NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

పవన్‌పై మంత్రి అంబటి తీవ్ర వ్యాఖ్యలు.. మరి ఇంత దారుణమా..?
జనసేనాని పవన్‌పై మరోసారి ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ పంది మీద ఊరేగుతున్న పిచ్చికుక్క.. పెళ్లిళ్ల వీరుడు పవన్ కల్యాణ్‌.. అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. భీమవరం వేదికగా ప్రభుత్వంపై పవన్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన అంబటి.. ఢిల్లీలో పెద్దలలో నీకు సన్నిహిత సంబంధం ఉంటే రాష్ట్రానికి మేలు చేయ్‌.. సీఎం జగన్ ను బెదిరిస్తున్నావా..? మతి భ్రమించి మాట్లాడుతున్న పవన్ లో పిచ్చి కుక్క లాంటి వాడు అంటూ మండిపడ్డారు. జగన్ రాజకీయాన్ని చూసి నేర్చుకో.. తప్పుడు కేసులు పెట్టినా జగన్ భయపడ కుండా పోరాటం చేశాడని గుర్తుచేశారు. నలుగురు విప్లవ కారులు పేర్లు తెలిస్తే నువ్వు విప్లవ కారుడివా..? వివాహ వ్యవస్థలో విప్లవం తెచ్చావా? అంటూ సెటైర్లు వేశారు. వివాహ వ్యవస్థ పై నీకు నమ్మకం లేదు.. పెళ్లిళ్ల వీరుడు పవన్‌ కల్యాణ్‌ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. అలాంటి వ్యక్తి ప్రజలకు నీతులు చెప్తున్నాడు.. పేదలకు, పెత్తందార్ల మధ్య పోరాటంలో జగన్ పేదల పక్కన నిలబడితే పవన్, చంద్రబాబు పక్కన చేరాడని విమర్శించారు. పవన్ మాటలు సంస్కార హీనంగా ఉన్నాయి.. పవన్ మాటలతో అసాంఘిక శక్తులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. యువత అప్రమత్తంగా ఉండండి.. పవన్ సిద్ధాంతాలు తెలియని వ్యక్తి.. తప్పులన్నీ ఆయన దగ్గర పెట్టుకుని ఎదుటి వారిని దూషించే మనస్తత్వం పవన్ ది అని ఫైర్‌ అయ్యారు.

ఈటలకు భద్రత పెంపు.. వై ప్లస్ కేటగిరికి మార్పు
బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎక్స్ కేటగిరీగా ఉన్న ఈటల భద్రతను వై ప్లస్‌ కేటిరీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత వారం రోజుల నుండి తన భర్తకు ప్రాణహాని ఉందంటూ భార్య జమున ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్‌కు చెందిన ఒక ఎమ్మెల్సీ తన భర్తను చంపడానికి రూ. 20 కోట్ల సుఫారీ ఇచ్చారని ఆరోపించారు. తన భర్తకు ప్రాణ హాని ఉందని మీడియా ముఖంగా బహిరంగంగా ఆరోపించింది. ఈటల భార్య జమున ఆరోపణల అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈటలకు ప్రాణహానీ ఉందంటే తాను నమ్మనని అయినా తెలంగాణలో సుఫారి ఇచ్చి హత్యలు చేయించే సంస్కృతి లేదని చెబుతూనే.. అయినా ఈటలకు అటువంటి ఇబ్బంది ఉందంటే తప్పకుండా ఆయనను రక్షించుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈటల భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కేటీఆర్‌ ఆదేశించినట్టు తెలిసింది. అనంతరం పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు రెండు రోజుల క్రితం ఈటల నివాసంకు వెళ్లి పరిస్థితులను పరిశీలించి వచ్చారు. అనంతరం ప్రభుత్వానికి నివేదకను సమర్పించారు.

