NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

షాకిచ్చిన ఎస్బీఐ.. ఈఎంఐ మరింత భారం
ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు షాకిచ్చింది… నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటును పెంచేసింది.. అన్ని కాలపరిమితులపై స్వల్పంగా అంటే.. 5 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతున్నట్టు ప్రకటించింది.. పెంచిన వడ్డీ రేట్లు నేటి నుంచి అంటే జులై 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.. ఈ పెరుగుదలతో, MCLRపై రుణాలు పొందిన రుణగ్రహీతలకు ఈఎంఐల భారం మరింత పెరగనుంది.. ఇతర బెంచ్‌మార్క్‌లతో రుణాలు అనుసంధానించబడిన వారికి ఇది వర్తించదు.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్న ప్రకారం.. ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణ రేట్లు 8 శాతం నుంచి 8.75 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఎంసీఎల్‌ఆర్‌ అనేది ఒక బ్యాంకు వినియోగదారులకు ఇచ్చే రుణాల ప్రాథమిక కనీస రేటు.. ఇక, ఎస్బీఐ తాజా నిర్ణయంతో.. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాల రేటు 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరగనుండగా.. ఓవర్‌నైట్‌ రేటు 8 శాతంగా ఉంటుంది. నెల, మూడు నెలల రేటు 8.15 శాతం చొప్పున అమలు చేయనున్నారు.. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.45 శాతంగా ఉండగా.. రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.65 శాతానికి చేరింది.. ఇక, మూడేళ్ల రేటు 8.75 శాతంగా ఉంటుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

నేను నిరూపిస్తా.. ఛాలెంజ్ చేస్తున్నా.. చర్చకు రాగలరా?
పోలవరం గురించి దుష్టచతుష్టయం పుంఖానుపుంఖాలుగా విమర్శలు చేస్తున్నారు.. కానీ, పోలవరంపై మా ప్రభుత్వమే కీలకంగా దృష్టి పెట్టిందన్నారు మంత్రి అంబటి రాంబాబు.. పోలవరం.. వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు.. కానీ, టీడీపీ హయాంలో స్పిల్ వే సగంలో వదిలేశారు.. స్పిల్ వేను పూర్తి చేసిన ఘనత మాత్రం వైఎస్‌ జగన్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. నదిని డైవర్ట్ చేసిన ఘనత కూడా జగన్ దే అన్న ఆయన.. డయాఫ్రమ్ వాల్ వరదల వల్ల కొట్టుకుపోలేదు.. చంద్రబాబు ప్రభుత్వం అనుచిత నిర్ణయాల వల్లే కొట్టుకుపోయిందని ఆరోపించారు. రెండు కాఫర్ డ్యాంలు పూర్తిగా కట్టిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ కట్టాలి.. కానీ, చంద్రబాబు ఏం చేశాడు? దానికి విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు.. ఈ విషయాన్ని నేను నిరూపిస్తా.. ఛాలెంజ్ చేస్తున్నా.. నాతో చర్చకు రాగలరా? అంటూ బహిరంగ సవాల్‌ చేశారు అంబటి రాంబాబు. ఇక, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆరోపణలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మంత్రి అంబటి.. రాజ్యాంగ నిపుణుడు పయ్యావుల కొన్ని ఆరోపణలు చేశాడు అంటూ సెటైర్లు వేసిన ఆయన.. పయ్యావుల ఆరోపణలు అవాస్తవం.. వీటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నా.. కానీ, సమాధానం ఇవ్వకపోతే నేరం అంగీకరించినట్లే అని పయ్యావుల అనటం విచిత్రంగా ఉందన్నారు. పయ్యావుల చదువుకున్న వారని, ఙ్ఞానం ఉందని అనుకునే వాడిని.. ఇప్పుడు పయ్యావుల మాటలు విన్న తర్వాత లోకేష్ కంటే తక్కువ బుర్ర ఉందని తేలి పోయిందని ఎద్దేవా చేశారు. ఆర్ఈసీ నుంచి వచ్చిన లోన్ ను గుత్తేదారులకు డైరెక్ట్‌గా చెల్లించాం.. తప్పుడు ఆరోపణలు చేసినందుకు పయ్యావుల క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు మంత్రి అంబటి రాంబాబు.

