Tammy Beaumont: టామీ బ్యూమాంట్ డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన మహిళా బ్యాట్స్‌మెన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammy Beaumont: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టామీ బ్యూమాంట్ డబుల్ సెంచరీ సాధించింది. మ్యాచ్‌లో మూడో రోజు టామీ ఈ ఘనత సాధించింది. టెస్ట్‌ల్లో ఆమెకు మొదటి డబుల్ సెంచరీ కాగా.. టెస్ట్‌ల్లో ఇంగ్లీష్ మహిళా బ్యాట్స్‌మెన్ సాధించిన మొదటి డబుల్ సెంచరీ. మరోవైపు ఇంగ్లండ్ మహిళల జట్టు నుంచి అన్నీ ఫార్మాట్లో టామీ చేసిన అత్యుత్తమ స్కోరు ఇదే. బ్యూమాంట్కి ఇది వరుసగా రెండో డబుల్ సెంచరీ. అంతకుముందు జూన్ 15 మరియు 17 మధ్య డెర్బీలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ సాధించింది. ఆ మ్యాచ్‌లో బ్యూమాంట్ 201 పరుగులు చేసి ఔటైంది.
Read Also: Chiranjeevi: కళ్యాణ్ కృష్ణ సినిమాలో ఫైట్లు లేవ్, విలన్లు లేరట?
Also Read
ఎనిమిది టెస్టు మ్యాచ్ లు ఆడిన టామీ బ్యూమంట్.. ఈ మ్యాచ్‌కు ముందు మహిళా బ్యాట్స్ మెన్ అత్యుత్తమ స్కోరు 70 పరుగులు కాగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టామీ తన టెస్టు కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేయడంతోపాటు డబుల్ సెంచరీ నమోదు చేసింది. టామీ ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరుగా దిశగా వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 473 పరుగులు చేసింది. ఇంతటి భారీ స్కోరు ముందు ఇంగ్లండ్‌ను ఎవరైనా హ్యాండిల్ చేస్తే.. అది టామీ మాత్రమే.. మహిళా క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన ఎనిమిదో ప్లేయర్‌గా టామీ నిలిచింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఆమె తన జట్టు కోసం చివరవరకు పోరాడుతూ.. స్కోర్‌బోర్డ్‌ను పరుగులు పెట్టిస్తూనే ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లను బలంగా ఎదుర్కొని.. డబుల్ సెంచరీ సాధించింది ఈ ఓపెనర్. అంతేకాకుండా నాట్ షివర్ మరియు కెప్టెన్ హీథర్ నైట్ టామీకి మద్దతుగా నిలిచి అర్ధ సెంచరీలు సాధించారు. షివర్తో కలిసి టామీ 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అంతకుముందు నైట్‌తో కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!