NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఆ పరిస్థితి ఉండకూడదనే జనసేన స్థాపించా..
జనసేన వారాహి యాత్ర కొనసాగుతోంది.. ఓవైపు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెడుతూనే.. మరోవైపు జనవాణి పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.. ఇక, బహరంగ సభల్లో అధికార పార్టీ నేతలను టార్గెట్‌ చేసి ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు పశ్చిమ గోదావరి నరసాపురం నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను.. మార్పుకోసం పంతం పట్టి కొనసాగుతున్నా.. సమాజంలో విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు చాలా అవసరం.. ఈ మూడు కొద్ది మంది చేతుల్లోకి వెళ్లి.. మిగతా వాళ్లు దేహి అనే పరిస్థితిలో ఉండకూడదని ఉద్దేశంతో జనసేన స్థాపించానని తెలిపారు. ఎక్కడ చూసినా ఇసుక దోచేస్తున్నారు.. దీని వల్ల పర్యావరనానికి ముప్పు ఏర్పడుతుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది.. ఆక్వా వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆక్వా కాలుష్యం వల్ల ఆరోగ్యం అనేది పెద్ద సమస్యగా మారిపోతుందన్నారు పవన్‌ కల్యాణ్.. గోదావరి జిల్లాలో కేరళ తరహా టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.. కానీ, పెట్టుబడి పెట్టేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటివాళ్ళు వ్యాపారాలు చే..స్తూ తమ స్వార్థం చూసుకుంటున్నారని విమర్శించారు. నేను పార్టీ నడుపుతూ దెబ్బలు తిన్నాను తప్ప కార్యకర్తల ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లకుండా చూడగలిగాను అన్నారు. డబ్బులు ఖర్చు చేయకుండా అభిమానులు కార్యకర్తల ప్రేమాభిమానాన్ని జనసేన పార్టీ సొంతం చేసుకోగలుగుతుందని వెల్లడించారు.

టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు.. బస్సు యాత్ర వాయిదా
అనంతపురం జిల్లాలో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర సాక్షిగా టీడీపీలో విభేధాలు రచ్చకెక్కుతున్నాయ్. పెనుకొండలో తెలుగు తమ్ముళ్లు ఒకరిని ఒకరు కొట్టుకోగా, మడకశిర ఏకంగా యాత్రనే వాయిదా వేయించారు. ఈ నియోజకవర్గాల్లో గ్రూపు పాలిటిక్స్‌కు చెక్ పెట్టాలని చూసిన నేతలకు జరుగుతున్న పరిణామాలు తలనొప్పిగా మారాయి. జిల్లాలోని నియోజకవర్గాల్లో టిడిపి నేతల మధ్య వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బస్సు యాత్ర సాక్షిగా తెలుగు తమ్ముళ్లు ముష్ఠిఘాతాలకు దిగుతున్నారు. గత కొంతకాలంగా పెనుగొండలో జిల్లా అధ్యక్షులు బికే పార్థసారథి, మహిళా నేత సవితమ్మ మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది. ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్ని స్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని సవితమ్మ డిమాండ్ చేస్తున్నారు. పార్థసారథి నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. ఐతే ఇక్కడ పట్టు సాధించుకునేందుకు ఇద్దరు నేతలు పోటాపోటీగా వ్యూహ ప్రతి వ్యూహాలను అమలు చేస్తుండటం ఘర్షణలకు దారితీస్తోంది. సీనియర్ , జూనియర్ అంటూ మడకశిరలో నేతలు అధిపత్యపోరుతో ఈనెల 27 న జరగాల్సిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సుయాత్ర తాత్కాలికంగా వాయిదా వేయించారు.మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం యాత్రలో పాల్గొంటే తాము పాల్గొనమని గుండుమల తిప్పేస్వామి వర్గీయులు తెగేసి చెప్పారు.దీంతో పాటు వాట్సప్ లలో మెసేజ్ స్తెతం ఫార్వర్డ్ చేశారు.ఇదే విషయాన్ని గుండుమల వర్గీయులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం జరగాల్సిన నియోజకవర్గంలో జరగాల్సిన బస్సు యాత్ర కాస్తా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మారింది.

