NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ప్రాణాలు తీస్తోన్న డీజేలు.. పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ మరో యువకుడు మృతి
చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ పెళ్లి పెళ్లి వేడుకల్లో డీజే సాంగ్ కి హుషారుగా స్టెప్పులు వేశాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్య సాయి.. శ్రీపెరంబదూర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. అయితే, ఫ్రెండ్‌ మ్యారేజ్ కావడంతో.. తన స్నేహితులతో కలిసి వెళ్లాడు.. ఇక, పెళ్లి వేడుకల్లో హుషారుగా గడిపాడు.. డీజే పాటలకు తోటి స్నేహితులతో కలిసి స్టెప్పులు వేశాడు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొద్దిసేపు డ్యాన్స్‌ చేసిన తర్వాత.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.. షాక్‌ తిన్న స్నేహితులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. అయితే, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. పెళ్లి వేడుకలో డీజే సౌండ్స్‌ ఓ ఫ్యాషన్‌ కావొచ్చు.. ఇప్పుడు ప్రాణాలు తీస్తున్న వాటి జోలికి వెళ్లకపోవడం బెటర్‌ అంటున్నారు వైద్య నిపుణులు.

దువ్వాడలో దంపతుల సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం..
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తలు సూసైడ్ వీడియో కలకలం రేపింది.. వడ్లపూడి తిరుమల నగర్ లో నివాసముంటున్న చిత్రాడ వరప్రసాద్ భార్య మీరా గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.. భర్త చిత్రాడ వరప్రసాద్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు.. భార్య మీరా తో కలిసి ఓ సెల్ఫీ వీడియో తీసి.. కుమారుడు కృష్ణ సాయి తేజకు వాట్సాప్ పంపించాడు.. ఇక, ఆ తర్వాత సెల్‌ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేశారు.. తల్లి తండ్రుల వీడియో చూసి ఆందోళనకు గురైన కుమారుడు కృష్ణ సాయి తేజ.. పోలీసులను ఆశ్రయించాడు.. దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇక, కృష్ణ సాయితేజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. అనకాపల్లి ఏటికొప్పాక ఏలూరు కాలువ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఉన్నట్లు గుర్తించారు.. ప్రస్తుతానికి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఎక్కడికైనా వెళ్లిపోయారా? లేదా? ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

వైసీపీకి గుడ్‌బై ప్రచారంపై స్పందించిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి
నెల్లూరు జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతున్నాయి.. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది.. ఇక, ఈ మధ్య నెల్లూరు జిల్లాకు చెందిన మరో రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.. తెలిసినవారు, తెలియనివారు ఈ వార్త షేర్‌ చేశారు.. చేస్తూనే ఉన్నారు. అయితే, ఆ ప్రచారంపై ఘాటుగా స్పందించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం సరికాదన్న ఆయన.. మాది రాజకీయ కుటుంబం.. నా మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. మంత్రిగా పనిచేశా.. సీఎం వైఎస్‌ జగన్‌ నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తారు.. అసలు నేను పార్టీ మారడం ఏంటి? అని ప్రశ్నించారు. 2012లో ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి గెలిచా.. నా చివరి రక్తపు బొట్టు వరకూ వైఎస్‌ జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు నల్లపరెడ్డి… వాళ్ల ఇంట్లో బిడ్డలా చూసుకుంటున్నారు.. నెల్లూరు బ్యారేజ్ కు మా నాన్న శ్రీనివాసులు రెడ్డి పేరు పెట్టారు అని గుర్తుచేశారు. కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని ద్రోహం చేశారని మండిపడ్డ ఆయన.. ఈ గేమ్ చంద్రబాబు ఆడుతున్నాడు.. గతంలో ఆయన సీఎం అయ్యేటప్పుడు కూడా ఇదే గేమ్ ఆడాడని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని ఇలా చేస్తూన్నాడు అని చంద్రబాబుపై ఫైర్‌ అయిన ఆయన.. కోవూరులో వేరొకరికి టికెట్ ఇస్తానని జగన్ చెప్పినా నేను సిద్ధం.. ఆయన పెట్టే ఏ అభ్యర్థినైనా గెలిపిస్తానని ప్రకటించారు.. అంతే కాదు.. నేను చనిపోయే వరకూ జగన్ తోనే ఉంటాను అని వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం సాగుతుండడంతో.. నాకు ఎందరో ఫోన్ చేశారు.. జగన్‌ మళ్లీ సీఎం అయ్యేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రకటించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. కాగా, నెల్లూరు వైసీపీలో పడనున్న మరో వికెట్‌.. జగన్‌పై అసంతృప్తితో రగిలిపోతున్న మరో పెద్దారెడ్డి అంటూ.. ఓ వార్త హల్‌చల్‌ చేసిన విషయం విదితమే.