బీజేపీలో కీలక మార్పులు..! బండిని తప్పిస్తే టీబీజేపీ చీఫ్ ఎవరు..?
తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకుంటాయా? ఇదే ఇప్పుడు కమలనాథుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సోమవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం ఉన్నందున టీబీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే చర్చ మరింత హీటెక్కిపోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యమంటున్న బీజేపీ.. రాష్ట్ర పార్టీ నాయకత్వం మార్పుపై దృష్టి సారించిందా.. అంటే అవుననే వాదన వినిపిస్తోంది. బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కమలదళంలో హోరెత్తిపోతోంది. బండి సంజయ్‌ను మారిస్తే.. బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు కిషన్‌రెడ్డికి అప్పగిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే, కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు గట్టిగానే వినిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం.. కిషన్‌రెడ్డిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. rj, బీజేపీ తెలంగాణ చీఫ్‌ పదవి చేపట్టేందుకు కిషన్‌రెడ్డి అంగీకరిస్తే.. బండి సంజయ్‌ను ఏ పదవి వరిస్తుంది. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో.. కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోడీ.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తెచ్చే దిశగా వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని, అలానే కొన్ని రాష్ట్రాల్లోని పార్టీ అధ్యక్షులను మారుస్తారని కమలదళంలో చర్చ జరుగుతోంది. ఈ లిస్ట్‌లో తెలంగాణ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ను బీజేపీ తెలంగాణ చీఫ్ పదవి నుంచి తప్పిస్తే.. ఆయనను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి మరో బీజేపీ నేతకు కేంద్ర సహాయ మంత్రి ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక, ఇటీవల తెలంగాణలోని బీజేపీలో జరుగుతున్న పరిణామాలను పార్టీ హైకమాండ్‌కు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి పార్టీ హైకమాండ్‌ సూచనలు చేసింది. మరోవైపు ఈటల రాజేందర్‌కు బీజేపీ ఎన్నికల కమిటీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

పవన్‌ కల్యాణ్‌ సస్పెన్స్ క్రియేట్ చేశారు.. తుస్సుమనిపించారు..
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి హాట్‌ కామెంట్లు చేశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. భీమవరం సభపై సస్పెన్స్ క్రియేట్ చేసిన పవన్ కల్యాణ్‌.. తన ప్రసంగాన్ని తుస్సుమనిపించారు అంటూ సెటైర్లు వేశారు.. యువకులు, రైతులు, శ్రామికులు మోసపోతున్నారు అంటూ అబద్దాలు ఆడారు.. జనసేన అంటే ప్యాకేజీ పార్టీ.. అబద్దాల పార్టీ.. కానీ, సీఎం జగన్ మేనిఫెస్టోను భగవద్గీతా, బైబిల్, ఖురాన్ గా భావిస్తారని తెలిపారు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భావించే వ్యక్తి సీఎం జగన్‌ అని కొనియాడిన ఆయన.. పవన్ తనని తాను ఎందుకు మోసం చేసుకుంటారు..? మహనీయుల పేర్లు చెబుతూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టి.. చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారని విమర్శించారు గ్రంధి.. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తే అన్ని వర్గాలు బాధ పడ్డాయి.. మీరు చేసిన దాష్టికాలు భరించలేకే ప్రజలు మిమ్మల్ని ఓడించారన్న ఆయన.. 2019లో విడివిడిగా పోటీ చేస్తున్నాం అంటూ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేశారు.. పవన్ ఉసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చుకున్నారని మండిపడ్డారు. నాకు సీఎం పదవి ఎవరు ఇస్తారని పవన్ మాట్లాడారు.. నాకు మీరంతా ఓట్లు వేయలేదంటూ సొంత పార్టీ వాళ్లను అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహనీయుల పేర్లు పలుకుతూ వారికి అపవిత్రత ఆపాదిస్తున్నారు. పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ పేరు చెబుతూ ఒంటరిగా వెళ్లి ఆత్మార్పణ చేయాల్సిన పని లేదంటారు అంటూ ఎద్దేవా చేశారు.