సిల్లీ బచ్చానే.. దమ్ముంటే నాపై పోటీచేయి.. నా మీద గెలిచినా.. నా విజయం ఆపినా..!
నారా లోకేష్‌ వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. యువ గళం పాదయాత్రలో నాపై ఎన్నో వ్యాఖ్యలు చేశారు.. మా తాత, మా నాన్న ముఖ్యమంత్రి కాదు.. కానీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం వైఎస్‌ జగన్ ఆశీస్సులతో మంత్రి అయ్యాను.. కానీ, నువ్వు మొదటిసారి పోటీ చేసి ఓడిపోయావు.. మీ తాత.. మీ నాన్న ముఖ్యమంత్రి కాకపోతే వార్డు కౌన్సిలర్ కూడా గెలవలేవు అంటూ సెటైర్లు వేవారు.. నన్ను సిల్లీ బచ్చా అన్నావ్.. గత ఎన్నికల్లో నాపై పోటీ చేసిన వ్యక్తి వంద కోట్లు ఖర్చు పెట్టారు.. 2024లో కూడా 200 కోట్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.. పిల్ల బచ్చాన్ని చూసి ఎందుకు అంత వణికిపోతున్నారు? అని ప్రశ్నించారు. నాకు టికెట్ రాదని అంటారా..? రాష్ట్ర ప్రజలందరూ పులకేసి అనుకుంటున్నారు.. పిల్ల బచ్చానే దమ్ముంటే నాపై పోటీచేయి అంటూ నారా లోకేష్‌కి సవాల్‌ చేశారు అనిల్‌ కుమార్‌ యాదవ్.. నెల్లూరు సిటీ నుంచి నా మీద పోటీ చేసి గెలిచినా.. లేదా 2024లో నా గెలుపును ఆపినా.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుంటాను.. గెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? అంటూ సవాల్‌ విసిరారు.. నా సవాల్ స్వీకరించాలి.. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. నేను నాయుడుపేటలో వంద కోట్ల రూపాయల విలువైన లేఔట్ వేశానని చెప్పావు.. ఒక శాతం భాగం కూడా నాకు లేదన్నారు.

ఢిల్లీ-పోర్ట్ బ్లేయర్ విమానం విశాఖలో ఎమర్జెన్సీ ల్యాండిండ్‌
ఢిల్లీ నుంచి పోర్ట్‌ బ్లేయర్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.. వాతావరణం అనుకూలించని కారణంగా.. విశాఖలో నిన్న రాత్రి ఎమర్జెన్సీగా ల్యాండ్‌ చేశారు పైలట్.. దీంతో.. ప్రయాణికులకు నిన్న రాత్రి ఒక హోటల్ లో వసతి ఏర్పాటు చేశారు… విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయిన నేపథ్యంలో.. పోర్ట్‌ బ్లేయర్‌ వెళ్లాల్సిన 270 మంది ప్రయాణికులు విశాఖపట్నంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.. ఇందులో అధిక సంఖ్యలో మెడికల్ కౌన్సిలింగ్ కి వెళ్లాల్సినవారే ఉన్నారని చెబుతున్నారు.. అయితే, 24 గంటలు గడిచినప్పటికీ విమానం ఎప్పుడు బయల్దేరుతుందనే ఖచ్చితమైన సమాచారం ఇప్పటికీ ఇవ్వకపోవడంతో.. ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు.. వీరంతా విశాఖపట్నం మేఘాలయ హోటల్లో బస చేశారు. అయతే, మెడికల్‌ కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సినవారు అధిక సంఖ్యలో ఉండడంతో.. వారిలో ఆందోళన మొదలైంది.. వెంటనే తమను గమ్యస్థానానికి చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

