NTV Telugu Site icon

Tomato Farmer: మంచి మనసు చాటుకున్న టమాట రైతు.. కూలీలకు కొత్త బట్టలు పెట్టి..

Tomato Farmer

Tomato Farmer

Tomato Farmer: దేశం మొత్తం టమాట వైపే చేస్తోంది.. సామాన్యులు తాము టమాటా కొనడమే మానేశామని చెబుతున్నారు.. ఇక, ఇప్పటి వరకు టమాటను నమ్ముకుని నష్టాల పాలైన రైతులు.. ఇప్పుడు లాభాలను చూస్తున్నారు.. గతంలో రూపాయికి కిలో టమాటలు విక్రయించిన సందర్భాలు అనేకం ఉండగా.. కొన్నిసార్లు కూలి డబ్బులు కూడా రాకపోతే.. రోడ్లపై పారబోసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. అలాంటిది ఈసారి టమాటలకు మంచి ధర రావడంతో కొందరు రైతులు కోటీశ్వరులు అవుతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టినవారు.. ఒకేసారి కోటీశ్వరులుగా మారిపోతున్నారు.. అయితే, మొత్తం లాభాలు నాకే వద్దు.. నా తోటలో పనిచేసేవారికి కూడా నేను సాయం చేస్తానంటూ ముందుకు వచ్చి మంచి మనసు చాటుకున్నారు ఓ రైతు.

Read Also: Baby : తమిళ్ లో విడుదల కాబోతున్న సూపర్ హిట్ మూవీ..?

పూర్తి వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి పల్లి మండలంలో మంచి మనసు చాటుకున్నాడు ఓ టమాట రైతు.. తనకున్న ఐదు ఎకరాల పొలంలో టమాట సాగు చేశాడు రైతు నరసింహా రెడ్డి.. ఆ పంట దిగుబడి మంచి సీజన్‌ అంటే.. బాగా ధర పలుకుతోన్న సమయంలో వస్తోంది.. అధిక ధరలతో లాభాలు రావడంతో ఆనంద పడ్డ రైతు. తన పొలంలో టమాట సాగులో భాగస్వాములైన కూలీలకు కొత్త బట్టలు పెట్టి మంచి మనస్సు చాటుకున్నాడు.. మహిళలకు చీరలు, పురుషులకు కొత్త బట్టలు పెట్టి.. వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.. కాగా, వర్షాల దెబ్బకు మార్కెట్‌లో టమాట మాయమైపోయింది.. ఉన్న కొద్దిపాటి పంట మార్కెట్‌ వచ్చినా ఫుల్‌ డిమాండ్‌ ఉండడంతో.. అధిక ధరలు పలుకుతున్నాయి.. హోల్‌ సెల్‌ మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.120 వరకు పలుకుతోంది టమాట.. కానీ, అదే వినియోగదారుకు వచ్చేసరికి రూ.150కి పైగానే పలుకుతోంది. ఇక్కడ కూడా దళారీలే దండిగా దండుకుంటూనే ఉన్నారు.