‘అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరు గుర్తించరు, జరిగిన తరవాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు‘ ఈ డైలాగ్ భీమ్స్ సిసోరిలియో కెరీర్‌కు సరిగ్గా సరిపోతుంది. ఇండస్ట్రీలో స్టెప్ ఇనై పుష్కరకాలం దాటినా కూడా అతడికి బ్రేక్ వచ్చింది ధమాకాతోనే. బలగంతో బాగా రిజిస్టరైన ఈ తెలుగు కంపోజర్ సంక్రాంతికి వస్తున్నాంతో ఫుల్ పాపులరయ్యాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలవడంలో భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ పాత్ర ఎంతో ఉంది.
Also Read : OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘మలయాళ ఇండస్ట్రీ హిట్’ సినిమా
సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత క్రేజీ ఆఫర్స్ కొల్లగొడుతున్నాడు భీమ్స్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారూకి ట్యూన్స్ అందించే బాధ్యతను భుజాన వేశాడు. నెక్ట్స్ అడివి శేష్ డెకాయిట్ లైన్లో ఉంది. ఇక ఎప్పుడో కంప్లీట్ చేసిన మాస్ జాతర అక్టోబర్ 31కి వస్తుంది. బెంగాల్ టైగర్, ధమాకా చిత్రాలకు సాంగ్స్ ఇచ్చిన భీమ్స్‌కు రవితేజ మరో ఛాన్సిచ్చాడు. ఇప్పుడు ఇదే మాస్ జాతర భీమ్స్‌కు మరో స్టార్ హీరోతో వర్క్ చేసే ఛాన్స్ తెచ్చిపెట్టింది. మాస్ జాతర ప్రీ రీలిజ్ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భీమ్స్ టాలెంట్ గుర్తించి, అతడ్ని ప్రశంసించి, భవిష్యత్తులో కలిసి వర్క్ చేద్దామంటూ ఆఫర్ చేశాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ తప్ప మరో చోట వర్క్ చేయని భీమ్స్‌కు ఇది మంచి ఆఫరే. కానీ కోలీవుడ్‌లో అనిరుధ్, సాయి అభ్యంకర్, జీవీ ప్రకాష్ వంటి స్టార్ సంగీత దర్శకులు హవాలో భీమ్స్ అక్కడ నిలబడగలడా అనేది చూడాలి.