టీడీపీ, జనసేనతో కలిసే పోటీచేస్తాం..
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సీపీఐ ఎన్నికల బరిలో నిలవబోతుందని ప్రకటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కలవడం అంటూ జరిగితే మా ఓట్లు ఇవ్వడం మాత్రమే కాదు.. మాకు సీట్లు కూడా కావాలని స్పష్టం చేశారు.. ఇక, వీరుడు, సూరుడు అనుకున్న జగన్.. కేంద్రం దగ్గర మొకరిల్లుతున్నాడని విమర్శలు గుప్పించారు.. పోలవరం విషయంలో వాళ్ల నాన్న వైఎస్ లో ఉన్న పోరాట స్ఫూర్తి జగన్ లో కనిపించడం లేదన్న ఆయన.. వాళ్ల నాన్న సిద్ధాంతాలకు కూడా పంగ నామాలు పెట్టిన వ్యక్తి గా జగన్ మిగిలిపోయేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం సీఎం వైఎస్‌ జగన్ కు లేదని విమర్శించారు నారాయణ.. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి.. పోలవరం ఎత్తు పెంచడంతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం విషయంలో విభజన హామీల హక్కులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిపోయిందన్నారు.. మీకు, పోరాడటానికి భయంగా ఉంటే అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకువెళ్ళండి, విభజన హామీలు మేం సాధించుకు వస్తాం అంటూఏ ప్రకటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో..
గుంటూరులో గ్రానైట్ తవ్వకాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.. గ్రానైట్‌ తవ్వకాలు నిలిపివేయాలంటూ గుంటూరు జిల్లా చిలకలూరపేటలో మురికిపుడి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.. దీనిపై గతంలో విచారణ జరిపి మంత్రి విడదల రజనీ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. ఇక, ఈ రోజు మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.. కాగా, ఈ కేసులో మంత్రి విడదల రజనీ, ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు స్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. అయితే, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దుచేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ ఇవ్వడంపై హైకోర్టులో రైతులు పిటిషన్‌ వేశారు.. ఈ పిటిషన్ తరపున వాదనలు వినిపించారు న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ.. మొత్తం 21 ఎకరాల 50 సెంట్లు భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ ఇచ్చిన ఎమ్మార్వోకు, రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్సైకి కూడా నోటీసులు ఇచ్చింది.. ఒక్కో ఎకరాలో 200 కోట్లు విలువ చేసే గ్రానైట్ నిల్వలు ఉన్నాయని అంచనా ఉండగా.. రైతులకు తెలియకుండానే ఎన్‌వోసీ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.. ఇక, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వచ్చేనెల 10 వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది.. అప్పటి వరకు స్టేటస్ కో ఉత్తర్వులు. కౌంటర్ లు దాఖలు చేయాలని మంత్రి, ఇతరులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

అనిల్‌కుమార్‌ యాదవ్‌కు మేకపాటి కౌంటర్‌.. ముందు నీది చూసుకో..!
ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత నలుగురు ఎమ్మెల్యేపై వేటు వేసింది వైసీపీ అధిష్టానం.. ఇక, ఆ తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలపై హాట్‌ కామెంట్లు చేస్తూ వస్తున్నారు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు.. వారి నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఎటాక్‌ నడుస్తోంది.. తాజాగా, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని ఎమ్మేల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం చాలా బాధాకరమన్న ఆయన.. అనిల్ నువ్వు ఓడిపోతున్నావు.. ముందు అది చూసుకో అని సూచించారు. నీకు నోరు ఉందనే సీఎం మంత్రి పదవి ఇచ్చారన్న ఆయన.. నెల్లూరు జిల్లా నుంచి మేం ముగ్గురం నూటికి నూరుపాళ్లు ఎమ్మెల్యేలుగా గెలుస్తాం, రాబోయే ఎన్నికల్లో మీరే చూస్తారు కదా? అని సవాల్‌ చేశారు. పార్టీ భ్రమలో మీరు మాట్లాడుతున్నారు.. కచ్చితంగా ప్రభుత్వం మారుతుంది, వైసీపీ ఓడిపోతుంది అని జోస్యం చెప్పారు మేకపాటి.. పోయిన ఎన్నికల్లో సింగిల్ డిజిట్ తో అనిల్ గెలిచాడని ఎద్దేవా చేసిన ఆయన.. అది మర్చిపోయినట్లుగా ఉన్నారు. కాస్త గుర్తుంచుకోండి అని సలహా ఇచ్చారు. మమ్మల్ని సస్పెండ్‌ చేశారు.. కానీ, నీకు పార్టీ టికెట్లు ఇవ్వరని ప్రచారం జరుగుతోంది.. నీది నువ్వు చూసుకో ముందు అని సూచించారు.. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగానే ఓటు వేశాను అని మరోసారి స్పష్టం చేశారు మేకపాటి.. రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ నాకు ఇవ్వనని సీఎం వైఎస్‌ జగన్ చెప్పారు.. వేరే, వ్యక్తికి ఇస్తున్నాం.. అతనికి మద్దతు తెలపాలని అన్నారు.. అయితే, పార్టీకి పనిచేసిన వారిని.. వెన్నుపోటు పొడిచే వారిని మంచి నేతలు అనరు అంటూ మండిపడ్డారు.. పార్టీ టికెట్ అడిగితే నన్ను సస్పెండ్ చేయడం సీఎం గారికి న్యాయం కాదన్నారు.

కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ధర్నా ఢిల్లీలో కాదు సీఎం ఇంటి ముందు చేయండి
మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వెల్లి మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాడం ఏంటని, మీకు ఏ అధికారం ఉందంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై మండిపడ్డారు. మీరు మహిళా రిజర్వేషన్‌ పై ఢిల్లీలో వచ్చి ఆందోళన చేస్తున్న కేసీఆర్‌ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఏ రకమైన అధికారం ఉందని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలో వున్న ఐదు సంవత్సరాల పాటు మీ మంత్రి వర్గంలో ఒక్క మహిళా కూడా లేని ప్రభుత్వాన్ని ఎలగబెట్టిన మీరు ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పోరాడటం ఏంటని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ధర్నా చేయాలంటే.. ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద కాదు సీఎం కేసీఆర్‌ కుటుంబం మీద చేయాలని మండిపడ్డారు. ధర్నా చేయాలంటే కేసీఆర్‌ నివాసం ముందు, సీఎం కార్యాలయం ముందు, తెలంగాణ ప్రభుత్వం ముందు నిరసన దీక్ష చేయాలి కానీ ఢిల్లీలో కాదని సంచలన వ్యాక్యలు చేశారు. బీజేపీలో అత్యధికంగా మహిళా ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌ సభ్యులు ఉన్న పార్టీ అని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటి సారి అత్యధికంగా మంత్రులు ప్రాతి నిత్యం వహిస్తున్నటు వంటి ప్రభుత్వం మాదని కొనియాడారు. మహిళలంటే మాకు గౌరవమని, మీలాగా మహిళా ద్వేషి కలిగినటువంటి పార్టీ కాదని స్పష్టం చేశారు. ఈరోజు సీఎం కుటుంబంపై వచ్చినటు వంటి అనేక రకాల అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించడం కోసం నాటకమే తప్పా మరేంకాదని కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు గుప్పించారు.

హైదరాబాద్‌ వాసులు అలర్ట్‌.. 3 నెలల పాటు అక్కడ ట్రాఫిక్ మళ్లింపు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో 2023 మార్చి 28 మంగళవారం నుంచి జూలై 28 వరకు సుమారు 3 నెలలపాలు ట్రాఫిక్‌ మళ్లించనున్నాట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ సమీపంలో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక మెట్రో స్టేషన్ వద్ద AG కాలనీ నుండి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈపనుల నిమిత్తం దాదాపు మూడు నెలల పాటు మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవాల్టి నుంచి (మార్చి 28)వ తేదీ నుంచి జులై 28వ తేదీ వరకు అనగా 3నెలలు అంటే 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అయితే.. నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి డైవర్ట్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు… ప్రయానికులు ట్రాఫిక్ ఆంక్షలను పాటించి సహకరించాలని వాహనదారులను కోరారు.

అన్నాడీఎంకే చీఫ్‌గా పళనిస్వామి.. పన్నీర్ సెల్వం సంగతేంటి?
తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ అయిన ఎఐఎడిఎంకె చీఫ్ గా మాజీ సీఎం ఎడప్పాడి కె పళనిస్వామిని ఎన్నికైయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై గత కొంత కాలంగా మాజీ సీఎంలు ఈపీఎస్- ఓపీఎస్ ల మధ్య వివాదం నడుస్తోంది. ఈ అంశంపై ఓపన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన సవాలను హైకోర్టు తిర్కరించింది. దీంతో పళనిస్వామికి మార్గం సుగుమమైంది. వెంటనే ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ని అధికారికంగా ప్రకటించింది. నాయకత్వ వివాదానికి పరిష్కారం లభించడంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. మరోవైపు OPS టీం ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌కు అప్పీల్ చేసే అవకాశం ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గత ఏడాది జూలైలో పార్టీ జనరల్ కౌన్సిల్ ఆమోదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. తాత్కాలిక చీఫ్‌గా ఆయన కొనసాగింపునకు సుప్రీంకోర్టు నెల రోజుల క్రితం పచ్చజెండా ఊపింది. అయితే తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం తీసుకునే బాధ్యతను మద్రాసు హైకోర్టుకు వదిలివేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక కోసం EPS శనివారం నామినేషన్ దాఖలు చేశారు.

