No fights and villian in chiranjeevi-kalyan krishna kurasala movie: ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సినిమా అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఈ సినిమాని జూలై నెలలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించబోతున్నారు. ఆమె ఈ మధ్యనే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. అందులో శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమా నిర్మించారు, షూట్ అవుట్ ఎట్ ఆలేరు అనే ఒక వెబ్ సిరీస్ నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆమె సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
Telangana Slang: మొన్న బాలయ్య, ఇప్పుడు చిరు.. తెలంగాణ యాసలో రచ్చ లేపుడే!
ఇక కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో సినిమా పట్టాలు ఎక్కడానికి సర్వం సిద్దం అయినట్లుగానే తెలుస్తోంది. ఈ సినిమాకి బెజవాడ ప్రసన్న కుమార్ కాదా అందించినట్లు చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా కథ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక ఫైట్ కానీ విలన్ గాని లేరని అసలు అవసరమే లేకుండానే ఈ సినిమా డిజైన్ చేసుకున్నారని చెబుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాలో యాక్షన్ ఉన్నా సరే కామెడీ యాంగిల్ కూడా కొంత వర్క్ అవుట్ అయిన నేపథ్యంలో తనకు బాగా కలిసి వచ్చిన కామెడీ యాంగిల్ ని వాడుకునేందుకు మరోసారి మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారని ఈ తాజా పరిణామంతో అర్థమవుతుంది. అయితే మెగాస్టార్ సినిమా అంటే ఒక పక్క మాస్ ఫైట్లు, ఇరగదీసే సాంగులు ఎక్స్ పెక్ట్ చేస్తారు. మరి అవేమీ లేకుండా చిరంజీవి సినిమా చేస్తే ప్రేక్షకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది.