ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ.ఈ సినిమా జులై 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు.
ఈ సినిమా యూత్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించింది..తన నటనతో సినిమా రేంజ్ ను పెంచేసిందని చెప్పవచ్చు.అలాగే ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కూడా సినిమాలో చాలా అద్భుతంగా నటించారు.ఈ సినిమా విడుదలైన మూడు వారాలకే దాదాపు రూ.70 కోట్లకు పైగా వసూలు చేసింది.బేబీ మూవీ సక్సెస్ ను చిత్ర యూనిట్ ఎంతగానో ఎంజాయ్ చేస్తోంది..రీసెంట్ గా “బేబీ” చిత్రాన్ని చూసిన తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు…
బేబీ సినిమాపై విఘ్నేష్ శివన్ రివ్యూ పై ఇప్పుడు ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. దీనితో “బేబీ” చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేయాలనీ చూస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను తమిళ్ లో రీ మేక్ చేస్తారా లేక తమిళంలో డబ్ చేసి విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమా ను ఎక్కువ శాతం డబ్ చేసి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఇదే కనుక జరిగితే బేబీ మూవీ కోలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంతగానో మెప్పిస్తుందని చెప్పొచ్చు. తమిళ్ ప్రేక్షకులు కూడా ప్రేమ కథలను ఎంతగానో ఆదరిస్తారు. దీనితో బేబీ సినిమా అక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.ఈ సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ ఎంతగానో పాపులర్ అయ్యాడు. ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.దీనితో ఈ దర్శకుడు తన తరువాత సినిమాని స్టార్ హీరోతో చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.అలాగే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.