యూపీఏ మాయం కానుందా..? కొత్త పేరు అదేనా..? కెప్టెన్‌ ఎవరు..?
యూపీఏ.. కాంగ్రెస్ సారథ్యంలో పదేళ్లపాటుదేశాన్ని ఏలిన ఐక్య ప్రగతిశీల కూటమి. 19 ఏళ్లుగా ఆ కూటమిని కాంగ్రెస్ లీడ్ చేసింది. అయితే ఇకపై ఈ పేరు కనుమరుగు కాబోతోందని జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. కొత్తగా కలిసిన 15 ప్రతిపక్షాలు కూటమికి కొత్త పేరుపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏకి దీటుగా దేశభక్త ప్రజాస్వామిక కూటమి అనే పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చినట్టు తెలిసింది. పేట్రియాటిక్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌-పీడీఏ అని పేరు ఖరారు చేసినట్టు సమాచారం. ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల ఐక్యతా సమావేశంలో కొత్త జట్టు పేరును మెజారిటీ పార్టీలు అంగీకరించాయని సమాచారం. పీడీఏ పేరును సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా గట్టిగా సమర్థించినట్టు తెలిసింది. వచ్చే నెలలో సిమ్లాలో జరిగే భేటీలో కొత్తపేరు మీద క్లారిటీ వస్తుందని జాతీయ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం యూపీఏ కన్వీనర్‌గా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందు కృషిచేస్తున్న నితీష్‌ కుమార్‌.. ఆమె స్థానంలో కూటమికి నేతృత్వం వహిస్తారని కాంగ్రెసేతర విపక్షాలు చెబుతున్నాయి. అయితే యూపీఏ రద్దును కాంగ్రెస్‌ అంగీకరిస్తుందా లేదా అనేది తెలియాలి. 19 ఏళ్లుగా యూపీయే కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు కొత్త కూటమిలో అంతే గౌరవం దక్కుతుందా.. ఓ ప్రాంతీయ పార్టీ నేత నాయకత్వాన్ని జాతీయ పార్టీ ఆమోదిస్తుందా అనే సందేహంపై పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. యూపీఏ ఇప్పటికీ ఉనికిలోనే ఉందని, సోనియా సారథిగా వున్నారని కాంగ్రెస్‌ చెబుతోంది. అయితే కొత్త కూటమి పేరు పట్నా భేటీలో ప్రస్తావనకు వచ్చి ఉంటే కచ్చితంగా మీడియాకు చెప్పే వాళ్లమని ఆర్‌జేడీ అంటోంది. మరోవైపు విపక్షాల కూటమిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చేరడం ఇప్పటికీ సందేహంగానే ఉంది. ఆ పార్టీ బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఢిల్లీ ఆర్డినెన్స్‌ విషయంలో కాంగ్రెస్‌ ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. రాహుల్‌ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తమతో సయోధ్య కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఆప్‌ నాయకత్వానికి అర్థమైంది.

తండ్రి ప్రేమ మరి..! తుపాకీతో కాల్చిన కొడుకు.. నాన్న వాంగ్మూలం చూస్నే కన్నీళ్లు ఆగవంతే..
పంజాబ్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హోషియార్‌పూర్‌ జిల్లా జలాల్‌చక్క గ్రామంలో వీర్‌సింగ్‌ అనే వ్యక్తి తన ఆర్మీ మాజీ ఉద్యోగి అయిన కుమారుడు అమర్‌సింగ్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎండలు మండుతున్నాయి.. దానికి తోడు ఇంట్లోని ఏసీ సరిగా పనిచేయడంలేదు.. చల్లనిగాలి రావడంలేదు.. దీంతో కుమారుడు ఏసీకి మరమ్మతు చేయించాలని తండ్రికి చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది.. ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు.. తండ్రిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటాలు ఆ వృద్ధుడైన ఆ తండ్రి రెండు కాళ్లలోకి దూసుకెళ్లాయి.. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మరింత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని అమృత్‌సర్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడైన తండ్రి వాంగ్మూలం కోసం ఆస్పత్రికి వెళ్లారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ తండ్రి మాట్లాడుతూ.. నా కొడుకు మద్యం మత్తులో ఉన్నాడు.. కోపంతో లైసెన్స్‌ కలిగిన తుపాకీతో నాపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నా రెండు కాళ్లలోకి బుల్లెట్లు దిగాయి. వాడు మద్యం మత్తులో తప్పు చేశాడు.. నేను వాడికి తండ్రిని అయిన కారణంగా.. అరెస్ట్‌ చేయించి, తప్పు చేయలనుకోవడం లేదు. నా కుమారునిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వేడుకుంటున్నాను అని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.. జర్నలిస్ట్ గగన్‌దీప్ సింగ్ ట్విట్టర్‌లో పంచుకున్న వీడియోలో, గాయపడిన తండ్రి తన చికిత్స తర్వాత ఆసుపత్రి బెడ్‌పై పడుకోవడం చూడవచ్చు. ఆశ్చర్యకరంగా, తన కొడుకుపై కాల్పులు జరిపిన తర్వాత కూడా, బాధితుడు తన కుమారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసు అధికారులను అభ్యర్థించడం చూడవచ్చు. అయితే, ఐపీసీ, ఆయుధ చట్టంలోని హత్యాయత్నం సహా సంబంధిత సెక్షన్ల కింద అమర్జీత్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ తండ్రి కన్నుమూశారు.

