*టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల
టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. 24 ఎమ్మెల్యే స్థానాల్లో, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని… మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. తొలి జాబితాలో భాగంగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన వైపు నుంచి ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు మిగిలిన స్థానాలకు తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారు పవన్.
*రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం: చంద్రబాబు
జగన్ వల్ల ఏపీ బ్రాండ్ డామలిష్ అయింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పాడింది.. వైసీపీ అరాచకాలను సామాన్యులు మొజలకుని నా వరకు పవన్ కళ్యాణ్ వరకు భరించామన్నారు. రాగ ద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని కాపాడాలనే మా ప్రయత్నం.. ప్రజా వేదిక విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభమైంది అని ఆయన పేర్కొన్నారు. ఆ విధ్వంసం గుర్తుకు వచ్చేలా ప్రజావేదిక డెబ్రిస్ కూడా తొలగించాలి.. మేమిద్దరం మంచి అభ్యర్థులను ప్రకటించాం.. రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామని తెలిపారు. 1.10 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం.. ప్రజలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. అన్ని కోణాల్లో విశ్లేషించి అభ్యర్థుల వడపోత చేశామని చంద్రబాబు అన్నారు. మంచి అభ్యర్థులను ఎంపిక చేశాం.. యువత, మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిందన్నారు. 23 మంది తొలిసారి పోటీ చేస్తున్నారు.. 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు.. ఎర్రచందనం స్మగ్లర్లను కూడా వైసీపీ అభ్యర్థులను నిలిపింది అని ఆయన చెప్పుకొచ్చారు. రౌడీలను అభ్యర్థులుగా పెట్టి వైసీపీ రాష్ట్రం మీదకు వదులుతోంది.. రెండు పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి.. సహకారం ఉంటే గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. టీడీపీ -జనసేన కలిసిన వెంటనే వైసీపీ ఓటమి ఖాయం అయింది.. ఆ పార్టీ కాడి పక్కన పడేసింది.. వలంటీర్లను అడ్డం పెట్టుకుని.. రౌడీయిజం చేసి వైసీపీ గెలిచే ప్రయత్నం చేస్తోంది.. ఇప్పటికే వైసీపీ అవినీతి సొమ్ము నియోజకవర్గాలకు చేరిందని అంటున్నారు.. నా దగ్గర డబ్బు లేదు.. కానీ రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉంది.. ఐదు కోట్ల ప్రజలు ఓ పక్క.. ధన బలం.. రౌడీయిజంతో వస్తోన్న వైసీపీ మరో పక్క ఉంది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
*సీట్ల ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఈ క్రమంలో సీట్ల ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దం అని వైసీపీ జగన్ అంటున్నారని.. మేం యుద్దానికి సంసిద్ధం రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండటానికి మేం ఇది చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చాలా మంది 60 లేదా 70 సీట్లలో పోటీ చేయాలని అన్నారని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు. గతంలో 10 సీట్లు గెలిచి ఉండుంటే అడగటానికి ఉండేదన్నారు. ఇప్పుడు సీట్ల సంఖ్య ముఖ్యం కాదని.. పరిమిత సంఖ్యలో పోటీ చేసి స్ట్రైక్ రేట్ గెలుపులో చూపించాలని ఉందన్నారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో మేము సీట్లు తగ్గించు కుంటున్నామమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక స్థానం ఉంటుందన్నారు.
*టీడీపీ- జనసేన పార్టీల తొలి జాబితా.. చంద్రబాబు- పవన్ ఉమ్మడి ప్రకటన..
మరో 50 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ- జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను వెల్లడించాయి. చంద్రబాబు, పవన్ లు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. వివాదం లేని నియోజకవర్గాలకు తొలి జాబితాలో రెండు పార్టీలు చోటు కల్పించారు. బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత రెండో జాబితాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతానికైతే 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. 94 స్థానాల్లో టీడీపీ, 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాయి. కాగా, గత కొద్ది రోజులుగా టీడీపీ- జనసేన పార్టీలు అభ్యర్థులపై కసరత్తులు చేస్తున్నాయి. ఇక, నియోజకవర్గాల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల జాబితాను చంద్రబాబు రూపొందించారు. ముఖ్యమైన నేతలతో చర్చించిన తర్వాత ఈ జాబితాను ఆయన రిలీజ్ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కుటుంబాలకు సంబంధించిన టిక్కెట్ల వ్యవహారం కూడా అక్కడి నేతలతో ప్రధానంగా చర్చించారు. పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున ఈసారి సర్దుకుపోవాలని వారికి చంద్రబాబు సూచించారు. అందుకు చాలా మంది నేతలు ఓకే చెప్పినట్లు టాక్. మరికొందరిని మాత్రం తప్పని పరిస్థితుల్లో పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పాడిందన్నారు. వైసీపీ నుంచి వచ్చి కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా కొందరికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, జనసేన ఆశించే స్థానాల్లో ఉన్న టీడీపీ నేతలకు కొందరికి ప్రత్యామ్నాయ నియోజకవర్గాలు సూచించారు. మరి కొందరికి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లను త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని మొదటి నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చారు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కొన్ని స్థానాలకు మాత్రం ఫస్ట్ లిస్ట్‌లో అవకాశం లభించింది. అయితే, పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జగన్ ను ఓడించడమే ప్రస్తుతం అందరి ముందున్న కర్తవ్యమన్నారు. అందులో భాగంగా అందరూ సహకరించాలి.. పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ సముచితమైన స్థానం దక్కుతుందన్నారు. మనందరిది ఒకటే లక్ష్యం.. వైసీపీని ఓడించడమే.. అందరూ సమన్వయంతో కలిసి పార్టీ విజయానికి కృషి చేయాలని చంద్రబాబు- పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
*పొత్తులపై పురంధేశ్వరి క్లారిటీ!
విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో కాసేపట్లో బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం జరగనుంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన ఈ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో 26 జిల్లాల ఇంఛార్జ్‌లు పాల్గొననున్నారు. ఎలక్షన్లలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనే అంశంపై సమావేశంలో నిర్ణయించనున్నారు. ఓటరును బూత్ వరకూ తీసుకురావడానికి చేయాల్సిన పనులపై ఇవాళ చర్చిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడించారు. దొంగ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలను కొందరు ఉల్లంఘిస్తారని.. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలని ధర్మాన చెప్పడం ఈసీ ఆదేశాలకు విరుద్దంగా ప్రవర్తించడమేనని ఆమె విమర్శించారు. వాలంటీర్లు ఫ్యాన్ గుర్తుపై ఓటేసేలా చేయాలని జగన్ సభలో చెప్పడం ఈసీ నిబంధనలు ఉల్లంఘనేనని ఆమె అన్నారు. ఇవన్నీ పొందుపరుస్తూ సీఈసీకి తాను లెటర్ రాశానన్నారు. అయోధ్య కలను సాకారం చేసిన పాలన నరేంద్ర మోడీ వెల్లడించారు. ప్రజాపోరు యాత్రలో బీజేపీ మన రాష్ట్రానికి ఏం చేసిందో చెబుతున్నామన్నారు. బీజేపీని రాష్ట్రంలో ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకొస్తున్నారన్నారు. పొత్తుపై మా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని.. టీడీపీ-జనసేనలో పొత్తులో ఉండి సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పష్టం చేశారు.
*నేడు ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం
ధరణి పోర్టల్ పునర్నిర్మాణం, సమస్యలపై అధ్యయనం చేసే కమిటీతో ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ కానున్నారు. ధరణి సమస్యలను పరిష్కరించి మాతృభూమిగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ముందుగా సమస్యలపై అధ్యయనం చేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ కన్వీనర్‌గా కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌లతో ప్రభుత్వం కమిటీని వేసింది. ధరణి కమిటీ ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, కొందరు కలెక్టర్లతో సమావేశమైంది. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పరిష్కార మార్గాలను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ వివరించనుంది. వారి సూచనల మేరకు ప్రభుత్వం త్వరలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ పై ప్రత్యేక కమిటీని వేసిన సంగతి తెలిసిందే. భూమాత స్థానంలో ధరణిని బరిలోకి దించనున్నట్లు హస్తం పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా పోర్టల్‌లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం దానిని పునర్నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని భూ సమస్యలు, పరిష్కారాలపై పలువురు కలెక్టర్లు, అధికారులతో ధరణి కమిటీ సమావేశాలు నిర్వహించింది. అందులో చాలా లోపాలను గుర్తించింది. ధరణిలో ఒక సమస్యకు మరో సమస్యకు ముడిపెట్టలేదన్నారు. పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక లోపాలున్నాయని పేర్కొంది. తెలంగాణలో భూసమస్యల పరిష్కారానికి ధరణి సాఫ్ట్‌వేర్‌ను మార్చితే సరిపోదని, చట్టాలను కూడా మార్చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కమిటీ ప్రాథమికంగా వ్యక్తం చేసింది. ధరణి పోర్టల్ నిర్వహణ సంస్థ అయిన టెరాసిస్ ప్రతినిధులతోనూ కమిటీ చర్చించింది. ధరణి సాఫ్ట్‌వేర్‌తో మాడ్యూల్స్ ఎలా పని చేస్తాయి? అప్లికేషన్ నుండి పరిష్కారం వరకు సాఫ్ట్‌వేర్ ఏ దశల్లో ఎలా పని చేస్తుంది? ఎదురవుతున్న సమస్యలను లోతుగా అడిగి తెలుసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని మాడ్యూల్స్ అవసరమని తెలుస్తోంది, అదేవిధంగా అప్లికేషన్ నుండి పరిష్కారం వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఉండాలి. ధరణి విధానం వల్ల సామాన్యులకు ప్రయోజనం లేదని కమిటీ పేర్కొంది. 35 మాడ్యూల్స్ ప్రజలకు ఉపయోగపడవని తేల్చింది. నిషేధిత జాబితాలో 18 లక్షల ఎకరాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా, పార్ట్-బీలో 23 లక్షల ఎకరాలు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా, పోర్టల్‌లోని ఎంపికలలో కీలకమైన మార్పులను సూచించింది. భూ సమస్యలన్నింటికీ ఒకే దరఖాస్తు ఉండాలని వివరించింది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు రెవెన్యూ శాఖకు ప్రాథమికంగా సూచించినట్లు తెలిసింది.
*ముగింపు దశకు మేడారం మహా జాతర.. కిక్కిరిసిన గద్దెల పరిసరాలు
నాలుగు రోజులుగా జరుగుతున్న మేడారం మహాజాతర తుది దశకు చేరుకుంది. ఈరోజు అమ్మవారి రాకతో జాతర ముగుస్తుంది. ఈరోజు సాయంత్రం పూజారులు పొలాల్లోకి వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వనదేవతల వన ప్రవేశం ప్రారంభమవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండకు, గోవిందరాజులను ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. పొలాల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మూడు రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజు కూడా దర్శనానికి వస్తున్నారు. అమ్మవారి దర్శనం సందర్భంగా కొంతసేపు దర్శనాలు నిలిపివేసినప్పటికీ మళ్లీ యథావిధిగా దర్శనాలు జరుగుతున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి అమ్మవారిని దర్శించుకోవడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయినా దర్శనం బాగా జరుగుతుండడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహా జాతరకు భక్తులు పోటెత్తడంతో మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. తాడ్వాయి, పస్రా గుండ్లవాగు వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. వాహనాలు ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి మళ్లీ యథావిధిగా రాకపోకలు సాగించేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మేడారం జాతరలో కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. తొలి రెండు రోజుల్లో కేజీ చికెన్ ధర రూ.150 పలికింది. ఇలా చేయడంతో చాలా దుకాణాల్లో కోడిగుడ్లు అయిపోయాయి, సరఫరా లేకపోవడంతో విక్రయదారులు ధరను పెంచేశారు. చికెన్ కిలో రూ.500 చొప్పున విక్రయించారు. ఎక్కువ ధర ఉండడంతో చాలా మంది చికెన్ సెంటర్లకే వెనుదిరిగారు. కొందరు మేకలు, గొర్రెల మాంసాన్ని కొనుగోలు చేశారు. సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతులు పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్ష్మి, విజయవాడకు చెందిన సాంబయ్యగా గుర్తించారు.
*కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ వ్యాను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన సెంట్రల్ కాలిఫోర్నియాలోని మదేరా సిటీలో శుక్రవారం నాడు చోటు చేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు రైతులతో పాటు పికప్ ట్రక్కు డ్రైవర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మదేరా సిటీ సమీపంలో ఉదయం 6:15 గంటలకు ప్రమాదం జరిగిందని సెంట్రల్ కాలిఫోర్నియా అధికారి జేవియర్ రువల్కాబా తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా దెబ్బతినడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఓ రైతు గాయపడ్డాడు.. అతన్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్చారని రువల్కాబా చెప్పుకొచ్చారు. ఇక, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇద్దరు మాత్రమే సీటు బెల్టు పెట్టుకున్నారు.. వ్యాన్‌లోని ఇతర వ్యక్తులు సీటు బెల్టు పెట్టుకుని ఉంటే ప్రాణాలతో బయటపడేవారని వెల్లడించారు. బ్లాక్ పికప్ ట్రక్ రెండు లేన్ల హైవేపై వేగంగా నడుపుతోందని ప్రత్యేక్ష సాక్షి పోలీసులకు తెలిపినట్లు రువల్కాబా తెలిపారు. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.. డ్రైవరు మత్తు మందు సేవించి ఉన్నారా లేదా అనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
*రైతులు, ఎంఎస్‌ఎంఈలకు యూపీఐ నుంచి క్షణంలో లోన్స్
రైతులు, చిరు వ్యాపారులు రుణాలు పొందడంలో పడుతున్న ఇబ్బందులు త్వరలో తొలగనున్నాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ కొత్త పథకాన్ని సిద్ధం చేసింది. రైతులు, MSMEలకు రుణాల కోసం UPI లాంటి వేదికను తీసుకురావాలని RBI ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదిత క్రెడిట్ డిస్బర్సల్ ప్లాట్‌ఫారమ్ డిజిటల్ చెల్లింపుల కోసం UPI పని చేసే విధంగానే పని చేస్తుంది. ఇది రైతులు, MSME లకు రుణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా వినియోగదారుల రుణాలు ఇప్పుడు సర్వసాధారణమని ఆర్‌బిఐ విశ్వసిస్తోంది. అయితే రుణాలు పొందడానికి రైతులు, చిన్న వ్యాపారులు ఇప్పటికీ బ్యాంకులను సందర్శించవలసి ఉంటుంది. ప్రతిపాదిత క్రెడిట్ ప్లాట్‌ఫారమ్ రైతులకు, MSMEలకు రుణ ప్రక్రియను ఆర్బీఐ సులభతరం చేస్తుంది. ప్రస్తుతం, రైతులు వ్యవసాయ రుణం లేదా కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి బ్యాంకులతో పాటు భూ రికార్డు కీపింగ్ విభాగాలను రౌండ్ చేయాలి. ప్రతిపాదిత ప్లాట్‌ఫారమ్‌తో ఈ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. క్షణంలో రుణం పొందడం సాధ్యమవుతుంది. ఈ పని ఫైనాన్షియల్ క్రెడిట్ కోసం పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్( PTPFC) ద్వారా సాధ్యమవుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం అగ్రి లోన్, కిసాన్ క్రెడిట్ కార్డ్, స్మాల్ MSME లోన్ వంటి ఉత్పత్తులపై పని చేస్తోంది. రుణాలు ఇచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్టార్టప్‌లను ఈ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానించవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.3,500 కోట్ల విలువైన అగ్రి, MSME రుణాలు పంపిణీ చేయబడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ PPI అంటే ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలకు సంబంధించి కూడా మార్పు చేసింది. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం, ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థకు చెల్లింపులు.. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు జారీ చేసే PPIల ద్వారా చేయవచ్చు. ప్రజా రవాణాను ఉపయోగించే ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వివిధ ప్రజా రవాణా వ్యవస్థలలో చెల్లింపు కోసం బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు PPIని ప్రవేశపెట్టడానికి అనుమతించాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
*తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోరూట్ (122*) శతకం చేయగా.. రాబిన్సన్ (58) అర్థ శతకం, బెన్ ఫోక్స్ (47), జాక్ క్రాలే (42), బెయిర్ స్టో (38) పరుగులు చేశారు. ఇక, టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, ఆకాశ్‌దీప్ 3 వికెట్లు తీసుకోగా.. మహ్మద్ సిరాజ్ 2 రెండు వికెట్లు పడగొట్టగా రవిచంద్రన్ అశ్విన్ ఒక్క వికెట్ తీసుకున్నాడు. అయితే, తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్లకు 302 రన్స్ చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాగా, అంతకుముందు.. రవీంద్ర జడేజా విజృంభించడంతో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 103వ ఓవర్ వేసిన జడేజా మొదటి బంతికి రాబిన్సన్(58)ను అవుట్ చేయడంతో నాలుగో బంతికి షోయబ్ బషీర్ (0)ను డగౌట్ కు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ 102.4వ ఓవర్‌లో 349 రన్స్ కే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న రాబిన్సన్ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. కానీ, చివరికి జడేజా బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. టెస్టుల్లో రాబిన్సన్ కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. అలాగే, భారత్ తరపున డెబ్యూ చేసిన మ్యాచ్ లోనే మూడు వికెట్లను ఆకాశ్ దీప్ సైతం తీసుకున్నాడు.