పవన్ ఏకపత్నీవ్రతుడు.. ఏక కాలంలో ఒక పత్నీనే ఉంటుంది..!
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. పవన్‌లా మేం మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేమంటూ సీఎం జగన్‌ నుంచి మంత్రులు, వైసీపీ నేతలు ఘాటుగా మాట్లాడితే.. అసలు నా పెళ్లిళ్ల గురించి మీకెందుకు..? వ్యవస్థ గురించి ఆలోచించండి అంటూ సలహా ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌.. అయితే, పవన్‌ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ కల్యాణ్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉంది.. ఎవరైనా చికిత్స చేసేవారు ఉంటే ముందుకు రావాలన్న ఆయన.. ముందుకు వచ్చేవారికి ఒక కేసు స్టడీకి పనికొస్తుందని సలహా ఇచ్చారు.. ఇక, పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్‌కు కోపం వచ్చి ఊగిపోయాడు.. పవన్ ఏకపత్నీవ్రతుడు.. ఏక కాలంలో ఒక పత్నీనే ఉంటుంది.. ఇది బాగుందా? అని ప్రశ్నించాడు. ఇక, మర్యాదలకు మారుపేరుగా ఉన్న గోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ చాలా మర్యాదగా మాట్లాడారు.. మళ్లీ ఎప్పుడు వస్తారు ? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు.. ఇదే సమయంలో లెక్కలు తేలకుండా రారులేండి అని సెటైర్లు వేశారు. మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌ తన స్పీచ్ లో 373 సార్లు జగన్ పేరును ఉచ్చరించాడు.. వెయ్యి సార్లు జగన్ పేరు ఉచ్చరించటం పూర్తి చేస్తే పవన్ కల్యాణ్‌ పాపాలు కొన్ని అయినా కొట్టుకుపోతాయని సలహా ఇచ్చారు. ఇక, బందరు వెళ్లి చెప్పులు వెతుక్కుంటే మంచిది అని సూచించారు. రాష్ట్రంలో హిందూ ధర్మ రక్షణకు వచ్చిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అట.. దేవుడు దగ్గర పెట్టిన దీపంతో సిగరెట్ ముట్టించుకున్న కానిస్టేబుల్ కొడుకు హిందూ ధర్మ రక్షణకు వచ్చాడట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.

చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు మాయా శక్తి..
చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మాయా శక్తి అంటూ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె… కాల్ మనీ సెక్స్ రాకెట్స్ నిందితులకు పెద్దపీట వేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు మాటలను చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారన్న ఆమె.. చంద్రబాబు కుటుంబంలో వాలంటీర్లు ఏమైనా గొడవలు పెట్టారా..? అని ప్రశ్నించారు.. చంద్రబాబు, లోకేష్ వేర్వేరుగా కాపురం ఉండడానికి వాలంటీర్లు ఏమైనా కారణమా..? భువనేశ్వరి, బ్రాహ్మణి మధ్య గొడవలకు వాలంటీర్లు ఏమైనా కారణమా..? లోకేష్ తో గొడవ పడి చంద్రబాబు ఫామ్‌హౌస్‌లో కాపురం ఉండడానికి వాలంటీర్లు ఏమైనా కారణమా..? అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, మహిళల పట్ల గౌరవం లేని సంస్కారహీనుడు పవన్‌ కల్యాణ్‌ అంటూ ఫైర్‌ అయ్యారు.. పవన్ తల్లిని చంద్రబాబు, లోకేష్ దారుణంగా అవమానించారు.. సిగ్గు లేకుండా అదే తెలుగుదేశం పార్టీతో పవన్‌ కల్యాణ్‌ పొత్తు పెట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్యాణి. కాగా, టీడీపీ పాలనతోనే మహిళా సంక్షేమం సాధ్యమైందని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం విదితమే.. మహిళా సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు… తెలుగుదేశం ఆవిర్భావం తరవాత అని చూడాల్సిన అవసరం ఉందన్నారు.. మేనిఫెస్టో మహాశక్తి పథకాలపై సదస్సు నిర్వహించిన చంద్రబాబు.. అనంతరం మహాశక్తి చైతన్య రథయాత్రను ప్రారంభించారు. నా మహాశక్తి రథసారథులు ఆడబిడ్డలే. ఆవిర్భావం నాటి నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. నేడు మహాశక్తి తీసుకొస్తున్నా. మహాశక్తి పదం నా మనసులో నుంచి వచ్చిందని.. రాష్ట్రంలోని మహిళల స్థితిగతులను మహాశక్తి కార్యక్రమం ద్వారా మార్చేస్తాం అన్నారు.. ఆనాడు 1986లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. ఆ తర్వాత కాలంలో ఆస్తి హక్కును దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని చంద్రబాబు గుర్తుచేసిన విషయం విదితమే.

ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌ లైన్‌ లీక్.. ఉదయం నుంచి ఉద్ధృతంగా ఎగిసిపడుతోన్న మంటలు..
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులో ఓఎన్జీసీ పైప్‌ లైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతుండడంతో.. మంటలు చెలరేగాయి.. ఉదయం నుంచి మంటలు అదుపులోకి రావడం లేదు.. శివకోడు గ్రామం మట్టపర్రు రోడ్‌లో ఇంకా గ్యాస్‌ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి.. 30 అడుగుల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి.. దీంతో, లోకల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, ONGC అధికారులు అప్రమత్తం అయ్యారు.. కానీ, మంటలు వచ్చే ప్రాంతంలో ఎటువంటి ONGC పైప్ లైన్లు లేవని.. సహజంగానే మంటలు ఎగసిపడుతున్నాయని అంటున్నారు ONGC సిబ్బంది. మరోవైపు.. గతంలో ఈ పొలాల వెంట ONGC పైపులైన్ వేశారని.. రెండు మూడు సార్లు నా పొలంలో గ్యాస్ లీక్ అయితే.. నష్ట పరిహారం కూడా ఇచ్చారని శ్రీనివాసరావు అనే రైతు చెబుతున్నారు.. కాగా, పైపులైన్లు లేవని ONGC అధికారులు అంటుంటే.. 20 సంవత్సరాల క్రితం ఇటువైపు ONGC పైప్‌లైన్‌ వేశారని రైతులు చెబుతున్నారు.. మరోవైపు.. మంటలను అదుపు చేయడానికి నర్సాపురం నుండి ప్రత్యేక బృందం వస్తుందని కొద్ది గంటల్లోనే మంటలను అదుపు చేస్తామని ONGC అధికారులు చెబుతున్నారు.. అయితే, ONGC గాస్ పైప్‌లైన్‌ లీక్‌ వల్లే మంటలు వస్తున్నాయా? లేక సహజంగా వస్తున్న గ్యాస్ ఫైరా అనేది తేలాల్సి ఉంది.

ఢిల్లీ వరదలకు హర్యానా సర్కారే కారణం
దేశ రాజధాని ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని ఆప్‌ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేయడానికే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదులుతోందని ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్ ఆరోపణలు చేశారు. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలే లేవు.. అయినా యమునా నది నీటిమట్టం తగ్గకపోగా పెరుగుతోందని సంజయ్ సింగ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయని.. దీనికి కారణం హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని మళ్లించడమేనని ఆయన అన్నారు. ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. హత్నీకుండ్ బ్యారేజీకి మూడు కాలువలు ఉన్నాయని, ఒక కాలువకు నీళ్లు వదిలితే ఉత్తరప్రదేశ్‌కు వెళతాయని, మరోదాంట్లో నుంచి ఢిల్లీకి, మూడో కాలువ నుంచి హర్యానాకు నీళ్లు వదలవచ్చని ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. వరదలు వస్తే హత్నీకుండ్‌ నుంచి యూపీ, హర్యానా, ఢిల్లీ వైపుకు సమాతూకంలో నీటిని విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. అయితే, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఢిల్లీ సర్కారును ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో మిగతా రెండు కాలువలను మూసేసి యమునా నదిలోకి నీటిని వదులుతోందని మండిపడ్డారు. మూడు కాలువలను తెరిచి నీటిని వదిలితే ఢిల్లీలో ఈ స్థాయిలో వరదలు వచ్చేవి కావని చెప్పారు.

