Ram Mandir Inauguration: అయోధ్యలో రేపు మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తుంది.. ఈ కార్యక్రమం కోసం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 10. 20 గంటలకు అయోధ్య ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి 10. 55 నిమిషాలకు రామజన్మభూమి స్థలికి చేరుకుంటారు. కాగా, 12. 05 నిమిషాల నుంచి 12. 55 నిమిషాల వరకు ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఇక, 12. 55గంటలకు గర్భగుడి నుంచి ప్రధాని బయటకు రానున్నారు. ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు పబ్లిక్ ఈవెంట్ లో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. అయితే, 2 గంటల నుంచి అయోధ్య కుబేర్ తిలను ఆయన సందర్శించనున్నారు.
Read Also: Sania Mirza: షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది!
అయితే, గర్భగుడిలో వేదమంత్రాల మధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని.. అనంతరం, సత్సంగులు, సాధువులతో ఆలయంలోనే సమావేశం అవుతారు. కాగా, శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వీఐపీ, వీవీఐపీ, విదేశీ ప్రతినిధులకు ప్రధాని మోడీ పలకరిస్తారు. ప్రాణప్రతిష్ట తర్వాత ఆలయం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు ప్రధాని రోడ్ షో చేయనున్నారు. రామభక్తులకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ గత పది రోజులుగా కఠిన నియమాలు పాటిస్తున్నారు. అనుష్ఠాన దీక్ష చేస్తున్న ఆయన ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ దీక్షలో భాగంగా నేలపైనే శయనం కొబ్బరి నీళ్లే ఆహారంగా తీసుకుంటున్నారు. అయోధ్య రామమందిరం వేడుక మరింత శోభాయమానంగా వచ్చేలా ఇప్పటికే ఏర్పాటు పూర్తి అయ్యాయి. ఇవాళ ప్రతిష్టిత దేవతలకు నిత్యపూజలు, హవన, పారాయణ.. అలాగే, ఈ రోజు బాలరామునికి 125 కలశాలతో మంగళస్నానం చేయించనున్నారు.