NTV Telugu Site icon

Smart Tv: రూ. 15,000 ధరలో స్మార్ట్ టీవీలు.. ఓ సారి లుక్కేయండి..!

Smart Tv

Smart Tv

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కలిగి ఉన్న బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే.. ఇది మీ కోసమే. 5 గొప్ప కంపెనీలకు సంబంధించిన రూ.15 వేల రేంజ్లో స్మార్ట్ టీవీలు ఉన్నాయి. అందులో.. సాంసంగ్, ఎల్జీ లాంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ టీవీలలో మీరు డాల్బీ ఆడియోతో పాటు హెచ్డీ స్క్రీన్ను పొందుతారు. విశేషమేమిటంటే వీటిలో కొన్ని టీవీలపై రెండేళ్ల వరకు వారంటీ కూడా ఇస్తున్నారు. ఇంతకు ఆ టీవీల గురించి వివరంగా తెలుసుకుందాం.

Betting At Munneru: రూ.2వేల పందెం కోసం మున్నేరులో దూకిన యువకుడి మృతదేహం లభ్యం

1. Samsung 80 cm (32 Inches): వండర్‌టైన్‌మెంట్ సిరీస్ HD రెడీ LED స్మార్ట్ టీవీ UA32T4340BKXXL (గ్లోసీ బ్లాక్)
సాంసంగ్ టీవీ.. అమెజాన్ ఇండియాలో రూ. 15,240కి లభిస్తుంది. ఈ టీవీలో మీరు 60Hz రిఫ్రెష్ రేట్‌తో హెచ్డీ రెడీ డిస్‌ప్లే పొందుతారు. అలాగే.. సౌండ్ కోసం, కంపెనీ ఈ టీవీలో డాల్బీ డిజిటల్ ప్లస్‌తో 20 వాట్ల అవుట్‌పుట్‌ను అందిస్తోంది. సాంసంగ్ టీవీలో.. మీరు పర్సనల్ కంప్యూటర్, స్క్రీన్ షేర్, మ్యూజిక్ సిస్టమ్, కనెక్ట్ షేర్ మూవీ, కంటెంట్ గైడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీకి ఒక సంవత్సరం వారంటీని కూడా కంపెనీ ఇస్తుంది.

2. Acer 80 cm (32 inches): V సిరీస్ HD రెడీ స్మార్ట్ QLED Google TV AR32GR2841VQD (నలుపు)
అమెజాన్ ఇండియాలో ఈ టీవీ ధర రూ. 14,999 ఉంది. టీవీ లుక్ చాలా ప్రీమియం. ఈ టీవీలో మీరు 60Hz రిఫ్రెష్ రేట్‌తో హెచ్డీ రెడీ డిస్‌ప్లే పొందుతారు. సౌండ్ సిస్టమ్ కోసం, డాల్బీ ఆడియోను అందిస్తుంది. టీవీ సౌండ్ అవుట్‌పుట్ 30 వాట్స్. ఈ టీవీ 1.5 GB RAM మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ టీవీపై కంపెనీ 2 సంవత్సరాల వారంటీని ఇస్తోంది.

3. TCL 80.04 cm (32 inches): మెటాలిక్ బెజెల్-లెస్ S సిరీస్ పూర్తి HD స్మార్ట్ LED, Google TV 32S5500 (నలుపు)
ఈ టీవీ అమెజాన్ ఇండియాలో రూ. 13,990 ధరతో లభిస్తుంది. కంపెనీ 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్డీ డిస్‌ప్లేను అందిస్తోంది. అలాగే.. సౌండ్ కోసం, 24 వాట్ల అవుట్‌పుట్‌తో డాల్బీ ఆడియోను కలిగి ఉంది. ఈ టీవీ 1.5 GB RAM మరియు 16 GB స్టోరీజీని కలిగి ఉంది. ఇందులో మీరు ప్రముఖ ఓటీటీ(OTT) యాప్‌లను ఇన్ బిల్ట్గా పొందుతారు. ఈ టీవీపై కంపెనీ ఏడాది వారంటీ కూడా ఇస్తోంది.

4. LG 80 cm (32 అంగుళాలు) HD రెడీ స్మార్ట్ LED TV 32LQ576BPSA (సిరామిక్ బ్లాక్)
ఈ టీవీ ధర రూ.15,990గా ఉంది. ఈ టీవీలో 60Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే.. 10 వాట్ల అవుట్‌పుట్‌తో డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ కాన్ఫిగరేషన్‌ను పొందుతారు. అంతే కాకుండా.. కంపెనీ ఈ టీవీలో AI సౌండ్ మరియు వర్చువల్ సరౌండ్ సౌండ్ 5.1ని కూడా అందిస్తోంది. కనెక్టివిటీ కోసం, రెండు HDMI పోర్ట్‌లు.. ఒక USB పోర్ట్, టీవీలో 2-వే బ్లూటూత్ కూడా కలిగి ఉంది. ఈ టీవీ Alpha Gen 5 AI ప్రాసెసర్, WebOSతో తయారు చేశారు. ఈ టీవీలో కూడా ఏడాది వారంటీ ఇస్తున్నారు.

5. తోషిబా 80 సెం.మీ (32 అంగుళాలు) V సిరీస్ HD రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV 32V35MP (నలుపు)
ఈ టీవీ రూ. 12,999కి మీ సొంతం చేసుకోవచ్చు. ఇందులో.. 60Hz రిఫ్రెష్ రేట్‌తో హెచ్డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. REGZA అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ కోసం ఈ టీవీలో పిక్చర్ ఇంజిన్‌ను అందిస్తోంది. Bezel-less డిజైన్ ఈ టీవీకి చాలా ప్రీమియం రూపాన్ని ఇస్తుంది. ఈ టీవీలో మీరు డాల్బీ ఆడియో, DTS వర్చువల్: Xతో 20 వాట్ల శక్తివంతమైన స్పీకర్‌లను పొందుతారు. మీరు ఈ టీవీలో ఇన్ బిల్ట్ Chromecastని కూడా పొందుతారు.

Show comments