రైతుకు జాక్‌పాట్‌.. టమాటాలు అమ్మి నెల రోజుల్లో కోటీశ్వరుడయ్యాడు..
దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణె జిల్లాలో టమోటా సాగు చేసిన ఓ రైతుకు జాక్‌పాట్ తగిలింది. తుకారాం భాగోజీ గయాకర్, అతని కుటుంబం నెలలో 13,000 టమాటా బాక్సులను విక్రయించడం ద్వారా రూ. 1.5 కోట్లకు పైగా సంపాదించారు. తుకారాంకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, 12 ఎకరాల భూమిలో కుమారుడు ఈశ్వర్ గయాకర్, కోడలు సోనాలి సహకారంతో టమాట సాగు చేశాడు. వారు నాణ్యమైన టమాటాలు పండిస్తున్నారని.. ఎరువులు, పురుగుమందుల గురించి వారికి జ్ఞానం ఉండడంతో తమ పంట తెగుళ్ల నుంచి సురక్షితంగా ఉండేలా చూసుకోవడంలో సహాయపడుతుందని కుటుంబం తెలిపింది. నారాయణగంజ్‌లో ఒక టమాటా బాక్సును అమ్మడం ద్వారా రైతు ఒక్కరోజులో రూ.2,100 సంపాదించాడు. గయాకర్ శుక్రవారం నాడు మొత్తం 900 బాక్సులను విక్రయించి ఒక్కరోజులోనే రూ.18 లక్షలు సంపాదించాడు. గత నెలలో టమాటా డబ్బాలను నాణ్యత ఆధారంగా ఒక్కో బాక్సుకు రూ.1000 నుంచి 2,400 వరకు విక్రయించగలిగాడు. పుణె జిల్లాలోని జున్నార్‌లో టమాటాలు పండిస్తున్న చాలా మంది రైతులు కోటీశ్వరులుగా మారారు. ఈ కమిటీ టమాటా విక్రయం ద్వారా నెల రోజుల్లో రూ.80 కోట్ల వ్యాపారం చేసి ఆ ప్రాంతంలో 100 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించింది.

పర్యటనలో ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై సమీక్ష
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని అటు నుంచి అటే యూఏఈకి వెళ్లారు. యూఏఈలో ఒకరోజు పర్యటన కొనసాగించనున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అబుదాబీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక రోజు యూఏసీ పర్యటన నిమిత్తం శనివారం అబుదాబి చేరుకున్నారు. ఈ సందర్భంగా యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమై రెండు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షిస్తారు. రెండు రోజుల పారిస్ పర్యటన విజయవంతమైన తర్వాత ప్రధాని మోదీ అబుదాబి చేరుకున్నారు, అక్కడ బాస్టిల్ డే పరేడ్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొని ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. యూఏఈ అధ్యక్షుడు అబుదాబి పాలకుడు షేక్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు.

టీతో పొరపాటున కూడా ఈ పదార్థాలు తినకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
భారతదేశంలో ‘టీ’ని తాగేవారు చాలా చాలా ఎక్కువ. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడైనా టీని తాగేస్తుంటారు. వేడి వేడి టీ ఉదయాన్నే తాగితే కానీకే కొందరికి రోజు మొదలు కాదు. దేశంలో చాలా మంది టీకి బానిసైపోయారు. టీతో తాజాదనం, మెదడుకు శక్తి, శరీరానికి ఉత్తేజం కలుగుతాయని అందరూ తాగుతూ ఉంటారు. ఇది నిజమే అయినా.. కొన్ని పదార్థాలను టీతో కలిపి తీసుకుంటే మాత్రం మనం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. టీతో ఏ పదార్థాలు తినకూడదో (Foods You Should Avoid Consuming with Tea) ఇప్పుడు చూద్దాం. బిస్కెట్స్, బన్, నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్, పండ్లు, యోగర్ట్ మరియు ఫ్రూట్,