వాటర్ ఫాల్స్‌లో వీడియో కోసం జంప్‌.. బండరాళ్ల మధ్య చిక్కుకొని నరకయాతన.. చివరకు..!
ప్రకృతి అందాలకు నిలయమైన తలకోన వాటర్ ఫాల్స్ లో ఓ యువకుడు వీడియో స్టిల్ కోసం నీటిమడుగులో డైవ్ వేసి అందులోనే మునిగి మృతి చెందాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన 23 ఏళ్ల సుమంత్.. చెన్నైలో రాజీవ్ గాంధీ కళాశాలలో ఎంఎస్సీ చదువుతున్నాడు. తిరుపతికి చెందిన సహ విద్యార్థితో కలిసి తలకోన పర్యటనకు వెళ్లాడు.. తలకోన వాటర్ ఫాల్స్ కి వెళ్లి స్నేహితులందరూ సరదాగా జలకాలాటాడారు. అయితే, ఈ క్రమంలో సుమంత్ తాను ఎత్తు నుంచి నీటిమడుగులోకి తలకిందులుగా దూకే విన్యాసం డైవ్ వేస్తుండగా వీడియో తీయమని మిత్రులను కోరారు.. వారు మొబైల్ కెమెరాల్లో వీడియో తీస్తుండగా స్టిల్ కోసం పైనుంచి నీటి మడుగులోకి తలకిందులుగా దూకాడు.. అయితే, నీటి అడుగుభాగాన కొక్కెర రాళ్లు, బండరాల మధ్యలో చిక్కుకొని నీటి అడుగులోనే ఆగిపోయాడు.. ఎంతసేపు చూసినా అతను నీటి పైకి రాకపోవడంతో షాక్‌ తిన్న స్నేహితులు గంట సేపు అక్కడే అతని ఎదురుచూశారు.. ఎంతకీపైకి రాకపోవడంతో.. అంతా వెతికారు.. పైనుండి చూస్తే.. ఆ స్వచ్ఛమైన నీటి అడుగు భాగంలో సుమంత్ ఇరుక్కుపోయినట్టు గుర్తించారు.. అప్పటికే సంధ్య వేళచీకటి పడటంతో అక్కడున్న వారికి చెప్పి.. తిరిగి వెళ్లిపోయారు.. ఆ విషయాన్ని ఎలావారిపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికితీశారు.. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు ముగ్గురు తలకోన నీటిలో మునిగి మృతి చెందారు.. వాటర్ ఫాల్స్ వద్ద అటవీ శాఖ అధికారులు పర్యాటలకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!
భారత యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌ అరుదైన ఘనత సాధించింది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇప్పటివరకు పురుషుల లేదా మహిళల క్రికెట్‌లో ఎవరూ కూడా సీపీఎల్‌లో భాగం కాలేదు. సీపీఎల్‌ ఆడనున్న తొలి టీమిండియా ప్లేయర్ శ్రేయాంకనే. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని శ్రేయాంక.. సీపీఎల్‌ ఆడే ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల ముగిసిన మహిళల ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అత్యధిక వికెట్స్ పడగొట్టిన బౌలర్‌గా నిలిచింది. సీపీఎల్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ ఫ్రాంచైజీ 21 ఏళ్ల శ్రేయాంక పాటిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే ఎడిషన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. భారత మహిళల జట్టులోని చాలా మంది క్రీడాకారులు విదేశీ టీ20 లీగ్‌లలో ఆడారు. హర్మన్‌ప్రీత్ కౌర్‌, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్‌లతో సహా పలువురు క్రీడాకారులు ‘ది హండ్రెడ్’, బిగ్ బాష్ లీగ్‌లో ఆడారు. విదేశీ లీగ్‌ల్లో పాల్గొనడంపై భారత పురుషుల క్రికెటర్లపై ఉన్న అంక్షలు మహిళా క్రికెటర్లపై లేవనే విషయం తేగలిసిందే.

టీమిండియాలో బెస్ట్‌ స్లెడ్జర్‌ ఎవరు?.. రవీంద్ర జడేజా సమాధానం ఇదే!
సోషల్ మీడియాలో ‘ర్యాపిడ్-ఫైర్’ రౌండ్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ రౌండ్‌లో ఎన్నో ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడమే ఈ ర్యాపిడ్-ఫైర్ ముఖ్య ఉద్దేశం. ర్యాపిడ్-ఫైర్ రౌండ్‌కు చాలా మంది సెలెబ్రిటీలు సమాధానం ఇచ్చారు. ఇటీవల భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. టీమిండియాలో బెస్ట్‌ స్లెడ్జర్‌ ఎవరు?, ఎవరికి మంచి గడ్డం ఉంటుంది అనే విషయాలు పంచుకున్నాడు. గత నెలలో లండన్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో స్టార్ స్పోర్ట్స్‌ నిర్వహించిన ర్యాపిడ్-ఫైర్ రౌండ్‌లో రవీంద్ర జడేజా పాల్గొన్నాడు. ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటన సన్నాహాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ వీడియో మరోసారి సోషల్ ఈడియలో వైరల్‌గా మారింది.

సంక్రాంతికి… అందరూ ‘జై హనుమాన్’ అనాల్సిందే
‘హనుమాన్’ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్ ని సొంతం చేసుకుంది ‘హనుమాన్’ సినిమా. అనౌన్స్మెంట్ తోనే ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హనుమాన్, ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెరిగేలా చేసింది. యునానిమస్ గా ప్రతి ఒక్కరికి హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవుతుంది, పాన్ ఇండియా రేంజులో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది అనే నమ్మకం ఉంది. టీజర్ తో ఆ నమ్మకం మరింత పెరిగింది. దీంతో సినీ అభిమానులంతా హనుమాన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ప్రశాంత్ వర్మ హనుమాన్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసాడు. ఈ సినిమా తెరకెక్కించడానికి రెండేళ్లు కష్టపడ్డాను, మరో ఆరు నెలల్లో ది బెస్ట్ సినిమా ఇస్తాను… 2024 జనవరి 12న హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది” అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసాడు. హనుమాన్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రావడంతో మూవీ లవర్స్ ఖుషి అవుతున్నారు.

