పవన్ కల్యాణ్‌కు మరోసారి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ.. ఇలా చేయండి..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. అన్ని పార్టీలో వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. ఇప్పటికే పలు అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖలు రాస్తూ వచ్చిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య.. ఈ సారి రాసిన బహిరంగ లేఖలో కీలక అంశాలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు.. ఉమ్మడి మ్యానిఫెస్టోలో పలు అంశాలు పరిశీలించాలంటూ పవన్ కల్యాణ్‌కు సూచించారు హరిరామ జోగయ్య.. సీఎం వైఎస్ జగన్‌ను ఓడించాలంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే మెరుగైన పథకాలు అమలు చేయాలన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పెరిగిన నిత్యవసరవస్తువుల ధరలు, ఇతర ఛార్జీల నుంచి ఉపసమనం కలిగించేందుకు ప్రతి కుటుంబానికి రెండువేలు అందేలా చూడాలని సూచించారు. ఒకరికంటే ఎక్కువ ఉన్నా.. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా అర్హత ఉన్నవారికి వృద్ధాప్య పెన్షన్‌ను నెలకు రూ.నాలుగు వేలు అందేలా చేయాలన్నారు. తెల్లకార్డు కలిగిన కుటుంబాల్లోని 18 ఏళ్లు దాటిన విద్యార్ధిని, విద్యార్ధులకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఉచితంగా అందించాలి.. విద్యుత్ బిల్లులపై 20 శాతం సబ్సిడీ ఇవ్వాలంటూ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.
విశాఖకు దొరికిన ఆణిముత్యాలు.. ఆ ఇద్దరిపై ఎమ్మెల్సీ వంశీకృష్ణ సెటైర్లు
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీపై సెటైర్లు వేశారు.. ఎమ్మెల్సీ, జనసేన విశాఖ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్.. విశాఖకు దొరికిన ఆణిముత్యాలు ఎంపీ ఎంవీవీ, జీవీ అంటూ మండిపడ్డారు.. అంతేకాదు.. సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన నవరత్నాల్లో రెండు రత్నాలు ఇవే అంటూ ఎంవీవీ, జీవీపై విరుచుకుపడ్డారు వంశీ కృష్ణ. జీవి అనే వ్యక్తి ఎప్పుడైనా ఒక జెండా పట్టుకున్నాడా..? జెండా రంగులు తెలుసా..? అని ప్రశ్నించారు. విశాఖలో ఉన్న బిల్డర్స్.. ఎంవీవీ, జీవీని చూసి భయపడుతున్నారన్నారు.. వేరే రాష్ట్రాలకు వెళ్లిపోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇక, సంక్రాంతి పండుగ తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయబోతున్నాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. ఎన్నికల తరువాత విశాఖ మేయర్ పదవి కోసం ఆలోచిస్తాం.. వైసీపీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ, జనసేన విశాఖ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్.
ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తి.. పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు..!
విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి షాక్ ఇస్తూ.. రాజకీయాలపై క్లారిటీ వచ్చింది టీడీపీ.. బెజవాడ ఎంపీ టిక్కెట్టను వేరేవారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని.. తిరువూరు ఘటన తర్వాత క్లారిటీ ఇచ్చేంది టీడీపీ అధిష్టానం. అయితే, ఇక, ఈ పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఎంపీ కేశినేని నాని.. ఇకపై ఎక్కువగా పార్టీ వ్యవహారలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని నేను హామీ ఇచ్చానని పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు.. తినబోతూ రుచులెందుకు? మీరే చూస్తారు భవిష్యత్తులో ఏం జరుగుతోందో అంటూ మీడియా చిట్‌చాట్‌లో పేర్కొనడంతో.. బెజవాడ రాజకీయాలు కొత్త మలుతు తీసుకుంటాయా? అనే చర్చకు దారి తీసింది. ఫేస్ బుక్ పోస్ట్ లో అన్ని వివరాలు సవివరంగా పెట్టా.. అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదన్న ఎంపీ కేశినేనా నాని.. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసా వహిస్తా అని స్పష్టంగా ఫేస్ బుక్ లో పెట్టా.. కానీ, మీడియాకు కావాల్సింది మసాలెనేగా.. తినబోతూ రుచులెందుకు..? అన్ని విషయాలు ఒకే రోజెందుకు? అని ప్రశ్నించారు. ఈ రోజు విషయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు, రేపటి విషయం ఎల్లుండి కరెక్ట్ కాకపోవచ్చు?.. అది ఎవరికి ఎలా అర్ధమైతే అలా ఇచ్చుకోండి, మీడియాను పట్టించుకోవటం ఎప్పుడో మానేశాను అని పేర్కొన్నాడు. రేవంత్ రెడ్డి దొంగా, అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసింది.. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అయి కూర్చున్నాడు అని గుర్తుచేశారు. ఇక, 2024 మే వరకూ నేనే విజయవాడ ఎంపీని.. నా రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు టీడీపీ ఎంపీ కేశినేని నాని.