హత్య కేసులో ట్విస్ట్..నిందితులను పట్టించిన కండోమ్..
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల లో పూర్తిగా కాలిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు సర్కస్ కళాకారుడు అజబ్ సింగ్‌గా గుర్తించారు. అజబ్‌ను వేరే ప్రాంతంలో హత్య చేసి, ఆపై పాఠశాలకు తీసుకువచ్చి ఇక్కడి ఫర్నీచర్‌తో సహా మృతదేహాన్ని తగల బెట్టినట్లు గుర్తించారు. అయితే, ఘటనా ప్రదేశంలో ఎలాంటి క్లూస్ లభించలేదు. కండోమ్ ప్యాకెట్ సహా చిన్నపాటి క్లూస్ లభించాయి. ఇందులో కండోమ్ ప్యాకెట్ కేసు మొత్తాన్ని మలుపు తిప్పింది.. ఆ కండోమ్ కేసులో ట్విస్ట్ ను తీసుకొచ్చింది.. జూన్ 11న, అక్బర్‌పూర్ బ్లాక్ పరిధిలోని భిత్రి దీహ్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల లో అజబ్ సింగ్ మృతదేహం కలకలం రేపింది. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు ఇతర ఆధారాల తో పాటు టైమెక్స్ బ్రాండ్ కండోమ్ ప్యాకెట్‌ ను స్వాధీనం చేసుకున్నారు.. నిజానికి సహరాన్‌పూర్‌ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు సర్కస్‌ ఏర్పాటు చేసేందుకు ఈ గ్రామానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా ఆర్తి అనే మహిళ ఇంట్లో బస చేశారు. దీని ఆధారంగా ఆ ఇంటి పరిధిలో యాక్టీవ్‌గా ఉన్న మొబైల్ నెంబర్స్, కాల్స్, నెట్‌వర్క్ ఆధారంగా ఎంక్వైరీ చేశారు. హత్య అనంతరం నిందితు లు ఆ ఇంటి నుంచి పరారైనట్లు గుర్తించారు.. అసలు కారణం అక్రమ సంబంధం అని తెలిసింది.. మొత్తానికి కేసు ఎండ్ అయ్యింది..

కీర్తి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందా…?
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా అని ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది.. ఈ విషయం పై ఆలోచించాలి అని ఆమె సమాధానం ఇచ్చారు.. కీర్తి చేసిన ఆ కామెంట్ తో భవిష్యత్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఆమెకు పాలిటిక్స్ ఆసక్తి ఉందని తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా కీర్తి సురేష్ బీజేపీలో జాయిన్ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. ఆ వార్తలు నిజం కాదని కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ చెప్పుకొచ్చారు.. మరి భవిష్యత్ లో కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.తెలుగులో కీర్తి సురేష్ దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.. దసరా సినిమా వంద కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. నాని హీరోగా తెరకెక్కిన దసరా మార్చి 30న విడుదలై భారీ విజయం నమోదు చేసింది..ఇంతకు ముందు మహేష్ కి జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా ఆమె కు మంచి విజయాన్ని అందించింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూనే కీర్తి సౌత్ సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో సిస్టర్స్ రోల్స్ కూడా చేస్తుంది.. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి తాజాగా భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నారు.

