Site icon NTV Telugu

Tammy Beaumont: టామీ బ్యూమాంట్ డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన మహిళా బ్యాట్స్మెన్..!

Tommy

Tommy

Tammy Beaumont: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టామీ బ్యూమాంట్ డబుల్ సెంచరీ సాధించింది. మ్యాచ్‌లో మూడో రోజు టామీ ఈ ఘనత సాధించింది. టెస్ట్‌ల్లో ఆమెకు మొదటి డబుల్ సెంచరీ కాగా.. టెస్ట్‌ల్లో ఇంగ్లీష్ మహిళా బ్యాట్స్‌మెన్ సాధించిన మొదటి డబుల్ సెంచరీ. మరోవైపు ఇంగ్లండ్ మహిళల జట్టు నుంచి అన్నీ ఫార్మాట్‌లో టామీ చేసిన అత్యుత్తమ స్కోరు ఇదే. బ్యూమాంట్‌కి ఇది వరుసగా రెండో డబుల్ సెంచరీ. అంతకుముందు జూన్ 15 మరియు 17 మధ్య డెర్బీలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ సాధించింది. ఆ మ్యాచ్‌లో బ్యూమాంట్ 201 పరుగులు చేసి ఔటైంది.

Read Also: Chiranjeevi: కళ్యాణ్ కృష్ణ సినిమాలో ఫైట్లు లేవ్, విలన్లు లేరట?

ఎనిమిది టెస్టు మ్యాచ్ లు ఆడిన టామీ బ్యూమంట్.. ఈ మ్యాచ్‌కు ముందు మహిళా బ్యాట్స్ మెన్ అత్యుత్తమ స్కోరు 70 పరుగులు కాగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టామీ తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేయడంతోపాటు డబుల్ సెంచరీ నమోదు చేసింది. టామీ ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరుగా దిశగా వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 473 పరుగులు చేసింది. ఇంతటి భారీ స్కోరు ముందు ఇంగ్లండ్‌ను ఎవరైనా హ్యాండిల్ చేస్తే.. అది టామీ మాత్రమే.. మహిళా క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన ఎనిమిదో ప్లేయర్‌గా టామీ నిలిచింది.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఆమె తన జట్టు కోసం చివరవరకు పోరాడుతూ.. స్కోర్‌బోర్డ్‌ను పరుగులు పెట్టిస్తూనే ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లను బలంగా ఎదుర్కొని.. డబుల్ సెంచరీ సాధించింది ఈ ఓపెనర్. అంతేకాకుండా నాట్ షివర్ మరియు కెప్టెన్ హీథర్ నైట్ టామీకి మద్దతుగా నిలిచి అర్ధ సెంచరీలు సాధించారు. షివర్‌తో కలిసి టామీ 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అంతకుముందు నైట్‌తో కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

Exit mobile version