రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ నటి కంగన రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి 2 సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ సినిమా 17 సంవత్సరాల క్రితం విడుదల అయి సూపర్ హిట్ సాధించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కటంతో అంచనాలు మరింత ఎక్కువగా ఏర్పడ్డాయి. అయితే గ్రాండ్ గా విడుదల అయిన చంద్రముఖి 2 మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో నెల తిరగకుండానే చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. చంద్రముఖి 2 సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (అక్టోబర్ 26) స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం అక్టోబర్ 26 అర్ధరాత్రి 12 గంటలకే అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ ప్రకటించింది..
చంద్రముఖి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పి.వాసు నే ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. లక్ష్మీ మీనన్, వడివేలు, రాధిక శరత్ కుమార్, మహిమా నంబియార్, విఘ్నేష్ మరియు రవి మరియా ఈ చిత్రంలోక కీలకపాత్రలు చేశారు.చంద్రముఖి 2లో కంగన మరియు లారెన్స్ నటనకు ప్రశంసలు వచ్చినా.. మొత్తంగా సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఏ అంశంలోనూ ఈ సినిమా ఆకట్టుకోలేదని కథనం లో కొత్తదనం లేదు అంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి తగ్గట్టే కలెక్షన్లు కూడా ఈ చిత్రానికి పేలవంగానే వచ్చాయి.చంద్రముఖి ఆత్మ తిరిగి వచ్చి రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబంలో సమస్యలు సృష్టిస్తుంది. గుడిలో పూజ కోసం వేటయ్యపాలెంలోని ప్యాలెస్‍లో దిగే ఆ కుటుంబాన్ని చంద్రముఖి ఆత్మ తిప్పలు పెడుతుంది. ఆ కుటుంబానికే చెందిన మదన్ (రాఘవ) ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అసలు చంద్రముఖి ఎందుకు మళ్లీ తిరిగి వచ్చింది..ఈ సమస్యను మదన్ ఎలా పరిష్కరించారు..అన్నదే ఈ సినిమా ప్రధాన కథగా ఉంది