నామినేషన్ల ఉప సంహరణకు నేడే డెడ్‌లైన్.. బరిలో నిలిచేది ఎవరో తేలిపోనుంది..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలతో పాటు.. తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించనున్నంది ఎన్నికల కమిషన్.. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తి కాగా.. ఈ రోజు ఇవాళ నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు కావడంతో.. ఇంకా ఎవరెవరు నామినేషన్లు ఉపసంహరించుకుంటారు.. కొన్నిస్థానాల్లో రెబల్స్ నామినేషన్స్ వేయడంతో.. వారి ఉపసంహరించుకుంటారా? లేదా కొనసాగుతారా? బరిలో నిలిచే స్వతంత్రులు ఎంతమంది.. వెనక్కి తగ్గేవారు ఎవరు? ఇవాళ్టితో తేలిపోనుంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 6001 నామినేషన్ల దాఖలు కాగా.. అందులో 4,189 నామినేషన్ల ఆమోదం పొందాయి.. 1,637 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించింది ఎన్నికల కమిషన్.. మరోవైపు ఇప్పటి వరకు తొమ్మిది నామినేషన్ల ఉప సంహరించుకున్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 1103 నామినేషన్ల దాఖలు కాగా.. 771 నామినేషన్ల ఆమోదం తెలిపారు అధికారులు.. 291 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.. అయితే, భారీగా ఇండిపెండెంట్ అభ్యర్థులు, డమ్మి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.. రెండు నుంచి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు ప్రధాన పార్టీల అభ్యర్థులు.. ఇక, ఇవాళ ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది పోటీ చేస్తారనే అంశంపై ఇవాళ రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు 625 నామినేషన్లు దాఖలు చేశారు.. అందులో 268 నామినేషన్లను తిరస్కరించింది ఎన్నికల కమిషన్.. మిగతా వారు బరిలో ఉన్నారు.. కానీ, నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరి తేదీ కావడంతో.. ఎవరెవరు? నామినేషన్లను ఉపసంహరించుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.. ఇక, అత్యధికంగా మెదక్ స్థానానికి 53 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 13 మంది పోటీ పడుతున్నారు. అయితే, అసలు బరిలోకి దిగేది ఎవరు? అనేదానిపై ఈ రోజు క్లారిటీ రానుంది.
అభ్యర్థుల తరపున బరిలోకి కుటుంబసభ్యులు, బంధువులు.. అన్నీ తామై..!
తూర్పుగోదావరి జిల్లాలో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. మరీ ముఖ్యంగా అభ్యర్థుల తరపున ప్రచార బరిలోకి బంధు బలగం రంగంలోకి దిగింది. అభ్యర్థులు.. సమీప బంధువులు, దగ్గరి స్నేహితులకు ఎన్నికల ప్రచారం, పర్యవేక్షణతో పాటు ఆర్ధిక వ్యవహారాల బాధ్యతలను కట్టబెడుతున్నారు. నియోజకవర్గాలలో నేతలను సమన్వయ పరుస్తూనే ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తెరవెనుక ఎన్నికల వ్యూహరచన చేస్తూనే ఆర్థిక వ్యవహారాలకు చక్కబెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్చులు, ప్రచారంలో పాల్గొనే నేతలు, కార్యకర్తలకు భోజనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం, వాహనాలు ఏర్పాటు చేయడం వంటి పనులను ఒక్కొక్కరు మీదేసుకుంటున్నారు. కొందరు అభ్యర్థుల కుటుంబసభ్యులు, భార్యాపిల్లలు, విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ ఎన్నికల సమయం కావడంతో అందరూ ఇంటికి చేరుకుంటున్నారు. వీరి ఉద్యోగాలు, వ్యాపారాలకు తాత్కాలిక విరామం ప్రకటించి ప్రచారంలో అభ్యర్థులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.. బంధువులు, స్నేహితుల రంగ ప్రవేశం.. పార్టీ నేతల్లోనూ ఉత్సాహం. నింపుతోంది.