ఈ అప్డేట్స్ ఏంటో… ఆ సినిమా ఏంటో… అప్పుడే 50% అయిపోవడం ఏంటో…
హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఇవి. ఈ సినిమాలని హిట్ ఇచ్చిన దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు కానీ OG డైరెక్ట్ చేస్తున్న సుజిత్ మాత్రం సాహూతో సాలిడ్ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, OG సినిమాతో పంజా రేంజ్ సినిమా ఇస్తాడని ఫాన్స్ అంతా నమ్ముతున్నారు. తెలుగులో ఏ సినిమాకి లేనంత బజ్, OG సినిమాపై ఉంది. ముహూర్తం రోజు నుంచి ఎప్పటికప్పుడు OG నుంచి అప్డేట్స్ బయటకి వస్తూనే ఉన్నాయి. అర్జున్ దాస్ జాయిన్ అయ్యాడని, శ్రీయ రెడ్డి కాస్ట్ ఇన్ అయ్యిందని, విలన్ గా ఇమ్రాన్ హష్మీ లాక్ అయ్యాడని, పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుందని… ఇలా ఏప్రిల్ 15 OG రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కేవలం రెండున్నర నెలలో ఇన్ని అప్డేట్స్ ఇచ్చారు. ఏప్రిల్ 15న ముంబైలో OG ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది, ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్ మే 3 నుంచి 9 వరకూ జరిగింది. ఈ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అవ్వగానే హైదరాబాద్ కి తిరిగొచ్చిన OG టీం… మే 18 నుంచి మూడో షెడ్యూల్ ని స్టార్ట్ చేసారు. దాదాపు నెలన్నర పాటు ఏ ధాటిగా జరిగిన ఈ షెడ్యూల్ తో OG మేజర్ పార్ట్ ని కంప్లీట్ చేసారు. ఇంత పెద్ద షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి ట్వీట్ వచ్చింది. 50% షూటింగ్ కంప్లీట్ అయ్యింది అంటూ మేకర్స్ నుంచి అప్డేట్ బయటకి వచ్చింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఒక సినిమా రెండున్నర నెలల గ్యాప్ లో 50% షూటింగ్ కంప్లీట్ అవ్వడం అంటే మాటలు కాదు. సుజిత్ అసలు ఏ సినిమా చేస్తున్నాడో? మేకర్స్ నుంచి ఈ రేంజ్ అప్డేట్స్ బయటకి రావడం ఏంటో? సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్కరూ ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు “ఫైర్ స్ట్రామ్” వస్తుంది అంటూ ఎలివేషన్స్ ఇవ్వడం ఏంటో? ఎవరికీ అర్ధం కావట్లేదు. రోజు రోజుకీ OG పై అంచనాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున OG టీజర్ ని రిలీజ్ చేస్తే చాలు సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ ఎగిరిపోవడం గ్యారెంటీ.

చిమ్మ చీకట్లో తెరకెక్కించిన ఫైట్… దేవరకే హైలైట్
జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న సినిమా ‘దేవర’. ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దేవర సినిమా ఆగిపోతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం కథని, కొరటాల శివని నమ్మి ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చెయ్యకుండా ముందుకి తీసుకొని వెళ్లాడు. అభిమానుల నుంచి, ఫిలిం ఫెటర్నిటీ నుంచి, మీడియా నుంచి… ఇలా ప్రతి చోటుని ఇంకెన్ని రోజులు డిలే చేస్తారు అనే కామెంట్స్ వినిపించినా కూడా కొరటాల శివకి కావాల్సినంత సమయం ఇచ్చాడు ఎన్టీఆర్. దాదాపు ఏడాది పాటు కేవలం ప్రీప్రొడక్షన్ మాత్రమే జరిగింది అంటే దేవర సినిమా విషయంలో కొరటాల శివకి ఎన్టీఆర్ ఎలాంటి ఫ్రీడమ్ ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ ఇప్పుడు దేవర సినిమా షూటింగ్ ఎఫెక్టివ్ గా జరగడానికి ఉపయోగపడుతుంది. మూడున్నర నెలల్లో నాలుగు మేజర్ షెడ్యూల్స్ ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసారు అంటే కొరటాల శివ ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా నైట్ ఎఫెక్ట్ లో ఒక భరో యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ ఫైట్ గురించి రివీల్ చేస్తూ… “లో లైట్ లో, అలల మధ్య ఎన్టీఆర్ తో అర్రి అలెక్సా LF సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ వాడి ఒక యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసాం” అంటూ ట్వీట్ చేసాడు. మామూలుగానే సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎపిసోడ్ అంటే స్రీన్ పైన విజువల్ గ్రాండియర్ ఉంటుంది. అలాంటిది నైట్ ఎఫెక్ట్ లో, లో లైట్ లో షూట్ చేసారు అంటే ఆన్ స్క్రీన్ ఆ ఫైట్ చూసినప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవ్వడం గ్యారెంటీ. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాకే ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లాడు. ఎన్టీఆర్ తిరిగిరాగానే దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది, ఇదే స్పీడ్ ని మైంటైన్ చేస్తూ నవంబర్ చివరికి దేవర షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చెయ్యడానికి కొరటాల శివ అండ్ టీం రెడీ అవుతున్నారు.