రామ్ సినిమా కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను సెట్ చేస్తున్న పూరి..?
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన కెరీర్ మళ్ళీ సెట్ చేసుకోడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది.హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.లైగర్ కు ముందు పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి కి అదిరిపోయే విజయం అందించింది.ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు చేసిన సినిమాలు  పూరి కి చాలా నిరాశ నే మిగిల్చాయి. ఇప్పుడు మరొక సాలిడ్ హిట్ కొడితే గానే పూరి జగన్నాద్ కు స్టార్ హీరోల సినిమాలు వచ్చే అవకాశం లేదు.ఇకపోతే గతంలో పూరి చేసిన సినిమాలలో మ్యూజిక్ అద్భుతంగా ఉండేది. సినిమా ప్లాప్ అయినా కానీ పాటలు బాగా ట్రెండ్ అయ్యేవి. లైగర్ సినిమాలో మ్యూజిక్ అంతగా మెప్పించలేక పోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి మ్యూజిక్ కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు.. సోషల్ మీడియా లో  లైగర్ మ్యూజిక్ కి ట్రోల్స్ కూడా వచ్చాయి. పలువురు సంగీత దర్శకులు లైగర్ కి సంగీతాన్ని అందించారు. అయినా కూడా ఒక్క పాట కూడా ట్రెండింగ్ అవ్వలేదు.దాంతో ఈసారి పూరి రూపొందిస్తున్న డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా లో అయినా పాటలు బాగుండే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.కానీ పూరి మరోసారి అదే మిస్టేక్ చేస్తున్నట్లు సమాచారం.ఇస్మార్ట్‌ శంకర్ సినిమా కు మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అందులోని పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి.ఇప్పటికీ ఆ సినిమా పాటలు ఎక్కడోచోట వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి మణిశర్మ సంగీతాన్ని వదిలేసి మళ్లీ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను వెతికే పనిలో వున్నాడని సమాచారం.తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్‌ సంగీత దర్శకుల పాటలు నచ్చవు అని తెలిసి కూడా పూరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడో అని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

‘బ్రో’ రన్ టైమ్ తక్కువయ్యేలా ఉందే…
బాక్సాఫీస్ సెన్సేషన్ సృష్టించడానికి, ఓపెనింగ్స్ లో కొత్త రికార్డులని క్రియేట్ చేయడానికి ఈ మంత్ ఎండింగ్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవర్ స్టార్ జూలై 28న థియేటర్స్ లోకి ‘బ్రో’గా రాబోతున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్, బ్రో మూవీ సాంగ్స్ ని బ్యాక్ టు బ్యాక్ బయటకి వదులుతూ ఉన్నారు. టీజర్, మై డియర్ మార్కండేయ సాంగ్ ‘బ్రో’ మూవీకి మంచి బజ్ వచ్చేలా చేసాయి కానీ పవర్ స్టార్ సినిమాకి ఉండే జోష్ కనిపించట్లేదు. అది కనిపించాలి అంటే బ్రో మూవీ ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెరగాలి. అక్కడుంది పవర్ స్టార్ కాబట్టి మెగా ఫాన్స్ సంబరాలు రిలీజ్ రోజున పీక్ స్టేజ్ లో ఉంటాయి. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా మెగా ఫాన్స్ హంగామా చేస్తారు. ఇది దృష్టిలో పెట్టుకోని బ్రో సినిమా ప్రమోషన్స్ ని ప్లాన్ చేసుకోవాలి. ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచే బ్రో హైప్ పెంచడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడి నుంచి జులై 28 వరకూ బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ ని రిలీజ్ చేస్తే పాజిటివ్ బజ్ ని క్యారీ చేస్తూ ఉండాలనేది మేకర్స్ ప్లాన్. ఇది వర్కౌట్ అయితే జులై 28న ఓపెనింగ్ డే రికార్డ్స్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే.. బ్రో మూవీ రన్ టైం ఎంత? అనేది తాజాగా బయటకు వచ్చేసింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ‘బ్రో’ మూవీ 130 రన్ టైం లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే.. రెండు గంటల పది నిమిషాలతో బ్రో ఆడియెన్స్ ముందుకు రానుంది. స్టార్ హీరోల సినిమా అంటే మినిమమ్ రెండున్నర గంటల నిడివి ఉండేలా చూసుకుంటారు కానీ మరీ రెండు గంటల పది నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ని చూడాలి అంటే ఫాన్స్ కాస్త నిరాశ చెందడం గ్యారెంటీ. అది కూడా మల్టీస్టారర్ అంటే ఇంకా ఇబ్బంది కలిగించే విషయం. కనిపించే కాసేపు అయినా పవన్ కి సూపర్బ్ సీన్స్ పడితే ఫాన్స్ నిడివి లోటు తెలియకుండా బయటకి వస్తారు. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందట. ఇక్కడి నుంచి బ్రో గ్రాఫ్ ని లిఫ్ట్ చేస్తే చాలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఖాతాలో మరో హిట్ పడినట్లే.