డిసెంబర్‌లో 19.16 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ఎప్పుడూ పెద్ద సంఖ్యలో తరలివస్తూనే ఉంటారు.. కొన్ని సందర్భాల్లో తిరుమల గిరులు భక్తులతో రద్దీగా మారతాయి.. ప్రత్యేక సందర్భాలు వచ్చాయంటే వారిని కట్టడి చేయడం కూడా కష్టమే అనే తహారలో భక్తులు రద్దీ కనిపిస్తోంది. అయితే, రద్దీ కట్టడికి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇక, డిసెంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 19.16 లక్షలు ఉందని టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ నెలలో హుండీ ద్వారా శ్రీవారికి రూ.116.7 కోట్ల ఆదాయం వచ్చింది.. కోటి 46 వేల లడ్డూలను భక్తులకు విక్రయించినట్టు టీటీడీ పేర్కొంది.. 40.77 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.. 6.87 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ తెలిపింది..
ఎమ్మెల్యే యూటర్న్..! ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీతోనే..!
ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మార్పులు, చేర్పులపై కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.. పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం విదితమే కాగా.. ఉన్నట్టుండి ఇప్పుడు ఆయన యూ టర్న్ తీసుకున్నారు.. ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను అని స్పష్టం చేశారు ఎంఎస్ బాబు.. ఇంట్లో తండ్రిని కొడుకు ఏ విధంగా అడుగుతాడో అదే హక్కుతో నేను మాట్లాడాను.. వాటిని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. ఇక, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తండ్రి లాంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, నన్ను గెలిపించిన పూతలపట్టు నియోజకవర్గ ప్రజలే కారణం అన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. నేను ప్రెస్ మీట్ లో మాట్లాడినవి ఎవరిని ఉద్దేశించి కాదన్న ఆయన.. నా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ కోసమే కష్ట పడతాను, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేలు మరువలేనిది పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చిచ్చుపెట్టే విధంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను వైసీపీ నుంచి బయటకు పంపించాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.
ఎంసిహెచ్ పేరుతో కొత్త కిట్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
గత పదేళ్లుగా తెలంగాణలో సుపరిచితమైన పేరు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా కేసీఆర్ పేరుతో ఎన్నో పథకాలు అమలు చేయడంతో ఆ పేరు బాగా వినిపించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించిన కాంగ్రెస్.. రాష్ట్రంలో ఆయన పేరు కూడా వినిపించకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ పేరిట ఉన్న పథకాలను మారుస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాతా శిశు సంక్షేమం కోసం కేసీఆర్ కిట్‌ను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం జరిగితే తల్లికి, అప్పుడే పుట్టిన బిడ్డకు ఉపయోగపడే వస్తువులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తూవచ్చింది. పేద మధ్యతరగతి తల్లులను ఆదుకోవాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కేసీఆర్ కిట్ పేరు, ఫొటోపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా కేసీఆర్ కిట్ పేరు మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కేసీఆర్ కిట్ పేరును మాతా శిశు ఆరోగ్యం (ఎంసీహెచ్)గా మారుస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే కిట్ బ్యాగులపై కేసీఆర్ పేరు, ఫొటోలతో కూడిన ఎంసీహెచ్ స్టిక్కర్లు అతికించి పంపిణీ చేస్తున్నారు. ఇంత జరిగినా ఎంసీహెచ్ పేరుతో కొత్త కిట్లను అందించాలని ప్రభుత్వం ఆదేశించిందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నివాసం కాస్త ఉపముఖ్యమంత్రి నివాసంలా… ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ లా మారింది. అంతేకాదు ప్రతి వారం ప్రజావాణి నిర్వహించి సామాన్యులను అనుమతిస్తున్నారు. ఇలా కేసీఆర్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అనుమతి లేని భవనంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులను అనుమతిస్తోంది. పేదలకు సొంత భూమిలో ఇళ్ల నిర్మాణం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. గృహ లక్ష్మి ద్వారా అర్హులైన వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు ఆర్థిక సాయం అందించారు. అయితే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆరు హామీల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. పేదల ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సహాయం చేస్తుంది. అందుకే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశామని రేవంత్ సర్కార్ చెబుతోంది.
అటు జేఎన్టీయూ.. ఇటు ఓయూ.. విద్యార్థినుల ఆందోళనలు..!
