఫాలో చేసిందని రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి.. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ విఘ్నేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఇప్పుడు మరో పోస్ట్ పెట్టింది.. మరోసారి ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.. నయనతార స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటు వరుస సినిమాల్లో బిజీగా ఉంటుంది…ఎంత స్టార్డమ్ వచ్చినా.. నయనతార మాత్రం సోషల్ మీడియాకు దూరంగానే ఉండేది. కానీ కొన్నిరోజుల కిత్రం తాను కూడా ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టింది. ఇక ఇటీవల నయనతార ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ లిస్ట్లో విఘ్నేష్ శివన్ పేరు కనిపించలేదు. దీంతో నయన్.. విఘ్నేష్ను అన్ఫాలో చేసిందని వార్తలు మొదలయ్యాయి. అంతే కాకుండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వింత కోట్ను కూడా షేర్ చేసింది.. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి.. ఈ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా విఘ్నేశ్ శివన్ ఒక పోస్ట్ చేశాడు..

Show comments