చంద్రబాబు వ్యాఖ్యలకు వైఎస్ భారతి కౌంటర్.. వయసులో పెద్దవారు.. అలా మాట్లాడటం తప్పు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ తాజాగా, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, కడప జిల్లా పులివెందులలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోన్న సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు.. అలా మాట్లాడడం తప్పు అని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిని చంపాలి అనుకోవడం తప్పు అవుతుందన్న ఆమె.. ఏమైనా ఉంటే ప్రజల వద్ద తేల్చుకోవాలి తప్ప.. ఇలా ఆలోచించడం ప్రజల దృష్టిలో.. దేవుడి దృష్టిలో.. చట్టం దృష్టిలో కూడా తప్పే అవుతుందన్నారు. ఇక, సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు విచక్షతకే వదిలేస్తున్నాం అన్నారు. ఏమైనా ఉంటే ప్రజలను మెప్పించుకోవాలని.. అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్ భారతి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జగన్ నైజం…
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నైజం అన్నారు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి.. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరు అడిగినా హామీలు ఇచ్చి వాటిని మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబుకు టిడిపికి గ్రాఫ్ పడిపోతోంది.. చంద్రబాబు నాయుడు ఏ మేనిఫెస్టోను సాధ్యం కాదు అన్నాడో, దానిని జగన్ సుసాధ్యం చేశాడని తెలిపారు. 2014లో జగన్ ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేసిన విధానమే ఆయన విజయానికి మూలంగా పేర్కొన్న ఆయన.. ఓట్ల కోసం సీట్ల కోసం చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఇక, షర్మిల తన ప్రత్యర్థులతో కలిసి ప్రచారం చేస్తుంది.. బీజేపీతో చేతులు కలిపిందని ఆరోపించారు సతీష్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు బీజేపీతో చేతులు కలపడం కోసం పంచన కాపు కాశారు.. అయినా బీజేపీ పెద్దలు చంద్రబాబునాయుడును నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. మేనిఫెస్టో ప్రకటన తర్వాత జగన్ పై ప్రజలకు విశ్వసనీయత పెరిగింది.. పులివెందులలో జగన్ భారీ మెజార్టీతో గెలుపొందుతారని వెల్లడించారు. పులివెందులలో, కడప జిల్లాలో టీడీపీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందంటూ వ్యాఖ్యానించారు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి.. కాగా, ఎన్నికల తరుణంలో టీడీపీకి షాకిచ్చిన సతీష్‌రెడ్డి.. హైకమాండ్ అండ లేకుండా టీడీపీలో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం వితమే.
వాళ్లను నమ్మితే కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే.. సీఎం జగన్ హెచ్చరిక
సూపర్ 6.. సూపర్ 7.. బెంజ్ కార్ హామీలు నమ్మితే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బాబా అధికారంలోకి వస్తే వర్షాలు రావు.. రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని వ్యాఖ్యానించారు.. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. జనసంద్రంగా మారిన కొత్తూరు జంక్షన్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జగన్ కు ఓటేస్తే పథకాలు అన్నీ కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు అన్నీ ముగింపు అని వార్నింగ్ ఇచ్చారు. ఇది చంద్రబాబు గత పాలన చెప్పిన సత్యం.. బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమౌతుంది.. గోవిందా.. గోవిందా..!! మనం చెప్పే గోవిందా.. గోవిందా..!! చంద్ర బాబును నమ్మితే ఎలా మోసపోతామో చెప్పే గోవిందా.. గోవిందా..!! వేర్వేరు అన్నారు.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోవడంతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గోవిందా.. గోవిందా..!ఢిల్లీలో రాజీపడ్డంతో ప్రత్యేక హోదా.. విభజన హామీలు గోవిందా.! అన్ని హంగులు వున్న వైజాగ్ వదిలేసిన చంద్రబాబు.. గ్రాఫిక్స్ రాజధాని చూపించాడు.. అది కూడా గోవిందా..! అంటూ ఎద్దేవా చేశారు. ఇక, చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఒక్క స్కీమ్ ప్రజల్లో లేవు అన్నారు సీఎం జగన్.. దోచుకున్న డబ్బులు తో ఓటుకు 2 వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారన్న ఆయన.. రూ.3 వేల నుంచి రూ. 5 వేలు ఇవ్వడానికి కూడా సిద్ధం అయ్యారని ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోండి.. అది మన దగ్గర దోచేసిందే.. ఓటుకు డబ్బులు తీసుకుని.. ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి.. జగన్ అధికారంలోకి వస్తేనే పథకాలు అన్నీ వస్తాయి అని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్..
కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా మోడీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలను కలవడం మా ఎజెండా అన్నారు. నేడు నడ్డా పర్యటన ఉంది.. రోడ్ షోలో పాల్గొంటారు.. రాత్రి ముఖ్యనేతలతో సమావేశం ఉందన్నారు. రేపు అందోల్ లో ప్రధాని మోడీ సభ ఉందన్నారు. 1న అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారు.. రోడ్ షో లో పాల్గొంటారని తెలిపారు. మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అన్నారు. మా అజెండాలో లేని అంశాలను కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అబద్ధాలను చూసి వీళ్లకు సిగ్గులేదా అని నవ్వుకుంటున్నారు ప్రజలని కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఏం చెప్తామో.. చెప్పిందే చేస్తామన్నారు. ఆర్థిక, సామాజిక తారతమ్యాలు లేకుండా రిజర్వేషన్స్ ఉండాలని బీజేపీ భావిస్తుందన్నారు. కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఎంఐఎం సంక నాకుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్, కేసీఆర్ కలిసి ఓవైసీ ది చెరో సంక నాకుతారని అన్నారు.
విద్యార్థులు అలర్ట్.. రేపు ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు..
తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పరీక్ష పేపర్ల మూల్యాంకనం, కంప్యూటరీకరణ కూడా పూర్తికావడంతో ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. పదో తరగతి ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా.. మొత్తం 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 2,7,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్షలు జరుగుతుండగా.. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు 19 కేంద్రాల్లో పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరిగింది. ఆ తర్వాత కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. https://results.cgg.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ పదవ ఫలితాలను కనుగొనవచ్చు. విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేస్తే, ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫలితాలతోపాటు మార్కుల మెమో ఉంటుంది.
కాశ్మీర్‌లో భారీ వర్షం, హిమపాతం… శ్రీనగర్-లేహ్ హైవే క్లోజ్
జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు వచ్చే అవకాశం ఉంది. వర్షం కారణంగా నదులు, కాలువల నీటిమట్టం పెరిగింది. అదే సమయంలో ఎగువ ప్రాంతాల్లో ఈరోజు తాజాగా మంచు కురుస్తోంది. సోన్‌మార్గ్‌లో 3 అంగుళాల కంటే ఎక్కువ మంచు కురిసింది. దీని కారణంగా శ్రీనగర్-లేహ్ హైవే ట్రాఫిక్ కోసం మూసివేయబడింది. ఇది కాకుండా, జోజిలా, సాధనా టాప్, రజ్దాన్ పాస్, దావర్ గురేజ్, తులైల్ గురేజ్, మచిల్, కొంగ్డోరి, మెయిన్ గుల్‌మార్గ్, సింథాన్ టాప్, మొఘల్ రోడ్‌లలో కూడా హిమపాతం సంభవించింది. కాశ్మీర్‌లో రాబోయే కొద్ది రోజులలో ఎక్కువ వర్షాలు, తేలికపాటి మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక్కడ కొనసాగుతున్న వర్షాల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు వానకాలం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే సోమవారంతో పోలిస్తే తీవ్రత, ప్రభావం తక్కువగానే ఉండబోతోంది. కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు, తీవ్రమైన వడగళ్ల వాన, బలమైన గాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భయపడుతున్నారు. మే 1వ తేదీ వరకు జమ్మూ-శ్రీనగర్ హైవేపై ప్రయాణించవద్దని ప్రజలకు పలు విజ్ఞప్తులు చేశారు.
ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు.. ప్రమాదంలో స్కూల్స్, కాలేజీలు
రాష్ట్రంలోని జనావాస ప్రాంతాలకు మంటలు చెలరేగడంతో పాఠశాలలు, కళాశాలలు కూడా ప్రమాదంలో పడ్డాయి. చాలా ప్రభుత్వ పాఠశాలలు నదీ తీరాలు, అడవులకు సమీపంలో ఉన్నాయి. వాటి కారణంగా ఈ పాఠశాలలకు మంటలు వ్యాపించాయి. అడిషనల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ నిశాంత్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. జనావాస ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలల సమీపంలో అడవికి మంటలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడి నుండైనా ఇలాంటి సమాచారం అందితే అటవీ శాఖ బృందంతో పాటు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి నియంత్రిస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఇంటర్ కళాశాల దేవాల్లో మంటలు చెలరేగడంతో పాఠశాల గదిలోకి మంటలు చెలరేగాయి. అటవీ శాఖ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. అయితే పాఠశాల సమీపంలోని అడవిలో ఎటువంటి మంటలు సంభవించలేదు. ఇది కాకుండా, జౌరాసి అటవీ ప్రాంతంలోని మనీలా సౌత్ బీట్ పరిధిలోని జగ్తువాఖాల్ గ్రామం నుండి డిగ్రీ కళాశాల మనీలా సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతానికి చేరుకోవడానికి ముందే అటవీ శాఖ బృందం మంటలను అదుపు చేసింది. ఈ బృందంలో ఫారెస్ట్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ త్రిపాఠి, దినేష్ జోషి, రవి నైన్వాల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కిషోర్ చంద్ర, ముగ్గురు ఫైర్ వాచర్లు ఉన్నారు.
అరుదైన ఘనత సాధించిన “పొలిమేర 2”..
స్టార్ కమెడియన్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన “మా ఊరి పొలిమేర “ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2021 లో వచ్చిన “మా ఊరి పొలిమేర “సినిమా నేరుగా ఓటిటిలో విడుదల అయి అద్భుత విజయం సాధించింది.చేతబడి ,మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది .ఈ సినిమాలో సత్యం రాజేష్ ,కామాక్షి భాస్కర్ల ,గెటప్ శీను ,బాలాదిత్య ,రవి వర్మ ,రాకేందు మౌళి కీలక పాత్రలు పోషించారు. పొలిమేర సినిమా మంచి విజయం సాధించడంతో దర్శకుడు అనిల్ విశ్వనాధ్ ఈ సినిమాకు సీక్వెల్ గా “పొలిమేర 2 ” సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌర్ కృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి గ్యాని మ్యూజిక్ అందించారు. పొలిమేర సినిమాలో నటించిన ప్రధాన పాత్రలు ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి.పొలిమేర 2 చిత్రం కూడా చేతబడి,క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతుంది.ఈ సినిమాలో వచ్చే ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.పొలిమేర2 చిత్రం గత ఏడాది నవంబర్ 3 వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది .ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగా వచ్చాయి .థియేటర్ లో ఆకట్టుకున్న పొలిమేర 2 మూవీ ఓటిటిలో కూడా అదరగొట్టింది.గత ఏడాది డిసెంబర్ 8 వ తేదీన ఆహా ఓటిటిలో విడుదల అయి అక్కడ కూడా అద్భుత విజయం సాధించింది.ఇదిలా ఉంటే ఈ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది .ఏప్రిల్ 30 ,2024 న న్యూ ఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన 14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024 లో ఈ చిత్రం అధికారికంగా ఎంపిక చేయబడింది.
భారీ ధరకు నాగ చైతన్య ‘తండేల్ ‘ ఓటీటీ రైట్స్?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు.. రీసెంట్ గా ధూత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాకు ఆడియన్స్ ను మంచి స్పందన వచ్చింది.. దాంతో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..చందు మొండేటి దర్శకత్వం లో రాబోతున్న సినిమా తండేల్… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది.. నాగ చైతన్య మూడవసారి దర్శకుడు చందూ మొండేటితో కలిసి జాతీయవాద అంశాలతో కూడిన గ్రామీణ ప్రేమకథ తండేల్ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా, వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. పాన్ ఇండియా హిట్ కార్తికేయ 2ని అందించిన చందూ మొండేటి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. మేకోవర్‌కు గురైన నాగ చైతన్య గ్రామీణ పాత్రలో కనిపిస్తాడు మరియు టీజర్‌లో అతని లుక్ అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. మేకర్స్ థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ హక్కుల కోసం పెద్ద డీల్‌లను పొందుతున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కు భారీ ధరకు కొనుగోలు చేసింది… OTT ప్లాట్‌ఫారమ్ అన్ని భాషలకు సంబంధించిన సినిమా స్ట్రీమింగ్ హక్కులను రూ. 40+ కోట్లకు కొనుగోలు చేసింది, ఇది నాగ చైతన్యకు ఇది అతిపెద్ద డీల్‌గా నిలిచింది.గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..