ఈ రికార్డ్ ఎవరికీ సాధ్యం కాదు… అందుకే బాలీవుడ్ సినిమా
అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఎలాంటి గొడవలకి, కాంట్రవర్సీలకీ పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు మార్కెట్ ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిందీలో మాత్రం స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ఉంది. సాయి శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాలకి మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. అతను ఏ సినిమా రిలీజ్ చేసిన అది హిందీలో డబ్ అవ్వాల్సిందే, లక్షల్లో వ్యూస్ తీసుకోని రావాల్సిందే. మాములు మాస్ సినిమాలని రిలీజ్ చేస్తేనే యుట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ అవుతుంటే ఇక బోయపాటి శ్రీను లాంటి ఊర మాస్ డైరెక్టర్ తో చేసిన జయ జానకి నాయక మూవీ యుట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. 2017లో తెలుగులో రిలీజ్ అయిన జయ జానకి నాయక సినిమా బాగానే ఆడింది, ఇదే మూవీని హిందీలో డబ్ చేసి పెన్ మూవీస్ యుట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేశారు. 2019 ఫిబ్రవరి 8న హిందీలో జయ జానకి నాయక ‘ఖూన్కార్’ అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో 700 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఏ బాషలో అయినా ఒక సినిమా 700 మిలియన్ వ్యూస్ రాబట్టడం ఇదే మొదటిసారి. యుట్యూబ్ లో రిపీట్ వ్యూస్ రాబడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి మాత్రం ఏకంగా హిందీ బాక్సాఫీస్ నే టార్గెట్ చేశాడు. తనకి తెలుగు డెబ్యు ఇచ్చిన వీవీ వినాయక్ దర్శకత్వంలో, ప్రభాస్-రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాని సాయి శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. మే 12న ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ముందుకి రానుంది. మరి హిందీ ఛత్రపతి సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఎలాంటి లాంచ్ ఇస్తుందో చూడాలి.

ముంబైలో మెరిసిన ఎర్ర గులాబీ.
లేడీ పవర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ ‘సాయి పల్లవి’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా సినిమాతో తెలుగు తెరపై మెరసిన సాయి పల్లవికి ఫస్ట్ సినిమాతో సూపర్బ్ ఫేమ్ వచ్చింది. డెబ్యుతోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్న సాయి పల్లవి, తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. సాయి పల్లవి ఫిల్మోగ్రఫీలోని లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం లాంటి సినిమాల పేర్లు చూస్తే ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ ఇంత పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ పడలేదు అంటే అతిశయోక్తి కాదు. చీర కట్టులో కూడా మోస్ట్ గ్లామరస్ గా కనిపించగల సాయి పల్లవికి తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెని చూడడానికే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు అంటే సాయి పల్లవి క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగా ఉన్న సాయి పల్లవి, గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇందుకు కారణం సాయి పల్లవి, తన ట్రేడ్ మార్క్ లాంటి రెడ్ సారీలో కనిపించడమే. ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఫంక్షన్ లో సాయి పల్లవి తళుక్కున మెరసింది. గతేడాది రిలీజ్ అయిన ‘గార్గీ’ సినిమాకి గాను సాయి పల్లవికి ‘బెస్ట్ హీరోయిన్’ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ ని అందుకోవడానికి సాయి పల్లవి ముంబై వెళ్లింది. ఈ సంధర్భంగా రెడ్ సారీలో కనిపించిన సాయి పల్లవిని కెమెరాలు బంధించాయి. అంతే సాయి పల్లవి కొత్త ఫోటోలు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి సినిమాలని సైన్ చెయ్యకుండా సైలెంట్ గా ఉన్నా సాయి పల్లవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ట్విట్టర్ లో అవుతున్న ట్రెండే ఉదాహరణ. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది, ఈ పాన్ ఇండియా సినిమా కోసం పడి రోజుల కాల్ షీట్స్ కూడా కేటాయించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.