హైదరాబాద్‌లోని అటు జేఎన్టీయూ, ఇటు ఓయూ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీ మెస్‌లో ఆహారం సరిగా లేదని జేఎన్‌టీయూ విద్యార్థినికులు నిరసన చేపట్టారు. మరోవైపు ఓయూలో రాత్రి పూట కొందరు దండగులు గది డోర్ లు కొడుతున్నారని గేట్లు మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. జేఎన్ టీయూ పీజీ విద్యార్థులు మాట్లాడుతూ.. తినే ఆహారంలో పురుగులు, బొద్దింకలు, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని ఆరోపించారు. కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్ వచ్చినప్పటి నుంచి భోజనం సక్రమంగా అందడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు సరిపడా ఆహారం అందడం లేదంటూ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. డౌన్ డౌన్ ప్రిన్సిపాల్ అంటూ ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. విద్యార్థుల సమస్యలపై పలుమార్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఫిర్యాదు చేసిన వారిపైనే ప్రిన్సిపాల్ దాడులు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం వెళితే.. సాయంత్రం 6 గంటలలోపు మెస్ తలుపులు మూసేస్తామని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు.
కేజ్రీవాల్‌కి కొత్త చిక్కు.. ఆప్ “మొహల్లా క్లినిక్‌ల”పై సీబీఐ విచారణకి ఆదేశం..
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కొత్త చిక్కు ఎదురైంది. ఆప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్‌ల పనితీరులో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్‌లలో జరిగి రోగనిర్ధారణ పరీక్షల్లో అవినీతి జరిగిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని కేంద్రం కోరినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. మొహల్లా క్లినిక్ పేరుతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక హెల్త్ ప్రోగ్రాం చేపట్టింది. అయితే ఈ ఆస్పత్రుల్లో ఎలాంటి పేషెంట్లు లేకుండానే నకిలీ రేడియాలజీ, పాథాలజీ పరీక్షలు నిర్వహించాయనే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా సెప్టెంబర్ 20న ఈ విషయాన్ని ప్రస్తావించారు. మొహల్లా క్లినిక్స్‌లో పనిచేస్తున్న ఏడుగురు వైద్యుల్ని తొలగించారు. కొంతమంది ఆస్పత్రులకు రాకున్నా హాజరు అవుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఆ రాష్ట్రంలో ఆగిపోయిన 4 లక్షల పెన్షన్లు..
రాజస్థాన్‌లో నకిలీ పెన్షనర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో 4 లక్షల మంది పెన్షన్లు నిలిపివేసింది. సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు స్కాలర్‌షిప్ పథకంలో అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక, స్కాలర్‌షిప్ పథకంలో అక్రమాలకు పాల్పడిన వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయనున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వని వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే, రాజస్థాన్ ఎస్ఎస్పీ యాప్ ద్వారా పెన్షన్ మోసాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల వెల్లడైన సమాచారం ప్రకారం.. పెన్షన్ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. రాజస్థాన్ లో లక్ష 13 వేల మంది పెన్షన్ పొందుతున్నట్లు విచారణలో తేలింది. అక్రమాలు వెలుగులోకి రావడంతో వీరికి పింఛన్ నిలిచిపోయింది. దీంతోపాటు 34 వేల 444 మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పెన్షన్ కూడా నిలిపివేశారు.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్.. యూఎన్ రిపోర్ట్‌లో వెల్లడి..
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక నివేదిక వెల్లడించింది. 2024లో కూడా భారత వృద్ధి 6.2 శాతానికి చేరుకోగలదని యూఎన్ ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక తెలిపింది. భారత వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని, అయితే ఇది 2023లోని 6.3 శాతంతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని యూఎన్ రిపోర్ట్ అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధికి దేశీయ డిమాండ్, తయారీ, సేవల రంగాల్లో బలమైన వృద్ధి తోడ్పడుతుందని నివేదిక పేర్కొంది. స్థిరాస్తి రంగంలో చైనా ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, అయినప్పటికీ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లను భర్తీ చేస్తాయని తెలిపింది. చైనాకు పరిస్థితికి విరుద్ధంగా భారత్ లో ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మల్టీ నేషనల్ పెట్టుబడుల వల్ల బలమైన పనితీరును నమోదు చేస్తుందని తెలిపింది. 2023 మూడో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సంబంధించి ముఖ్యమైన కొలమానంగా భావించే మాన్యుఫాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ భారతదేశంలో మెరుగ్గా ఉందని, అయితే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మాత్రం ఈ ఇండెక్స్ సంకోచంలో ఉందని పేర్కొంది.