ఏంటి.. సుధీర్ ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. అమ్మాయి ఎవరు?
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు.. స్టార్ హీరో ఇమేజ్ ను అతి తక్కువ కాలంలోనే సొంతం చేసుకున్నాడు.. మ్యాజిక్ షోలు చేసే సుధీర్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలను చేస్తున్నాడు.. కమెడియన్ గా కేరీర్ ను స్టార్ట్ చేసిన సుధీర్ ఇప్పుడు ఇప్పుడు హీరో అయ్యాడు.. ఆయనకు యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సోషల్ మీడియాలో సుధీర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. అదేంటంటే సుధీర్ కు ఇటీవల ఎంగేజ్మెంట్ అయ్యిందని, సీక్రెట్ గా ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. సుడిగాలి సుధీర్ -రష్మి ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే సుడిగాలి సుధీర్ అవేవీ పట్టించుకోకుండా, తన మరదలని నిశ్చితార్థం చేసుకున్నాడు అంటూ కొద్ది గంటలు నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . తన సొంత మరదలని సుధీర్ నిశ్చితార్ధం చేసుకున్నాడు అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో రష్మీ సుధీర్ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుత ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం సుధీర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..

బారసాల కు వచ్చిన ప్రతి ఒక్కరికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి..?
మెగా కుటుంబంలోకి లిటిల్ ప్రిన్సెస్ రావడంతో చిరంజీవి కుటుంబంలో పండగ వాతావరణం ఏర్పడింది.ఇక మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంలోకి మహాలక్ష్మి అడుగు పెట్టిందంటూ ఎంతగానో మురిసిపోయారు.అభిమానులు కూడా ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే శుక్రవారం మెగా ఇంట ప్రిన్సెస్ నామకరణ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది . ఇదిలా ఉండగా చిరంజీవి తన మనవరాలు పేరును ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.దాదాపు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసనలు తల్లిదండ్రులు అయ్యారు. దీనితో మెగా కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. జూన్ 20న ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మనిచ్చింది. ఇక ఆడబిడ్డ పుట్టడంపై మహాలక్ష్మి పుట్టిందంటూ కుటుంబంతో సహా చిరంజీవి కూడా ఎంతగానో ఆనందపడ్డారు.ఇక ఉపాసన డిశ్చార్జ్ సమయంలో కూడా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. ఆ సమయంలో బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారు అని రాంచరణ్ ను ఓ రిపోర్టర్ ప్రశ్న అడగ్గా.. సాంప్రదాయం ప్రకారం బారసాల రోజు వెల్లడిస్తామంటూ ఆయన సమాధానమిచ్చాడు. అయితే ఓ పేరు అనుకుంటున్నట్లు.. అదే పేరును ఫిక్స్ అయినట్లు కూడా తెలిపాడు. ఇక బిడ్డ ఎవరి పోలిక అని అడగ్గా ఇంకెవరి పోలిక నాన్న పోలిక అంటూ సమాధానం ఇచ్చాడు రాంచరణ్. లిటిల్ ప్రిన్సెస్ బారసాల వేడుకకు చిరంజీవి నివాసంలో ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి అలంకరణ చేశారు. ఈ వేడుకకు ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.బారసాల ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి పట్టుచీర గాజులతో పాటు గోల్డ్ కాయిన్ గిఫ్ట్ గా ఇచ్చారని సినీ వర్గాల సమాచారం..ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.. తన మనుమరాలు పేరును చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఆ బేబీ పేరును క్లీన్ కారా కొణిదలగా ప్రకటించారు.. లలిత సహస్రనామం నుంచి ఈ పేరు తీసుకున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు.. ఈ పేరు ఆధ్యాత్మిక మేల్కొలుపును తీసుకువచ్చే శక్తిని, ప్రకృతి స్వరూపాన్ని కూడా సూచిస్తుంది. ఈ లక్షణాలను మా లిటిల్ ప్రిన్సెస్ అందిపుచ్చుకొని తన వ్యక్తిత్వంలో పెరిగే కొద్దీ ఇమడ్చుకుంటుందని మేము కచ్చితంగా నమ్ముతున్నాము.. అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.