రెడ్‌మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ధర, ఫీచర్లు ఇవే!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి.. ‘రెడ్‌మీ’ బ్రాండ్‌లో నోట్ 13 5జీ సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 2023 సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ అయిన ఈ సిరీస్.. 2024 జనవరి 4న భారత్‌లో విడుదలైంది. రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌లో మూడు వేరియంట్‌లు ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 13 స్టాండర్డ్, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్‌లను కంపెనీ రిలీజ్ చేసింది. నోట్ 13 ప్రో ప్లస్ ఈ సిరీస్‌లో టాప్-ఎండ్ మోడల్. షావోమీ తీసుకొచ్చిన ఈ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్లు ఓసారి చూద్దాం. రెడ్‌మీ నోట్ 13 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా ఉండగా.. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.19,999గా, 12జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఆర్కిటిక్ వైట్, ప్రిజమ్ గోల్డ్, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో ఈ వేరియంట్ లభిస్తుంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ 8జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.25,999గా.. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది.ఇక 12 జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో ఈ వేరియంట్ అందుబాటులో ఉంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.31,999, 12జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.33,999, 12జీబీ+512 జీబీ వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ వైట్ రంగుల్లో ఈ వేరియంట్ లభిస్తుంది.
మాళవిక మోహన్ కు చేదు అనుభవం.. అక్కడ అలా జరగడంతోనే..
హీరోయిన్లను వస్తున్నారంటే చాలా మంది చూడటానికి ఎగబడతారు.. వారితో సెల్ఫీలు దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కొందరు అభిమానులు అనుకుంటే మరికొంతమంది మాత్రం వారితో అసహభ్యంగా ప్రవర్తిస్తారు.. తాజాగా ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహన్ కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్. తమిళంలో రజనీకాంత్ ‘పేట’ మూవీలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. దళపతి విజయ్ ‘మాస్టర్’లో, ధనుష్ ‘మారన్’లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’ త్వరలో రిలీజ్ కానుంది.. ఇక ప్రభాస్ నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.. ఇదిలా ఉండగా.. ఈ అమ్మడుకు చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది…ఈమె జైపూర్ నుంచి ఇండిగో విమానంలో చైన్నెకి బుధవారం తిరిగొచ్చానని అయితే.. సోదాల పేరుతో విమాన సిబ్బంది తనతో చాలా అనుచితంగా ప్రవర్తించారని మాళవిక ఆవేదన వ్యక్తం చేసింది. వారి చర్యలు చాలా మొరటుగా ఉన్నాయని రాసుకొచ్చింది.. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు..
బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం… మారింది తేది మాత్రమే మాసోడి మార్క్ కాదు
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది నేనింతే. ఫిల్మ్ ఇండస్ట్రీపైన తెరకెక్కించిన ఈ సినిమా క్లైమాక్స్ లో “సపోజ్ సినిమా పోయింది ఇంకో సినిమా చేయకుండా ఉంటామా? సినిమా హిట్ అయ్యింది ఇంకో సినిమా చేయకుండా ఉంటామా… మనకి తెలిసింది ఒకటేరా సినిమా సినిమా సినిమా” అనే డైలాగ్ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసే వాళ్లకి, ఇండస్ట్రీలో రావాలి అనుకునే వాళ్లకి ఈ డైలాగ్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇప్పుడు ఈ మాటని నిజం చేసి చూపిస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. సంక్రాంతికి ఒకటి కాదు రెండు కాదు అయిదు సినిమాలు బరిలో ఉండడంతో గత కొన్ని నెలలుగా థియేటర్స్ ఇష్యూ జరుగుతోంది. ఎప్పుడూ లేనంత హీట్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తోంది. ఏ సినిమాకు ఎన్ని థియేటర్స్ ఇస్తారు, ఏ సినిమాకి ఎక్కువ లాభం జరుగుతుంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో గుంటూరు కారం సినిమా తర్వాత అంతటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ని మైంటైన్ చేస్తున్న ఈగల్ సినిమా వాయిదా పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈగల్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ… ఈగల్ ఫిబ్రవరి 9న వస్తుంది అని అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “<span class=”css-1qaijid r-bcqeeo r-qvutc0 r-poiln3″>బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.</span><span class=”css-1qaijid r-bcqeeo r-qvutc0 r-poiln3″> మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి Februaryకి తీసుకొచ్చాడు.</span><span class=”css-1qaijid r-bcqeeo r-qvutc0 r-poiln3″> మారింది తేది మాత్రమే మాసోడి mark కాదు” అంటూ ట్వీట్ చేసారు.</span> రవితేజ సినిమాలు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈగల్ సినిమాని వాయిదా వేసాడు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రవితేజకి మాత్రమే చెల్లింది. ఆ ప్లేస్ లో వేరే ఏ హీరో ఉన్నా కూడా ఈగల్ సినిమా వెనక్కి వెళ్లేది కాదు.
